అగ్ని దేవుడు పలికెను : వశిష్ఠా! శ్రీరాముడు చెప్పిన రాజనీతిని చెప్పితిని. ఇపుడు స్త్రీపురుష లక్షణములను చెప్పెదను. దీనిని పూర్వము సముద్రుడు గర్గమునికి చెప్పెను. సముద్రుడు చెప్పెను: ఉత్తమవ్రతాచరణ శీలుడవగు గర్గా! స్త్రీపురుషలక్షణములను, వాటి ప్రభాశుభఫలములను చెప్పెదను. ఏకాధికుడు, ద్విశుక్లుడు, త్రిగంభీరుడు, త్రిత్రికుడు, త్రిప్రలంబుడు, త్రిక వ్యాపి, త్రివళీయుక్తుడు, త్రికాలజ్ఞుడు, త్రివిపులుడు అగు పురుషుడు శుభలక్షణసంపన్నుడు. ఇడ్లీ చతుర్లేఖుడు, చతుఃసముడు, చతుష్కిష్కడు, చతుర్దశిష్ట్రుడు, చతుఃకృష్ణుడు, చతుర్గంధుడు, చతుర్ఘస్వుడు, పంచసూక్ష్మడు, పంచదీర్ఘుడు, షడున్నతుడు, అష్టవంతుడు, సప్త స్నేహుడు, నవామలుడు, దిశ పద్ముడు, దళవ్యూహుడు, వ్యగ్రోధపరిమండలుడు, చతురక సమద్వంద్వుడు షోడశాక్షుడు అగు పురుషుడు ప్రశస్తుడు. ధర్మ - ఆర్థ - కామము తో కూడిన ధర్మము “ఏకాధికము”. నల్ల గ్రుడ్లు తప్ప మిగిలిన నేత్రములు, దంతములు తెల్లగా ఉన్న వాడు “ద్వేశక్లుడు”. స్వర - నాభి - సత్త్వములు, గంభీరములుగా ఉన్న వాడు త్రిగంభీరుడు. నిర్మాత్సర్యము, దయ, క్షమ, సదాచరణము, శాచమా, ఆస్పృహ, ఔదార్యము, అనాయాసము శూరత్వము అను (తొమ్మిది) గుణములుకలవాడు “త్రిత్రికుడు”. వ్రేలాడు వృషణములు, భుజద్వయము కలవాడు త్రిప్రలంబుడు. తేజో - యశః - కాంతులచే దేశజాతి-దశదిశలను వ్యాపించువాడు “త్రికవ్యాపి”. ఉదరమునందు మూడు ముడతలు ఉన్న వాడు “త్రివళిమంతుడు” దేవతా - క్రాహ్మణ - గురు జనుల విషయ మున వినతుడు “త్రివినతుడు”, ధర్మ-అర్థ - కామముల సమయము నెరిగిన వాడు. త్రికాలజ్ఞుడు. వక్షః స్థల-బలాట-ముఖ ములు విపులముగా నున్న వాడు “త్రివిపుండు”, హ సద్వయ పొదద్వయములు ధ్వజచ్ఛత్రాది లేఖా చిప్నాతములై ఉన్న వాడు “చతుర్లేఖుడు”. వ్రేళ్ళు, హృదయము, కటి, పృష్ఠము - ఈనాలుగు సమములుగా ఉన్న వాడు “చతుస్సమడు. తొంబదియారు అంగుళముల ఎత్తుగలవాడు “చతుష్కిష్కువు” చంద్రునివలె ప్రకాశించు నాలుగు కోరలు గలవాడు చతుర్దంష్ట్రుడు. నేత్రతారలు, కనుబొమ్మలు మీసము, కేశములు నల్లగా ఉండువాడు “చతుష్కృష్ణుడు”. నాసిక, ముఖము, రెండు చంకలు - వీటి యందు మంచి గంధమున్న వాడు చతుర్గంధుడు, లింగము, కంఠము, రెండు పిక్కలు హ్రస్వముగానున్న వాడు చతుర్ఘస్వుడు వ్రేళ్ళకణుపులు, గోళ్ళు, కేశములు, దంతములు, చర్మము - ఇవి సూక్ష్మ ముగా నున్న వాడు “పంచసూక్ష్మడు”. చెక్కిలి, నేత్రములు, లలాటము, నాసిక, వక్షః స్థలము విశాలముగా నున్న వాడు “పంచదీరుడు”. వక్ష స్థలము, చంకలు, గోళ్ళు, ముక్కు, మఖము, మెడ వెనుక భాగము ఉన్న తముగా నున్న వాడు “షడున్న తుడు”, చర్మము, కేశములు, దంతములు, రోమములు, చూపు, నఖములు, మాట - ఇవిస్నిగ్ధ ముగా నున్న వాడు “సప్త స్నేహుడు”. రెండు మోకాళ్ళు, రెండుతొడలు, పృష్ఠభాగము, హస్తద్వయము, నాసిక అనునవి చక్కగానున్న వాడు “ఆష్టవంతుడు”. నేత్రద్వయము, నాసికాద్వయము కరద్వయము, శిశ్నము, గుదము, ముఖము ఈ తొమ్మిది నిర్మలముగానున్న వాడు “నవామలుడు”. పద్మసమాన కాంతిగల జిహ్వ - ఓష్ణ - తాలు - నేత్ర - హస్త - పాద - నఖ - శిశ్నాగ్ర - ముఖములు కలవాడు “దశ పద్ముడు”, హస్త - పాద - ముఖి - కంఠ - కర్ణ – హృదయ - శిరో - లలాట - ఉదర - పృష్టములు పెద్దవిగా ఉన్న వాడు “దశవ్యూహుడు”. ఇతడు లోకసంమానితుడగును. రెండు చేతులు చాపగా ఒక చేతి మధ్య మాంగుళినుండి రెండవ చేతి మధ్య మాంగుళి వరకు ఎంత పొడవుండునో అంత ఎత్తు ఉన్నవాడు “న్యగ్రోధపరిమండలుడు”. చరణములు, గుఱ్ఱములు, నితంబములు, పార్శ్వములు, వంజ్ఞములు, వృషణములు, స్తన ములు, కర్ణములు, ఓష్ఠములు, ఓష్టాంతములు, పిక్కలు, హస్తములు, బాహువులు, నేత్రములు అను యుగ్మాంగములు సమముగా నుండువాడు “చతుర్ధశ సమద్వంద్వుడు”. రెండు నేత్రములతో పాటు పదునాలుగు విద్యలు కూడ ఉన్నవాడు “షోడశాక్షుడు”, దుర్గంధ యుక్తము, మాంసహీనము, ఎండిపోయి నాడులు కనబడుచున్నది ఆ యిన శరీరము అడు భము. ఇందుకు భిన్నమైన గుణములు కలది వికసించిన నేత్రములు కలదియగు శరీరము ప్రక స్తము ఉత్తమ పురుషుని మాటమధురముగా నుండును. నడక మత్తగజగమన సమానమై యుండును. ఒక్కొక్క రోమ కూపమునుండి ఒక్కొక్క రోమమే వచ్చును. ఇట్టి పురుషుడు సర్వదో సకల భయములనుండి రక్ష పొందును.
ఆగ్ని మహాపురాణమునందు పురుషలక్షణవర్ణనమను రెండువందల నలుబదిమూడవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 243 of the Agni Purāṇa is as follows:
The science of wholesome food and drink (āhāra) is described. Agni prescribes dietary guidelines according to season, constitution, and digestive capacity. The eight factors of ideal food — prakṛti (nature), karaṇa (processing), saṃyoga (combination), rāśi (quantity), deśa (habitat of source), kāla (time), upayoga-saṃsthā (rules of intake), and upayoktā (the eater) — are elaborated. The chapter declares that proper āhāra is the foremost medicine, while improper food is the root of all disease.