పుష్కరుడు పలికెను : జ్ఞానమోక్షాది ప్రదర్శక మగు యతిధర్మమును చెప్పెదను. ఆయుర్దాయములోని నాల్గవభాగములోనికి రాగానే సంన్యసించవలెను. ధీరుడు ఏ రోజున వైరాగ్యము కలుగునో ఆ రోజునే సంన్యసించ వలెను. సర్వవేద సదక్షిణ మగు ప్రాజాపత్యేష్టి నిర్వర్తించి, ఆ్నులను తనలోనే ఆరోపించుకొని బ్రాహ్మణుడు గృహమునుండి నిష్క్రమించవలెను. ఒంటరిగానే సంచరించవలెను. అన్న ముకొరకు మాత్రమే గ్రామములోనికి ప్రవేశించవలెను. సంన్యాసి ఏది వచ్చినను ఉపేక్షాబుద్ధితో చూచుచు, ధనాదికమును కూడ బెట్టక, జ్ఞానసమన్వితుడై ఉండవలెను. చేత కపాలము, వృక్షమూలనివాసము, మాసిన వస్త్రము, ఏకాకిత్వము, సర్వసమదృష్టి ఇవి ముక్తుని లక్షణములు. మరణమును ఆభినందించ గూడదు. జీవనమును గూడ అభినందించగూడదు. భృత్యుడు ప్రఖ్వాజ్ఞకై ఎదురు చూచుచున్నట్లు కాలమునకై ఎదురు చూచుచుచుండవలెను. క్రింద చూచుకొని అడుగు పెట్టవలెను. వస్త్రముతో వడబోసిన నీరు త్రాగ వలెను. సత్యముచే పవిత్ర మైన మాటలే పలకవలెను. మనస్సుచేత పవిత్ర మైనదానిని ఆచరించవలేను. ఆనపకాయ బుర్ర, దారపాత్ర, మట్టి పాత్ర, వెదురు పాత్ర-ఇవి సంన్యాసికి విధింపబడినవి. యతీశ్వరుడు ఎల్లపుడును గ్రామములోని ఇండ్లలో ధూమము శాంతించిన పిమ్మటను, రోకళ్ళు ఆగిపోయినపుడును, నిప్పులు ఆర్పివేయబడిన పిమ్మటను, జను లందరును భోజనము చేసిన పిమ్మటను పాత్రలు కడిగివేసిన పిమ్మటను భిక్షకు బైలుదేర వలెను. మాధుకరము (అనేక గృహము నుండి కొంచెము కొంచెము సంగ్రహింపబడినది), ఆసక్ల ప్తము ముందుగా ఆనుకొని తయారు చేయబడనిది), ప్రాక్రృణీతము (ముందుగా తయారుచేయబడినది). అయాచితము, తాత్కాలికోపపన్నము (అప్పటి కప్పుడు లభించినది) అని బైక్షము ఐదు విధములు. హస్తములే పాత్రగా ఉపయోగించవలెను. లేదా మరి యొక పాత్ర నుండి హస్తపాత్రలోనికి తీసికొనవలెను. కర్మదోషముల వలన ప్రాణులు ఏ ఏ విధముల బాధపడుతున్నారో గమనించవలెను. ఏ ఆశ్రమములో నున్నను మానవుడు పరిశుద్ధ చిత్తముతో ధర్మాచరణము చేయవలెను; అన్ని భూతములందును సమదృష్టి చూపవలెను. అంతియే కాని ఆశ్రమలింగములను ధరించినంత మాత్రమున ప్రయోజనము లేదు. కతక వృక్షఫలము (ఇందుపకాయ) నీటిలోని బురదను తొలగించి దానిని నిర్మలము చేయు నను మాట నిజమే; కాని దాని పేరు చెప్పినంతమాత్రమున నీరు ప్రసన్న ముకాదు కదా ? అజ్ఞానవశముచే సంసారములో చిక్కుకొనిన ద్విజుడు కుంటివా డైనను, గ్రుడ్డివా డై నను, చెవిటివా డైనను, కుటిలత్వము లేని సంన్యాసి యెపచో సత్కర్మల నుండియు, అసత్కర్మల నుండియు విముక్తు డగును. సన్యాసి పగ టియందును, రాత్రియందును తనచే చంపబడిన ప్రాణ0 ల విశుద్ధికె స్నానము చేసి ఆరు ప్రాణాయామములు చేయవలెను. ఎముక లనేడు స్తంభములు గలదియు, నాడులతో కూడినదియు, మాంసశోణితములచే పూయబడినదియు, చర్మముచే కప్పబడినదియు, మూత్రపురీషదుర్గంధముతో నిండినది యు, జలాశోక ములతో కూడినదియు, ఆనిత్యముమ, జీవునికి నివాసమును ఆగు ఈ శరీరమును త్యజించవలెను.
స్థ్యైర్యము, ఓర్పు, మనోనిగ్రహము, పరధనాపహారము చేయకుండుట, ఇంద్రియనిగ్రహము సిగ్గు, జ్ఞానము సత్యము అక్రోధము ఈ పదియు ధర్మలక్షణములు, కుటీచకుడు, బహూచకుడు, హంస, పరమహంస అని సన్న్యాసులు వాలుగు విధములు. వీరిలో ఉత్తరోత్తరుడు ఉత్తముడు. ఏకదండి యైనను, త్రిదండి యైనను యోగి బంధనములనుండి విముక్తుడగును. అహింస, సత్యము, అస్తేయము, బ్రహ్మచర్యము, ఆపరిగ్రహమం, ఈ ఐదును యమములు. శౌచము సంతోషము, తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వరపూజ ఇవి నియమములు. సంన్యాసికి పద్మాసనాదులు ఏహితములు. సగర్భము, అగర్భము అని ప్రాణాయామము రెండు విధములు, జపధ్యానాదులు కలిసినది సగర్బము. మరల ఆ రెండును ఒక్కొక్కటి పూరకము, కుంభకము, రేచకము అని మూడేసి విధములు. వాయువు- నింపుట పూరకము; బంధిం చినచో కుంభకము. విడచుటచే రేచకము. ప్రాణాయామము- ద్వాదశ మాత్రాకము, చతుర్వింశన్మాత్రాకము అని మరల మూడేసి విధములు. తాళము, లేదా లమ్వక్షరము ఒక మాత్ర. ప్రాణయామసమయమున ఓం కారాదులను మెల్లగా జపించవలెను. ఇంద్రియసంయమము ప్రత్యాహారము. జపము చేయు సాధకులు ఈశ్వరుని స్మరించుట ధ్యానము. మనస్సును స్థిరముగా నిలుపుట ధారణ. బ్రహ్మయందు స్థితి సమాధి. ఈ ఆత్మయే వరమాత్మ. ఆత్మ సత్యము జ్ఞానరూపము, అనంతము, విజ్ఞానము, ఆనందరూపమ. ఇదియే బ్రహ్మ. నీవు ఆ బ్రహ్మయే నేను ఆ బ్రహ్మనే. పరబ్రహ్మ జ్యోతిరూపము. ఆదియే ఆత్మ. వామ(సు)దేవుడు, నిత్యయుక్తము ఓంకార రూపము. దేహేంద్రియ మనో బుద్ధి ప్రాణ అహంకార శూన్య మైనది. ఈ బ్రహ్మణోగ్రత్ స్వప్న సుషుప్త్యాదిముక్త మైనది. అందుచే తురీయము, నిత్యము శుద్దము, జ్ఞానరూపము, ముక్తము, సత్యము, ఆనందము, అద్వితీయము, పర జ్యోతియు, అక్షరము, సర్వవ్యాప్తము, హరియు అగు బ్రహ్మయే నేను. ఆదిత్యునిలో ఉన్న అఖండపురుషుడు నేను. ఓం మనుష్యుడు సర్వకర్మలను పరిత్యజించి సుఖదుఃఖములందు సముడై ఓర్పు కలవాడై, భావమునందు పరిశుద్దుడై, బ్రహ్మాండమును భేదించుకొని బ్రహ్మ యగును. ఆషాడపౌర్ణమాసియందు చాతుర్మాస్య వ్రతము ప్రారంభించి చేయవలేను. కార్తికశుక్ల నవమి మొదలు సంచారము చేయవలెను. ఋతుసంధాదివసమలందు ముండనము చేయించుకొనవలెను. సన్యాసులకు ధ్యాన-ప్రాణాయామములే ప్రాయశ్చిత్తము.
అగ్ని మహాపురాణమునందు యతిధర్మవర్ణన మను నూట అరువదియొకటవ ఆధ్యాయము సమాప్తము.
Summary of chapter 161 of the Agni Purāṇa is as follows:
The way of life of the saṃnyāsin (yati) who has renounced all worldly ties is described. Agni explains the four types of saṃnyāsins—kuṭīcaka, bahūdaka, haṃsa, and paramahaṃsa—in ascending order of renunciation. The paramahaṃsa carries only a daṇḍa and kamaṇḍalu, moves constantly without attachment to any place, accepts food from any varṇa without distinction, and meditates continuously on the advaita-tattva. The saṃnyāsin's death (mahāsamādhi or deliberate departure) is described as the final liberation from the body; his relatives perform no śrāddha since he has transcended sapiṇḍa-relationships.