ఆగ్ని దేవుడు చెప్పెను : ఓ మునీ! ఇపుడు నేను ఆత్మరక్షను, ఇతరుల రక్షను చేయు విధానమును చెప్పుచున్నాను. దీనికి “మార్జనము” లేదా “అపామార్జనము” అని పేరు. ఈ రక్ష చేసికొనుటచే మానవుడు దుఃఖములు తొలగి సుఖము పొందును. సచ్చిదానందస్వరూపుడును, పరమార్థభూతుడును, సర్వాంతర్యామియు, మహాత్ముడును, నిరాకారుడును, సహస్రాకారములు ధరించినవాడును, సర్వవ్యాపకుడును కగు పరమాత్మకు నమస్కరించుచున్నాను. కల్మషరహితుడును, పరమశుద్దుడును, నిత్యధ్యానయోగ నిరతుడును అగు పరమాత్మకు నమస్కరించి విషయమును చెప్పుచున్నాను. నా వాక్కు సత్య మగు గాక. భగవంతు డైన వరాహమూర్తికిని, నృసింహునకును, వామనునకును నమస్కరించి రషావిషయమున చేప్పెదను. నా వాక్యము సిద్ధించుగాక. భగవంతు డైన త్రివిక్రమునకును, శ్రీరామునకును, శ్రీమహావిష్ణువునకును, నరునకును నమస్కరించి నేను రషావిషయమున చెప్పుచున్నాను. అది సత్యమగు గాక.
ఓ వరాహస్వామీ! నృసింహేశ్వరా! త్రివిక్రమా! హయగ్రీవేశా! సర్వేశా! హృషీ కేశా! నా సమస్త అశుభములను హరింపుము. ఎవ్వనిచేతను ఓడింపరాని ఓ పరమేశ్వరా! అకుంఠితశక్తి గల నీ, చక్రాద్యాయుధములు నాలిగింటిచే సమ స్తదుష్టుల నంహారము చేయుము. ఓ ప్రభూ! ఫలానా వాని సంపూర్ణపాపములను హరించి ఆతనికి పూర్తిగ కుశ లవేమము. ను ప్రసాదించుము. పాపము వలన కలుగు -మృత్యు, బంధన, రోగ, పీడా, భయాదులను తొలగింపుము.
ఇతరుల వినాశమును కోరువారు చేసిన అభిచారిక ప్రయోగములను, వారిచ్చిన విషమితాన్నపానములను, వారు కల్పించిన మహారోగమును జరా జీర్ణముగ చేసి వాటి నన్నింటిని నశింపచేయుము. ఓం భగ వంతు డైన వాసుదేవునకు నమస్కారము. ఖడ్గధారియైన కృష్ణునకు నమస్కారము. కమలనేత్రుడును, ఆది చక్రధారియు అగు కేశవునకు నమస్కారము. పద్మము కింజల్కము వలే పసుపు రంగు గల నిర్మలవస్త్రములు ధరించిన, భగవంతు డైన పీతాంబరునకు నమస్కారము. ఘోర సంగ్రామములో శత్రువుల కంఠములతో రాచుకొను చక్రమును ధరించిన చక్రపాణికి నమస్కారము. కోర పై రేవదీయబడిన భూమిని ధరించినవాడును, వేదవిగ్రహుడును శేషశయ్యపై శయనించువాడును అగు మహాయజ్ఞవరాహమూర్తికి నమస్కారము. ఓ! దివ్యసింహమూర్తి! నీ కేశాంతములు కరిగించిన బంగారము వలె ప్రకాశించు చున్నవి. నేత్రములు అగ్ని వలె ప్రజ్వంచుచున్నవి. నీ నఖముల స్పర్శ వజస్పర్శకంది గూడ ఎక్కువ తీక్షమైనది. నీకు నమస్కారము. చాల చిన్న శరీరము కలిగి, ఋగ్యజుఃసామవేదములచే అలంకృతుడ వై న కాశ్యపకుమారా! వామనా! నమస్కారము. పిమ్మట విరాడ్రూపము ధరించి భూమిని ఆక్రమించిన త్రివిక్రమునకు నమస్కారము. .
ఓ వరాహమూర్తీ! సమ స్తపాపప :రూపమున వచ్చిన సకలదుష్టరోగములను ఆణచివేయుము; అణచివేయుము. గొప్ప కోరలు గల మహావరాహా! పాపమువలన కలిగిన ఫలమును అణచివేయుము; అణచివేయుము. వికట మైన ముఖము గల నీ దుతాగ్రములు ఆగ్ని వలె ప్రకాశించుచున్నవి. ఓ ఆర్తివినాశనా! ఆక్రమణము చేయు దుష్టుల వైపు చూడుము; నీ గర్ణనముచే వారినందరిని నశింపచేయుము; నశింపచేయుము. ఓ! వామనమూర్తీ! ఋగ్యజుఃసామవేదముల గూడతత్వములతో నిండిన వాక్కుతో ఈ ఆర్తుని సకలదుఃఖమును శమింపచేయుము గోవిందా! త్రిదోషములవలన కలిగినదియు, సంనిపాతమువలన కలిగినదియు, ఆగంతుక మునుగు. ఐకాహిక జ్వరమును (రోజువిడిచి రోజువచ్చు జ్వరము), ద్వ్యాహిక జ్వరమును (రెండు రోజులకు వచ్చునది), త్ర్యాహిక జ్వరమును, ఆత్యంతముభయంకర మగు చాతుర్థిక జ్వరమును (నాలుగురోజులకొకసారివచ్చునది), మానకుండా వచ్చు జ్వరమును శీఘ్రముగ శమింప చేయుము. దానివలన కలుగు బాధలను తొలగింపుము.
నేత్రరోగమును, శిరోరోగ మును, ఉదరరోగమును, శ్వాసావరోధమును; అతిశ్వాసమును, పరితాపమును,శ్రీమదగ్ని మహాపురాణము కంపనమును. గుదరోగమును, నాసికారోగమును, పాదరోగ మును, కుష్ఠరోగములను, క్షయరోగమును, కామలాట రోగములను, అత్యంతముదారుణమైన ప్రమేహమును, భగందర . అతిసారములను, ముఖరోగమును, వల్గులీరోగమును, ఆశరీరోగమును, ఇతర మూత్రకృచ్ఛరోగమును, ఇతర ము లైన భయంకరరోగమును తొలగింపుము. వాత-పిత్తకఫములవలన కలిగిన రోగములును, సంనిపాతమువలన కలిగిన రోగములును, ఆగంతుక రోగములును, లూతా-విస్ఫోటాది రోగములను భగవంతు డగు వాసు దేవుని నామసంకీర్తనమాత్రముననే తొలగిపోవుగాక. ఆ రోగము లన్నియు శ్రీ మహావిష్ణు నామోచ్చరణమాత్రముననే నశించి పోవుగాక. అవి అన్నియు శ్రీమహావిష్ణువు చక్రముచే కొట్టబడి తొలగిపోవుగాక. ‘అచ్యుత’, 'అనంత' 'గోవిన్ద' అను నామములను ఉచ్చరించుట అనేడు ఔషధముచే సకలరోగ ములును నశించును. నేను చెప్పునది సత్యముః సత్యము.
స్థావరము, జంగమము, కృత్రిమము, దంతములందు పుట్టినది, నఖములందు పుట్టినది, ఆకాశమునందు పుట్టినది, సాలెపురుగు మొదలగువాటినుండి పుట్టినది, ఇంకను ఇతర విధములైన దుఃఖకర మగు విషమును భగవంతుడైన వాసుదేవుని స్మరణము నశింపచేయుగాక. బాలకృష్ణుని చరిత్రముయొక్క కీర్తనము గ్రహ-పేతగ్రహ-డాకినీ పతనాది గ్రహ-వినాయక గ్రహ ముఖమండికా క్రూర రేవతి - వృద్ధి రేవతీ - వృద్ధికానామకోగ్రగ్రహ మాతృగ్రహాదు లగు బాలగ్రహములను నశింపచేయుగాక భగవంతుడవైన నర సింహా! నీ దృష్టిసారముచే బాలగ్రహములు, యువగ్రహములు, వృద్ధగ్రహములు దగ్గము లే పోవుగాక! జూలుతో భయంకర మైన ముఖము కలవాడును, లోకమునకు హితము చేకూర్చువాడును, మహాబలవంతుడును అగు భగవంతు డైన నృసింహుడు సమ స్తబాలగ్రహములను నశింపచేయుగాక, ఓ నరసింహా! మహాసింహా! జ్వాలామాలలచే నీ ముఖమండలము ప్రకాశించుచున్నది. ఓ అగ్నిలోచనా! సర్వేశ్వరా! సమస్త గ్రహములను భక్షించుము! భక్షించుము.
పరమాత్ము డైన జనార్దనుడు. సర్వాత్మస్వరూపుడు. ఓ వాసుదేవా! ఈ వ్యక్తియందు ఏ రోగ మలున్నవో, ఏ మహోత్పాతము లున్నవో, ఏ విష మున్నదో, ఏ మహాగ్రము లున్నవో, క్రూరభూతము లున్నవో, దారుణమైన గ్రహపీడ లున్నవో వాటి నన్నింటిని ఏదియో ఒక రూపము ధరించి నశింపచేయుము. దేవ శ్రేష్ఠుడ పైన అచ్యుతా! జ్వాలామాలలచే మిక్కిలి భయంకర మైన సుదర్శనచక్రమును ప్రయోగించి దుష్టరోగముల నన్నింటిని నశింపచేయుము. తీవ్రజ్వాలలచే ప్రకాశించుచు, మహాధ్వని చేయుచున్న సుదర్శనచక్రమా! సమ స్తదుష్టరాసులను సంహరింపుము; సంహరింపుము. నీ ప్రభావముచే ఆ రాక్షసు లందరును నశింతురుగాక. సర్వాత్మకు డగు నృసింహుడు, తన గర్ణనముచే, పూర్వ-పశ్చిమ-ఉత్తర దక్షిణదిశలందు రక్షించుగాక.అ నేక రూపములను ధరించు భగవంతు డైన జనార్దనుడు స్వర్గలోక భూలోక అంతరిక్షములందును, ముందును, వెనుకను రక్షించుగాక. దేవాసుర మనుష్యసహిత మగు ఈ జగత్తు అంతయు భగవంతుడగు విష్ణువు యొక్క స్వరూపమే. ఈ సత్యముయొక్క ప్రభావముచే ' ఈతని దుష్టరోగము లన్నియు నశించుగాక.
“విష్ణువును స్మరింపగనే సర్వపాపములును వెంటనే తొలగిపోవును” అను సత్యముయొక్క ప్రభావముచే వీని దుష్టరోగము లన్ని ము శాంతించుగాక. “యజేశ్వరుడైన విష్ణువు దేవతలచే ప్రశంసించబడుచున్నాడు” అనేడు సత్యముయొక ప్రభావముచే నా మాట సత్య మగుగాక. శాంతి కలుగుగాక. మంగల మగుగాక. ఈతని దుష్టరోగములు నశించుగాక. భగవంతు డైన వాసుదేవుని శరీరమునుండి పుట్టిన కుశ అనే నేను ఈతని రోగములను తొలగించితిని. నరనారాయణులు, గోవిందుడును వీనికి ఆపామార్లనము చేయుగాక. శ్రీహరి వచనము ప్రకారము ఈతని సంపూర్లదూఖములు శపించుగాక. సమస్తరోగాదులను నివారించుటకు ఆపామార్ణనస్తోత్రము ప్రశస్త మైనది. నేను శ్రీహరిని. నేను నీ రోగములను నశింపచేసితిని.
ఆగ్ని మహాపురాణమునందలి కుశాపానూర్జహస్తోత్రవర్ణన మను ముప్పదియొకటవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 31 of the Agni Purāṇa is as follows:
This chapter surveys the holiest tīrtha-s of Bhārata and the merit that accrues from visiting them. Prayāga (the confluence of Gaṅgā, Yamunā, and the invisible Sarasvatī) is hailed as the king of tīrtha-s. Vārāṇasī (Kāśī) is described as Śiva's own city where liberation is granted to all who die there through the Tārakamantra whispered by Śiva himself into the dying person's ear. Gayā, Kurukṣetra, Puṣkara, Dvārakā, Ayodhyā, Mathurā, Kāñcī, Avantī, and the banks of sacred rivers — Gaṅgā, Godāvarī, Kṛṣṇā, Kāverī — are praised in turn. The Purāṇa enumerates the specific sins that are cleansed at each tīrtha and the specific boons that are granted to pilgrims who bathe, perform tarpaṇa, and make charitable gifts at these holy places.