ఆగ్ని దేవుడు పలికెను. కావ్య నాటక ఆలంకారాదుల స్వరూపమును చెప్పెదమ. ధ్వని, వర్ణము, పదము, వాక్యము. ఇవియే సకల పోజ్మయము. శాస్త్ర ఇతి హాస కావ్యములు ఈ వాజ్మయములో అంతర్గతములు. శాస్త్రము నందు శబ్దమునకు ప్రాధాన్యము. ఇతిహాసము లందు ఆర్డము నకు ప్రాధాన్యము. వీటిలో ఆభిధకే ప్రాధాన్యము. అందుచే కావ్యము ఈ రెండింటి కంటెను భిన్నమైనది. లోకములో నర త్వము దుర్లభము, విద్యను ఇంకను దుర్లభము. కవిత్వము ఇంకను దుర్లభం, శక్తి ఇంకను దుర్లభము. వ్యుత్పత్తి ఇంకను దుర్లభము వివేకము అన్నిటి కంటెను. దుర్లభము. ఆ విద్వాంసులు ఎంత ప్రయత్నించినను శాస్త్రము సిద్ధించదు. శాది వర్ణములు, వర్గ, ద్వితీయ చతుర్ధాక్షరములు మహా ప్రాణములు వర్ణ సము దాయము పదము సుబంతము తీజంతము యని, ఇది రెండు విధములు. ఇష్టార్థమును బోధించు పద పంక్తి వాక్యము.
స్పష్టమైన అలంకారములు గలది, గుణములు కలది, దోషములు లేనిది యగు వాక్యము కావ్యము. వేదములు, లోకము, కావ్య హేతువులు. సిద్ధ మంత్రముచే నిర్మించబడిన కావ్యము అయోనిజము. దేవతలకు సంస్కృత భాషను, మనుష్యులకు త్రివిధ ప్రాకృత భాషలను ప్రయోగించవలెను. గద్యము పద్యము మిశ్రమ యని, కావ్యము మూడు విధములు. పాదములు లేని పద సముదాయము గద్యము చూర్ణకము ఉత్కలికా వృ త్త గంధి యని గద్యము మూడు విధములు. చిన్నచిన్న మృదువై న మాటలున్నది చూర్ణకము. దీర్ఘ సమాసములు కలది ఉత్కలి, ఈ రెండింటికి నడుమ వున్నదియు, అత్యంత కుత్సిత విగ్రహము కానిదియు వృత్తచ్ఛాయ కలదియు యగు గద్యము వృత్త గంది. ఇది ఉత్కటకముగ నుండదు. ఆఖ్యాయికా, కథ, ఖండ కథ, పరికథ, కథానిక యని గద్య కావ్యము ఐదు విధములు. గ్రంథ కర్త యొక్క వంశ ప్రశస్తి అధికముగ నుండి కన్యాహరణ సంగ్రామ విప్రలంబ విపత్తుల వర్ణన ములతో వై దర్భాందీ రీతులు భారత్యాది వృత్తులు ప్రవృత్తులు వున్నదియు ఉచ్ఛ్వాసములను పేరు గల పరిచ్ఛేదములు కలదియు. చూర్ణక ప్రధానమును వస్త్రము గాని ఆపర వస్త్రము గాని యున్నది యగు గద్య కావ్యము ఆఖ్యాయికా. కవి దేనిలో తన వంశమును శ్లోకములలో సంక్షిప్తముగా చెప్పునో, మఠ్యార్థమును ప్రవేశ పెట్టుటకు మరియొక కథ చేర్చబడునో పరిచ్ఛేదము లుండవో, వున్నను లంబక మును పేర్లతో వుండునో యది కథ. దాని మధ్య భాగమున చతుష్పదితో బంధ రచన చేయవలెను. కథా ఖండము మాత్రమే వుద్నది ఖండ కథ. ఖండ కథా పరికథలలో, మంత్రి లేద వై శ్యుడు లేదా బ్రాహ్మణుడు నాయకుడుగా వుండును. కరుణర సము ప్రధానము. నాలుగు విధములగు విప్రలంబము వర్ణింపబడను. ఈ రెండింటిలో కథ సమాప్తి పొందదు. లేదా ఖండ కథలో కథా శైలి ఆనుసరించబడదు. కథా ఆఖ్యాయికల లక్షణములు కలిసి యున్నది పరికథా. ప్రారంభమున భయానకము, మధ్య యందు కరుణము, అంతమున ఆద్భుతము వుండునది కథానిక. ఇది ఉదాత్తమైనది కాదు.
చతుష్పది యనగా పద్యము. యది వృత్తయు, జాతి యని రెండు విధములు. అక్షర సంఖ్యా నియమము వున్నది వృత్తము. యిది ఉక్థము కృతి శేషజము యని రెండు విధములు. మాత్రాగణన వున్నది జాతీ యని కాశ్యపుడు చెప్పెను. పింగళుని ప్రకారము సమము, అర్ధ సమము, విషమము యని వృత్తము మూడు విధములు. కావ్య సముద్రమును దాట గోరు వారికి ఛందో విద్య నౌక వంటిది. మహా కావ్యము, కలాపము, పర్యాయ బంధము, విశేషకము, కుంకము, ముక్తకము కోశము ఇవన్నియు పద్య సముదాయములే. సర్గలలో విథ కమే సంస్కృతములో రచింపబడినది మహా కావ్యము. మహా కావ్య స్వరూపమును విడువక దాని వలె మరియొక విధమైన రచన చేసినను దోషము లేదు. ఇతిహాస కథను గ్రహించి గాని, మరియొక్క ఉత్తమ కథను గ్రహించి గాని మహా కావ్యము రచింపబడును. మంత్రము దూత ప్రయాణము యుద్ధము మొదలైనవి అచ్చట అచ్చట వర్ణింపబడును. అధిక విసృతము కాకూడదు. శక్వరి అతశక్వరి, అతజగతి, త్రిష్టప్ పుష్పితాగ్ర, వస్త్రము మొదలగు సమవృత్త ఛందస్సులను ప్రయోగించవలెను. సర్గల ఆంతమున ఛందస్సు మార్చవలెను. సర్గలు చాల సంక్షిప్తముగా నుండకూడదు. ఒక సర్గ అతశక్వరి, అష్టి ఛందస్సులతోను, మరియొక సర్గ మాత్రా ఛందస్సు లతోను సంకీర్ణమై యుండవలెను. రాబోవు సర్గ పూర్వ సర్గ కంటే ఉత్తమముగా నుండవలెను. కల్పము చాలా నిందితము సత్పురుషులకు వాని యందు ఆదరము వుండదు. న, గర, సముద్ర పర్వత, ఋతు, చంద్ర సూర్య, ఆశ్రమ, వృక్ష , ఉద్యాద, జలక్రీడ, మధుపాన, రతోత్సవ, దూతి వచన, కులటా చరిత్రాదుల అద్భుత వర్ణనలతో కావ్యము నిండి యుండుమ. అంధకారము వాయువు, ఇతర రతి విభావములు వర్ణింపబడును. అన్ని విధములగు వృత్తులు ప్రయోగింప బడును. అన్ని భావములచే ప్రభావితమై యుండును. సకల రీతులు సకల రసములు గుణములు అలంకారములు. దీనిని పరిపుష్టము చేయును. ఈ విశేషములుండుట చేతనే ఇది మహా కావ్యము. దానిని రచించిన వాడు మహా కవి.
మహా కావ్యమునందు ఉక్తివై చిత్త్ర్యమునకు ప్రాధాన్యమున్న ను రసమే దాని జీవనము కావ్యస్వరూపమువచో వక్రత్వము ఉన్నను ప్రయత్న పూర్వకముగ రసమున పోషించుటచే సిద్ధించును. మహాకావ్య ఫలము చతుర్వర్గ ప్రాప్తి దీనికి నాయకుని పేరుతో పేరు పెట్టవలెను. సమానమైన వృత్తుల, కూర్చవలెను. కైశికి వృత్తిచే కావ్యము కోమల ముగా నుండును. ప్రవాస వర్ణనమున్న కావ్యము కలాపము దానిలో పూర్వానురాగమను శృంగారముండును. సంస్కృతము లేదా ప్రాకృతముతో పాప్త్యాదులను వర్ణించినచో విశేషకము అనేక శ్లోకములకు ఒకే ఆశ్వయమున్న చో కులకము, సందారితకము యని పేరు. ఒక్కొక్క శ్లోకము స్వతంత్రార్థకమైనచో ముక్తకము. యది సత్పురుషులకు చమత్కారము కల్గించవలెను. మహాకవులు ఉత్తమ సూక్తులు కూర్చినది కోశము. యది బ్రహ్మవలె. అపరిచ్చిన్న రసభరితమై సహృదయు లకు రుచికరముగ నుండును. సర్గలో వేరువేరు వృత్తములను ఉపయోగించుట ఆభాసోపమ శక్తి యది మిశ్రమ ప్రకీర్ణము యని రెండు విధములు. శ్రవ్య ఆభినేయముల రెండు లక్షణములును వున్నది మిశ్రము. సకలోక్తుల తో కూడినది ప్రకీర్ణము.
ఆగ్ని మహాపురాణమున కావ్యాది లక్ష్మణ వర్ణనయను మూడువందల ముప్పదియేడవ ఆధ్యాయము సమాప్తము.
Summary of chapter 338 of the Agni Purāṇa is as follows:
The theory of drama (nāṭya) is described, beginning with the twenty-seven types of rūpaka (dramatic compositions), of which the nāṭaka is the supreme. The thirty-two elements of the pūrvaraṅga (pre-performance ceremony) are listed, establishing the stage as sacred space. The five sandhis (dramatic junctures) — mukha, pratimukha, garbha, vimarśa, and nirvahaṇa — each containing specific sequences of subsidiary units called sandhi-aṅgas, are explained as the structural backbone of the plot. The five arthaprakṛtis (plot-elements: seed/bīja, drop/bindu, episode/patākā, sub-plot/prakarī, and conclusion/kārya) and the role of the sūtradhāra (stage manager) in mediating between the divine origin of drama and its human performance are described.