పరమేశ్వరుడు చెప్పెను : ఇపుడు నేను విజయమునకై నాలుగు విధము లగు మండలములను గూర్చి చెప్పే దను. కృత్తికా-మఘా-పుష్య-పూర్వఫల్గునీ-విశాఖా-భరణీ-పూర్వభాద్రపదల మండలము ఆగ్నేయ, మండలము. దాని లక్షణము చేప్పెదను. ఈ మండలమునందు వాయుప్రకోపము వచ్చినను, నూర్యచంద్రపరివేషము కలిగినను, భూమి కంపిం చినను, దేశమునకు వివాము కలుగును. సూర్య చంద్రగ్రహణములు వచ్చినను, ధూమజ్వాల కనబడినను, దిక్కులు దహించుకొని పోవుచున్నట్లు కనబడినను, ధూమకేతువు కనబడికను, రక్తవృత్తి వచ్చినను, ఎక్కవ వేడిగా నున్నను, రాళ్ళు కురిసిన జనులక నేత్రరోగము, ఆతీసారము, ఆగ్ని భయము కలుగును. ఆవు పాలు తక్కువ ఇచ్చుడు. వృక్షములండు నలపుష్పమాలు తక్కువగా ఉండును. పంట తక్కువగును. వృక్షములు కూడ తక్కువగా ఉండును. నాల్గ వర్ణముల వారును దుఃఖితు లగుదురు. మనుష్యు లండరను ఆకలితో బాధపడుదురు, ఇట్టి ఉత్పాతములు కలిగినపుడు సింధుయమువప్రాంతములు, గుజరాతు, భోజ-బాహ్లిక-జాలంధర-కాశ్మిర-ఉత్తరాపథములు నశించిపోవును. హస్త-చిత్రా-మఘా-స్వాతి-మృగశీర్ష-పునర్వసు-ఉత్తర-ఫల్గునీ-అశ్వినీ నక్షత్రముల మండలము వాయవ్యమండలము. ఈ మండ లమునందు వెనుక చెప్పిన ఉత్పాతములు కలిగినచో ప్రజ లందరును, హాహాకారము చేయుచు, నష్ట ప్రాయు లగుదురు. డ్రాహల (త్రిపుర)-కామరూపకలింగ కోసల-అయోధ్యా-ఉజ్జయినీ-కోంక-ఆంధ్రదేశములు నష్టమగును. ఆశ్లేషా-మూల-పూర్వాషాఢా-రేవతీ-శతభిషా-ఉత్తరాభాద్రపదానక్షత్రముల మండలము వారుణమండలము. పైన చెప్పిన ఉత్పాతములు ఈ మండలమునందు ఉత్పన్న మైనచో ఆవుల పాలు, నెయ్యి వృద్ధిపొందును. వృక్షములందు ఫలపుష్పములు అధికముగా నుండును. . ప్రజలు ఆరోగ్యవంతులగుదురు. భూమి సస్యసమృద్ధముగా నుండును.
ధాన్యములు చౌకగా నుండును. దేశము సుభిక్షముగా నుండును. కానీ రాజుల మధ్య ఘోర సంగ్రామములు చెలరేగును. జ్యేషా-రోహిణీ.అనురాధా-శ్రవణ-ధనిష్ణా-ఉత్తరాభాద్రపదా-అభిజిత్తుల మండలము మహేంద్రమండలము. ఈ మండలమునందు పై ఉల్పాతములు సంభవించినచో ప్రజలు సౌఖ్యముతో నుందురు. రోగభయ మేమియు ఉండదు. రాజులు తమలో సంధి చేసికొందురు. రాజులకు హితకర మగునటుల సుభిక్ష మేర్పడును. ముజగ్రామ, పుచ్చ గ్రామము అని గ్రామము రెండు విధములు. చంద్ర-రాహు-సూర్యులు ఒకే రాశిలో ఉన్నపుడు ముఖగ్రామము, రాహువునుండి ఏడవ స్థానమునకు పుచ్ఛగ్రామ మని పేరు. చంద్రుడు సూర్యుడున్న నక్షత్రమునుండి పదునై దవ నక్షత్రమునకు వచ్చినపుడు, తిథిసాధనము ననుసరించి సోమగ్రామము, అనగా పూర్ణిమాతిథి అగును.
ఆగ్ని మహాపురాణమునందు యుద్ధజయార్ణవమున వివిధమండలవర్ణనమను నూటముప్పదియవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 130 of the Agni Purāṇa is as follows:
The construction and significance of ritual maṇḍalas drawn on purified earth or floor are described. Agni explains the geometric principles—the saptavyūha-maṇḍala, the aṣṭadala-padma-maṇḍala, and the navakhaṇḍa-maṇḍala—according to the purpose of the rite. Deities are assigned specific positions within the maṇḍala corresponding to the cardinal and intermediate directions. The use of powders of five colours (white, red, yellow, black, green) drawn from natural substances is prescribed. The maṇḍala is treated as a temporary sacred precinct in which the invoked deity truly resides during the pūjā.