ఈశ్వరుడు చెప్పెను : శాంతము, నాదాంతకము అను హ్రస్వదీర్ఘముల ప్రయోగముచే శుద్ధ - ఆశుద్ధకళల సంధానము చేయవలెను. “ఓం హాం ప్రాం హ్రీం హాం” అనునది సంధానమంత్రము. పిమ్మట ప్రతిష్టాకళలో నున్న జలతేజో - వాయు-ఆకాశ - పంచతన్మాత్ర - దశేంద్రియ - బుద్ధి- గుణత్రయ - అహంకార - పురుషులను ఇరువదియైదు తత్వములను, 'క' మొదలు 'య' వరకును ఉన్న ఇరువదియెదు అక్షరములను చింతన చేయవలెను. ప్రతిష్టాకళలో ఏబదియారు భువనము లున్నవి. వాటిలో అవే పేరులు గల రుద్రుని ఆంతమంది ఉన్నారు. వారి పేర్లు ఈ విధముగనున్నవి. అమరేశ -ప్రభాస-నైమిష - పుష్కర - ఆషాఢ - డిండి - భావభూతి - లకులీశులు (ఇది మొదటి అష్టకము), హరిశ్చంద్ర - శ్రీ శైల - జల్ప - ఆమ్రతకేశ్వర – మహాకాల మధ్యమ - కేదార - భైరవులు (ద్వితీయాష్టకము), గయా - కురుక్షేత్ర - సాల - కనఖల - విమల - ఆట్టహాస - మహేంద్ర - భీములు (తృతీయాష్టకము), వస్త్రపద - రుద్రకోటి - ఆవిముక్త-మహాలయ - గోకర్ణ - భధ్రకర్ణ - స్వర్ణాక్ష - స్థాణువులు (చతార్థాష్టకము), అజేశ - సర్వజ్ఞభాస్వర - తదనంతర - సుబాహు - మంత్రరూపి - విశాల - జటిల - రౌద్రులు (ఐదవ అష్టకము), పింగలాక్ష - కాలదంష్ట్రా - విధుర - మోత - ప్రాజాపత్య , హుతాశన - కాలరూపి - కాలకర్ణులు (ఆరవ అష్టకము). భయానక - పతంగ - పింగల - హర - ధాతృ - శంకుకర్ణ - శ్రీకంఠ - చంద్రమౌలు (ఏడవ అష్టకము) ఈ ఏబది యారుగురు రుద్రులు ఏబదియారు భువనములలో వ్యాపించియున్నారు. ఇపుడు ముప్పది రెండు పదములు చెప్పబడుచున్నవి.
త్యాపీన్, ఆరూపిన్, ప్రథమ, తేజః, జ్యోతి, అరూప, పురుష, అగ్నే, ఆధూమ, అభస్మన్, ఆనాదే, వానానానా, ధూధూధూధూ, ఓం భూః, ఓం భువః, ఓం స్వః, అనిధన, నిధన, నిధవోద్భవ, శివ, శర్వ, పరమాత్మన్, మహేశ్వర, మహదేవ, సద్భావ, ఈశ్వర, మహాతేజః, యోగాధిపతే, ముంచ, ప్రమథసర్వ, సర్వసర్వ అనునవి ముప్పదిమూడు పదములు. రెండు బీజములు, వాసుదేవ-శిరస్- శిఖలను మూడు ముత్రములు. గాంధారీసుషుమ్నా నాడులు, సమానోదానము లను రెండు ప్రాణవాయువులు, రసనాపాయువు లను రెండు ఇంద్రియములు. రసమను విషయము; రూప శబ్ద స్పర్శర సము లను నాలుగు గుణములు, కమలాంకిత మైన అర్థచంద్రాకర శ్వేతమండలము, సుషుప్త్యవస్థ, ప్రతిషారణభూతు డైన విష్ణువుఈ విధముగ భువనాది సకల తత్త్వములను ప్రతిష్టలోపల భావన చేసి, ప్రతిష్ఠకళామంత్రముతో శిష్యశరీరమున ప్రవేశించి నట్లు భావన చేసి, దానిని ఆ కళాశమునుండి విముక్తుని చేయవలెను. ఓం హం హీం హాం ప్రతిష్టాకలాపాశాయ హుం ఫట్ స్వాహా అను మంత్రముతో, పూరక ప్రాణాయామాంకుశ ముద్రలతో కళాపాళాకరణము చేయవలెను. పిమ్మట “ఓం హూం హాం హీం హాం హూం ప్రతిష్టాకలాపాశాయ హుం ఫట్” అను మంత్రముతో, సంహార ముద్రా కుంభక ప్రాణాయామములతో హృదయము క్రింద సాడిసూత్రము గ్రహించి, “ఓం హూం హీం హాం ప్రతిష్ఠాకలాపాశాయ నమః” అనుమంత్రముతో, ఉదృవముద్రా రేచక ప్రాణాయామములతో కుండమునందు ఉంచవలెను. పిదప “ఓం హం హాం హీం హాం ప్రతిష్టి కాలా ద్వారాయ నమః” అను మంత్రముతో అర్ఘ్య మిచ్చి, పూజించి, స్వాహావితమంత్రముతో మూడేసి హోమములు చేసి, సంతర్పణ సంవిధాపనములు చేయవలెను. “ఓం హం విష్ణవే నమః” అను మంత్రముతో విష్ణువును ఆవాహన చేసి, హజాతర్పణములు చేసి “ఓ విష్ణ! నీ ఆధికారమునందు ముముకు వగు శిష్యునకు దీక్ష ఇచ్చుచున్నాను. నీవు అనుకూలుడ వగుము” అని ప్రార్థించవలేను.
పిమ్మట వాగీశ్వరీ వాగీశ్వరులను వెనుకటివలెనే ఆవాహన చేసి పూజనతర్పణమాలు చేసి, శిష్యుని వక్షమున తాడనము చేయవలెను. “ఓం హం హం హ హూం ఫట్” అనునది తాడనమంత్రము. ఈ మంత్రముతోడనే శిష్యుని. హృదయమున ప్రవేశించి పాశబద్ధ మగు ఆతని చైనత్యమును. అస్త్రమంత్ర-జ్యేష్ఠాంకుశముద్రలతో పాశ విముక్తము చేయ వలెను; ఎట్లనగా “ఓం హం హం హః ఫట్” ఈ మంత్రమునకే “స్వాహా” చేర్చి తత్సంప్రటిత మైన మంత్రముతో జీవ చైతన్యము ఆకర్షించి, నమస్కారాంత మగు “ఓం హ్రాం హాం హాం ఆత్మనే నమః” అను అత్మమంత్రముతో తన ఆత్మతో “కలపవలెను. పిదప, ఆ జీవచైతన్యము పితృసంయుక్త మను భావన చేసి, దానిని వామా ఉద్భవముద్రతో దేవీగర్భము నందు స్థాపించవలెను. ఆ సమయమున “ఓం హం హం హామాత్మనే నమః” అను మంత్రము పఠించవలెను. దేవోత్పత్తి కొరకై (హృదయమంత్రముతో ఐదు హోమములును, జీవాత్మస్థితికొర తై శిరోమంత్రముతో ఐదు హోమములు చేయవలెను. అధికార ప్రాప్తికొరకు శిఖామంత్రముతోను, భోగ సిద్ధికొరకు కవచమంత్రముతోను, లయకొరకు అస్త్రమంత్రముతోను, గ్రోత సిద్దికొరకు శివమంత్రముతోను తత్త్వశుద్దికొరకు హృదయమంత్రముతోను ఐదేసి హోమములు చేయవలెను. పిమ్మట వెనుకటి వలె గర్భాదానాది సంస్కారములు చేసి, పాళశైథిల్య-ప్రాయశ్చిత్తములకొరకు శిరోమంత్రముతో నూరు హోమములు చేయ వలెను. మలశక్తి నివారణముకొరకై స్వాహాంతమగు ఆశ్రమంత్రముతో ఐదు హోమములు చేయవలెను. ఈ విధముగ పాశములు తొలగిన పిమ్మట అస్త్రమంత్రమును ఏడుపర్యాయములు జపించి, “ఓం హీం ప్రతిష్ఠాకలాపాశాయ హూం ఫట్” అను కలాబీజయుక్తమగు అస్త్రమంత్రరూపఖడ్గముతో కలాపాశమును ఛేదించవలెను. పాఠశ స్త్రముతో ఆ పాశమును నలిపి, వర్తులాకారము చేసి, వెనుక టివలెనే ఘృతపూర్ణ మగు స్రువమునందుంచి, దానిని కలాశ స్రముతో హోమము చేయవలెను. పిమ్మట పాశాంకుర నివృత్తికొరకై అస్త్రమంత్రముతో ఐదు హోమములు చేసి ప్రాయశ్చిత్త నివారణార్థమై మరల ఎనిమిది హోమములు చేయవలెను. “ఓం హః అస్త్రాయ హూం ఫట్” అనునది హోమమున కుపయోగించు అస్త్రమంత్రము.
హృదయమంత్రముచే విష్ణువును ఆవాహనచేసి, పూజనతర్పణాద్యనంతరము “ఓం హాం విష్ణో రసం శుల్కం గృహాణ స్వాహా” అను మంత్రముతో ఆధికార సమర్పణము చేయవలెను. పిదప ఈ విధముగ శివాజ్ఞ వినిపింపవలెను. “ఓ విష్ణూ! ఈ పశువు పాశములు పూర్తిగా దగ్ధ మైనవి. ఇక నీవు వీనికి బంధనకారకుడవు కాకూడదు.” పిదప రౌద్రీనాడితో విష్ణువును విసర్జించి రాహుముక్త మైన ఆర్థభాగము గల చంద్రమండలముతో సమానమైన ఆత్మను నియుక్తము చేయ వలెను. సంహార ముద్రతో దానిని తనలోనుండి, ఉద్భవముద్రతో దానిని సూత్రముతో కలుపవలెను. పిదపవెనుకటివెలెనే, జలబిందుసదృశ మగు ఆ ఆత్మను శిష్యుని శిరముపై ఉంచవలెను. దీనివలన ఆతనికి ఆప్యాయనము కలుగును. పిదప పుష్పాదులతో ఆగ్ని యొక్క మాతాపితరులను పూజించి, విసర్జనము చేసి, విధిపూర్తి కొరకై యథాశాస్త్రముగ పూర్ణాహుతి ఈయలేలెను. ఇట్లు చేయుటచే ప్రతిష్టాకళ కూడ శోధితమగును.
అగ్ని మహాపురాణమునందు, నిర్వాణదీక్షలో ప్రతిష్టాకళా సంశోధనవిధి యను ఎనుబదియైదవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 85 of the Agni Purāṇa is as follows:
The eighty-fifth chapter continues the nirvāṇa-dīkṣā procedure with the purification of the pratiṣṭhā-kalā — the second cosmic level associated with water and the sustaining function of the cosmos. The 56 bhuvana-s of this kalā, each presided over by a Rudra bearing the name of a sacred tīrtha or pilgrimage site — Amareśa, Prabhāsa, Naimiṣa, Puṣkara, and 52 others — are enumerated. The theological principle that Bhagavān Viṣṇu is the presiding kāraṇa (cause) for this kalā — the sustaining function belonging to Viṣṇu's domain — is stated. The purification procedure (tāḍana — striking, bheda — piercing, praveśa — entering, viyojana — separating) follows the same pattern as the previous kalā but uses the specific mantra of the pratiṣṭhā-kalā. The liberation of the soul from the bondage of the sustaining cosmic level is described as freedom from the compulsion to take birth in samsāra.