ఈశ్వరుడు పలికెను - ఇపుడు భోగ - మోక్షప్రద మగు దీక్షా విధానమును గూర్చి చెప్పెదను. ఇది సమస్త పాపములను నశింపచేయును మల - మాయాదులను తొలగించును శిష్యునకు జ్ఞానమును కలిగించుదానికి దీక్ష యని పేరు. అది భోగ మోక్షముల నిచ్చును. విద్యచే అనుగ్రహింపదగిన శిష్యుడు - విజ్ఞానాకలుడు, ప్రలయకలుడు, సకలుడు అని మూడు విధములు. కేవలము మలరూప మగ పాళము కలవాడు “విజ్ఞానకలుడు”. మలములచేతసు, పాశములచేతను.
కుశలు, దూర్వాంకురములు, యవలు, పాలు, ఉదకము వీటి నన్నింటిని ఒక చోట ఉంచి విశేషార్ఘ్యము ఏర్పరచుకోన వలేను. ఆ జలముతో సమస్తద్రవ్యముల శుద్ధి చేయవలెను. తిలకము ధరించి, వెనుకటి వలెనే పూజా మంత్రధన పంచగర ప్రాశనాదికము చేసి, పేలాలు, చందనము, ఆవాలు, భస్మము, దూర్యలు. అక్షతలు, కుశలు, చివర మరల శుద్ధమైన పేలాలు అను వికిర ద్రవ్యములు (చల్లుటకు ఉపయోగించు ద్రవ్యములు) గ్రహించి, అస్త్రమంత్రముచే ఏడు పర్యాయములు ఆభిమంత్రించి, అస్త్రమంత్రాభి మంత్రిత జలముతో ప్రోక్షించి, కవమంత్రముచే (హుమ్) ఆచ్ఛాదించి “ఇది విఘ్న సమూహములను తొలగించు నానావిధాస్త్ర శస్త్రములు అని భావన చేయవలెను. పిమ్మట ప్రాదేశమాత్రము పొడవైన ముప్పది సూరు కుశ దళములతో లేజీ రూపమును, బోధమయమును అగు ఉత్త మఖడ్గము నిర్మించి, దానిని శివ మంత్రము ఏడు పర్యాయములు జపించి, ఆభిమంత్రించవలెను. ఆది శివస్వరూపరాగ భావించి తన హృదయమున ఉంచు కొనవలెను. తన కభిష్టమైన శివుని రూపమును ధ్యానించుచు, నిష్కల పరమాత్మయగు ఆ శివుని తనలో న్యాసము చేసిన వలెను. పిదప “నేనే శివుడను” అని భావన చేయవలెను. శిరస్సు పై తెల్లని శిరస్త్రాణము ధరించి తన శరీరమును అలంక రించుకొనవలెను. పిమ్మట గురువు తన కుడి చేతిపై సుగంధద్రవ్యములతో గాని, కుంకుమముతో గాని మండలమును నిర్మించవలెను. దానిపై శివుని పూజించవలెను. ఇట్లు చేయుటచే అది శివహస్త మగును. తేజస్వియైన ఆ శివ హస్తమును తన శిరస్సుపై ఉంచుకొని, “నేను శిపుడను. సకల జగత్సృష్టియగు పరమాత్ముడ నేన శివుడను నేనే” అని దృఢమగు భావన చేయవలెను. ఈ విధముగ భావన చేసిన గురువు యజ మండపమునందు కర్మసాక్షిగాను, కలశముపై యరక్షకుడుగాను, అగ్నిలో హోమాధిష్టాతగాను, శిష్యుని ఆజ్ఞానమయపాశ చేత్తగాను, అంతరాత్మయండు అనుగ్రహకర్తగాను, ఐదు విధముల ఆభివ్యక్తుడై న ఈశ్వర రూపుడగును. ఆ “పర మేశ్వరుడను నేనే” ఆను దృఢతర మగు భావన గురువునకు ఉండవలెను.
పిమ్మట గురువు జ్ఞానరూప మగు ఖడ్గము చేత ధరించి యజమండపము నైరృతి దిక్కున ఉత్తరాభిముఖుడై నిలచి ఇలపంచగవ్యములతో మండపమును ప్రోక్షించి, ఈషణాది చతుష్పథాంతసంస్కారములతో దానీని సంస్కరింపవలెను. యజ్ఞమండపమున చల్లవలసిన వస్తువులను చల్లి వాటిని కుళ కూర్చతో ప్రోగుచేసి, ఈనకోణమునందు స్థాపిత మగు వర్జనిక
పిదప ప్రణవమయ మైన ఆసనముపై కూర్చొని యున్న చతుర్భుజుడగు గణేశుని వాయవ్య దిక్కునందు పూజించ వలెను. అనంతరము వేగి పై శివుని పూజించి, అర్ఘ్యమును చేత గ్రహించి యజ్ఞకుండము వద్దకు వెళ్ళి, అచట కూర్చుండి మంత్రదేవతాతృప్తి కొరకు వామభాగమునందు అర్ఘ్య-గంధ-మృతాదులను, కుడివైపున సమిధలు, కుశలు, తిలలు మొదలగు వాటిని ఉంచి, వెనుకటి వలెనే కుండ-అగ్ని -మృత-సృక్ ఆదులను సంస్కరించి, హృదయమున ఊర్ధ్వముఖాగ్ని ప్రాధాన్య మును భావించుచు అగ్నియందు శివుని పూజించవలెను. పిమ్మట గురువు తన శరీరమునందును, శివకలశమునందును, మండలమునందును, అగ్నియందును, శిష్యుని దేహమునందును సృష్టిన్యాసక్రమమమును న్యాసకర్మను చేసి, యథా శాస్త్రముగ అధ్వశోధనము చేసి, అగ్ని కుండము పొడవు వెడల్పులను పట్టి అగ్ని దేవుని ముఖము పొడవు వెడల్పులను భావన చేయుచు, అగ్ని జిహ్వానామమంత్రముల చివర 'నమః' చేర్చి పలుకుచు ఆభీష్టవస్తువుని హోమము చేసి అగ్నిని తృప్తుని చేయ వలెను. అగ్ని జిహ్వలు ఏడింటికిని ఏడు బీజము లున్నవి. హోమము చేయుటకై అవి యేవియో చెప్పబడుచున్నది.
రేఫ తప్ప మిగిలిన చివరి రెండు వర్ణముని అన్ని అక్షరములకును, అనగా య మొదలు హ వరకు ఉన్న ఏడక్షరములకును రేప-ఊర మును చేర్చి, దాని మీద ఆర్ధబిందుపును చేర్చగా అప్ గ్రూబ, లూట, ఫ్రాట, క్రూట, మాట, సూట, ఝూట అను వి ఏడు అగ్ని జిహ్వల బీజమంత్రములు. హిరణ్య, కనక, రక్త, కృష్ణ, సుప్రభ, అతిరిక్త, బహురూప, అని అగ్ని జిహ్వానామములు. వీటి ముఖములు వరుసగ ఈశాన్య-పూర్వ-ఆగ్నేయ, నైరృతి, పశ్చిమ, వాయవ్య, మధ్య దిక్కులం దుండును శాంతికపౌష్టికకర్మలలో క్షీరాది మధుర పదార్థములను, అభిచారకర్మలలో ఆవాల తెలకపిండి, సత్తువులు, యవు గంజి. ఉప్పు, రాజికలు, కలువై లములు, ముళ్లు, వంకరటింకరగా నున్న సమిధలు, వీటితో క్రోధపూర్వకముగా, భాష్యమంత్రముతో హోమము చేయవలెను.
కదంబపు మొగ్గలు హోము చేసినచో తప్పక యక్షిణి సిద్దించును. వశీకరణ-ఆకర్ణణములకై బంధూక కింశుక పుష్పాదులను హోమము చేయవలెను. రాజ్యలాభము కొరకై బిల్వఫలములను, లక్ష్మీప్రాప్తి కొరకు పాటల-చంపక పుష్పము లను, చక్రవర్తిత్వముకొరకై పద్మములను, సంపదకొరకు థక్ష్య-భోజ్య పదార్థములను, వ్యాధివినాశముకొరకు దూర్వలను.
శుద్ధ మైన పొయ్యి పై అహంకారబీజమును న్యసించవలెను. పిమ్మట దానిని కుండమునకు కుడి వైపున ఉంచి “ఈ పొయ్యి శరీరము ధర్మాధర్మమయ మైనది” అని భావన చేయవలెను. దాని శుద్దికై అస్త్రమంత్రము జపించుచు స్పృశించవలెను. పిమ్మట అస్త్రమంత్రము (ఫట్) చే అభిమంత్రింపబడిన గోఘృతముచే మార్జిత మైన ఆ పాత్రను పొయ్యి పై ఉంచవలేను. అస్త్రముచే శుద్ధము చేసిన గోక్షీరమును ప్రాసాదమంత్రము (హోం)చే నూరు సార్లు ఆభిమంత్రించి ఆ పాత్రలో పోసి, ఆ పాలలో శ్యామకాదితండులమును ఉంచవలెను. ఒక శిష్యుని దీక్షా విధికై ఐదు చేరలు బియ్యము పోయవలెను. ఇద్దరు ముగ్గురు లేదా ఎక్కువమంది శిష్యు లున్నచో వారి సంఖ్యను బట్టి ఐదేసి చేరలు పెంచుతు పోయవలెను. అస్త్రమంత్రముతో నిప్పు ముట్టించి, కవచ మంత్రముతో పాత్రను మూత పెట్టవలెను. పూర్వాభిముఖుడై శివాగ్ని లో, మూలమంత్రోచ్ఛారణ పూర్వకముగ చరువును వండవలెను.
తండులములు బాగుగా ఉడికిన పిమ్మట స్రువము నిండ ఆజ్యముపోసి, స్వాహాక్ష సంహితామంత్రములతో, పొయ్యిలో తప్టాభి ఘోర మను హోమము చేయవలెను. ఆ చరుపాత్రను మండలముపై ఉంచి, అస్త్రమంత్రముతో దాని పై కుశ లను ఉంచవలెను. ప్రణవముతో పొయ్యి పై గీసి, హృదయమంత్రముతో అలికి వెనుకటి వలెనే శిలాభిఘార మను హోమము చేయవలెను. అపుడు పొయ్యి చల్లబడును. శీతాభిఘారము చేయు విధాన మేమనగా సంహితామంత్రముల చివర ‘పౌషట్’ చేర్చి, దానితో కుండమండపమునకు పశ్చిమమున దర్బార్యాసనముపై ఒక్కొక్క శిష్యుని నిమిత్తము ఒక్కొక్క హోమము చేయవలెను. సుక్కుతో సంపాతహోమము చేసి సంహితామంత్రముతో శుద్ధి చేయవలెను. “వషట్' చేర్చిన, సంహితామంత్రములో ఒక పర్యాయము చదువు గ్రహించి ధేనుముద్రతో అమృతీకరణము చేయవలెను. పిమ్మట వేదిక పై, దానితో శాంతిహోమము చేయవలెను. పిమ్మట గురువు, శిష్యులకొరకును, అగ్ని దేవతకొరకును, లోకపాలులకొరకును మృతసహితము లగు భాగము లేర్పరచవలేను. అన్ని భాగములందును ఆజ్యము సమముగా నుండవలెను. వారి నామ మంత్రముల చివర 'నమః' చేర్చి, వారి వారి భాగములను అర్పించి, ఆ మంత్రముతోడనే వారికి ఆచమనీయము సమర్పించవలెను.
పిమ్మట మూలమంత్రముతో నూట ఎనిమిది హోమములు చేసి, యథాశాస్త్రముగ పూర్ణాహుతి ఇవ్వవలెను. మండలములోపల, కుండమునకు తూర్పున గాని, శివ-కుండముల మధ్య యందు గాని హృదయముత్రముతో, రుద్రమాతృకాగణాదులకు అంతర్బలి సమర్పించవలెను. శివుని ఆశ్రయించి, ఆతని ఆజ్ఞ పొంది, ఏకత్వభావన చేయుచు ఈ విధముగ భావన చేయవలెను. “సర్వజ్ఞత్వాది గుణములతో కూడినవాడును, సమస్తాధ్వలకును పైన ప్రకాశించుచున్న వాడును అగు శివుడను నేనే. ఈ యజ్ఞస్థానము నా అంశము. నేనే యజ్ఞాధిష్టాతను.” ఈ విధముగ అహంకార పూర్వకముగ అనగా శివాభేదదృష్టితో-గురువు యజ్ఞమండపమునుండి బైటకు రావలెను. అస్త్రమంత్రముచే (ఫట్) నిర్మించిన మండలము పై తూర్పునకు అగ్రము లుండు నట్లు ఉత్తమ మైన కుశలు కప్పి, దాని పై ప్రణవమయ మగు ఆసనము భావన చేయుచు, స్నానము చేసిన శిష్యుని దానిపై కూర్చుండబెట్టవలెను. శిష్యుడు ఆ సమయమున శ్వేతవస్తో త్తరీయములు ధరించి యుండవలెను. అతడు ముక్తికాముడైనచో ఉత్తరాభిముఖుడుగను, భుక్తికాము డైనచో పూర్వాభి. ముఖుడుగను కూర్చుండ వలెను. శిష్యుని చీలమండల పైభాగము ఆసనముపై ఉండవలెను. క్రింది భాగము ఉండ గూడదు. గురువు శిష్యుని దగ్గర పూర్వాభిముఖుడై కూర్చుండవలెను. మోక్షమును అభిలషించినచో, శిష్యుని ఆంగముల పై పాదములనుండి శిఖవరకును, భోగములను అభిలషించిన పక్షమున శిఖనుండి పాదములవరకును, ప్రనన్నము, శైవతేజస్సును ప్రసరింపచేయు నదియు అగు దృష్టితో చూడవలెను.
పిమ్మట అస్త్రమంత్రముచే అభిమంత్రించిన జలముతో శిష్యుని ప్రోక్షించి మంత్రోదకస్నానము పూర్తి చేయవలెను. పిమ్మట విన్న శాంతికొరకును, పాపవినాశ ముకొరకును భస్మస్నానము చేయించవలెను. అస్త్రమంత్రముచే భస్మను అభి మంత్రించి, దానితో శిష్యుని సృష్టి సంహార యోగముచే తాడనము చేయవలెను. ఆనగా పైనుంచి క్రిందికిని, క్రింది నుండి పైకిని వాని శరీరముపై భస్మము చల్లవలెను. బదియే భస్మస్నానము. పిదప సకలీకరణము నిమిత్తమై, వెనుక టివలెనే అస్త్రజలముతో శిష్యుని ప్రోక్షించి, ఆస్త్రమంత్రోచ్చారణ పూర్వకముగ కుశాగ్రముతో వాభినుండి పైభాగమునుదు మార్గనము చేయవలెను. హృదయ మంత్రము జపించుచు కుళమూలములతో నాభినుండి క్రింది భాగమును, పాపవినాళార్ధమై, స్పృశించ వలెను. సమ స్తపోశములను భేదించుటకై ఆశ్రమంత్రముతో మరల ఆ కుశ లతోడనే పూర్వము చెప్పిన విధము మార్జన స్పర్శనములు చేయవలెను. పిమ్మట ఆతని శరీరముపై ఆసనసహితుడైన సాంగ శివుని న్యాసము చేసి, శివభావనతో, పుష్పా దులచే ఆతనిని పూజించవలెను. పిమ్మట నేత్రమంత్రము (నౌషట్) గాని, హృదయమంత్రము (నమః) గాని ఉచ్చరించుచు తెల్లనిదియు, దశకలదియు అగు వస్త్రముతో ఆతని నేత్రములు కట్టవలెను. ప్రదక్షిణ క్రమమున ఆతని శివుని వద్దకు తీసి కొని వెళ్ళి, అచట శివునకు కుడి వైపున కూర్చుండబెట్టవలెను. సంహార ముద్రచే తనను శివాభిన్ను నిగ చేసి, ఆతని హృదయపద్మమున నిరోధించి, న్యాసము చేసి, ఆతనిని పూజించవలెను.
తూర్పునకు తిరిగి కూర్చొని యున్న శిష్యుని శిరముపై మూలమంత్రముచే శివహస్త ముంచవలెను. ఆది రుద్రేశ పదమును ఇచ్చును. పిమ్మట శిష్యుని హస్తమునందు, శివమంత్ర పురస్సరమంగా శివ సేవాప్రాప్తికి ఉపాయముగా ఒకపుష్పము, నుంచవలెను. దానిని శివుని పై ఉంచవలెను. పిమ్మట ఆతని నేత్రములకు కట్టిన వస్త్రము తొలగించి, ఆతనికొరకై శివ దేవగణాంకిత మైన స్థాన మంత్ర నామాదికమును ఊహించవలెను. లేదా, బ్రాహ్మణాది వర్ణములకు, వరుసగ, తన ఇష్టము వచ్చిన పేరు ఉంచవలెను. “శివకలశమునకును, వర్గనికిని నమస్కరింపచేసి అగ్ని సమీపమున, తనకు కుడి ప్రక్కన నున్న ఆసనముపై, శిష్యుని వెనుక వలెనే ఉత్తరాభిముఖముగ కూర్చుండబెట్టి “ఆతని శరీరమునుండి సుషుమ్నా నాడి బైటకు వచ్చినా శరీరములో విలీనమైనది.” అని భావన చేసి, మూల మంత్రముచే అభిమంత్రించిన దర్భ గ్రహించి, దాని అగ్రమును శిష్యుని హస్త మునందును, మూలభాగమును తన కాలి పైనను లేదా, అగ్రభాగమును తన కాలి పైనను, మూల భాగమును శిష్యుని హస్తమునందును ఉంచవలెను. శివమంత్రముతో రేచక ప్రాణాయామము చేసి, శిష్యుని హృదయములో ప్రవేశించుచున్నట్లు భావన చేయుచు, మరల అదే మంతముతో పూరక ప్రాణాయామముచే తిరిగి తన హృదయాకాశమును చేరి నట్లు భావన చేయవలెను. శివాగ్నిచే ఈ విధమగు నాడీసంధానము చేసి, తత్సన్నిధానము నిమిత్తము హృదయ మంత ముతో మూడు హోమముల చేయవలెను. శివహస్త పేర్యము కొరకై , మూల మంతముతో నూరు హోమములు చేయ వలెను. ఈ విధముగ చేయుటచే శిష్యుడు సమయదీక్షా సంస్కారయోగ్యుడగును.
ఆగ్ని మహాపురాణమునందు సమయదీక్షావిధి యను ఎనుబది యొకటవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 81 of the Agni Purāṇa is as follows:
The eighty-first chapter marks a major transition in the Purāṇa's content, introducing the sacred subject of Śaiva dīkṣā — the initiation that grants entry into Śiva's community of properly consecrated worshippers. The three categories of souls who approach dīkṣā — vijñānakala (pure souls bound only by āṇava mala), pralayākala (souls bound by āṇava and kārma mala-s), and sakala (souls bound by all three mala-s) — are distinguished, and the appropriate type of dīkṣā for each is described. The four types of dīkṣā — nirādhārā, sādhārā, sabīja, and nirbīja — are enumerated. The chapter then describes how the guru, having identified himself with Śiva, constructs the initiation maṇḍala and performs the crucial nāḍī-saṃdhāna — the connecting of the guru's own subtle channels with those of the śiṣya, creating the ritual space for the transmission of Śiva's grace.