ఆగ్ని దేవుడు చెప్పెను. పద వాక్యము లందు వర్ణముల ఆవృత్తికి అను ప్రాస అని పేరు. ఏక వర్ణము అనేక వర్ణము అని వృత్త్యను ప్రాస వర్ణ సముదాయము రెండు విధములు, ఏక వర్ణగతా వృత్తి వలన మధుర లలిత ప్రౌడ భద్ర పరుషలను ఐదు వృత్తులు ఏర్పడును. మధుర వృత్తి యందు వర్గ పంచమ వర్ణము క్రింద ఆ వర్గ కే చెందిన అక్షర ములు, హ్రస్వ స్వర అంతరితములగు ర, ణ, న, న, లు నకార ద్వయ సంయోగము కూడ వుండును. వర్గ, వర్ణము లను ఐదు పర్యాయములు మించి ఆ వృత్తి చేయరాదు. మహా ప్రాణ ఊష్మ వర్ణముల సంయోగముతో కూడ ఉత్తరోత్తర లఘ్వక్షరములు కల రచన మధుర యని చెప్పబడును. లలిత రచనలో వకార లకారములు అధికముగా ప్రయోగింపబడును. రేవ సంయుక్త ప, కా ర నకారములు వర్గ, వర్ణములు దేని యందు ప్రయోగింపబడునో టవర్గ పంచమాక్షరములు వుండవో ఆది ప్రౌఢ వృత్తి. మిగిలిన ఆసంయుక్తములగు రేపన కారాది కోమల వర్ణములు ప్రయోగించిన వృత్తి భద్ర లేవ కోమల వృత్తి యని చెప్పబడును. ఊష్మలు భిన్న అక్షరములతో సంయుక్తములై ప్రయోగింపబడినచో పరుషావృత్తి. దీని యందు ఆహార భిన్నములగు స్వరములు అత్యధికముగా ఆ వృత్తి చెందుచుండును. అనుస్వార విసర్గలు నిరంతరము ప్రయోగింప బడును. రేప సంయుక్త శ, ష, స, ల ప్రయోగము ఎక్కు వగా అకార ప్రయోగము అధికముగా అంతస్థ వర్ణ ప్రయో గము రేపానంతస్థంచే భేదితము సంయుక్తము యగు హకార ప్రయోగము పదుషత్వమును కలిగించును. గురు వర్ణములు మాధుర్య విరుద్ధములగు వర్ణములతో సంయుక్తములైనచో పరుషత్వము కలుగును. పరుష రచవలో వర్గాద్యక్షరమే సంయు క్తము. గురువు అయినచో శ్రేష్టము. పంచమ వర్ణము సంయుక్తమైనచో ప్రశస్తము కాదు. ఎవరినైన ఆక్షేపించుట యందును కఠోర శనుకరణము వందును పరుష వృత్తిని ప్రయోగించవలెను. క, చ, ట, త, ప వర్గలను అంతస్త ఊష్మ లను క్రమముగ ఆవర్తనము చేయుటచే ఏర్పడు వృత్తికి కర్నాటి, కౌంతలీ, కౌంకీ కొంకణీ, వాణ వాసికా, ద్రావిడి, మాథులీ, మాల్సీ, మాగధీ, తామ్ర లి పిక, బౌండ్రీ పౌండ్రీ అను పండ్రెండు భేదము లుండును.
భిన్నార్ధ ప్రతిపాదక మగు అనేక వర్ణా వృత్తికి యమక మని పేరు. అవ్య పేతము వ్యపేతము యని అది రెండు విధములు. నిరంతరా వృత్తి యున్నది, అవ్య పేతము. వ్యవధానముతో ఆ వృత్తి యువ్నది వ్య పేతమ స్థాన పాద భేదములచే ఈ రెండింటికిని రెండేసి భేదములు ఏర్పడును. మొదటి పాదము యొక్క ఆది మధ్య అంతము లందు ఒకటి రెండు మూడు వర్ణములు పర్యాయములు ఆవృత్తములు ఆయినచో మొ త్తము ఏడు భేదములు ఏర్పడును. ఏడు పాదము లలో ఉత్తరోత్తర పాడమును ఒకటి, రెండు, మూడు పదములతో ప్రారంభించినచో అంతిమ పాదము ఆరు విధములగును. తృతీయ పాదమున ఆది మధ్యాంతము లందు ఆవృత్తి చేసినచో మూడు విధములగును. శేష్టయమకము పాదాంతయమకము, కాంచీ యమకము సముద్ధ యమకము విశ్రాంత యమకము వక్రవాల యమకము సందష్టము పాదాది యమకము ఆత్రీడితము చతుర్వ్యవ సితము, మాలాయమకము యని పది పది విధములు. వీటిలో కూడ అనేక భేదము లుండును. భిన్నార్డ్ వాచక పదమును ఆ వృత్తి చేసినచో అది స్వతంతము అస్వతంత్రము అని రెండు విధములు. రెండు ఆ వృత్త పదములకు సమాస మున్నచో సమస్తము సమాసములేనిచే వ్యస్తము. ఒకపాదమున విగ్రహముండుటచే ఆదివ్య స్తమగును. యథా సంభవముగ, వాక్యావృత్తి ఈ విధముగా జరుగును. అనుప్రాస యమకాదులు పండితులచే సమ్మానితములు. పదావృతి యైనను వాక్యా వృత్తి యైనను ఏ వర్ణ సమూహము సమానముగ కన్పట్టునో దానిని మొదట వుంచి సాను ప్రాస పదరచన చేసినచో యది రసావహమై వుండును. కవి గోష్టిలో కౌతూహల పూర్వకముగ చదువబడు వాగ్బంధము చిత్రము.
ప్రశ్నము ప్రహేళికా గుప్తము, చ్ముతాక్షరము, దత్తాక్షరము, చ్యుత దత్తాక్షరము, సమస్యయని ఏడు ప్రహేళికా భేదములు, సమానాంతర విన్యాస పూర్వకముగా ఉత్తరము ఇచ్చినచో యది ప్రశ్న ప్రహేళికా. ఏకపృష్ఠోత్తరము ద్విపృష్టోత్తర మని ఆది రెండు విధములు. సమస్తము వ్యస్తము అని మొదటిది రెండు విధములు. రెండు ఆర్థములను చెప్పు శబ్దములుగూడ ముగ నున్న దానిని ప్రహేళిక యందురు. ఆర్థికాప్టియని యిది రెండు విధములు. ఆర్థ బోధతో సంబంధించని ఆర్థి. శబ్ద బోధతో సంబంధించినది కాబ్ది. ఈ విధముగా ప్రహేళికా ఆరు విధములు. వాక్యాంగము గుప్త మైనను సంభావ్యమగు ఒక అపార మార్థిక అర్థము దేని ఆంగి మునందు ఆకాంక్షా యుక్తమైవుండునో ఆది గుప్త ము. దీనికి గూడమని కూడ పేరు. వాక్యాంగ వైకల్యముచే ఆర్థాంతర ప్రతీతి వికలితాంగమునందు సాకాంక్షముగ నున్న చో ఆదిచ్యుతాక్షర. స్వరవ్యంజన, బిందు విసర్గ అచ్యుతిని బట్టి ఇది నాలుగు విధములు, వాక్యాంగము యొక్క వికలాంశము, పూర్తి చేసిన పిమ్మట కూడ ద్వితీయార్థ ప్రతీతి కల్గించునది దత్తాక్షర. స్వరాదులను బట్టి దీనికి కూడ నాలుగు భేదము లుండును. లుప్తమగు వర్ణము స్థానమున మరియొక అక్షరము వుంచినను ఆర్థాంతరా భాసము కల్గించునది చ్యుత దత్తాక్షర. ఒక పద్యాంశ ముతో నిర్మితమై మరియొక పద్యముతో సంబంధించినది సమస్య. సమస్య ఇతరులదగును. దాని పూర్తి తనదగును. ఈ విధముగా స్వపర, కృతి సాంకర్యముచే సమస్య పూర్తి యగును. చిత్రకావ్యము ఆకిక్లేశ సాధ్యము అగుటచే కవియొక్క కవితా శక్తి ని సూచించును. ఆది రసవిహీనమైనను విదగ్గు కు మహోత్సవము. నియమ విదర్భబంధములను బట్టి ఇది మూడ విధములు. రమణీయ కవిత్వమును చెప్పు కవియొక్క ప్రతిజ్ఞ నియమము. ఇది స్థానస్వర వ్యంజనములను బట్టి మూడు విధములు. ప్రాతిలో మ్యానులోమ్యములచే వికల్పవ చేయబడును. ప్రాతిమ్యానులోమములు శబ్దమును బట్టియు, ఆర్థమును బట్టియు ఏర్ప డును. వివిధ వృత్తముల వర్ణములను ఆయా వస్తువుల ఆకార మున కూర్చుటకు బంధమని పేరు. గోమూత్రికా, ఆర్థ భ్రమకము, సర్వతో భద్రము, కమలము. చక్రము, చక్రాబ్దకము, దండము, ముర జముయని బంధములు యెనిమిది విధములు. రెండు శ్లోకార్థము లందును ప్రతిపాదమునందు ఏకై కాక్షర వ్యవధానముచే ఆక్షరసామ్యము వున్న చో ఆదిగోమూత్రీకాబంధము. పూర్వగోమూత్రికా ఆంత్యగో మూత్రికాయని ఇది రెండు విధములు. వీటికి ఆశ్వపదధేనుజాల బంధయని కూడ పేరు. ఆర్ధభాగములు రెండింటి యందును ఏకై కాక్షర వ్యవధానమున అక్షరసామ్య మున్నది మొదటిది. ఒక్కొక్క పదమునందు వున్నది రెండవది. వాటిని అర్ధ భాగము లందును, ఆర్ధపాదము నందును విన్యాసము చేయవలెను.
క్రమముగా క్రింద క్రిందుగా వ్రాసిన వర్ణములతో క్రింద క్రింద వ్రాసిన వర్ణములతో కలుపగా చతుర్థ పాదము పూర్తియగు వరకు నడిపించవలెను. చతుర్థపాదము పూర్ణమై పిమ్మట అక్షరములను ప్రతిలోమ క్రమమున పాదార్థ పర్యం తము పైకి తీసుకుని పోవలెను. ఈ విధముగా మూడు విధములగు సర్వతో భద్రము ఏర్పడును. కమల బంధము చతుర్థళము, అష్టదళము షోడశ దళము యని మూడు విధములు. ప్రథమ పాదము యొక్క పై మూడు పదముల అక్షరములను అన్ని పాదముల చివరను ఉంచవలెను. పూర్వపాద అంతిమ వర్ణమును ప్రత్యక్పాదాది యందు ప్రాతిలోమ్య క్రమమున ఉంచవలెను. అంతిమపాద అంతీమాక్షరర్వయమును ప్రథమ పాదాది యందు వుంచవలెను. ఈ విధముగా చతుర్దళ కమలము ఏర్పడును. అష్టదళ కమలమునందు అంత్యపాద అంత్యాక్షర త్రయమును ప్రథమపాద ఆదియందు వుంచవలెను. షోడశ దళ కమలమున రెండు అక్షరముల మధ్య కర్ణిక దాని మధ్యయందు ఒక అక్షరము కర్ణికాంతమున పైభాగమున పత్రాకారాక్షర పంక్తి వ్రాసి దానిని కర్ణికలో చేర్చవలెను. ఈ విషయము చతుర్దళకమలము విషయమున చెప్పబడినది. కర్ణికయందు ఒక అక్షరము వ్రాసి దిగ్విదుక్కులందు రెండేసి అక్షరములు వ్రాసి ప్రత్యేక దిక్కుయందు ప్రవేశ నిర్గమ మార్గము (వాయవలెను. ఇది అష్టదళ కమలము విషయమున చెప్పబడినది. నాలుగు వైపుల ఎన్ని విషమ వర్ణములున్నవోయన్ని పత్రము లేర్పరచి న్యాసము చేసి మధ్య కర్ణికయందు సమాక్షరములను ఏకాక్షర రూపమున న్యాసము చేయవలెను. ఇది షోడశ దళ కమలమునకు సంబంధించిన విషయము. చతరరము, షడరము అని చక్రబంధము రెండు రెండు విధములు. చతురరమునందు పూర్వారమున సమవర్ణమును ప్రతిపాదము యొక్క ప్రథమ పంచమాది విషమ వర్ణములను చతుర్థ అష్టమ వర్ణములను క్రమముగా ఉత్తర పూర్వ దక్షిణ, పశ్చిమారములందుంచవలెను.
ఉత్తర పాదార్థ అక్షర చతుష్టయమును నాభియందును, దాని ఆద్యక్షరమును వెనుకటి రెండు అరములందును, మిగిలిన రెండు పదములను నమియందును స్థాపించవలెను. తృతీయాక్షరమును చతుర్థ పాదాంతమునందును, ప్రథమ సమవర్ణద్వయమును, మూడు పాదముల అంతమునందును వుంచవలెను. దశమాక్షరము సమమైనచో దానిని ప్రథమార మందును, ఆరు అక్షరములను పశ్చిమారము నందును ఉంచవలెను. వాటిని రెండేసి అక్షరముల వ్యవధానముతో వుంచ వలెను. ఇట్లు బృహచ్చక్రము ఏర్పడును. ఎదుటనున్న రెండు ఆరముల పై క్రమముగా ఒక్కొక్క పాదమును వ్రాయవలెను. నాభియందు దశమాక్షరమును వ్రాసి చతుర్థ పాదమును నేమి వద్దకు తీసుకుని వెళ్ళవలెను. శ్లోకము యొక్క ఆది అంత దశమాక్షరములును ద్వితీయ చతుర్థ చరణముల ఆద్యంత్యాక్షరములను ప్రథమ చతుర్థ చరణముల ప్రథమ, చతుర్థ, పంచమ వర్ణములును, సమములుగా వుండవలెను. ద్వితీయ పాదమును విలోమ క్రమమున చదువగి, తృతీయ పాదము ఏర్పనిచో దానిని పత్ర సాధనమున వుంచగా దండ చక్రాబ్దబంధము ఏర్పడును. పూర్వార్ధమున రెండు పాదముల ద్వితీయాక్షరమలును ఉత్తరార్ధమును రెండు పాదముల సప్తమాక్షరములును సమానములై వుండవలెను ద్వితీయా క్షరములను బట్టి పూర్వార్ధ ఉత్తరార్ధములు తుల్యములై వుండవలెను. ద్వితీయషష్ట చతార్థ పంచమాక్షరములు తుల్యములై వుండవలెను. ఉత్తరార్ధమున సప్తమ ప్రథమ చతుర్థ పాదముల ఆ అక్షరములతో సమానములైన చతుర్థ పంచమ అక్షరములను క్రమముగా కూర్చవలెను. క్రమపాదము లందున్న చతుర్థాక్షరములను, దళాంత వర్ణములను వెనుకటి వలె స్థాపించవలెను. ముర జ బంధమున రెండు శ్లోకార్థముల ఆంతిమ ఆద్యక్షరము సమానములై వుండవలెను. పాదార్ధము నందున్న వర్ణములను ప్రాతిమ్యాను లోమ్య కామముతో వుంచి ఆంతిమాక్షరము చతుర్థపాద ఆద్యక్షర మగునట్లు కూర్చ వలెను. చతుర్ధపాద ఆద్యక్షర మును దానినుండి నవమ, షోడశాక్షరములను పుటక కము మధ్య మధ్య నుండి నాలుగేసి అక్షరములను కూర్చవలెను. ఈ విధముగా మురజ బంధము ఏర్పడును. ద్వితీయ చక్రము శార్దూలవిక్రీడితముతో చేయవచ్చును. గోమూత్రికా బంధమును అన్ని ఛందస్సులలోను నిర్మించవచ్చును. మిగిలిన బంధములన్నియు అనుష్టప్ ఛందస్సుచే నిర్మింపబడును. ఈ బంధములలో కవికావ్యముల నామధేయములు లేకున్న చో మిత్రుల సంతుష్టులగుదురు. శత్రువులు కూడభిన్నులు కారు. బాణ ధునుస్, వ్యోమ, ఇద్ద, ముద్గర, శక్తి ద్విశృంగాట, తిశృంగాట చతుశ్మగాట వజ, ముసల, అంకుశ, రథపద, నాగపద పుష్కరిణీ, ఆసీ పుత్రికాది ఆకారములలో కూడ చిత్ర బంధములు వ్రాయ బడును. వీటిని ఇంకను అధికమగు చిత్రబంధమును విద్వాంసుడు స్వబుద్ధిచే తెలుసుకొనవలెను.
ఆగ్ని మహాపురాణమున శబ్దాలంకార నిరూపణమను మూడువందల నలభై మూడవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 344 of the Agni Purāṇa is as follows:
The figures of speech that operate primarily at the level of meaning (arthālaṅkāra) are enumerated in eight categories. Upamā (simile) is analyzed into eighteen varieties based on what element is left unstated — the upameya (subject), the upamāna (standard), the sādhāraṇadharma (point of comparison), or the particle of comparison. Rūpaka (metaphor), sahokti (co-identification), arthāntaranyāsa (corroboration by general and particular), utprekṣā (poetic fancy), atiśaya (hyperbole), viśeṣokti (emphasis through contradiction), vibhāvanā (effect without apparent cause), virodhālaṅkāra (apparent contradiction), and the two types of hetv-alaṅkāra (causation figure — kāraka and jñāpaka) are each defined and illustrated with examples.