ఆగ్ని దేవుడు చెప్పెను : ఓంకారము నెరిగినవాడే యోగి. ఆతడే విష్ణుస్వరూపుడు. ఆందు వలన సకలమంత్ర సారభూతము, సర్వప్రదము అగు ఓంకారమును అభ్యసించవలెను. సమ సమంతప్రయోగ ప్రారంభము నందును ఓంకార ముచ్చరింపబడును. ఓంకార యుక్తమగు కర్మయే పరిపూర్ణము; అది లేనిది పూర్ణము కాజాలదు. మొదట ఓంకారము తోడను, మూడుశాశ్వత వ్యాహృతులతోడను కూడిన మూడుపదముల గాయత్రి వేదమునకు ముఖము. మూడు సంవత్సరముల పాలు నిత్యము గాయత్రీజపము చేయువాడు పాయువై, ఆకాశ స్వరూపుడై , పరబ్రహ్మను పొందును, ఏకాక్షరమగు ఓంకారమే పర బ్రహ్మము. ప్రాణాయామమే పరమతపస్సు. గాయత్రిని మించినది ఏదియు లేదు. మౌనమాగానుండుట కంటె సత్యభాషణము శ్రేష్ఠము. ఏడు పర్యాయములు గాయత్రి ఆవృత్తి చేసినచో సర్వపాపములును తోలగును. పది అవృత్తులు చేయువాడు స్వర్గము పొందును. ఇరువది ఆవృత్తులు చేయువానిని గాయత్రి స్వయముగా ఈశ్వరలోకమునకు తీసికొని పోవును. నూటఎనిమిది పర్యాయములు గాయత్రీ జపము చేసినవాడు సంసారసాగర మును తరించును. రుద్ర పాత్ర జపమికంటెను, కూష్మాండ మంత్ర జపముకంటెను గాయత్రీమంత్ర జపము శ్రేష్టము. గాయత్రికంటె శ్రేష్ఠమైన జపించదగిన మంత్రమేమియును లేదు. వ్యాహృతి హోమ తుల్యమగు హోమమేమియును లేదు గాయుత్రిమంత్రము లోని ఒక పాదమును గాని, సగము పాదమును గాని, సంపూర్ణ ఋక్కును గాని, సగము ఋక్కును గాని జపించినంత మాత్రమున గాయత్రి బ్రహ్మహత్యా - సురాపాన - సువర్ణ స్తేయ, గురుపత్నీగమనాది మహాపాతకముల నుండి విముక్తుని చేయును.
ఏ పాపమునకైనను తిలహోమము, గాయత్రి జపము ప్రాయశ్చిత్తములు. ఉపవాసపూర్వకముగ సహస్ర గాయత్రీ జపము చేయువాడు తన పాపములను నశింప చేసుకొనును. గోవధ-పితృవధ-మాతృవధ-బ్రహ్మహత్యా-గురపత్నీ గమన-బ్రాహ్మణజీవితాపహరణ-సుపర్ణ సేయ–సురాపానాదీ మహాపాపములు చేసినవాడు కూడ ఒక లక్ష గాయత్రీ జపము చేయుటచే శుద్ధుడగును. లేదా స్నానానంతరము నీటిలో ఉండి నూరు పర్యాయములు గాయత్రీ జపము చేయవలెను. పిదప గాయత్ర్యభిమంత్రితమగు జలముతో నూరు ఆచమనములు చేయవలెను. అట్లు చేసినవాడు కూడ పాపరహితు డగును. నూరు పర్యాయములు గాయత్రీ జపము సమస్త పాపములను శమింపచేయును. సహస్ర జపము ఉప పాతకములను కూడ నశింపచేయును. కోటి జపము చేసిన వానికి గాయత్రీదేవి అభీష్టఫలము నొసగును. జపము చేయువాడు దేవత్వమును,దేవరాజత్వమును కూడ పొందును. మొదట “ఓం” కారమును, పిదప “భూర్భువఃస్వః” ను ఉచ్చరించి పిదప గాయత్రి ఉచ్చరించి, చివర ‘ఓం’ చేర్చవలెను. జపమున ఈ విధముగ గాయత్రీ మంత్రము విహితమైనది. గాయత్రికి ఋషి విశ్వామిత్రుడు. గాయత్రి ఛందస్సు. దేవత సవిత. ఉపనయన–జప-హోమములందు దీనిని వినియోగించవలెను. గాయత్రీమంత్రమునందలి ఇదువది నాలుగు అక్షరములకు వరుసగా -ఆగ్ని -వాయు-రవి -విద్యుత్-యమ-జలపతి-గురు-పర్జన్య-ఇంద్ర-గంధర్వ-పూషన్-మిత్ర-వరుణ-త్వష్టృ- వసుగణ-మరుద్గణ-చంద్ర-అంగిరస్-విశ్వేదేవ -అశ్వినీ కుమార-ప్రజాపతిసహిత సమస్తదేవగణ-రుద్ర-బ్రహ్మ విష్ణువులు ఆధిష్ఠాతృదేవతలు. గాయత్రీజప సమయమున పైదేవతలను ఉచ్చరించినచో వారు జపము చేయువాని పాపములను తొలగింతురు.
గాయత్రీమంత్రమునందలి ఒక్కొక్క అక్షరమును క్రింద చెప్పిన అవయవములపై వరుసగా న్యాసము చేయవలెను- రెండు పాదాంగుష్ఠములు, రెండు మడమలు, రెండుపిక్కలు, మోకాళ్లు, తొడలు, ఉపస్థ, వృషణములు, కటిభాగము, నాభి. ఉదరము, స్తన మండలము, హృదయము, కంఠము, అధరోక్షము, తాలు, నాసిక, నేత్రములు, కనుబొమ్మల మధ్య భాగము, లలాటము, ఉత్తరోష్ఠము, దక్షిణపార్శ్వము, ఉత్తరపార్శ్వము, శిరస్సు, సంపూర్ణముఖ మండలము. ఇరువదినాలుగు గాయత్ర్యక్షరముల రంగులు. వరుసగా - పీత - శ్యామ - కపిల - మర క తమణిసదృశ - ఆగ్నితుల్య, స్వర్ణతుల్య - విద్యుత్రథ - ధూమ - కృష్ణ - రక్త - గౌర - ఇంద్రనీల మణిసదృశ - స్ఫటికమణికుల్య - స్వర్ణతుల్య - పాండు - పుష్పరా, తుల్య - ఆఖీలద్యుతి - హేమాభధూమ - రక్త నీల - రక్త కృష్ణ - సువర్ణాభ - శుక్ల - కృష్ణ - పలాశ వర్ణములై యుండును. గాయత్రిని ధ్యానము చేసినచో ఆ దేవి ధ్యానించు వానిపాపములను తొలగించును. హోమము చేసినచో ఆభీష్టముల నిచ్చును. గాయత్రీ మంత్రముతో తిలహోమము చేసినచో సకలపాపములు నశించును. శాంతికోరువాడు యవలను, దీరాయుర్ధాయము కోరువాడు ఘృతమును హోమము చేయవలెను. కర్మసిద్ది కోరువాడు ఆవాలను, బ్రహ్మతేజస్సు కోరువాడు క్షీరమును, పుత్రులను కోరువాడు పెరుగును అధిక ధాన్యము కోరువాడు శాలితండులములు హోమము చేయవలెను. గ్రహపీడాశాంతికై అదిర వృక్ష సమిధలను, ధనముకొరకు బిల్వపత్రములను, లక్ష్మి కొరకు కమలములను, ఆరోగ్యముకొరకు మహోత్పాత శాంతి కొరకును దూర్వలను, సౌభాగ్యముకొరకు గుగ్గులును, విద్యకౌరకు పాయసమును హోమము చేయవలెను. పదివేల హోమములచే పూర్యోక్త ఫలము లభించును. ఒక లక్ష హోమములచే మనోభిలషితములగు వస్తువు లన్నియు లభించును. ఒక కోటి ఆహుతులు చేసినవాడు బ్రహ్మహత్యాపాపవిముక్తుడై , తన కులము నుద్దరించి, శ్రీ మహా విష్ణు స్వరూపుడగును. గ్రహశాంతికై చేయు యజ్ఞములలో కూడ గాయత్రీ మంత్రముచే పదివేల హోమములు చేసినచో ఆభీష్టసిద్ధి కలుగును.
గాయత్రిని ఆవాహనము చేసి ఓంకారమును ఉచ్చరించవలెను. గాయత్రీ మంత్ర సహితమగు ఓంకార ముచ్చరించుచు శిఖనుబంధించి, ఆచమనము చేసి హృదయ-నాభి - కుజద్వయములను స్పృశించవలెను. ప్రణవమునకు ఋషి బ్రహ్మ, గాయత్రి ఛందస్సు. అగ్ని లేదా పరమాత్మదేవత. సర్వకర్మ ప్రారంభమునందును దీనిని ప్రయోగించ వలెను. “శుక్లా-శుభా” ఆను (మూలోక్త) మంత్రముచే గాయత్రిని ధ్యానించి “ఓం తేజోఽసి......తతః స్మృతా” అను (మూలోక్త) మంత్రముచే ఆవాహన చేయవలెను. సమ స్తవ్యాహృతులకును ఋషి ప్రజాపతి. అవన్నియు వ్యష్టిసమష్టి రూపములతో పర బ్రహ్మరూపమగు ఓంకార ములో ఉన్నవి. సప్తవ్యాహృతులకు వరుసగా - విశ్వామిత్ర - జమదగ్ని - భరద్వాజ - గౌతమ - అత్రి - వసిష్ఠ - కశ్యపులు ఋషులు. అగ్ని - వాయు - సూర్య - బృహస్పతి - వరుణ - ఇంద్ర - విశ్వదేవులు దేవతలు. గాయత్రీ - ఉషైక్ - అనుష్టుప్ - బృహతీ - పంక్తి త్రిష్టుప్. జగతి అనునవి ఛందస్సులు. ఈ వ్యాహృతులు ప్రాణాయాయ హోమములందు వినియోగింపబడును. “ఆపోహిష్ఠామయోభువః......జనయథాచన” అను మూడు ఋక్కులను, “ద్రుపదాదివ......ముముచానః” “హిరణ్యవర్ణాఃశుచయః” ఇత్యాది పవమాన ఋక్కులను పఠించుచు ఎనిమిది పర్యాయములు జలమును మీద చల్లుకొనవలెను. నీటిలోపలనిలచి “ఋతంచ” ఇత్యా ద్యమమర్షణమంత్రమును మూడు పర్యాయములు జపించవలెను. “ఆపోహిష్ఠా” ఇత్యాది ఋక్షయమునకు ఋషి సింధుద్వీపుడు, ఛందస్సు గాయత్రి. దేవత జలము. బ్రాహ్మస్నానమున కై మార్జనమునందు ఇది వినియోగింపబడును. ఆఘమర్షణసూక్త మునకు ఋషి ఆఘమర్షణుడు. ఛందస్సు అనుష్టుప్, దేవత భావవృత్తుడు. పాపనిస్సారణమునందు వినియోగము. “ఓం ఆపోజ్యోతీరసోఽమృతం బ్రహ్మభూర్భువఃసువరోమ్” ఇది గాయత్రీ మంత్ర శిరోభాగము. దాని ఋషి ప్రజాపతి. ఇది ఛందోరహితమైన యజుర్వేద మంత్రము. ఏలననగా యజుర్వేదము ఛందోబద్ధము కాదు. శిరోమంత్రమునకు దేవతలు బ్రహ్మ - అగ్ని - వాయు - సూర్యులు. ప్రాణాయామము నుండి వాయువు, వాయువు నుండి ఆగ్ని, ఆగ్ని నుండి జలము ఉత్పన్నమైనవి. ఈ జలమువలన శద్ధి కలుగును. ఆందుచే “అన్తశ్చర సిభూతేషు......రసోఽ మృతమ్” అను (మూలోక్త) మంత్రముతో ఆచమనము చేయవలెను. “ఉదుత్యం జాతవేదసమ్” అను మంత్రమునకు ప్రస్కణ్వఋషి. ఛందస్సు గాయత్రి. దేవత సూర్యుడు. దీనికి అతిరాత్ర - ఆగ్నిష్టోమములందు వినియోగము. “చిత్రందేవానామ్” అను మంత్రమునకు ఋషికౌత్సుడు. ఛందస్సుత్రిష్టుప్. దేవతసూర్యుడు. సూర్యోపస్థానమునందు వినియోగము.
అగ్ని మహాపురాణమునందు సంధ్యావిధి వర్ణన మను రెండు వందల పదునైదవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 215 of the Agni Purāṇa is as follows:
The worship of Devī in her various forms — Mahākālī, Mahālakṣmī, Mahāsarasvatī — is described according to the Śākta tantra tradition. The Navāvaraṇa pūjā of Śrī Yantra and the recitation of the Devī Māhātmya are prescribed. Agni describes the Kumārī pūjā, in which young girls are honored as living embodiments of the goddess. Offerings of red flowers, saffron, and sindūra are prescribed, and the chapter emphasizes that Devī worship bestows both bhukti and mukti.