నారదుడు పలికెను -
ఆన్ని కోరికలను తీర్చు ఆగ్నికార్యమును చెప్పెదను. ఇరవై నాలుగు అంగుళముల చతురస్ర క్షేత్రమును సూత్రముతో కొలచి సమముగా అంతలను సమముగా త్రవ్వవలెను. ఆ విధముగా త్రవ్వినదానికి రెండంగుళములు విడచి మేఖలలు (ఒడ్డాణము వంటి కట్లు) చేయవలెను. సత్వము మొదలగు పేర్లు గల ఆ మేఖలలు పూర్వాభిముఖములు గాను, పండ్రెండు అంగుళములు ఎత్తు కలవిగ ఉండవలెను. ఒకటి ఎనిమిది అంగుళముల విస్తారము కలది, రెండవది రెండు అంగుళముల విస్తారము కలది, మూడవది సొలుగు అంగుళముల విస్తారము కలది అయి ఉండవలెను. పది అంగుళిముల రమ్యమైన యోని ముందు వైపు వరుసగా ఆరు.నాలుగు. రెండు అంగుళములు ఎత్తు ఉండవలెను. పడమట నున్న దానిని క్రమముగా లోతుగా నుండునట్లు చేయవలెను. రావి ఆకు ఆకారములో నున్న దానిని కొద్దిగా కుండములోనికి చేర్చి నిర్మింపవలెను. దాని నాళము నాలుగు, ఐదు, పది అంగుళాల పొడవు ఉండవలెను. ఆ యోనియొక్క మూలము మూడు అంగుళములు, దాని ఆగ్రము ఆరు అంగుళములు ఉండవలెను. ఏకహస్త కుండలక్షణము ద్విహస్త కుండాదుల విషయమున రెట్టింపు అగుచుండును.
ఒక మేఖల, మూడు మేఖలలు గల వర్తులాదికుండములను గూర్చి చెప్పెదను. కుండము యొక్క ఆర్ధమునందు సూత్రము నుంచగా కోణమునందు మిగిలిన ఆ సూత్రములోని ఆర్ధమును దిక్కునందుంచి త్రిప్పినచో ఆది వర్తుల మగును.
కుండార్ధమును మించిన కోణభాగార్ధమును బయట ఉత్తరభాగమున పెంచి పూర్వపశ్చిమముల వైపు బైటకు చాపి మధ్యమునందు ఉంచి సూత్రము త్రిప్పినచో ఆర్ధచంద్రాకార మైన శుభకర మైన కుండము ఏర్పడును. పద్మాకార మైన వర్తులగుండమునందు మేఖలయందు దలము లుండును.
హోమము చేయుటకై చేయి ప్రమాణము లేదా పండ్రెండు అంగుళముల ప్రమాణము గల సృక్కును చేయించ వలెను. దాని మూలభాగము చతురస్రముగా ఏడు లేదా ఐదు అంగుళములు ఉండవలెను. దాని మధ్యయందు త్రిభాగమును అంద మైన, వర్తులాకార మైన గర్త ము గొయ్యి) ఉండవలెను. ఆడ్డముగా, పై భాగమున సమముగా ఆ గర్తము నిర్మించి పైన ఆర్ధాంగుళ భాగమును శోధించవలేను. (చెక్కి నున్నగా చేయవలెను). నాల్గవ వంతు అంగుళమును, మిగిలిన అర్దములో ఆర్ధమును కూడ శోధించవలెను. మిగిలిన ఆర్ధముచే గర్త మునకు రమ్య మైన మేఖలను ఏర్పరుపవలెను. త్రిభాగ విస్తారము కలదియు, అంగుష్ఠ మంత ఆయత మైనదియు ఆగు కంఠమును చేయవలెను. దాని అగ్రమునందు నాలుగు లేదా ఐదు అంగుళముల ప్రమాణము గల ముఖ ముండవలెను. దాని మధ్యము ఆరు అంగుళముల ప్రమాణ ముండవలెను. దాని ఆయామము కూడ అంతయే ఉండి మధ్యమున పల్లమై ఆందముగా ఉండవలెను. దాని కంఠదేశమునందు చిటికెనవ్రేలు ప్రవేశించు నంత రంధ్ర ముండవలెను. మిగిలిన కుండము (సుక్కు ముఖము) ఆభిరుచి ననుసరించి విచిత్రముగ చేయవలెను.
సువము దండముతో సహా చేయి పొడ వుండవలెను. కొంచెము పంకమునందు ఆవు పాదము దిగిన లోతు ఎట్లుండునో ఆ విధముగా ఆంద మైన, రెండు అంగుళముల వృత్తము చేయవలెను.
ఆగ్ని కుండమును ఆలికి, ఆంగుళము ప్రమాణము గల వజనాసికాలేఖను గీయవలెను. ఆది ఉత్త రాగ్ర మగు మొదటి రేఖ. దాని పై పూర్వాభిముఖము లైన రెండు రేఖలు గీయవలెను. వాటి మధ్య దక్షిణాదిక్రమమున మూడు రేఖలు గీయవలెను.
మంత్రవేత్త ఈ విధముగా రేఖలు గీసి, ప్రణవ ముచ్చరించుచు నీళ్ళు చల్లి, ఓంకారము నుచ్చరించుచు - పీఠమును కల్పించి దానిపై మూర్తి మతి యగు వైష్ణవీశక్తి ని అలంకరించి, విష్ణువును స్మరించుచు అగ్ని ని ఉంచవలెను.
జానెడు పొడవు గల సమిధల నుంచి ఆ అగ్నిని ప్రజ్వలింపచేసి పూర్వాదిదిక్కులందు దర్భలు మూడు విధములుగా (చుట్టూ) పరచి, వాటి పై పాత్రను, ఇద్మ మును వహ్నిని సమీపమున నుండు నట్లు చేసి సుక్కును, స్రువమును భూమిపై ఉంచవలెను.
ఆజ్యస్థాలిని, చరుస్థాలిని, కుశాజ్యమును ప్రణీతచే ప్రోక్షించి, ప్రోక్షణిని గ్రహించి దానిని. నీటితో నింపి, ఆ నీటిని పవిత్రముచే కప్పబడిన హస్తమునందు జారవిడచి, ప్రోక్షణిపాత్రమును తూర్పుగా తీసికొని వెళ్ళి, దానిని . అగ్ని కి ఎదురుగా ఉంచి, దానిని ఉదకముచే మూడు సార్లు-ప్రోక్షించి, ఎదుట నుంచి ఉత్తరమున పుష్పలముతో కూడిన ప్రణీత పై విష్ణువును ధ్యానించి, ఆజ్యపాత్రను ఆజ్యముతో నింపి ఎదుట ఉంచి, తెగని చిగుళ్లు గల, గర్భము లేని జానెడు పొడవైన రెండు కుశ ములను వెల్లగితల చేయబడిన హస్తములచే బొటనవేలితోను అనామిక తోను పట్టుకొని, వాటిని నేతిలో ఇటు నలు త్రిప్పినేతిని సంస్కరించవలేను.
వాటి ఆజ్యమును సంగ్రహించి, రెండు పర్యాయములు తీసి, మూడు పర్యాయములు - క్రిందికి చిమ్మవలెను. వాటితో సుక్రువములను గ్రహించి, నీటిచే తడిపి, వెచ్చచేసి, దర్బలచేత తుడిచి, మరల కడిగి, వెచ్చచేసి, ఓంకారము నుచ్చరించుచు క్రింద ఉంచి, సాధకుడు, పిమ్మట ఓంకారము మొదట ఉచ్చరించుచు, చివర 'నమః' అని అనుచు పిమ్మట హోమము చేయవలెను.
గర్భాధానాది కర్మలను ఆ యా అంశముల వ్యవస్థ చక్కగా పాటించుచు, అంగముల ననుసరించి, నాకంత ముగా గాని, సమావర్తాంతము గాని, అధికారాంతము గాని చేయవలెను.
సాధకుడు అన్నింటను ఓంకారముతో ఉపచారము చేయవలెను. ధనలోభము చేయకుండగా అంగహోమములు చేయవలెను.
గర్భాధానము, పుంసవనము, సీమస్తోన్నయనము, జాతకర్మ నామకరణము, అన్నప్రాశనము, చౌలము, వ్రత బంధము (ఉపనయనము), సమస్త మైన వేదవతాలు (నాలుగు), స్నాతకము, వివాహము, ఆధికారకము అను సంస్కారము లను వరుసగా చేయవలెను.
ప్రతికర్మయందును హృదయాదాక్రమముచే ధ్యానించి, ఒక్కొక్క కర్మను పూజించి, మరల - ఎనిమిదేసి ఆహుతు లను హోమము చేయవలెను.
సాధకుడు నౌషట్ చివర గల మంత్రమును చక్కగా ప్లుతస్వరముతో ఉచ్చరించుచు సుక్కు మొదటి భాగముతో పూర్ణాహుతి ఇవ్వవలెను.
విష్ణువునకై వహ్నిని సంస్కరించి వైష్ణవ మైన చరువును అర్పించవలెను. స్థలిడిలముమీద విష్ణువును పూజించి, మంత్రములను స్మరించుచు ఆశ్రయించవలెను.
ఉత్తమ మైన సాంగావరణమును ఆసనాది క్రమముచే గంధ పుష్పములతో పూజించి, దేవతా శ్రేష్ఠు డైన ఆ విష్ణువును ధ్యానించి, సమిధను ఉంచి, పిమ్మట ఆగ్నేయ ఈశాన్య దిక్కులందు ఆజ్యాఘారములను, వాయవ్య నైరృత దిక్కులందు ఆజ్యభాగములను క్రమానుసారముగా సమర్పించి, పిమ్మట దక్ష్మితో త్తర చక్షురోమములు చేసి, పిమ్మట అర్చా క్రమానుసారముగా మధ్యయందు, సర్వమంత్రముల తోడను, హోమము చేయవలెను.
ఆజ్యముచేత మూర్తినితృప్తిపరచవలెను. వదన అంశము అంగ హోమము చేయవలెను. ఆజ్యము మొదలైనవాటితో లేదా తిలలతో గూడిన సమిధలతో నూరు లేదా వేయి హోమములు చేయవలెను.
హోమము అంతమునందు గల పూజను సమాప్తి చేసి ఉపవాస మున్న పవిత్రు లై న శిష్యులను పిలచి, తన ఎదుట ఉంచుకొని, ఆ పశువులను అశ్రమంత్రముచే ప్రోక్షించవలెను.
శిష్యులను విద్యాకర్మ నిబంధనములచే తనలో కలుపుకొని, లింగ శరీరమును అనుసరించి ఉన్నదియు, లింగ శరీరముతో కూడా పాలింపబడినదియు అగు చైతన్యమును ధ్యానమార్గమున సంప్రోక్షించి, వాయుబీజముచే శుష్కింప . చేయవలెను. పిమ్మట బ్రహ్మాండ మను పేరు గల ఈ సృష్టి యంతయు అగ్ని బీజముచే కాల్చివేయబడి భస్మరాశి వలే . ఉన్నట్లుగా ధ్యానము చేయవలెను. ఆ భస్మము నీటితో ముంచెత్తవలెను. ప్రపంచ మంతయు జలమయముగా ఉన్నట్లు స్మరించవలెను.
పిమ్మట దానియందు పృథివీవికార మైనదియు, బీజ మను పేరు గలదియు అగు శక్తిని ఉంచవలెను. సమస్త మైన తన్మాత్రలచే ఏర్పడినది, పృథివీవికారము, శుభమైనదియు, అఖండము, దాని (శక్తి) నుండి పుట్టినది. తత్స రూపమును అగు దాని ఆధారమును ధ్యానించవలెను. దాని మధ్యయందు ప్రణవరూప మైన పురుషమూర్తిని ధ్యానించవలెను.
పిమ్మట, పూర్వము సంస్కరింపబడిన, తనలో నున్న లింగశరీరమును దానిమీదికి సంక్రమింపచేయవలెను. అది క్రమముగా విభక్త మైన ఇంద్రియముఖ ఆవ్యవస్థితీ కులదై వృద్ధిపొండ నట్లు చింతించవలెను.
పిమ్మట ఆండము ఒక సంవత్సరముపాటు ఉండి బద్దలై నట్లును అ ముక్కలు ద్యులోక పృథివీలోకము లేనట్లును, వాటి మధ్య ప్రజాపతి జనించి నట్లును ధ్యానించవలెను. మరల చూచి, ఆ శిశువును ప్రణవముచే, పూర్వము చెప్పినట్లుగా న్యాసములు చేసి మంత్రాత్మక మగు శరీరము కలవానినిగా చేయవలెను. పిమ్మట శిరస్సు పై విష్ణుహ స్తము నుంచి, వైష్ణవమంత్రమును ధ్యానించవలెను. ఈ విధముగా - ధ్యానయోగముతో ఒకటి గాని, అనేకము గాని జపించి, హస్తములను మొదళ్ళయందు పట్టుకొని, మాంత్రికుడు నేత్రమంత్రము చదువుచు అంచుతో (జాలుతో) కూడిన చినగని వస్త్రముచే ఆ శిష్యుల నేత్రములు బంధించవలెను. తత్త్వము నెరిగిన గురువు బాగుగా దేవదేవుని పూజించి, దోసిళ్లలో పుష్పములు ధరించి యున్న ఆ శిష్యులను పూర్వాభిముఖులనుగా కూర్చుండ బెట్టవలెను.
ఆ శిష్యులు కూడ గుర్వనుజ్ఞ పొంది ఆచట పుష్పాంజలిని చల్లి పోరిని పూజింపవలెను. పిమ్మట పుష్పాదులతో వాసుదేవార్చనము చేసి, తరువాత గురుపాదార్చడము చేసి సర్వస్వమును గాని, దానిలో సగము గాని గురుదక్షిణగా ఇవ్వవలెను.
గురువు శిష్యులకు బోధించవలేను వారు నామములతో హరిని పూజించవలెను. శంఖచక్రగదాధారియై,తర్జనితో జళిపించుచున్న ప్రభువైన విష్వక్సేనుని పూజించి మండలమునందున్న హరికి ఉద్వాసన చెప్పవలెను. విష్ణునిర్మాల్యము నంతను విష్వక్సేనునకు సమర్పింపవలేను.
ప్రణీతలతో తన పై జలము చల్లుకొని, కుండములో నున్న ఆగ్నిని తనలో చేర్చికొని విష్వక్సేనుని విసర్జన చేయవలెను. ఈ విధముగ చేసినచో భోగములు అనుభవింప కోరిక గలవాడు సకలభోగములను పొందును. మోక్షేచ్చగల వాడు హరియందు లీను డగును.
ఆగ్ని మహాపురాణములో కుండ నిర్మాణాగ్ని కార్యాది కథన రూప మగు ఇరువదినాల్గవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 24 of the Agni Purāṇa is as follows:
This chapter details the Pradoṣa Vrata — a fortnight observance performed on the trayodaśī (thirteenth lunar day) in both bright and dark fortnights, dedicated to Bhagavān Śiva. The observance is especially meritorious at the twilight hour (pradoṣa kāla) when, according to the Purāṇa, Śiva performs his cosmic dance and all the gods, sages, and celestial musicians gather to witness it. The worshipper's preparation — fasting, bathing, application of bhasma — and the pūjā sequence with bilva leaves, white flowers, and milk are prescribed. Specific mantras including the Mahāmṛtyuñjaya and Śivāṣṭaka are to be recited. The chapter narrates how the observance of Pradoṣa grants long life, removal of sins, fulfillment of desires, and ultimately Śivaloka.