పుష్కరుడు చెప్పేను: మిక్కిలి శుద్దికర మైన రహస్యాది ప్రాయశ్చిత్తమును చేప్పెదను. ఒక మాసము పురుషసూక్తము జపించినచో సర్వపాపములను నశింపచేసికొనును. అఘమర్షణసూక్తము మూడు పర్యాయములు జపించినచో సర్వపాపములనుండియు విముక్తు డగును. వేదమును జపించుటవలనను, ప్రాణాయామమువలనను, గాయత్రీజపముచేతను, వ్రతము వలనను పాపములను తొలగించుకొనును. సర్వకృచ్చములందును ముండనము, స్నానము, హోమము, విష్ణు పూజ చేయవలెను. కృచ్చవ్రతము చేయువాడు పగలు నిలచియు, రాత్రి కూర్చుండియు ఉండవలెను. దీనికి వీరాసన మని పేరు. ఈ విధముగ చేసినచో పాపము లన్నియు తొలగించుకొనును. ప్రతిదినము ఎనిమిది గ్రాసముల చొప్పున తిన్నచో ఆది యతి చాంద్రాయణము. ప్రాతఃకాలము నాలుగు, సాయంకాలము నాలుగు గ్రాసములు తిన్న చో శిశుచాంద్రాయణము. ఎట్లు. తిన్నను మొత్తము మాసములో రెండువందల నలుబది గ్రాసములు తిన్నచో సుర చాంద్రాయణము. మూడు దినములు వేడి ఉదకములు, మూడు దినములు వేడిపాలు, మూడు దినములు వేడి నెయ్యి త్రాగి, మూడు దినములు వాయువును మాత్రము భక్షించవలెను. దీని పేరు “తప్తకృచ్చము”. ఈ పదార్థములనే చల్లనివి తీసికున్న చో అది “శీతకృచ్ఛము”. ఇరువది యొక్క దినములు పాలుమాత్రమే త్రాగి ఉన్న చో కృచ్ఛాతికృచ్ఛము. గోమూత్రము, గోమయము, గోక్షీరము, పెరుగు, నెయ్యి, కుశోదకము, ఒక రాత్రి ఉపవాసము ఇది కృచ్చసాంతపనము. “ఈ విధముగ ప్రతిదినమునను చేసినచో మహా సొంతపనము”. ఒక్కొక్కటి మూడేసి రోజులు చేసినచో ఆతిసాంతపనము. పండ్రెండు దివసములు భోజనము లేకుండ ఉండుట పరాకకృచ్చము. మూడు దినములు ప్రాతఃకాలము, మూడు దినములు సాయంకాలము, మూడు దినములు ఆయాచితాన్నము భుజించి ఉపవాసము చేసినచో ఆతి ప్రాజాపత్యము; దీనిలో నాల్గవ వంతు చేసిన పాపకృచ్ఛము. ఒక మాసము ధ్వములు మాత్రము తిన్నచో అది ఫలకృచ్ఛము; బిల్వఫలములచే శ్రీకృచ్ఛము. తామర గింజలతోను, ఆమలకము లచేతను ఆకృచ్ఛములు. పుష్పములచే పుష్పకృచ్ఛము, పత్రములు తిన్న చో పత్రగృచ్ఛము, ఉదకము చూత్రము త్రాగిన ఉదకకృచ్ఛము, దుంపలు తిన్న చో మూలకృచ్ఛము, దధి క్షీరతక్రముంచే దధికృచ్ఛక్ష్మీరకృచ్ఛతక్రకృచ్ఛములు. యిచేనిండు నంత మాత్రము ఆన్న మే ఒక మాసము తిన్న చో. ఆది వాయవ్యకృచ్చము. పండ్రెండు దినములు తిరిలు మాత్రమే తిన్నచో అది పీడావినాశక మగు ఆగ్నేయకృచ్ఛము. చారేడు లాజలుమాత్రమే తిన్నచో ఆది బ్రహ్మ కూర్చము. చతుర్ధ శియందును, పూర్ణిమ యందును. ఉపవాసము చేసి పిదప పుచగవ్యమును భుజించవలెను. పిదప హవిస్సును భుజించవలెను. ఈ విధముగ మాసమునందు రెండు పర్యాయములు చేయువాడు సర్వపాపవిముక్తు డగును. శ్రీ కాముడును, పుష్టికాముడును, స్వర్గకాముడును పాపవినాళార్థమై దేవతారాధనవరు డై కృచ్ఛములు చేసినచో సర్వ మనోరథములను పొందును.
ఆగ్ని మహాపురాణమునందు రహస్యాది ప్రాయశ్చిత్త కథన మను నూట డెబ్బదియొకటవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 171 of the Agni Purāṇa is as follows:
Secret and superior forms of expiation beyond the public penances are described. Agni states that one month's japa of the Pauruṣa-sūkta purifies all accumulated sins, and that recitation of the Aghamarṣaṇa-sūkta three times while submerging in water frees from all pātaka immediately. The chapter then systematically enumerates all the kṛcchra varieties: taptakṛcchra, śīta-kṛcchra, kṛcchrātikṛcchra, sāntapana, mahāsāntapana, atisāntapana, parāka, mahāparāka, prājāpatya, phala-kṛcchra, śrī-kṛcchra, brahma-kūrcca, and the multiple variants of the cāndrāyaṇa (the yati, śiśu, and pipa lī forms). Each kṛcchra is defined by the specific dietary restriction, duration, and sin it expiates.