అగ్ని మహా పురాణము

103 - అథ జీర్ణోద్ధారవిధిః.

పరమేశ్వరుడు చెప్పెను : స్కందా! జీర్ణాదిలింగము, శాస్త్రీయోద్ధారక్రమమును గూర్చి చెప్పెదను : చిహ్నములు అరిగిపోవుట, బద్ద లగుట, మాలిన్యాదుచే స్థూల మగుట, వజ్రాహతమగుట, సంపుటిత మగుట, విరిగిపోవుట, అంగభంగము ఏర్పడు ఇట్టి దోషము లేర్పడిన లింగము పిడులను, వృషభమును వెంటనే త్యజించ వలెను. శివలింగమును ఎవరైన చలింపచేసినను, స్వయముగా ఆది చలించినను, చాల క్రిందికి దిగిపోయినను, విషమస్థానస్థిత మైనను, దిష్మోహ మున్నను, ఏ కారణముచేతనైన క్రింద పడి చను, లేదా మధ్యనే ఉన్న ను జారిపోయినను దానిని మరల స్థాపించపలెను. అది ప్రణరహిత మైననే ఆట్లు స్థాపించవలెను. నదీజలముచే కొట్టుకొనిపోయిన శివలింగమును గూడ మరల స్థాపన చేయవచ్చును. సుదృఢముగా నున్న శివలింగమును దాని స్థానమునుండి కదల్చగూడదు. అస్థిర మైన శివలింగమును చలింపచేసినచో, శాంతినిమిత్తమై వెయ్యి హోమములను, పునఃస్థాపనార్ధమై నూరు హోమములను చేయవలెను. శివలింగము జీర్ణతానిదోషయుక్త మైనను, దానికి నిత్యపూడ్డాదికము జరుగుచున్న చో దావిని కదల్చకూడదు. జీర్ణోద్గారార్థమే దక్షిణమునగాని ఈశాన్యమున గాని ఒక మండపము ఏర్పరచి, పశ్చిమమున ఒక ద్వార మేర్పరుపవలెను. ద్వారపూజాద్యనంతరము, వేదిక పై శివపూజ చేయవలెను. మంత్రపూజా తర్పణానంతరము అనుకటి వలే వాస్తుపూజ చేయవలెను. పిదప గురువు, బైటకు వెళ్లి, భూతబలి ఇచ్చి, ఆచమనము చేసి, బ్రాహ్మణులకు భోజనము పెట్టవలెను. పిదప శివునితో ఈ విధముగ నివేదించవలేను- “శంభూ! ఈ లింగము దోషయుక్త మైపోయినది. దీనిని ఉద్దరించినచో శాంతికలుగు నని నీవే చెప్పియున్నావు. అందుచే యథావిధిగా ఈ కార్యము చేయబడుచున్నది. శివా! నీవు నాలో ఉండి, ఈ కార్యమును సుసంపన్నము చేయుము.” శివునితో ఈ విధముగా విజ్ఞాపన చేసి, మధుమృతమిశ్ర మగు పాయసముతోను, దూర్వలతోను, మూలమంత్రముతో నూటఎనిమిది హోమములు చేసి, శాంతిహోమము కూడ పూర్తి చేయవలెను. పిదప లింగమునకు స్నానము చేయించి వేదిక పై దానికి పూజ చేయవలెను.

 పూజ “వ్యాపకేశ్వరాయ శివాయ నమః” అను మంత్రము ఉచ్చరించుచు చేయవలెను. “ఓం వ్యాపకేశ్వరాయ హృదయాయ నమః” “ఓం వ్యాపకేశ్వరాయ శిరసే నమః” ఇత్యాదులు అంగమంత్రములు. పిదప అస్త్రమంత్రము ఉచ్చ రించుచు శివలింగము ఆశ్రయించి యున్న భూతముతో “ఏదైన భూతము ఈ శివలింగమును ఆశ్రయించి ఉన్నచో, అది శివాజ్ఞ ప్రకారము, ఈ లింగమును విడచి, తన కిష్టము వచ్చిన చోటునకు పోవలెను. విద్యా విద్యేశ్వరులతో భగవంతు డైన శివుడు ఇచట నివసింపనున్నాడు” అని చెప్పవలెను. పాశుపతమంత్రముతో ఒక్కొక్క భాగమునకు వేయి చొప్పున హోమములు చేసి, శాంతిజలముతో ప్రోక్షణము చేయవలెను. కుశలతో స్పృశిచి పై మంత్రమును జపించవలెను. పిదప గురువు, విలోమక్రమముతో ఆర్ఘ్య మిచ్చి లింగముపైనను, 'పిండికయందును, ఉన్న తత్త్వములను, తత్త్వాధిపతులను, ఎనమండుగురు మూర్తీశ్వరులను స్వర్ణపాశమునుండి విస్తరింపచేసి, వృషభము భుజముపై నున్న రజ్జువుచే పట్టి తీసికొని పోయి, జనసముదాయముతో కూడ శివనామసంకీర్తనము చేయుచు, ఆ వృషభమును నీటిలో పడవేయవలెను. మంత్రజు డైన ఆచార్యుడు పుష్టికొరకై నూరు హోమములు చేయవలెను. దిక్పాలకుల తృప్తి కొరకుకు, వాస్తుశుద్ధి కొరకును గూడ నూరేసి హోమములు చేయవలెను.

పిదప మహాపాశుపత మంత్రముతో ఆ దేవాలయమునందు రక్షణము ఏర్పాటు చేసి, అచట విధిపూర్వకముగ మరి యొక లింగమును స్థాపించవలెను. ఆసురులు, మునులు, దేవతలు, తత్త్వవేత్తలు స్థాపించిన లింగము జీర్ణ మైనను, భగ్న మైనను, దానిని యథావిధిగా కూడ కదల్చరాదు. జీర్ణదేవాలయోద్ధార విషయమునందు గూడ ఈ విధినే అవలంబించ వలెను. ముత్రగణములను ఖడ్గమునందు న్యాసము చేసి, మరొక ఆలయము నిర్మించవలెను. దానిని మొదటి దాని కంటే చిన్నది చేసినచో కర్త మరణించును. పెద్దది చేసినచో ధనహాని కలుగును. అందుచే వెనుకటి ఆలయమునందలి వస్తువులతో గాని, మంచివైన ఇతర వస్తువులతో గాని, ఆ స్థానమునందు, మొదటి ఆలయము ఎంత ఉండెడిదో అంత ఆలయమే నిర్మించవలెను.

అగ్ని మహాపురాణమునందు జీర్ణోద్ధార విధి యను నూటమూడవ అధ్యాయము సమాప్తము.