అగ్ని మహా పురాణము

86 - అథ విద్యాశాదినవిధానమ్.

పరమేశ్వరుడు చెప్పెను. పూర్వమునం దున్న కళాప్రతిష్టతో కూడ విద్యాకళాసంధానము చేసి, వెనుకటి వలెనే దానియందు తత్వవర్ణాదుల చింతనము చేయవలెను. “ఓం హం హీం హూం హాం” అనునది సంధానమంత్రము. రాగశుద్ద విద్యా-నియతి-కలా-కౌలూయా అవిద్య లనెడు ఏడు తత్త్వములను, ర, ల, వ, శ, ష, స అను ఆరు వర్ణములును విద్యాక లాంతర్గతములు. ప్రణవము మొదలగు ఇరువది యొక్క పదములు గూడ తదంతర్గతములే.

“ఓం నమః శివాయ సర్వప్రభవే శివాయ ఈశానముర్ధ్నే తత్పురుష వక్తాయ ఆ ఘోర హృదయాయ, వాసుదేవగు హ్యాయ సద్యోజాతమూర్తయే, ఓం నమో నమః గుహ్యాతి గుహ్యాయ. గోప్డే అనిధానాయ సర్వయోగాధికృతాయ సర్వ యోగాధిపాయ జోతీరూపాయ పర మేశ్వరాయ అచేతన అచేతన వ్యోమన్ వ్యోమన్” ఇవి ఇరువడి యొక్క పదములు.

ఇపుడు రుద్రుల స్వరూపము, భువనముల స్వరూపము చెప్పబడుచున్నది. - ప్రమథ వామదేవ సర్వదేవోద్భవ - భవోద్భవ - వజ్రదేహ - ప్రభు-ధాతృ-క్రమ విక్రమ- సుప్రభ-బుద్ధ-ప్ర స్తనామన్- ఈశాన – ఆక్షర- శివ-సశివ-బభ్రు - అయ-శంభు ఆదృష్టరూపనామన్ -రూపవర్ణన-మనోన్మన- మహావీర. చిర్రాజ-కల్యాణులు (ణములు)- ఈ ఇరువది యైదును భువనములు, రుద్రులును అని తెలియవలెను.

విద్యాకళలో అఘోరము మంత్రము. మ ర లు బీజములు, పూషా, హస్తిజిహ్వా అనునవి వాడులు. వ్యాననాదములు రెండు ప్రాణవాయువులు. రూప మొక్కటియే విషయము. పాదములు, నేత్రములు ఇంద్రియములు, శబ్ద స్పర్శ రూపములు మూడు గుణములు. సుషుప్తి అవస్థ, రుద్రదేవుడు కారణము. భువనాది సమస్త వస్తువులును విద్యాంతర్గతములని భావన చేయవలెను. “ఓం హూం హైం హాం” అనునది సంధానమంత్రము, రక్షిక్త వర్ణము, స్వస్తిక చిహ్నాంకితము అగు త్రికోణాకారమండలమును భావన చేయవలెను. శిష్యుని పక్షమున తాడనము, కలాపాళ చ్చేదనము, శిష్యహృదయ ప్రవేశము, వాని జీవచైతన్యమును పాశ విముక్తము చేయుట, ఆతని హృదయ ప్రదేశమునుండి జీవచైతన్యముల ఆకర్షణ గ్రహణములును చేయవలెను. జీవచైతన్యమును తన ఆత్మయందు ఆరోపించు కొనుట, కళాపాళ సంగ్రహణము, దానిని కుండమునందు స్థాపించుట ఇవ న్నియు వేనుకటి వలెనే చేయవలెను. కారణరూపు డగు రుద్రదేవుని ఆవాహన పూజాదులు చేసి, శిష్యునకు బంధము చేయవలదని ఆతనిని ప్రార్థించవలెను. మాతాపిత్రాదుల ఆవాహనము చేసి శిష్యుని హృదయమున తాడనము చేయవలెను. పూర్వోక్త విద్యనుసారముగ అస్త్రమంత్రముతో హృదయమునందు ప్రవేశించి జీవచైతన్యమును కలాపా విముక్తము చేయవలెను. మరల దానిని ఆకర్షించి, గ్రహించి, తన ఆత్మలో చేర్చుకొనవలెను. వామా-ఉద్భవ ముద్రతో దానిని వాగీశ్వరీదేవీ గర్భమునందు స్థాపించి నట్లు భావన చేయవలెను. పిమ్మట దేహసంపాదనము చేసి, జన్మ-ఆధికారభోగ-లయ-ప్రోతశుద్ధితత్వశుద్దుల కొరకును, సకల మలకర్మాది నిర్మూలనము కొరకును, పాశ బంధనివృత్తి కొరకును, నిష్కృతి కొరకును స్వాహాంతాస్త్ర మంత్రముచే నూరు హోమములు చేయవలెను.

పిమ్మట అస్త్రమంత్రముచే పాశ బంధశిధిలీకరణము, మలశ స్తితిరోధానము, కళాపాళ చ్ఛేదనము, మర్ధనము, వర్తులీ కరణము, దాహము, అంకురాభావ సంపాదనము, ప్రాయశ్చిత్త కర్మ- ఇవన్నియు వేనుకటి వలెనే చేయవలెను. పిదప రుద్రుని ఆవాహన చేసి, పూజించి, “ఓం హం రూపగశౌ శుల్కం రుద్ర గృహాణ స్వాహా” అను మంత్రముచే రూపగంధములను సమర్పించవలెను. పరమేశ్వరుని ఆజ్ఞ వినిపించి రుద్రుని విసర్జించవలెను. జీవచైతన్యమును తన ఆత్మలో నుంచి, దాని పాశ సూత్రమునందు చేర్చవలెను. జలబిందుస్వరూప మగు ఆ చైతన్యమును శిష్యుని శిరము పై నుంచి మాతాపితరులను విసర్జించవలెను. సకలవిధి సంపూర్తి కొరకు పూర్ణాహుతి చేయవలెను. విద్యలో లాడనాదిక్రియ లన్నియు పూర్వోక్త విధానానుసారమే చేయవలెను. అంతలోను దానికి సంబంధించిన బీజముల నుపయోగించుట యొక్కటియే భేదము. ఈ విధానమంతయు పూర్తి యైనచో విద్యాక శోధన మగును.

అగ్ని మహాపురాణములో, నిర్వాణదీక్షలో విద్యాకలాశోధన మను ఎమబదియారవ అధ్యాయము సమాప్తము.