కిష్కిందాకాణ్డవర్ణనము. నారదుడు పలికెను. రాముడు పంపాసరస్సు చేరి దుఃఖించెను. పిమ్మట శబరివద్దకు వెళ్లాను. పిమ్మట హనుమంతుడు సుగ్రీవుని వద్దకు తీసికొనిపోగా ఆతనిని తన మిత్రునిగ చేసికొనెను.
సుగ్రీవుడు చూచుచుండగా ఒక బాణము చేత ఏడు తాళవృక్షములను భేదించి, దుందుభి శరీరమును పది యోజ నముల దూరము విసరెను.
ఆతని సోదరుడును, వై రము చేయుటచే శత్రువును అగు వాలిని చంపి అక్యమూక ముపై ఉన్న ఆతనికి కిష్కింధను, వానర రాజ్యమును, రుమను, తారను ఇచ్చెను. సుగ్రీవుడు ఇట్లు పలికెను. “రామా! నీకు సీత లభించు నట్లు చేసెదను,
రాముడు ఆ మాటలు విని మాల్యవత్పర్వతము పై వర్షాకాలము నాలుగు మానములును గడ పెను. కిష్కింధలో ఉన్న సుగ్రీవుడు మరల కనబడక పోగా లక్ష్మణుడు రాముడు చెప్పిన విధమున ఆతనితో ఇట్లు చెప్పెను. “నీవు రాముని దగ్గరకు వెళ్లుము. వాలి రామునిచే నిహతుడై వెళ్లిన మార్గము ఇంకను మూసివేయబడలేదు. సుగ్రీవా! మాటమీద నిలబ డుము. వారి మార్గమును అనుసరించకుము”.
వానరాధిపతి యైన సుగ్రీవుడు “కార్యాసక్తుడనైన నేను.గడచిన కాలమును గుర్తించ జాలకపోతిని” అని పలికి రాముని వద్దకు వెళ్లి నమస్కరించి ఇట్లు పలికెను.
సుగ్రీవుడు పలికెను: వానరులనందరిని పిలిపించితిని, నీ అభిలాష ప్రకారము వారిని సీతాన్వేషణము నిమి తమై వంపగలను. వారు తూర్పుదిక్కు మొదలైన ట్రిక్కులందు సీతను. మానములోపున ఆన్వేషించవలెను. మాసము దాటి నచో వారిని చం పెదను.
ఈ విధముగా ఆజ్ఞాపింపబడిన వానరులు తూర్పు-పశ్చిమము, ఉత్తరము వైపు వెళ్లి అచట సీతను గానక రామ సుగ్రీవుల వద్దకు తిరిగి వచ్చిరి.
హనుమంతుడు రాముని అంగుళీయకమును తీసికొని, వానర సమేతుడై దక్షిణ దిక్కునందు సుప్రభ గుహ నమీవమున అన్వేషించెను.
మాసము దాటిన తరవాత కూడ వింధ్యపర్వతమునందు ఉండి సీతను చూడజాలని ఆ వానరులు. ఇట్లు అనుకొనిరి. “మన మందరము వ్యర్థముగా మరణించనున్నాము. యుద్ధమునందు రావణునిచే చంపబడి, సీత నిమిత్తమై ప్రాణములు విడచిన ఆ జటాయువు ధన్యుడు కదా?”
ఆ మాటలు విని నంపాతి వానరులను భక్షించుట మాని ఇట్లు పలికెను. ఆ జటాయువు నాసోదరుడు. నాతో కలిసి సూర్య మండలము వైపు ఎగిరెను. ఆతనిని నేను సూర్యుని వేడిమినుండి రక్షించగా భూమి పై పడెను. ఆకాశము పై నున్న నా రెక్కలు కాలిపోయినవి. రాముని కథ వినుటచే నా రెక్కలు మరల మొలచినవి. ఓ వానరులారా! శత యోజనవిస్తీర్ణమైన లవణ నముద్రమున, త్రికూటవర్వతము పై నున్న లంకాపట్టణమునందు ఆశోకవనములో ఉన్న జానకి నాకు కనబడుచున్నది. ఈ విషయము తెలిసికొని రామసుగ్రీవులకు తెలుపుడు.
అగ్ని మహాపురాణమునందు రామాయణ కథలో కిష్కిన్ధాకాండ వర్ణనమను అష్టమాధ్యాయము సమాప్తము.
Summary of chapter 8 of the Agni Purāṇa is as follows:
This chapter begins the Rāmāyaṇa summary, covering the Bāla and Ayodhyā portions. It narrates Rāma's birth in the Ikṣvāku dynasty to King Daśaratha and Kausalyā, his training under Viśvāmitra in which he slew Tāṭakā and protected the sage's sacrifice, and his winning of Sītā at the svayaṃvara in Janakī-pura by stringing and breaking Śiva's great bow. The chapter then turns to Daśaratha's preparations for Rāma's coronation and the sudden reversal caused by Kaikeyī's two boons — exile for Rāma and the throne for Bharata. Rāma's serene acceptance of the exile, Sītā's insistence on accompanying him, and Lakṣmaṇa's devoted loyalty are presented as the supreme exemplifications of dharmic conduct.