అగ్ని మహా పురాణము

16 - అథ బుద్ధాద్యవతార కథనమ్.

అగ్ని పలికెను. బుద్ధావతారమును గూర్చి చెప్పెదను. ఇది చదువువానికిని వినువానికిని గూడ మంచి ప్రయోజనమును చేకూర్చును. పూర్వము దేవాసుర యుద్దము జరిగెను. ఆ యుద్దమున పరాజితు లైన దేవతలు ఊరడింపుము రక్షింపుము అని ప్రార్థించుచు పరమేశ్వరుని శరణు జొచ్చిరి. అపుడు మాయా మోహ స్వరూపుడైన ఆ పరమేశ్వరుడు శుద్దోదనుని కుమారుడుగా జనించి, దైత్యులకు మోహము కలిగించి, వారు వేదధర్మమును విడచు నట్లు చేసెను. వారందరును బౌద్దు లైరి. ఆ పరమేశ్వరుడే అర్హ తుడై , మిగిలిన వేద వర్ణితుల నందరిని ఆర్హతులను చేసెను. ఈ విధముగ దైత్యులు వేద ధర్మాదివర్జితు లైన పాషండులుగా ఆయిరి.

వారు నరకమును ఇచ్చు కర్మలు చేసిరి. వీరందరును ఆధమునినుండి కూడ ప్రతి గ్రహము చేయుదురు. కలియుగాంతమున సంకర మగుదురు. శీలరహితు లైన దొంగ లగుదురు. పదునై దు శాఖలు గల వాజసనేయ వేదము ప్రమాణము కాగలదు.

ధర్మమను చొక్కా తొడిగికొనిన మ్లేచ్ఛులు, రాజులై, అధర్మమునందు ఆసక్తి కలవారై మనుష్యులను లంచగలరు. (పీడించగలరు.)

విష్ణుయరని కుమారుడును, యాజ్ఞవల్క్యుడు వురోహితుడుగా కల వాడును అగు కల్కి ఆయుధములలో మిక్కిలి నేర్పరియై, అస్త్రములను ధరించి మ్లేచ్ఛులను నశింపజేయును.

నాలుగు వర్ణములందు తగిన కట్టుబాట్లు చేయగలడు. ప్రజలను నాలుగు ఆక్రమములందును, నద్ధర్మమార్గము నందును నిలుపగలడు.

విష్ణువు కల్కిరూపమును విడచి స్వర్గమునకు వెళ్లెను. పిమ్మట పూర్వము నందు వలె కృతయుగ మేర్పడును.

ఓ మునీ ! వర్ణాశ్రమములు తమ తమ ధర్మములను ఆచరించును. ఈ విధముగా శ్రీమహావిష్ణువు అన్ని కల్పములందును, అన్ని మన్వంతరములందును అనేకము లైన అవతారము లెత్తుచుండును. గడచినవి, రానున్న వి అవతారములు ఎన్ని యో లెక్కకు మించి ఉన్న వి. విష్ణు దశావతారములను పఠించినవాడును, వినినవాడును, పాపములు నశించి, సర్వకామములు పొంది, కులముతో కూడి స్వర్గము చేరును. విష్ణువు ఈ విధముగ ధర్మాధర్మవ్యవస్థ చేయు చుండును. సృష్ట్యాదులకు కారణమైన ఆ హరి ఈ విధముగ అవతరించి మరల (స్వర్గమునకు) వెళ్ళిపోయెను.

ఆగ్ని మహాపురాణమున బుద్దకల్క్యవతారవర్ణన మను షోడశోఽధ్యాయము సమాప్తము.