నారద ఉవాచః -
నారదుడు పలికెను :-
పూజ్యము లైన వాసుదేవాది మంత్రముల లక్ష్మణము చేప్పేదను. ఆదియందు “నమో భగవతే” అను పదములో కలవి, అ, ఆ, అం, అః అను బీజాక్షరములతో కూడినవి. ఓంకారము. ఆది యందు కలవి, 'నమః' అనునది అంతమందు కలవి ఆయిన “వాసుదేవ' 'సతికరణ' ప్రద్యుమ్న' 'అనిరుద్ద' అను పదములచే “ఓం ఆ నమో భగవతే వాసుదేవాయ” ఓం ఆ నమో భగవతే సంకర్షణాయ” “ఓం అం నమో భగవతే ప్రద్యుమ్నాయ” “ఓం అః నమో భగవతే అనిరుద్దాయ” అను మంత్రము లేర్పడును. పిమ్మట “ఓం నమో నారాయణాయ” అను మంత్రము.
“ఓం తత్సద్భ్రహ్మణే నమః” “ఓం నమో విష్ణవే నమః” “ఓం క్రైం ఓం నమో భగవతే నరసింహాయ నమః”. “ఓం భూర్బగవతే వరాహాయ నమః” (ఇవి మంత్రములు). జపా పుష్పము వలే అరుణమైన రంగు పసుపువంటి రంగు నీల - శ్యామల - లోహిత వర్ణములు, మేఘ - అగ్ని - మధువుల వంటి రంగులు, పింగవర్ణము గల తొమ్మండుగురు నరాధిపులు వీటికి నాయకులు. తంత్రవేత్తలు విభజించిన విధముగ స్వరరూపము లైన బీజాక్షరములకు ఆయా మంత్రము లందలి నామములను చివర చేర్చి హృదయాద్యంగములను కల్పించవలేను. వ్యంజనాది బీజాక్షరముల లక్షణము వేరుగా ఉండును.
'నమః' అనునది అంతము నందు గల మంత్రముల మధ్య దీర్ఘ స్వరములతో గూడి యున్న వ్యంజనములు ఆంగము అనియు, హ్రస్వస్వరములతో కూడినవి ఉపాంగము లనియు చెప్పబడును.
దీర్ఘ ప్రస్వములతో కూడినదియు, సాంగోపాంగ స్వరములతో కూడినదియు, విభజింపబడిన నామాక్షరము ఆంతమునందు ఉన్న దియు అగు బీజాక్షరము ఉత్తమ మైనది. హృదయాది కల్పనమునకు వ్యంజనముల క్రమ మిది - తన నామము అంతము నందు గల ఆంగ నామములచే విభ క్తము లై స్వబీజాక్షరముతో కూడిన, ఐదు మొదలు పండ్రెండు వరకును ఉన్న హృదయాదులను కల్పించి సిద్ధికి అనుగుణముగా ఉండునట్లు జపించవలెను.
హృదయము, శిరస్సు, శిఖ, కవచము, నేత్రము, అస్త్రము అను ఈ ఆరును బీజముల ఆంగములు. హృదయము. శిరస్సు, శిఖ, హస్తముయి, నేత్రములు, ఉదరము, పృష్టభాగము, బాహువులు, ఊరువులు, మోకాళ్ళు పిక్కeo, పాదములు ఈ పండ్రెండును మూలమునకు ఆంగ ములు. క్రమముగా వీటి అన్నింటిపై న్యాసము చేయవలెను.
“కం టం పం శం వే నతేయాయ నమః” “ఖం ఠం ఫం, షం గదానుజాయ నమః” గం డం బం సం పుష్టి మన్తాయ నమః”. ఘం థం థం హం శ్రియై నమః” వం శం మం క్షం పాఇ్చజన్యాయ నమః” “ఛం తం పం కౌస్తుభాయ నమః” “జం ఖం వం సుదర్శనాయ నమః” “సం వం దం చం లం శ్రీవత్సాయ నమః”.
ఓం ధం వం వనమాలాయై నమః “మహానక్తాయ నమః” బిజరహితము లైన పదములు గల మంత్రములకు పదములచేతనే అంగములను కల్పింపవలెను.
నామసంయుక్తములును, జాత్యంతములును ఆగు పదములచే, హృదయాది పంచకన్యాసమును చేయవలెను. ప్రణవము, పిమ్మట ఐదు హృదయాదులును చెప్పబడినవి.
ముందుగా ప్రణవముచే హృదయమును, 'పరాయ' అని శిరస్సును, పేరుతో శిఖను. ఆత్మ చేత కవచమును, నామా న్తముతో అస్త్రమును విన్యసించవలెను.
ఓంకారము ఆదియందు గల నామాత్మక పదమునకు చివర నమః చేర్చి నామాత్మక పదమును చతుర్థ్యంతము చేసి చెప్పవలేను. ఏక వ్యూహము మొదలు ఇరువదియారవ వ్యూహము వరకును ఇది సమానము.
కనిష్ఠిక మొదలైన కరాగ్రములందు దేహము పై ప్రకృతిని అర్చించవలెను. పరమ పురుషాత్మయే పరుడు. ప్రకృత్యాత్మ ద్విరూపము. “ఓం పరాయగ్న్యాత్మనే నమః” ఇది వ్యాపక మంత్రము. వసు - అర్క - అగ్నులు త్రివ్యూహాత్మక మార్హులు. ఈ మూడింటిపై అగ్ని న్యాసముచేసి కరదేహములపై వ్యాపకమును విన్యసించి, ఆంగుళుల యందును, సవ్యాపసవ్య హస్తములయందును, హృదయమునందును, మూర్తియందును, తుర్యరూప మగు త్రివ్యూహ మైన తనువునందును వాయ్వర్కులను విన్యసించవలెను.
వ్యాపక మైన ఋగ్వేదమును హస్తమునందును, ఆంగుళులపై యజుర్వేదమును, రెండు అర చేతులలో అథర్వ మును శిరోహృదయచరణములయందు సామవేదమును పంచవ్యూహమునందు ఆకాశమును విన్యసించి కరములందును, దేహము, నందును అంగుళీ - శిరో - హృదయ - గుహ్య - పాదములందును వాయ్వాదికమును పూర్వము చెప్పినట్లు న్యసించవలెను.
వాయువు, అగ్ని, జలము, భూమి (ఆకాశము). వీటి సముదాయము పంచవ్యూహము మనస్సు, శ్రోత్రము, త్వక్కు, నేత్రము, జిహ్వ, ఘ్రాణము వీటి సముదాయము షడ్వ్యూహము.
వ్యాపక మైన మానసమును విన్యసించి పిమ్మట క్రమముగా అంగుష్టాచుందును, శిరస్సు, ముఖము, హృదయము, గుహ్యప్రదేశము, పాదములు - వీటి యందును న్యాసము చేయవలెను. ఇది “పరమాత్మకవ్యూహన్యాసము”. ఆదిమూర్తి అగు జీవుడు సర్వవ్యాపకుడు.
భూః, భువః, సువః, మహః, జనః, తప, సత్యం అను ఈ ఏడింటిని ముందుగా కరమునందును, దేహము, నందును అంగుష్ఠాది క్రమమున విన్యసించవలెమ.
ఏడవది తలములం దుండును. లోకేశు డైన దేవుడు దేహమునందు క్రమముగా - శిరస్సు, లలాటము, ముఖము, హృదయము, గుహ్యము, పాదములు - వీటియందు ఉండును.
అగ్నిష్టోమము, ఉర్థము, షోడశి, వాజ పేయమ, ఆ.నాక్రము, ఆప్తోర్యామము అని యజ్ఞాత్మ సప్తరూపములు కలది .
ధీ, అహంకారము, మనస్సు, శబ్దము, స్పర్శ - రూప - రసములు, గంధము, వ్యాపకమైన బుద్ధి వీటిని క్రమముగా కరమునందును, దేహమునందును విన్యసించవలేను. పాదములు, తలములు, శిరస్సు, లలాటము, ముఖము, హృదయము, నాభి, గుహ్య ప్రదేశము, పాదము వీటిపై విన్యసించవలెను. జీవుడు అష్టవ్యూహు డని చెప్పబడినాడు.
జీవుడు, బుద్ధి, అహంకారము, మనస్సు, శబ్దము, గుణము, వాయువు, రూపము, రసము అని జీవుడు సవాత్మకుడు. అంగుష్ఠద్వయము నందు జీవుని, మిగిలిన వాటిని తర్జని మొదలు వామప్రదేశిని వరకును విన్యసించవలెను. దేహము పై, శిరస్సు, లలాటము, ముఖము, హృదయము, నాభి, గుహ్యము, మోకాళ్ళు, పాదములు వీటిపై విన్యసించ వలెను. దశాత్మకుడగు ఈ జీవుడు వ్యాపకుడుగా చెప్పబడుచున్నాడు. అంగుష్ఠద్వయమునందును, తర్జన్యాదులయందును, శిరోలూట, ముఖ, హృదయ, నాభి, గుహ్య, జాను, పాదములందును విన్యసించవలెను. మనః, త్ర, చతుర్, జిహ్వా, ఫ్రణ, వాక్, పాణీ, పాద, పాయు, ఉపస్థరూపమున ఏకాదశాత్మను డగు ఈ జీవుని శ్రోత్రమునందును, అంగుష్ట ద్వయము నందును, తర్జని మొదలు ఎనిమిదింటియందును, మిగిలిన తలద్వయమునందును విన్యసించవలెను. మనస్సు వ్యాపకము. అట్లే దేహముపై క్రమముగా శిరో, లలాట, ముఖ, హృదయ, నాభి, గుహ్య, ఊరుద్వయ, జంఘా, (పిక్కలు) గుల (చీలమండలు), పాదములపై విన్యసించవలెను.
విష్ణువు, మధుహరుడు, త్రివిక్రముడు, వామనుడు, శ్రీధరుడు, హృషీ కేశుడు, పద్మనాభుడు, దామోదరుడు, కేశవుడు, నారాయణుడు, మాధవుడు, గోవిందుడు అని, ద్వాదశాత్ముడు. వీటిలో విష్ణువును వ్యాపకునిగా విన్యసించి, మిగిలిన వారిని అంగుష్టాదులండును, తలాదులందును, పాదమునందును, జానువునందును, కటియందును, శిరస్సు, శిఖ, ఉరస్సు, కటి, ముఖము, జానువు, పాదము మొద లైన వాటియందును విన్యసించవలెను. పంచవింశవ్యూహములుకలవాడును, షడ్వింశ వ్యూహములు కలవాడును, ఎట్లనగా,
పురుష-ధీ-అహంకార-మనస్-చిత్తశబ్దస్పర్శ-రస రూప-గంధ-శోత్ర-త్వక్-చక్షుర్ -జిహ్వా-నాసికా-వాక్-పాణిపాద-పాయు-ఉపస్థ-భూజలతేజస్-వాయు- ఆకాశములు పంచవింశతివ్యూహము. పురుషుని వ్యాపకునిగా విన్యసించి, పదింటిని అంగుష్టాదులందును, మిగిలిన వాటిని హస్త తలమునందును విన్యసించవలెను. పిమ్మట శిరస్సు, లలాటము, ముఖము, హృదయము, నాభి, గుహ్యము, ఊరువులు, జానువులు, పాదములు, దశేంద్రియములు, పాదములు, జానువులు, ఉపస్థ, హృదయము, శిరస్సు.వీటిపై క్రమముగా విన్యసించవలెను. షడ్వింశవ్యూహమునందు పురుషాత్మకు ముందు పర రూపము ఉండును. మిగిలినదంతయు వెనుక చెప్పినట్లే.
పండితుడు ఒక మండలము పై ప్రకృతిని ధ్యానించి పూజింపవలెను. పూర్వ-దక్షిణ-పశ్చిమ-ఉత్తర దిశలందు హృదయాదులను పూజింప వలెను. అగ్న్యాది కోణములందు అస్త్రమును, వైనతేయాదులను, దిక్పాలులను పూర్వమునందు వలెనే పూజింపవలెను. త్రివ్యూహమునందు అగ్ని మధ్యమం దుండును. పూర్వాది దిక్కులందు దలములం దున్న దేవతలతో కూడ రాజ్యాధ్యలంకృతుడై కమల కర్ణికయందు నభోరూపుడగు, మాన సాత్మ (అంతరాత్మ) ఉండును.
ఈ విఖముగ సర్వవ్యూహములతోను, గరుడాదిపంచాంగములతోను, ఇంద్రాదులతోను కూడిన విశ్వరూపుని లోకస్థితినిమిత్తము, రాజ్యజయముకొరకును పూజింపవలేను. సమస్త కామములను పొందును. ఆకాశమునం దున్న బీజమును స్మరించుచు విష్వక్సేనుని పేరుతో పూజించవలెను.
అగ్ని మహాపురాణములో వాసుదేవాదిమంత్ర ప్రదర్శనరూప మగు ఇరువదియైదవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 25 of the Agni Purāṇa is as follows:
The twenty-fifth chapter is devoted to the Ekādaśī Vrata — observed on the eleventh tithi of both lunar fortnights — as the supreme vrata in honor of Bhagavān Viṣṇu. The Purāṇa affirms that Ekādaśī is Bhagavān's own day, born from his own form to destroy the sins of devotees. The rules of the vrata are prescribed in detail: fasting from the daśamī evening, avoidance of grains on Ekādaśī itself, night-long vigil with kīrtana and nāma-japa, and breaking the fast only after sunrise on dvādaśī with appropriate foods. Twenty-four Ekādaśī-s across the year are briefly enumerated. The chapter narrates a legend in which even inadvertent observance of Ekādaśī bestowed liberation, affirming the extraordinary potency of this vrata.