ఆగ్ని దేవుడు పలికెను : వశిష్ఠా! సువర్ణదండభూషితమగు చామరము ఉత్తమము. హింస పక్షములతోగాని, మయూరపక్షములతోగాని, శుక పక్షములతోగాని నిర్మించిన ఛత్రము రాజునకు మంచిది ఇక పక్ష నిర్మితఛత్రమునుకూడ ఉపయోగించవచ్చును. మిశ్రితపక్షముల ఛత్రము మాత్రము మంచిదికాదు మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఏడు లేదా ఎనిమిది పర్వములున్న దండము ప్ర స్తవం. భద్రాసనము క్షీరవృక్షకామ్లముచే నిర్మితమై ఏబది అంగుళముల ఎత్తు ఉండవలెను. ఆది సువర్ణ విచిత్రతమై మూడు హస్తముల విస్తారముండవలెను. ఓ ద్విజ శ్రేష్ఠా! ధనస్సును నిర్మించుటకు లోహముగాని, శృంగముగాని, కౌష్టముగాని ఉపయోగించవలెను. వెదురు, భంగము లేదా చర్మము వారికి ఉపయోగించును. దారు నిర్మితమగు! శ్రేష్ఠధనస్సుయొక్క పొడవు నాలుగు హస్తములు దానిలో ఒక్కొక్క హస్తము పొడవు తగ్గించగా మధ్యమయి అధమ ధనస్సులేర్పడును పిడికిలితో పట్టుకొనుటకు ధనస్సునకు మధ్యభాగ మున ఏదైన ప్రవ్యమునుపయోగించవలేను ధనస్సు యొక్క కోటిని కామినీభ్రూలత ఆకారములో చాల గట్టిగ చేయవలెను. లోహశృంగధనస్సులను ప్రత్యేకముగ ఒక పదార్థముతోగాని, మిశ్రపదార్థములతోగాని తయారుచేయవలెను. శృంగధనస్సును అత్యంతోపయుక్తముగాను, సువర్ణ బింద్వలంకృతముగాను చేయవలెను ధాతువులతో సువర్ణ-రజత-తామ్ర-కృష్ణలోహములను ఉపయోగించవలెను. శార్జ్గ ధనస్సులలో మహిష-శరభ-రోహిణహృగముల శృంగములతో నిర్మించినవి శుభములు. దారుమయశరాసనములలో చందన-వేతస-సాల-ధవ-అర్జున వృక్షముల కాష్ఠముతో నిర్మించినవి ఉత్తమములు. శరదృతువునందు పక్వమైన వెదురు కోసి నిర్మించిన ధనస్సు సర్వోత్తమము. ధవస్సును, ఖడ్గమును త్రైలోక్యమోహనమంత్రములతో పూజించవలెను.
లోహము, వెదురు, సరకాండము వీటితోగాని, ఒరియే ఇతర పదార్థములతో నిర్మించినను బాణము వంకర లేకుండగను, బంగారుకాంతికలదిగను, స్నాయువువలె క్లిష్టముగను, బంగారు పొన్నుతో భూషితముగను, తైలధౌతముగను, అందమైస రెక్కలు కట్టిన దిగను ఉండవలెను. రాజు యాత్రకుందును, అభిషేకమునందును, ధనుర్బాణములు మొదలగు అస్త్రములు; పతాకలు సంగ్రహించునపుడు దైవజ్ఞులనుగూడ పూజించవలెను. పూర్వము బ్రహ్మ దేవుడు సుమేరు పర్వత శిఖరమునంద, ఆకాశగంగాతీరమున యజ్ఞము చేసెను. అతడా యజ్ఞమునకు వచ్చియున్న లోహదే త్యుని చూచేను. ఆతనిని చూడగనే “వీడు నా యజ్ఞమున విఘ్నము కలిగించడుకదా!” ఆని వింతలోపడెను. ఇట్టి చింతకలుగగనే అగ్నినుండి బరి వంతుడగు ఒక పురుషుడు ఆవిర్భవించి బ్రహ్మకు నమస్క రించెను. దేవతలు ప్రసన్నులై ఆతనిని అభినందించిరి. ఇట్లు అభినందింపబడుటచే ఆతడు ‘నందక’ మను పేరుతో ఒక బడ్గమాయెను దేవతలు ప్రార్థింపగా శ్రీమహావిష్ణువు ఆ ఖడ్గమును తన ఆయుధముగ స్వీకరించెను. ఆ దేవాదిదేవుడు ఆ ఖడ్గమును దాని కంఠమున చేయి ఉంచి పట్టుకొనుటచే ఆది ఒర నుండి బైటకువచ్చెను. ఆ ఖడ్గకాంతి నీలముగను, ముష్టిరత్న మయముగను ఉండెను. అది పెరిగి నూరు హస్తముల పొడవాయెను. లోకదైత్యుడు గదాప్రహారము చేయుచు దేవతలను యుద్దభూమినుండి తరుమ మొదలిడెను. శ్రీ మహా విష్ణువు ఆ ఖడ్గముతో దైత్యుని శరీరమునంతను ఖండించివే సెను. నందకము స్పర్శతగులగనే ఆ దైత్యుని లోహమయాంగమం లన్నియు ఛిన్నాభిన్నములై భూతలముపై విడిపోయినవి. ఈ విధముగ లో హాసురుని సంహరించి శ్రీ మహావిష్ణువు- “నీపవిత్ర శరీరము భూతలమున ఆయుధనిర్మాణమునకై ఉపయుక్తమగుగాక” అని ఆతనికి వరమిచ్చెను. ఆనంతరము శ్రీ మహావిష్ణు ప్రసాదముచే బ్రహ్మ సర్వ సమర్థుడగు శ్రీ మహావిష్ణువును యజ్ఞముద్వారా నిర్విఘ్నముగ ఆరాధించెను. ఇపుడు నేను ఖడ్గ లక్షణములను చెప్పెదను.
ఖటీఖట్టర దేశమునందు నిర్మితములగు ఖడ్గములు చాల అందముగా ఉండును. ఋషీకదేశ నిర్మితములు శరీరమును చీల్చివేయును. శూర్పారక దేశీయఖడ్గములు ఆల దృఢముగ నుండును. అంగదేశఖడ్గములు తీక్ష్ణములై దెబ్బను ఎదుర్కొన సమర్థములైయుండును. ఆంగదేశఖడ్గములు తీక్ష్ణములు. ఏబది అంగుళముల ఖడ్గము ఉత్తమము. దానిలో సగము పరిమాణము గలది మధ్యమము. ఇంతకంటే తక్కువ ప్రమాణము గలదానిని ధరించగూడదు. మువ్వల ధ్వనివలె దీర్ఘశబ్దముచేయు ఖడ్గమును ధరించుట చాలమంచిది. పద్మపత్రమువలేగాని, ముండలాకార మునగాని, కరవీరపత్రమువలె గాని ఉన్న ఆగ్రముగలదియు, మృతగంధము కలదియు, ఆకాశ శీలమును అగు ఖడ్గము ప్రశస్తము. ఖడ్గముపై, సమాంగుళము నందున్న లింగాకారమగు వ్రణము ప్రశస్తము. కాక-ఉలూకములవంటి వర్ణముగలిగి విషమముగ నుండు ఖడ్గములు మంగళకరములుకావు. ఖడ్గమునందు తనముఖము చూచుకొనగూడదు. ఖడ్గముజాతిని, మూల్యమునుకూడ ఎవ్వరికిని చెప్పరాదు. రాత్రి ఖడ్గమును తలపైపున పెట్టుకొని నిద్రింపరాదు.
అగ్ని మహాపురాణమునందు చామరాది లక్షణ కథనమను నలుబదియైదవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 245 of the Agni Mahā Purana is as follows:
The Rasāyana therapy, concerned with rejuvenation and the extension of healthy life, is described. Agni presents the kuṭīprāveśika method — wherein the sādhaka enters a specially constructed hermit's cell and undergoes a complete rejuvenation course with rare herbal preparations — and the vātātapika method, conducted in the open air with more accessible preparations. Śilājatu, aśvagandha, śatāvarī, bhallataka, and āmalakī are among the foremost rasāyanas described.