అగ్నిదేవుడు పలికెను : పాపములను నశింపచేయు వరాహావతారమును గూర్చి చెప్పెదను. హిరణ్యాతుడనెడు రాక్షసరాజు ఉండెను. అతడు దేవతలను జయించి స్వర్గలోక ములో నివసించేను.
యజ్ఞస్వరూపు డిగు విష్ణువును దేవత లందరును వచ్చి తింపగా ఆహరీ వరాహరూపము ధరించి, లోకకంటకు డైన ఆ దానవుని దైత్యులతోకూడ ఆశ్చర్యకర మగువిధమున సంహరించి, ధర్మమును దేవతలు మొదలగువారిని రక్షించి అంతర్ధానము చెందెను.
హిరణ్యాక్షుని సోదరుడైన హిరణ్యకశిపుడు దేవతల యజ్ఞభాగములను అపహరించి దేవతలందరి పైనను అధికార మును జరిపెను.
విష్ణువు దేవతానమేతుడై (వెళ్లి) నరసింహరూపము దాల్చి ఆ హిరణ్యకశిపుని సంహరించెను. దేవతలచే స్తుతింప బడిన ఆ నర సింహుడు దేవతలను తమతమ స్థానములలో నిలిపెను.
పూర్వము దేవాసుర యుద్ధమునందు బలి మొదలగువారీచే సురులు పరాజితులై, స్వర్గమును కోల్పోయిరి. వారు అపుడు హరిని శరణు జొచ్చిరి.
విష్ణువు దేవతలకు అభయ మిచ్చి, అదితికశ్యపులు తనను స్తుతింపగా అదితియందు వామనుడుగ జన్మించెను. ఆ వామనుడు శోభాయు కముగ యజ్ఞము చేయుచున్న బలిచక్రవర్తి యజ్ఞమునకు వెళ్లి అచట రాజద్వారమునందు వేడమును వఠించెను.
బలి వేదములను పఠించుచున్న ఆ వామనుని చూచి, అతడు కోరు వరముల నీయవలే నని నిశ్చయించుకొని, శుక్రాచార్యుడు నివారించుచున్నను, ఆతనితో- “నీ కేమి కావలెనో కోరుకొనుము; ఇచ్చెదను” అని పలికెను. వామనుడు బలితో ఇట్లనెను : “మూడు అడుగుల నిమ్ము; నా గురువునకు కావలెను”; బలి “అట్లే ఇచ్చెదను” అని పలికెను.
దానజలము చేతిలో పడగానే వామనుడు అవామనుడు (పెద్ద శరీరము కలవాడు). ఆయెను భూలోక భువర్లోక. స్వర్లోకములను మూడడుగులుగా గ్రహించి బలిని సుతలమునకు తొక్కివేసెను. వామనరూపుడైన హరి ఆ లోకత్రయ మును దేవేంద్రున కిచ్చెను. దేవతాసహితుడగు ఇంద్రుడు హరిని స్తుతించి, త్రిభువనాధీశుడై సుఖముగా నుండెను.
ఓ బ్రాహ్మణా ! వడకరాముని అవతారమును గూర్చి చెప్పెదను వినుము. ఆ శ్రీమహావిష్ణువు, శత్రియులు ఉద్దతులుగా ఉన్నా రని తలచి, భూభారమును హరించుటకై, దేవతలను, విప్రాదులను పాలించనున్న వాడై, శాంతిని నెల కొల్పుటకై , జమదగ్ని నుండి రేణుకయందు సర్వశాస్త్ర విద్యాపారంగతుడైన భార్గవుడుగా (పరశురాముడుగా) అవతరించి నాడు.
కార్తవీర్యుడను రాజు దత్తాత్రేయుని అనుగ్రహముచే వేయిబాహువులు కలవాడుగను, సకల భూమండలమున కును రాజుగను ఆయెను. అతడు వేటకు వెళ్లెను.
ఆరణ్యములో అలసిన, సేనానమేతుడైన ఆ రాజును జమదగ్ని మహర్షి విమంత్రించి కామధేనువు ప్రభావము చేత భోజనము పెట్టను భోజనము పెట్టెను.
కార్తవీర్యార్జునుడు ఆ కామధేనువును తన కిమ్మని కోరెను. జమదగ్ని ఈయ నిరాకరించెను. అపుడాతడు దానీని అపహరించేను. పిదవ పరశురాముడు యుద్ధములో పరశువుచే ఆతని శిరస్పు చేదించి సంహరించి దేనువుతో ఆశ్ర మమునకు తిరిగి వెళ్లేను.
పరశురాముడు వనమునకు వెళ్ళి యుండగా కార్తవీర్యుని పుత్రులు పూర్వవై రమువలన జమదగ్ని ని చంపిరి. అంత తిరిగి వచ్చిన ప్రభావశాలి యగు పరశురాముడు చంపబడిన తండ్రిని చూచి, తండ్రిని ఆ విధముగ చంపుటచే కోపించి, ఇరువదియొక్క పర్యాయములు పృథీవీని క్షత్రియులు లేనిదానినిగా చేసి, కురుక్షేత్రమునందు ఐదు కుండములను చేసి, వాటితో పితృదేవతలను తృప్తిపరచి, భూమి నంతను కశ్యపునకు దానము చేసి, మహేంద్రపర్వతము పై నివసించెను.
కూర్మ, వరాహ, నరసింహ, వరశురామావతార గాథలు విన్న మానవుడు స్వర్గమునకు వెళ్ళును.
అగ్ని మహా పురాణములో వరాహనృసింహాద్యవతార మనేడు చతుర్థాధ్యాయము సమాప్తము.
Summary of chapter 4 of the Agni Purāṇa is as follows:
The fourth chapter presents the magnificent narrative of Bhagavān's Varāha avatāra, in which he lifted the earth-goddess Bhūdevī from the depths of the primordial ocean after the demon Hiraṇyākṣa had dragged her to the cosmic depths. Bhagavān emerged from Brahmā's nostril as a tiny boar, then grew to immeasurable size, his body identified with the Veda-s, the sacrificial implements, and the four Āśrama-s. He dove into the cosmic ocean, slew Hiraṇyākṣa in a great battle, and bore Bhūdevī aloft on his tusks, restoring her to her proper place. The earth's gratitude and her praise of Bhagavān are recorded. The chapter also describes the re-creation of the world following this rescue.