అగ్ని దేవుడు పలికెను చతుర్వర్గ సిద్ధికై త్రైలోక్య మోహన షను మంత్రమును చెప్పెదను. "ఓం శ్రీం హ్రీం మొదలు "ఆగచ్ఛ ఆగచ్ఛ నమః" వరకను మూలో క్త మగు మూలమంత్ర యుక్త వ్యాపక న్యాసము చెప్పబడినది. పూజ చేసి ఏబది వేల జపము చేసి ఆభిషేకము చేసి వైదిక విధిచే స్థాపించిన" కుండాగ్నిలో నూరు హోమములు చేయవల యును. దధి ఘృత క్షీర ఘృతయుక్త చెరు శృత వయస్సులను వేర్వేరుగా మూల మంత్రముతో పండ్రెండు పర్యాయములు హోమము చేసి అక్షత తియవలతో వెయ్యి హోమములు చేసి త్రిమధు పుష్ప ఫల దధి సమిధలతో నూరేసి హోమములు చేయవవలయును. పిదప పూర్ణాహుతి చేసి మిగిలిన మృత సహిత చెరువును భక్షించవలెను. బ్రాహ్మణులకు భోజనము పెట్టి ఆచార్యుని దక్షిణాదుతో సంతోషింప చేయవలయును. మంత్రము సిద్ధించును. స్నానా చమనములు చేసి మౌనముతో యాగ మందిరమున ప్రవేశించి పద్మా సనమున కూర్చండి తాంత్రిక విధానముతో శరీర శోషణము చేయవలయును. ముందుగా రాక్షసులను విమ్న కారక భూతములను ఆణచుటకై అన్ని దిక్కులందును సుదర్శన న్యాసము చేయవలయును. ఈ సుదర్శ నము పంచ క్లేశములకు బీజము, ధూమ్ర వర్ణము ప్రచండానిల రూపము. వాభి ప్రదేశము నదున్న నా సకల పాపములను శరీరము నందుండి తొలగించుచున్నది యవి భావన చేయవలయును. పిదప హృదయాబ్దము నందున్నరం బీజమును స్మరించి మీదను క్రిందను పార్శ్వము లందును వ్యాపించియున్న అగ్ని జ్వాలలచే ఆ పాప పుంజమును జ్వలింపచేసి భస్మము చేయ వలయును. పిదప శిరస్సు నందు అమృత భావన చేసి సుషుమ్నా నాడీ మార్గమున వచ్చుచున్న ఆ అమృత ధారలచే తన శరీరమును బయటను లోపలను కూడ ఆప్లావితము చేయవలయును. ఈ విధముగా శుద్ద శరీరడై మూల మంత్రముతో మూడు ప్రాణాయామములు చేసి శిరో ముఖ గుహ్య గ్రీవ. సకలదిక్ హృదయ కుక్షి సమస్త శరీరము లందు హస్త మంచి వాటి పై శ క్తి న్యాసము చేయవలయును. సూర్య మండలము నుండి పరమాత్మను ఆవాహనము చేసి బ్రహ్మ రంధ్ర మార్గము నుండి హృదయ కమలమునకు తీసుకొని వచ్చి ప్రణవోచ్చారణ చేయుచు సర్వలక్ష లక్షణ సంపన్నుడగు ఆ పర మాత్మను స్మరించవలెను. లోతైలోక్య మోహనాయ విద్మహే స్మరాయధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్" యను నది లోక్య మోహన గాయత్రి. అల్మార్చనానంతరము యజ్ఞ ద్రవ్యములను శుద్ధములగు పాత్రములను ప్రోషించి ఆత్మ పూజ చేసి వేదిక పై ఆర్చించవలెను.
కూర్మాది రూపమున కల్పితమగు పీఠముపై గరుత్మంతుని పై పద్మాసవము నందున్న శ్రీ మహా విష్ణువు సర్వాంగ సుందరుడు. వయస్సు తగిన లావణ్య యౌవనములు కలవాడు. అతని ఎర్రని నేత్రములు మదముచే తిరుగుచుండును. ఉదారుడు. స్మరవిహ్వలుడు. దివ్య మాల్యాంబర ఆలేపములచే అలంకృతుడు. మందహాసము కలవాడు. అనేక విధము లగు పరివార పరికరములు కలవాడు. లోకానుగ్రహ కారకుడు. సౌమ్యుడు. సహస్ర సూర్య తేజశ్శాలి. ఐదు బాణములు ధరించినవాడు. ఆతని అన్ని ఇంద్రియములును ప్రాప్తకామములు ఎనిమిది భుజములు గల వాడు. దేవతాస్త్రాలు యాతనిని చుట్టు ముట్టి యుందురు. ఆతని దృష్టి లక్ష్మీ ముఖ పై లగ్నమై యుండును. ఈ విధముగ భగవంతుని ధ్యానించవలెను. ఆతని ఎనిమిది హస్తములలో వరుసగా చక్ర శంఖ ధనుః ఖడ్గ గదా, ముసల, అంకుశ, పాశ ములుండును. ఆతనినిశ్రీ మదగ్ని మహాపురాణము ఆవాహనాదుల ద్వారా పూజించి ఆంతమును విసర్జించవలెను. శ్రీ మహా విష్ణువు తన వామోరు జంఘల పై చేతితో తనను ఆలింగనము చేసుకొని వున్న లక్ష్మిని కూర్చుండ బెట్టుకొని యుండును. ఆమె ఎడమ చేతిలో పద్మము వుండును. ఆమె బలిసి శ్రీవత్స కౌస్తుభములతో ప్రకాశించుచుండును. మాలా ధారియు, పీత వస్తూడు, చక్రాది ధారియు యగు హరిని పూజించ వలెను. "ఓం సుదర్శన మొదలు హుంఫట్" వరకును మూలములలో నున్నది. సుదర్శన మంత్రముతో సుదర్శనమును పూజించవలెను. “ఓం జల చరాయ స్వాహా ఖడ్గ తీక్ష్ణ చింద, ఖడ్గాయ నమః జార్జ్గాయ, సశ రాయ హఫట్. ఇవి పాంచజన్యాది పూజా మంత్రములు. భూత గ్రామాయ విద్మహే చతుర్విధాయధి మహి తన్నో బ్రహ్మ ప్రచోదయాత్. ఇది భూత గ్రామ గాయత్రి. సంవర్తక శ్వసన పోథయ పోధయ హంఫట్ స్వాహా" పాశ బంధ బంధ, ఆకర్షయ, ఆక రయ హుంకట్. అంకుశ కట్ట కట్ట హంఫట్". వీటిలో ముసలాదులను వాటి వాటి మంత్రములతో పూజించవలెను. “ఓం పక్షిరాజాయ హుంఫట్" యని గరుత్మంతుని పూజించవలెను. కర్జి క యందు యథావిధిగా ఆంగ దేవతలను పూజించి పూర్వాది దళములందు లక్ష్మ్యాది శక్తులను పొతురధారి ఆర్ష్యాదులను పూజించవలెను. శక్తి పూజ అంతము నందు చేయ వలయును. ముందుగ దండి సహితులగు ఇంద్రాదులను పూజించవలెను. లక్ష్మీ సరస్వతులు పీతవర్ణము కలవారు. రతి ప్రీతి జయలు శ్వేత వర్ణము కలవారు. కీర్తి కాంతులు కూడ శ్వేత వర్ణులు తుష్టి పుష్టులు. శ్యామ వర్ణము కలవారు. వీరిలో స్మర భావముండును. లోకేశుని వరకు దేవతలను పూజించి ఆభీష్ట సిద్దికై విష్ణువును పూజించవలెను. ఈ క్రింది మంత్ర మును జపించి హోమాభిషేకములు చేయవలయును. "ఓం శ్రీం క్లీం హ్రీం హ్రూం త్రైలోక్య మోహనాయవిష్ణవే నమః అని మంత్రము. ఈ విధముగా పూజాదులు చేయుటచే సర్వకామములను పొందును. జలముతో సం మోహనీ వృక్ష పుష్ప ముతోను పైమంత్రము చెప్పుచు నిత్యతర్పణము చేయవలయును. బ్రహ్మ ఇంద్ర శ్రీదేవి, దండి, బీజ మంత్ర తై లోక్య మోహన విష్ణువులను పూజించి పైమంత్రమును మూడు లక్షలు జపించి కమల పుష్ప బిల్వ పత్ర మృతములతోను, తుండుల వల సుగంధ చందనాది ద్రవ్యములతోను దూర్వలతోను ఒక లక్ష హోమము చేయవలయును. దీర్ఘ యుర్దా యము పొందును. జపాభి షేకహోమాదులచే సంతుష్టుడే మహా విష్ణువు ఆభీష్ట ఫలములను ఇచ్చును. “ఓం నమో భగవతే వరా హాయ'' భూర్భుభువ్వుఃపతయే భూపతిత్వం మే దేహి హృదయాయ స్వాహా, ఇది వరాహముత్రము. దీనికి ఐదంగములండును. ప్రతి దినము పది వేల చొప్పున జపము చేసిన వాడు ఆయుర్ధాయమును రాజ్యమును పొందును.
ఆగ్ని మహా పురాణమున త్రైలోక్య మోహన మంత్ర కథన మను మూడు వందల యేడవ ఆధ్యాయము సమాప్తము.
Summary of chapter 307 of the Agni Purāṇa is as follows:
Kaumārabhṛtya, the branch of Āyurveda dealing with the care of children, is described. Agni explains the selection and care of wet nurses (dhātrī), the correct method of bathing, oiling, and swaddling the newborn, and the rituals accompanying each stage of early childhood. The childhood diseases caused by grahas (malevolent influences affecting children) — skanda-graha, skandāpasmāra, śītapūtanā, and others — are listed along with their signs and therapies. The importance of jātakarman, nāmakaraṇa, and annaprāśana in establishing the child's health is also noted.