అగ్నిదేవుడు పలికెను. ధన్వంతరిచే సుశ్రుతునకు చెప్పబడినదియు మృత సంజీవనమును శ్రేష్ఠమును అగు ఆయుర్వేదమును గూర్చి చెప్పెదను. సుశ్రుతుడు పలికెను. మనుష్య, అశ్వ, గజరోగములను తొలగించు ఆయుర్వే దమును మృత సంజీవనకరములగు సిద్ధయోగములను సిద్దమంత్రములను నాకు చెప్పుము. ధన్వంతరి పలికెను. జ్వరము వచ్చినవాని బలము చూచుకొని వైద్యుడు లంగ సమును చేయించవలెను, పిదప శుంఠితో కూడి నదియు, దాహమును జ్వర మును తగ్గించు, లాజలగంజిని కాచిన జలమును ముస్త, పర్పట, కోశం, చందన, ఉదీచ్య, నాగరములు వేసి కాచి ఇవ్వవలెను. ఆరు దినములు గడచిన తరవాత, తిక్తకషాయమును తప్పక త్రాగించవలెను. జ్వరము తగ్గిన తరవాత, చెమట పట్టునట్లు చేసి, విరేచనమునకు మందు ఇవ్వవలెను. షష్టిక నీవారములు రక్తలులు ప్రమోదకములు. ఇట్టి పాత ధాన్యములు జ్వరమునందు మంచివి. యవలతో చేసిన పదార్థములు మంచివి. ముద్గ - మసూర - చిణక - కులుత్థ - కుష్ఠక - ఆడకి - నారకాదులును కర్కోటక - కట - ఉల్చకములను ఫలములతో కూడిన పటోలము వేప, దాడిమము ఇవి జ్వరమునందు హితకరములు. రక్త పిత్థము ఆధోగతిగ లదియైనచో, వమనము ఊర్ధ్వగతి కలదియైనచో విరేచనము ప్రశస్తము. శుంఠి చేర్చక తయారుచేసిన షడంగక్వాథము ఇవ్వవలెను. ఈరోగమున సక్తు-గోధూమ-లాజగువ-గాలి-మసూర-మకుష్ట - చణక - ముద్గములు - హితకరములు. పాలు నెయ్యి చేర్చి చేసిన గోధుమ పదార్థములు బలవర్థకములగు రసము తేనె, శ్రేష్ఠమైనది అతిసారరోగమునందు పాత బియ్యమును భక్షించుట హితకరము.
గుల్మరోగమునందు కఫకరము కానిదియు, లోధ్రవృక్షపు బెరడుతోచేసిన క్వాథము కలిసినదియు ఆగు. అన్నము మంచిది, వాయుకరములగు అన్నమును త్యజించవలయును. ఉదరరోగమున క్షీరముతో కలిపి ఘృతసాధితమగు వాట్యమును తినవలెను. గోధుచులు, బియ్యము, తిక్త ఔషధములు వీరికి మంచిది. గోధుమలు, బియ్యము, ముద్గములు, పలాశ బీజములు, ఖదిరము, ఆభయ పంచకోణము, జాంగలము నింబ పటోలకములు, ఉసిరి, మాతులుంగరసము, జాజి, శుష్కమూలకము, సైంధవము, ఇవి కుష్ఠరోగములకు హితకరములు. త్రాగుటకు ఖదిరోదకము మంచిది. పేయమునకు మసూర ముద్దములు ఉపయోగించవలెను. తినుటకు పాత బియ్యము హితకరము! నింబ పర్పటక శాకముల జాంగలరసము, విడంగ - మరిచ - ముస్త - కుష్ఠ - లోధ్ర - సువర్చికా - మనశ్శిలా - వచలు, గోమూత్రమున నూరినవి కుష్ఠమును తొలగించును. మేహవ్యాధి కలవారికి ఆపూప కుష్ఠ కుల్మాష యవాదులు హితకరములు యవలతో చేసిన పదార్ధములు పెసలు ఉలవలు - పాత బియ్యము, తిక్తరూష, శాకములు, తిక్తములు, హరితములగు శాకములు, తిలసిర్రుక - విభీతక - ఇంగుదీతైలములు హితకరములు రాజయక్ష్మరోగులకు ముద్దయవ గోధూములు ఒక సంవత్సరము నిల్వయున్న ధాన్యము జాంగ లరసము భోజనమునందు ప్రశ స్తము శ్వాసకాస రోగులకు కులస్థ-ముద్ద - కోల - శుష్కమూలక జాంగల అపూప - డధులు దాడిమరస సాధితములగు విష్కాల జాంగలర సమతు లుంగ రస, ఔద్ర, ద్రాక్షాదులు, వ్యోష సంస్కృతములగు యవ. గోధూమ శాంకన్న ములు హితక రములు. దశమూల, బల, రాస్నలు, కుళుత్థనిర్మితములగు పేయములు పూప రసత్వాథములు శ్వాసను ఎక్కిళ్ళను తొలగించును.
శుష్కమూల కుళుత్థ - మూల జాంగలజరసములు, పాతయవలు! గోధుమలు, పాలవరి - ఉశీరముతో కలిపి తీసుకొన్నచో శ్వాసకాసములు తొలగును. శోథరోగి గుడ సహిత పథ్యముకాని. గుడ నాగరమునుగాని తినవలెను. తక్రమ, చిత్రకము, ఈ రెండును గ్రహణిరోగమును తొలిగించును. సర్వదా వాతరోగముతో బాధపడు వారికి పాత యవలు గోధూమలు వరి, జాంగ లర సము, ముద్ద ఆమలక, ఖర్జూర మృద్వీకా బపరములు, మధువు, నెయ్యి, పాలు, శక్రము, నింబము, పర్పటకము, బలికారక ద్రవ్యములు, తక్రారిష్టములు హితకరములు హృదయరోగము కల వారికి విరేచనము చేయించవలెను. ఎక్కిళ్ళకు పిప్పలి మంచిది. మజ్జిగ ఆరణాలము, సీధువులను చల్లటి నీటితో తీసుకొన వలేను. ఎక్కిళ్ళకు మంచిది. మదాత్యయరోగమన ముత్యములు, సౌవర్చలాజాదికము మద్యము హితకరమైనది. గాయ పడినవాడు షోద్రము పాలు కలిపిన లాక్షను త్రాగవలెను. మాంస రసాహారము అగ్ని సంరక్షమై క్షయ రోగమును జయించును. క్షయ రోగికి భోజనమున ఎర్రవరి నీవారములు కలవములు మొదలగునది హిలకర ములు. హరరోగ మున యవాన్న వికృతులు మాంసము. శాకము, సౌవర్చలము, శటి , మండము జలముక లిపిన తక్రము మంచివి. మూత కృచ్ఛరోగమున ముస్తాభ్యాసము, హరిదా చిత్రకలేపము, యవాన్న వికృతులు, వరి వాస్తూకము, సువర్చలము తప్పు, క్షీరేక్షుఘృత మిశ్రితములగు గోధుమలు తినుటకు మంచివి. మండపురాదులు తాగుటకు మంచివి. వమనరోగమునకు లాజలు, సక్తువులు, మధువు శూన్య మాంసము, పరూషకము, వార్తాకము, నెమలి రెక్కలు కొన్ని పానకములు మంచివి వరి అన్నము కాచిన నీరు, పాలు, దాహమును కట్టును. ముస్తా గుడవలతో చేసిన గుటికను ముఖమునందుంచు కున్నను దాహము తొలుగును. యవాన్న వికృతులు పూపము, శుష్కమూలకము, శాకము, వేత్రాగ్రము, ఇవి మోకాలు పట్టుకొను టను తొలగించును. విసర్ఫరోగరం కలవాడు. ముద్ద ఆడక, మసూరముల గంజి తింయు జాంగ లర సము, సైంధవ యుక్త మృతము, ద్రాక్ష, శుంఠి, ఉసిరి, కోలమం వీటి యూషములతో పాత గోధుమలు, యవలు వరి వీటి అన్నమును తినవలెను. విసర్పి మధు ద్రాక్షా దాడిమములతో చేసిన జలమును పంచదారకలిపి త్రాగవలెను.
వాత రక్త రోగి ఎర్రవరి, గోధుమలు, మద్గములు మొదలగు అన్నములు, లఘువుగా తినవలెను. కాక మారి, వేర్రాగ్రము, వాస్తుకము, సువర్చలా, మొదలగు శాకములు, మధుశర్కరా మిశ్రితమగు జలము, తీసుకొన వలెను నాసికా రోగమునకు దూర్వా సిద్ధమగు ఘృతము హితము. భృంగరాజరసముతో గాని, ఆమలకర సముతో. కాని శోధితమైన తైలమును వశ్యముగా, ఇచ్చినచో సమస్త శిరోరోగములకు హితకరమాలు శీతల జల అన్న పానములు తిలభక్ష ఇము దంతములను దృఢము చేసి గొప్ప తృప్తిని కలిగించును. తిల తైలముతో గండూషము దంతములకు దార్ద్యము నిచ్చును. విడంగ చూర్ణము, గోమూత్రము అన్ని విధముల క్రిమినాశనమునకు ఉపయోగించును. ఉసిరి పండ్లు నూరి నేతిలో కలిపి శిరస్సుకు మర్దించినచో శిరో రోగములు నశించును. స్నిగ్ధము, ఉష్ణము అయిన భోజనము కూడ శిరోరోగము సిద్ధాషధానినకు మంచిది. కర్లశూలము తొలగించుటకు చెవులలో తైలముగాని, మేకమూత్రముగాని, నింపవలెను. ఇది సకల శిరో రోగముకు మంచిది. గిరి మృత్తిక, లాక్ష, చందనము, మాంతీకలిక, వీటిని కలిపినూరి చేసినవర్తి క్షతమును శుక్ర దోషమును హరించును. వ్యోషము త్రి ఫలమును, తుచ్చకమును జలమును కలిపి కంటిలో వేసికచో సర్వనేత్ర రోగ నాశకము. రసాంజనము కూడ ఇందుకు మంచిది. లోధ్రకాంజిక సైంధములను నేతిలో వేయించి శిలపై నూరి నేత్రమునకు లేపము చేసినచో అన్ని నేత్ర రోగములు తొలగును. నీళ్ళు కారుట తగ్గును. గిరి మృత్తికా చందనము వీటిని పైన రాసి. నచో కండ్లకు మంచిది. నేత్రరోగనాశనమునకైన సర్వదా త్రిఫలను సేవించవలెను.
దీర్ఘాయుర్దాయము కోరువాడు త్రిఫలను మధుమృతములతో సేవించవలెను. శతావరి రససోదితములగు క్షీర ఘృతములు బలవర్ధకములు, మాషములు పాలు నెయ్యి ఇవి కూడ బలవర్ధకములు. వెనుక చెప్పినట్లు మధుకామిక్రితమగు త్రిఫల ఆయుర్వర్ధకము. మధుకాదిర సమిశ్రితమగు త్రిఫల బళులను పలితమును నశింపచేయును వచాసిద్ధమగు ఘృతము భూత దోషమును నివారించును. దానితో చేసిన కవ్యము బుద్ధి ప్రదము. సర్వమనో రథసాధకము. బలాకల కషాయముతో చేసినది అభ్యంజనమునకు మంచిది. రాస్న తోగాని, సహచరితో గాని సిద్దమైన తైలము వాతరోగులకు మంచిది. వ్రణముకు శ్లేష్మ చేయని ఆహారము మంచిది. జీర్ణమునకు సక్తుపిండి ఆమ్ల, ప్రశస్తములు. వేప చూర్ణము వ్రణము పక్వమైనపుడు దానిని చితికించుటకును, మాన్పుటకును మంచిది. అట్లే సూదితో చికిత్సకూడ వ్రణమునకు మంచిది. బలికర్మ విశేషముచే సూతికకు లాభమగును రజాకర్మ ప్రాణులకు సర్వదా పాతక రము సర్పదష్టునకు నింబపత్ర భక్ష జము ఔషధము. తాళ నింబ పత్రములు పురాణ తైలము లేదా పురాణ ఘృతము కేశములకు మంచిది. తేలుకుట్టిన వానికి నెమలి పింఛము, ఘృతము, వీటితో ధూపము మంచిది. లేదా జిల్లేడు పాలతో నూరిన పలాశ బీజముల లేపము. తేలు విషమును దింపివేయును. తేలుకుట్టిన వానికి కృష్ణా ఫలములు కానీ శివానలములుకాని, తినిపించవలెను. జిల్లేడు పాలు తిలలు తైలము పలలము గుడము వీటిని సమాన మాత్రలో వేసి త్రాగించినచో భయంకరమగు కుక్క విషము శ్రీఘ్రముగ నశించును. మూలమును, త్రివృత్తును, సమావ మాత్రలో నేతితో లాగినచో మనుష్యుడు బలవంతుడై సర్వకీట విషములను జయించును. చందనము పద్మము, కుష్ఠము, లతాంబు. ఉషీరము, పాటల, నిర్గుండి, శారిబ సేలు, ఇవి సాలె పురుగు విషమును తొలగించును. గుడ సహితమగు శుఠి శిరో విరేచనమునకు మంచిది, స్నేహపానమునకు బస్తి క్రీపును తైలమృతములు అత్యుత్తమమలు. అధికాగ్నికి స్వేదనము, (చేమట పట్టించుట) స్తంబనమునకు చల్లటి నీరు శ్రేష్ఠము. రేచనమునకు త్రివృద్ధియు, వమనమునకు మదనమును శ్రేష్ఠము. వస్తే విరేచ నవమనములు శ్రీ లమృత మధువులు క్రమముగ వాతపిత్త కఫమకు పరషమౌధములు.
ఆగ్ని మహాపురాణమున సిద్ధౌషధాది కథనమను రెండు వందల డెబ్బది తొమ్మిదవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 279 of the Agni Purāṇa is as follows:
Dhanvantari narrates Āyurvedic treatments to Suśruta, covering a broad range of diseases. Treatments for jvara (fever) begin with laṃghana (fasting) and pañcamūla kvātha, followed by tikta and kaṣāya herbs. Remedies for rakta-pitta (hemorrhagic disorders), atisāra (diarrhea), kuṣṭha (skin diseases), meha (diabetes), śvāsa-kāsa (asthma and cough), and mūtra-kṛcchra (urinary disorders) are detailed. The four types of disease — śārīra (physical), mānasa (mental), āgantuka (exogenous), and sahaja (congenital) — are enumerated as the foundational taxonomy of Āyurvedic pathology.