అగ్ని మహా పురాణము

208 - అథ వ్రతదానసముచ్చయః.

అగ్ని దేవుడు చెప్పెను : వసిష్టా! ఇపుడు, సామాన్య వ్రతమును గూర్చియు, దానములను గూర్చియు సంక్షిప్తముగా చెప్పెదను. ప్రతిపదాదితిథులందును సూర్యవారాదులందును, కృత్తికానక్షత్రములందును విష్కంభాది యోగములందును, మేషాది రాశులందును, గ9హణాది సమయము బందును చేయ దగిన వ్రతములు, దానము వాటికి సంబంధించిన ద్రవ్యములు, నియమాదులు వీటిని గూర్చి కూడ చెప్పెదను. ప్రతూనోపయోగులగు ద్రవ్యములకును, కాలమునకును, ఆధిష్ఠాతయైన దేవత శ్రీమహావిష్ణువు. సూర్యశివబ్రహ్మలక్ష్మ్యాది దేవతలందరును శ్రీమహావిష్ణు విభూతులే. అందుచే ఆయనను ఉద్దేశించిచేసిన వ్రతదాన పూజనాదులు సకలమనోరథప్రదములు. “ఓ జగత్పతీ! నీకు నమస్కారము. రమ్ము. ఆసన-అర్ఘ్య-మధుపర్క-ఆచమనస్నాన వస్త్ర-గంధ-పుష్ప ధూప-దీప-నైవేద్యములనుహించుము” ఆని ప్రార్థించి పూజించవలెను. పూజా వత-దాన ములందు పై మంతముతో శ్రీమహావిష్ణువును పూజించవలెను. ఇప్పుడుసామాన్యదావసంకల్పమును గూర్చి వినుము. ఈ రోజున, ఈ గోతము గల, ఈ శర్మ అనుబ్రాహ్మణునకు నేను సమస్త పాపశాంతి, ఆయురారోగ్యవృద్ధి, సౌభాగ్యోదయము కలుగుటకై, గోత్ర-సంతానవిస్తృతి, ధనవిజయప్రాప్తికై, ధర్మ- ఆర్థ -కామసంపాదనమునకై, పాపనాశ పూర్వకముగ సంసారమునుండి విముక్తి పొందుటకై, విష్ణువునకు సంబంధించిన ఈ వస్తువును దానము చేయుచున్నాను. ఏతద్దానసాద్గుణ్యార్థమై మీకు సువర్ణాది ద్రవ్యములను గూడ సమర్పించుచున్నాను. నేను చేసిన ఈ దానముచే సకలలో కేశ్వరుడగు శ్రీహరి సర్వదా ప్రసన్ను డగుగాక. ఓ యజ్ఞ-దాన వ్రతాధీశా! నాకు విద్యాయక స్సులను అనుగ్రహించుము. ధర్మార్థ కామ మోక్షరూపములగు నాలుగు పురుషార్థములను, మనోభిలషితము లగు వస్తువులను అనుగ్రహించుము” ఈ వ్రతదానసముచ్చయమును ప్రతిదినము పఠించువాడు అభీష్ట లాభములను పొంది, పాపరహితుడై భుక్తిముక్తులను రెండింటిని పొందును. వాసుదేవాదులకు సంబంధించిన ఇట్టి పూజానియమాదులచే అనేక విధములగు తిథి వార - నక్షత్ర - సంక్రాంతి - యోగ - మన్వాదిసంబంధివ్రతము ననుష్ఠించిన ఫలము సిద్ధించును.

అగ్ని మహాపురాణమునందు వ్రతదాన సముచ్చయవర్ణన మను రెండువందల ఎనిమిదవ అధ్యాయము సమాప్తము.