పరమేశ్వరుడు చెప్పెను :- స్కందా! ఇప్పుడు పూజాసహికముగ గౌకేజ్రతిష్టావిధి చెప్పెదను వినుము. వెనుక చెప్పిన విధముననే మండపాది రచనచేసి, దేవీస్థాపన, శయ్యాధివాసనము చేయవలెను. పూర్వము చెప్పిన మంత్రమూర్యాదుల న్యాసము చేసి.. ఆత్మతత్త్వ-విద్యాతత్త్య.శివతత్త్వములను పరమేశ్వరుని యందు స్థాపించవలెను. పిదప పరాశ క్లిన్యాసము హోమజపాన పోట్లుకటి వలె జేసి క్రియాశక్తి రూపిణి యగు పిండిని సంధావము చేయవలెను, సర్వవ్యాప్తిని యగ పిండిని ధ్యానించి, అచట రత్నాది న్యాసము చేయవలెను. ఈ విధముగ పిండి స్థాపన చేసి దానిపై దేవీస్థాపన చేయవలెను. ఈ దేవి పరాశ క్తిస్వరూపిణి. ఆ దేవీమంత్రముతోడనే, సృష్టిన్యాసపూర్వకముగ దేవీస్థాపన చేయవలెను. పిదప పీఠముపై క్రియా శక్తిని, దేవీ విగ్రహమందు జ్ఞానశక్తిని స్థాపించవలెను. పిదప సర్వవ్యాపిని యగు శక్తిని ఆవాహనము చేసి దేవీప్రతిమపై ఆ. శక్తిని చేర్చవలెను, “శివా' యను పేరు గల ఆంబికా దేవిని స్పృశించి పూజించవలెను. పూజా మంత్రములు ఈ విధముగ; నుండును. “ఓం ఆం ఆధారశ క్షయే నమః ఓం కూర్మాయ నమః ఓం కర్ణాయ నమః ఓం హ్రీం నారాయణాయ నమః ఓం ఐశ్వర్యాయ నమః ఓం ఆధశ్చదనాయ నమః ఓం పద్మాసనాయ నమః” పిదప కేసరములను పూజించవలెను. పిదప “ఓం హ్రీం కర్ణికాయై నమః ఓం క్షం పుష్కరాజేభ్యో నమః” అను మంత్రములతో కర్ణికా-కమలాక్షములను పూజించవలెను. పిదప “ఓం హం పుష్యై నమః ఓం హ్రీం జ్ఞానాయై నమః ఓం హ్రూం క్రియాయై నమః” అను మంత్రములతో పుష్టి-జ్ఞానా క్రియా శక్తులను పూజించవలెను. “ఓం నాలాయ నమః ఓం రుం ధర్మాయ నమః ఓం రుం జ్ఞానాయ నమః ఓం వైరా గ్యాయ నమః ఓం ఆధర్మాయ నమః ఓం రుం ఆజ్ఞానాయ నమః ఓం అ వైరాగ్యాయ నమః ఓం అనైశ్వర్యాయ నమ” అను మంత్రములతో నాలాదులను పూజించవలెను. “ఓం హుం వాచే నమః ఓం హుం రాగి డ్ర్యై నమః ఓం హుం జ్వాలిన్యై నమః ఓం హౌం శమాయై నమః ఓంప్రూం జ్యేష్ఠాయై నమః ఓం హ్రం రౌం క్రైం నవశక్యై నమః” అను మంత్రములతో వాగాది శక్తులను పూజించవలెను. “ఓం గౌం గౌర్యాసనాయ నమః ఓం గౌం గౌరీమూర్తయే నమః” ఇపుడు గౌరీమూలమంత్రము చేప్పబడుచున్నది “ఓం హ్రీం సః మహాగౌరి రుద్రదయితే స్వాహా గౌర్యై నమః ఓం గాం హృదయాయ నమః ఓం గీం శిర సేస్వాహా ఓం గూం శిఖాయై వషట్ ఓం గ్రౌం కవచాయ హుం ఓం గౌం నేత్రత్రయాయ వౌషట్ ఓం గ ఆ స్రాయ ఫట్ ఓం గౌం విజ్ఞానశ క్తయే నమః” ఈ మత్రములతో శిఖాదులను పూజించపలెను. “ఓం గూం క్రియాశ క్తయే నమః” అను మత్రము తో క్రియాశక్తి ని పూజించవలెను. పూర్వాది దిక్కులందు ఇంద్రాదులను పూజించవలెను. మత్రములు వెనుక చెప్పబడినవి. “ఓంసుం సుభగాయై నమః” అను మంత్రముతో సుభగను “ఓం హ్రీం లలితాయై నమః” అను మంత్రముచే లలితను పూజించవలెను. “ఓం హ్రీం కామిన్యై నమః, ఓం హ్రుం కామ మాలిన్యై వము” అను మంత్రములతో గౌరీప్రతిష్ణా-పూజా-జపములు చేయుటచే ఉపాసకుడు అన్నియు పొందగల్గును.
అగ్ని మహాపురాణమునందు గౌరీప్రతిష్టాధాన మను తొంబది ఎనిమిదవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 98 of the Agni Purāṇa is as follows:
The ninety-eighth chapter provides the installation procedure for the image of Devī Gaurī — the bright, auspicious consort of Śiva. The procedure follows the general template established for Śivaliṅga installation but with the specific mantras, dhyāna, and nyāsa appropriate to the Goddess. The ātma-tattva, vidyā-tattva, and śiva-tattva are established in the image with their respective mantras, and the parāśakti — the supreme power of the Goddess — is invoked into the form. The pīṭha is identified as the seat of kriyāśakti and the vigraha (image) as the dwelling of jñānaśakti, with the sarvavyāpinī (all-pervading) śakti invoked through the āvāhana-mantra. The complete Gaurī pūjā mantra sequence — from "Oṃ Ādhāraśaktaye namaḥ" through the pīṭha-śaktis, the nāla, the eight petals, the Gaurī mūlamantra ("Oṃ Hrīṃ Sauḥ Mahāgauri rudradayite svāhā"), and the aṅga-mantras — is given in full, establishing a complete, usable pūjā protocol.