అగ్ని దేవుడు పలికెను. భరతుడు చెప్పిన ఆద్వైత బ్రహ్మ విజ్ఞానమునుగూర్చి చెప్పెదను. పూర్వము భరతుడను రాజు సాలగ్రామ క్షేత్రమున వాసుదేవాది పూజ చేయుచు తపస్సు చేసెను. ఒక మృగమునందు ప్రేమచే మరణసమయమున ఆ మృగమునే స్మరించుచు మరుజన్మమున మృగముగా పుట్టెను. కాని ఆజన్మలో పూర్వజన్మ స్మృతి వుండెను. అందుచే స్వయము గనే ఆ దేహమును విడిచి మరియొక జన్మ ఎత్తెను ఆ ద్వైత బ్రహ్మ జ్ఞానము కలవాడు మూ డుడ:వలే లోకమున సంచరించెను. సౌవీర దేశ రాజు ఆతనిని విష్టిగా నియమించేను. ఆతని ఆజ్ఞ ప్రకారము భరతుడు ఆతని పల్లకిని మోసెను. ఆతడు జ్ఞాని యైనను ప్రారబ్ధ క్షయము కొరకై విష్టిగా గ్రహింపబడి పల్లకి మోసెను. ఇతరులు శీఘ్రముగ నడచుచుండిరి. వారు తీవ్ర ముగ నడచుటను. ఇతడు మందముగా నడచుటను చూసి రాజు పలికెను.
రాజోవాచః
రాజు ఇట్లనెను. ఓయీ ! నీవు నా పల్లకి కొంచెము దూరమే మోసితివి. ఇతరోనే అలసిపోతివా ! నీవు చూచు టకు బలిసివున్నావు. శ్రమకు ఓర్చజాలవా ! బ్రాహ్మణుడు పలికెను. నేను బలిసిలేను, నేను నీ పల్లకి మోయుట లేదు. నేను అలసిపోలేదు నాపైన భార మేమియులేదు. నేల పై రెండు పాదములున్నవి. వాటిపై పిక్కలున్నవి. వాటిపై రెండు తొడలున్నవి వాటిపై ఉదరము దానిపై వక్షస్థలము, దాని పై భుజములు, వున్నవి. ఆ భుజముల పై ఈ పల్లకి వుంచబడి నది. ఆట్టి పరిస్థితులలో నాకేమి సంబంధమున్నది. నీది అను చెప్పబడు ఈ శరీరము పల్లకిలో వున్నది. నీవు ఆక్కడ వున్నావని, నేను ఇచట నున్నా నని చెప్పుట ఇదంతయు మిథ్యా. నిన్ను, నన్ను , అందరిని, కూడి, పంచ భూతములు మోయుచున్నవి. పంచభూతములు గుణ ప్రవాహములో పడి కొట్టుకొని పోవుచున్నవి. సత్త్వాది గుణములు కర్మాధీనములు. కర్మ అవిద్యా సంచితము. ఇది అన్ని జీవులందు వున్నది. ఆత్మ శుద్దము, అక్షరము, భ్రాంతము నిర్గుణము, ప్రకృతి, అతీతము, అన్ని ప్రాణులయందు ఒకే ఆత్మవున్నది. దానికి వృద్ధి కాని ప్రస్తముకాని లేవు. ఆట్టి పరిస్థితులలో నీవు బలిసివున్నావు అని ఏయి ని బట్టి నీవు పలికినావు. పృథివీ, పాదములు, కాళ్ళు, కటి, ఊరువులు, ఉదరము, మొద లగు వాటి పైనను స్కంధమునందును. వున్న పల్లకి నాకు భారమైనచో ఆది నీకు కూడ భారమే. ఇది ఇతర ప్రాణుల విషయమున కూడ సమానమే. కేవలము, పల్లకిని మాత్రమే కాక జీవులు పర్వతము అను, వృక్షములను, గృహములను, పృథ్యాదులను, వాటి భారమును కూడ తన నెత్తి పై వేసికొనినాడు. రాజా ప్రకృతి జన్యములను సాధనముల కంటే పురుషుడు సర్వధాభిన్ను డైన పుడు నేను భరించవలసిన భారమేమున్నది. ఏ పదార్థముతో ఈ పల్లకి తయారు చేయబడినదో ఆ పదార్థము తో బే నీయొక్క నాయొక్క సకల ప్రాణులయొక్క శరీరములు నిర్మింపబడినవి. ఆద్రవ్యములచేతనే అందరికిని వృద్ధి ఏర్పడినది.
బ్రాహ్మణ ఉవాచః
ఆ మాట విని రాజు ఆతని పాదములు స్పృశించి క్షమాపణను కోరి ఇట్లు పలికెను. నన్ను అనుగ్రహించుము. ఈ పల్లకిని విడిచి నీవు ఎవ్వరవో - ఇట్లు ఎందుకు వచ్చినానో చెప్పుము అని ప్రార్థించెను బ్రాహ్మణుడు పలికెను. రాజా ! వినుము. నేను ఫలానావాడను అని చెప్పుట అశక్యము. కర్మ ఫలమును అనుభవించుట కే అందరును వచ్చుచుందురు. సుఖ దుఃఖోప భోగము కొరకై విభిన్న దేశ కాలాదులను పొందుచుందురు. ధర్మా ధర్మ ఫలములను అనుభవించు కై జీవుడు ఆయా దేశములను పొందు చుండును. రాజు పలికెను. ఏది వున్నదో అది నేను అని చెప్పుటలో దోషమేమున్నది. అహం అనుశబ్దమును తన విషయమున ప్రయోగించుట దోషము కాదు కదా బ్రాహ్మణుడు పలికెను. తన విషయమున ఆహమ్ అను శబ్దమును ప్రయోగించుటలో దోషము లేదు. అని నీవు చెప్పినది సత్యమే. కాని ఆనాత్మ విషయమున “అహం” శబ్దమున ప్రయోగించి దానిని ఆత్మగా భావించుట భ్రాంతియే. సమస్త దేహము నందును వున్న ఆత్మ ఒక్కటియే యైనపుడు నీ వెవ్వరు నే నెవ్వరు మొదలగు వచనములకు అర్థము లేదు. నీవు రాజువు. ఇది పల్లకి. మేము దీనిని మోయు వారము. ఎదుట నడచు వారు నీ పరివారము. ఈ లోకము నీది. ఈ విధముగ చేప్పుట సత్యము కాదు. చెట్టు నుండి వచ్చిన కర్రతో చేసిన యీ పల్లకిని నీవు ఎక్క యున్నావు. రాజా! ఈ పల్ల కికి వుండవలసిన వృక్ష మను పేరు కర్ర అను పేరు ఏమై పోయినది అని చెప్పుము. ఇక్కడున్న వారెవరును మహారాజు చెట్టుపై ఎక్కినాడు అని కాని కట్టెపై ఎక్కినాడు అని కాని ఆనుట లేడు. పల్లకి ఎక్కినట్లు చెప్పుచున్నారు. ఒక విధముగ కూర్చిన కర్రల సముదాయమున కే “శిబిక “ అని పేరు. రాజా ! కర్రల కంటే వేరుగా పల్లకి ఎక్కడ వున్నదో వెతికి చూడుము. ఇతడు పురుషుడు, ఈమె , ఇది యెద్దు. ఇది గుర్రము, ఇది ఏనుగు, ఇది వృక్షము, ఇది పక్షి అని ఈ విధములగ కర్మ జనితములగు భిన్న భిన్న శరీరములకు వేర్వేరు నామములు ఆరోపింపబడుచున్నవి. ఇవన్నీ లోకము కల్పించిన పేర్లు. జిహ్వ అహం అని అనుచున్నది. దంతములు ఓష్ఠములు తొలువు కంఠము మొదలగునవి కూడ ఉచ్చరించుచున్నవి. కాని “వి యేమియు అహం కాదు. ఇవి కేవలము శబ్ధో చ్చారణ సాధన మాత్రములు ఈ జిహ్వ ఆహం అని యేకారణముచే చెప్పుచున్నది? జిహ్వ ఆహం అని చెప్పుచు పలుకుచు నేను అహం కాదు అని ఆగను. మిథ్య కాదు. శిరస్సు పాయ్యాదులు మొదలగు అవయవముల రూపములలో నున్న శరీరము పురుషుని కంటే సర్వధా భిన్న సం. అందుచే ఏ ఆవయవమును నిర్దేశించుటకు నేను అహం శబ్దమును ప్రయోగింతును? నా కంటే భిన్నమైన మరొక తత్వమున్నచో ఇది నేను, ఆ భిన్నము అని చెప్పుటకు వీలు వుండును. కాని వాస్తవమున పర్వత, పశు, పాద పాది భేదము, సత్యము కాదు. శరీర దృష్టిచే కనబడు భేదములన్నియు కర్మ జన్యములు. లోకములో ఇతడు రాజు. ఇతడు భటుడు మొదలగు విధమున చెప్పు భేదము లెవ్వియు నిర్వికార సతములు కావు. నీవు సకల లోకమునకు రాజువు. నీ తండ్రికి కుమారుడవు. నీ శత్రువునకు శత్రువు. నీ భార్యకు భర్తవు. నీ కుమారునకు తండ్రి. ఇన్ని పేర్లుడగా నిన్ను ఏ పేరుతో పిలువవలెను. ఈ శిరస్సు నువ్వా ! ఈ శిరస్సు నీదై నట్లే ఈ ఉదరము కూడ నీదే. అందుచే ఉద రము నువ్వా. ఈపాదాద్యవయవములలో ఏదై న ఒకటి నువ్వా ! కానిచో ఇవన్నియు నీవెట్ల నవి మహారాజా ! నీవు ఈ అవ యవము? కంటే కన్నుడవు. కావున వీటి నుండి వేరుబడి వా స్తవమున నేను ఎవరిని అని చక్కగా ఆలోచించుము.
ఆ మాటలు విని ఆరాజు భగవత్స్వరూపుడగు ఆ అవధూత బ్రాహ్మణునితో ఇట్లనెను. ఓ బ్రాహ్మణోత్తమా ! నేను శ్రేయస్సున కోరి కపిల మహర్షి వద్ద ఉపదేశము పొందుటకై వెళ్లుచున్నాను. నీవు కూడ కపిల మహర్షి యొక్క అంశమే. నాకు జ్ఞానమునిమ్ము. జ్ఞానరూపమగు మనోసాగరమును చేరుటచే శ్రేయస్సును కలుగు ఉపాయము చెప్పుము. బాహ్మణుడు పలికెను. ఇంకను ! శ్రేయస్సే కావలెనని అడుగుచున్నావు కాని పరమార్థ తత్త్వమేమని ఆడుగుటలేడు. రాజా! నీవనుకొనని శ్రేయస్సులన్నియు ఆ పరమార్థములే. మానవుడు దేవతారాధన చేసి ధన సంపత్తి ని పుత్రులను రాజ్యమును పొందకోరుచున్నాడు. రాజా నీవే చెప్పుము. అదియే ఆతనికి శ్రేయస్సు, వివేక వంతునకు పరమాత్మ ప్రాప్తి యే శ్రేయస్సు. యజ్ఞాది క్రియగాని ద్రవ్యసిద్ధి కాని, అతనికి శ్రేయస్సు కాదు. పరమాత్మ జీవాత్మల ఏకత్వమే పరమార్థము. ఏకము వ్యాపి, సమము, శుద్ధమ, నిర్గుణము, ప్రకృతి అతీతము, జన్మ వృద్ధ్యాది రహితము సర్వగతము, వికార రహి తము జ్ఞానమయము ఆసంగము గుణజాల్యాది రహితము సర్వశక్తముడైన ఆత్మయొక్క జ్ఞానమే పరమార్థము. ఇపుడు నిదాఘు నకను ఋతువునకును జరిగిన సంవాదమును చెప్పెదను వినుము. బ్రహ్మసుతుడగు ఋతువు మహాజ్ఞాని. పులస్త్యనందను డగు నిదాఘుడు ఆతనికి శిష్యుడే విద్యలు నేర్చి పిదప దేవికా” నదీ తటమున ఒక నగరము లో నివసించుచుండెను. ఋతువు తన శిష్యుని వాసస్థానమును తెలుసుకొనేను. వెయ్యి దివ్య వరము దాటిన పిమ్మట ఋతువు నిదాఘుని చూచు టకు వెళ్లెను, ఆసమయమున నిదాఘుడు వైశ్వ దేవానంతరము భుజించి తన శిష్యులతో ఇట్లు పలుకుచుండెను. భోజనా నంతరము నాకు తృప్తి కలిగినది. అక్షయ తృప్తి నిచ్చునది భోజనమే. ఋతవు పలికెను. ఓ బ్రాహ్మణా ! ఆకలి గొన్న వానికే భోజనానంతరము తృప్తి కలుగును. నాకెన్నడును ఆకలియే కలుగలేదు. నన్ను తృప్తి ని గూర్చి ఎదు కడుగు చున్నావు. ఆకలి దప్పికలు దేహ ధర్మములు కాని, నాకు సంబంధించినవి కావు. నీవు ఆడిగినావు కాన చెప్పు చున్నాను. నాకు సర్వదా తృప్తి యున్నది. ఆత్మ ఆకాశ మువలే సర్వవ్యాప్తము. ఆత్మయే నేను. అందుచే నీవు ఎక్క డి నుండి వచ్చుచున్నావు? అను ప్రశ్నకు అవకాశములేదు. నేను వేళ్ళు పొడను కాను. వచ్చువాడను కాను. ఒక ప్రదేశము వున్న వాడను కాను. మట్టితో కట్టిన ఇల్లు మట్టి పూయుటచే గట్టిపడినట్లు ఈ పార్థివ దేహము పార్థివ పరమాణువులచే గట్టి అద్వైత బ్రహ్మ విజ్ఞానమ్ పడుచుండును. నీవు నాకంటే భిన్ను డవు కాదు. నేను నీకంటే భిన్నుడనుకాను. ఓ బ్రాహ్మణా ! నేను ఆచార్యుడనైన ఋతువును. నీకు జ్ఞానోపదేశము చేయుటకై వచ్చితిని. ఇప్పుడు వెళ్లేదను. నీకు పర మార్థతత్వమును ఉపదేశించితిని. ఈ ప్రపంచమంతయు ఏకైక వాసుదేవనామక పరమాత్ముని స్వరూపమని తెలిసికొనుము. దీనిలో భేదము ఏ మాత్రములేదు.
పిదప వెయ్యి సంవత్సరముల తరువాత ఆ నగరముకు వెళ్ళిన ఋతువు నగర ప్రాంతమున ఏకాంత ప్రదేశము నందు వున్న నిదాఘుని చూచి ఇట్లనెను. నీవు ఏకాంతస్థానమున వున్నా వెందులకు నిదాఘుడు ! పలికెను, ఓ బ్రాహ్మణ మార్గమున ఎక్కువ జనసమ్మర్థము వున్నది. ఇపుడు రాజు సుందరమైన తన నగరములోనికి ప్రవేశించుచున్నాడు. అందుచే నేనిచ్చట ఆగియున్నాను. ఋతువు పలికెను. వీరిలో రాజు ఎవ్వరు? సామాన్యులెవ్వరు? నీకు తెలియును. కాన చెప్పుము, నీదాఘుడు పలికెను. మదించియున్న పర్వత శిఖర సదృశమగు గజేంద్రమును అధిష్టించియున్న వాడు నరేంద్రుడు. ఆతనిని చుట్టియున్న వారు ఇతర పరివారము. క్రిందనున్నది గజము. దానిపైననున్న వాడు రాజు. ఋతువు పలికెను. వీరిలో రాజు ఎవరు? గజము ఏది ? నిదాఘుడు చెప్పెను. సరే చెప్పెదను. అని పలుకుచు నిదాఘుడు ఋతువు పైకి ఎక్కి ఈ దృష్టాంతము ద్వారా తెలుసుకొనుము. పైనున్న నేను రాజు వంటివాడను. నాక్రింద నీవు ఏనుగువలె నిలచియున్నావు, ఋతువు పలికెను. నేనెవ్వరు? నీవు ఎవ్వరవని ఆందును. ఈ విధముగ పలుకగనే నిధాముడు నమస్కరించి సత్యముగ నీవు నా గురువు. ఏలననగా ! ఈ విధముగా ఆద్వైత సంస్కార సంస్కృతమగు మనస్సు కలవారు ఎవ్వరును లేరు! ఋతువు పలికెను, నీకు బ్రహ్మజ్ఞానము ఉపదేశించుటకై వచ్చితిని. పరమార్థము, సొర ము ఐన ఆద్వైతమును బోధించితిని. బ్రాహ్మణుడు పలికెను. ఆ ఉపదేశముపొంది నిదాఘుడు కూడ ఆద్వైత జ్ఞాని అయ్యెను. సమస్త ప్రాణులను, తనకంటే ఆభిన్న ములుగా చూచేను. అజ్ఞానమువలన ముక్తిని పొందెను. నీవు కూడ ఆట్లే ముక్తిని పొందేదవు. నీవు నేను ఈ సర్వ జగత్తు అంతయు ఏకమాత్రము వ్యాపకము ఆగు విష్ణు స్వరూపము. ఒకే ఆకాశము పీతలీలాది భేదములతో వేర్వేరుగా కనబడునట్లు భ్రాంత దృష్టి కలవారికి ఒకే ఆత్మ వేర్వేరు వేరుగ కన్పట్టును. అగ్ని దేవుడు పలికెను. ఆరోజు ఈ జ్ఞాన సారమును పొంది సంసారమునుండి ముక్తి పొందేను. అజ్ఞాన మయమగు సంసార వృక్షమునకు బ్రహ్మ జ్ఞానమే ఖడ్గము అని నిరంతరము చింతనము చేయుము.
ఆగ్ని మహాపురాణమున ఆ ద్వైత బ్రహ్మ విజ్ఞానమను మూడు వందల ఎనుబదవ ఆధ్యాయము సమాప్తము.
Summary of chapter 381 of the Agni Purāṇa is as follows:
Agni presents to Vasiṣṭha a compendium (sāra) of the Bhagavad Gītā — the teaching of Śrī Bhagavān to Arjuna on the battlefield of Kurukṣetra — as the most excellent of all gītās. The core teachings are summarized: the ātman is birthless, deathless, and indestructible, so grief over the perishing body is unfounded. Dwelling on sense-objects produces attachment, which produces desire, which produces anger and delusion, culminating in the destruction of discriminative wisdom. The teaching covers: the four types of devotees (ārtaḥ, jijñāsuḥ, arthārthī, jñānī); the definitions of kṣetra and kṣetrajña; the qualities of the divine (daivī) and demonic (āsurī) natures; the threefold classification of food, yajña, tapas, and dāna according to the three guṇas; the ascending hierarchy of elements culminating in puruṣa; and the final teaching that all of creation from Brahmā down to a blade of grass is Viṣṇu's vibhūti, and that the bhāgavata who worships Viṣṇu through the whole of life certainly attains liberation.