హయగ్రీపుడు పలికెను - ఇప్పుడు దేవసముదాయ ప్రతిష్టను గూర్చి చెప్పెదను. ఇది కూడ వాసుదేవ ప్రతిష్ట వలెనే చేయవలెను. ఆదిత్య - వసు - రుద్ర . సాధ్య - విశ్వేదేవ . అశ్వినీ కుమార - ఋషి - ఇతర దేవగణములకు దేవసముదాయ మని పేరు. వీరి స్థాపనలో నున్న విశేషములు చేప్పెదను. ఆయా దేవతల పేర్లలోని మొదటి అక్షరము గ్రహించి దానికి స్వరములు చేర్చవలెనుదీర్ఘ స్వరములతో కూడిన ఆ బీజాక్షరములతో అంగన్యాసము చేయవలెను. ఆ ప్రథమాక్షరమునకు బిందువు, చేర్చి బీజముగ గ్రహింపవలెను. ప్రణవనమస్కారములు చేర్చవలెను. సమస్తదేవతలను మూలమంత్రముతోడనే పూజించి స్థాపింపవలెను. ఇవి కాక, స్థాపనావిషయమున అవలంబింపవలసిన నియమములను, వ్రతములను, కృచములను. మఠ - సేతు - గృహాదులను, మాసోపవాస - ద్వాదశీవ్రతాదులను చేప్పెదను. ముందుగా శిలా - పూర్ణకుంభ - కాంస్య పాత్రలు తీసికొని వచ్చి ఉంచవలెను. పిమ్మట సాధకుడు బ్రహ్మకూర్చ గైకొని “తద్విష్ణోః పరమం పదమ్” అను మంత్రముతో కపిలగోవుపాలతో యవచ రువును వండవలెను. ఓం కారముతో దానిలో నేయిపోసి, గరటితో ఎనపవలెను. పిదప శ్రీవిష్ణు పూజ చేసి హోమము చేయవలెను. వ్యాహృతి గాయత్రులతో కూడిన తద్విప్రాసో ఇత్యాదిమంత్రముతో చరుహోమము చేయవలెను. “విశ్వతశ్చక్షుః” ఇత్యాది వైదిక మంత్రముతో భూమి - అగ్ని - సూర్య. ప్రజాపతి - అన్తరిక్ష - ద్యౌ - బ్రహ్మన్ - పృథ్వీ - కుబేర - సోమశ బ్దములను చతుర్థ్యంతములు చేసి, వాటికి “స్వాహా” చేర్చి, ఆ దేవతల నుద్దేశించి ఆహుతు నీయవలెను, ఇంద్రాది దేవతలకు ఆ దేవతలకు సంబంధించిన మంత్రములు చదువుచు ఆహుతు లివ్వవలెను. చరు భాగమును ఈ విధముగ హోమము చేసి ఆదర పూర్వకముగ దిగ్బలు లీయవలెను.
పిదప నూట ఎనిమిది పలాశ సమిధలను హోమము చేసి, పురుష సూక్తముతో ఆజ్యహోమము చేయవలెను, “ఇరావతీధేనుమతీ” అను మంత్రముతో తిలాష్టక హోమము చేసి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల పార్షదులకు, గ్రహములకు, లోకపాలులుకు, మరల ఆహుతు లీయవలెను. పర్వత నదీసముద్రములకు కూడ హోమములు చేసి, మహావ్యాహృతులను చ్చరించుచు, స్రువముతో మూడు పూర్ణాహుతు లియవలెను. పితామహా! 'నౌషట్' చేర్చిన వైష్ణవ మంత్రముతో పంచ గవ్యమును, చదువును ప్రాశనము చేసి, ఆచార్యు-కు సువర్ణయుక్త తిలపాత్రము, వస్త్రములు, అలంకృతమగు గోవు దక్షిణగా నీయవలెను. “భగవాన్ విష్ణుః ప్రియతామ్” అని పలుకుచు వ్రతవిసర్జనము చేయవలెను.
ఇపుడు మరియొక మాసోపవాసాది విధిని చెప్పుచున్నాను. ముందుగా యజ్ఞముచే శ్రీహరిని సంతుష్టుని చేయవలెను తిల - తండుల - నీవార - శ్యామాకములతో, శ్యామాకములకు బదులు యవలతో వండిన వైష్ణవ చరువును నేతితో కలిపి మూర్తి మంత్రముతో హోమము చేయవలెను. పిమ్మట మాసాధిపతులైన విష్ణ్వాది దేవతల నుద్దేశించి మరల హోమము చేయవలెను. 'ఓం శ్రీవిష్ణవే స్వాహా' ఇత్యాది మంత్రములతో నేతిలో ముంచిన అశ్వత్త సమిధలతో పండ్రెండు హోమములు చేయవలెను, “విష్ణోరరాటమసి” అను మంత్రముతో కూడ పండ్రెండు హోమములు చేయవలెను. 'ఇరావతీ' ఇత్యాది మంత్రముతో పండ్రెండు చర హోమములు చేయవలెను, 'తడ్విస్రాసః' ఇత్యాది మంత్రముతో ఘృత హోమములు చేయ వలెను. పిదప శేషహోమము చేసి మూడు పూర్ణాహుతులు ఇవ్వవలెను. “యుజ్ఞతే”. ఇత్యాద్యనువాకమును చదువుచు, ప్రణవముతో రావి ఆకుల విస్తరలో వడ్డించుకొని ఛరువును భక్షించవలెను. పిమ్మట మాసాధిపతుల నుద్దేశించి పండ్రెండుగురు బ్రాహ్మణులకు భోజనము పెట్టవలెను. ఆచార్యుడు వారిలో పదమూడవవాడుగా ఉండవలెను. వారికి మధుర జలపూర్ణము లగు పదమూడు కలశముల, ఉత్త మమైన ఛత్రము పాదుకలు. వస్త్రములు, సుపర్ణము, మాలలు దానము చేయవలెను. వ్రతపూర్తి కి ఆన్ని వస్తువులు పదమూడు చొప్పున చేయవలెను. గోవులు ప్రసన్నములగుగాక, సంతోషముతో నవిచుశ్రీమదగ్ని మహాపురాణము రించుగాక. అని పలుకుచు గోపథమును(గోవులు మేయుటకు స్థానము) విడచిపదిహ స్తముల ఎత్తైన యూపస్తంభము పాతవలెను. గృహస్థుడు ఇంటిలో హోమాదికార్యములన్నియు యథాశాస్త్రముగ జరిపి, పూర్వోక్త విధ్యనుసారము గృహములో ప్రవేశించ వలెను, అందరికిని, ఏ అడ్డులును లేకుండి అన్న దానము చేయవలెను. బ్రాహ్మణులకు యథాశక్తిగ దక్షిణ లీయవలెను. ఉద్యానమును నిర్మించువాడు చిరకాలము నందనోద్యానములో నివసించును. మఠ ప్రదానము చేయుటచే స్వర్గలోక ఇంద్ర లోకములు ప్రాప్తించును ప్రతి (చలివేందలి) దానము చేసినవాడు వరుణలోకమునందును. సేతునిర్మాణము చేసినవాడు దేవలోకమునందును నివసించును. ఇటుకలతో సేతువు నిర్మించువాడు కూడ స్వర్గమును పొందును. గోపథమును నిర్మించు వాడు గోలోకము పొందును. నియమములను వ్రతమును ఆచరించువాడు సాక్షాద్విష్ణు స్వరూపుడగును కృచ్చవ్రతములు చేయువాడు సమస్త పాపములను నశింపచేసికొనును గృహదానము చేసినవాడు మహాప్రలయము వరకును స్వర్గములో నివ సించును. గృహస్థుడు శివాదిదేవతల సముదాయ ప్రతిష్ఠ చేయవలెను.
శ్రీ అగ్ని మహాపురాణమునందు సాధారణ ప్రతిష్టాకథనమను ఆరువది యారవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 66 of the Agni Purāṇa is as follows:
The sixty-sixth chapter provides a comprehensive group-installation procedure for all deities simultaneously — the twelve Ādityas, eight Vasus, eleven Rudras, Sādhyas, and Viśvadevas, along with the seven primordial Ṛṣi-s. The mantra construction principle — forming the specific mantra for each deity by taking the first syllable of the deity's name and embedding it in a fixed mantra template — is explained, allowing even a single ācārya to consecrate all deities. The monthly fire ritual (māsika homa) to Viṣṇu for the continuous maintenance of the consecrated image is prescribed. The chapter concludes with a celebration of the merit of donating gardens (ārāma), monasteries (maṭha), bridges (setu), and residences (gṛha) to the community — each category of gift carries specific rewards in this world and the next, from abundance to liberation.