పరమేశ్వరుడు చెప్పెను : పూర్వోక్త విధానముచే విద్యాకళను శాంతికళతో విధిపూర్వకముగ సంధానము చేయ వలెను. అందుకు తొలి హాం హరాం హాం అనునది మంత్రము. శాంతికళలో ఈశ్వరుడు, సదాశివుడు అను రెండు తత్త్వములు ఇమిడియున్నవి. దీని వర్ణములు హకార కారములు. భువనములలో సమాన నామధేయములు గల రుద్రులు వీరు-ప్రభవ-సమయ-ముద్ర విమల. శివ-సన-నిరంజన-ఆంగార సుశిరా-దీ కారణ - త్రిద కేశ్వర-కాలదేవ-సూక్ష్మ-అంబుజే శ్వరు లను పదునాలుగురు రుద్రులు కాంతికళలో ప్రతిష్ణాతులు. “వ్యోమవ్యాపినే, వ్యోమరూపాయ, సర్వవ్యాపినే, శివాయ, అనస్తాయ, ఆనాధాయ, అనాశ్రితాయ, ధ్రువాయ, శాశ్వతాయ, యోగ పీఠసంస్థితాయ, నిత్యయోగినే, ధ్యానాహరాయ అను నవి పండ్రెండు పదములు. పురుష-కవచములు రెండు మంత్రములు. బిందుజకారములు బీజములు. అలంబుష, యశ అనునవి రెండు నాడులు. కృకరాకూర్మములు రెండు ప్రాణవాయుపులు. త్వక్కు, హస్తములు రెండు ఇంద్రియములు. విషయము, స్పర్శ, స్పర్శ శబ్దములు రెండు గుణములు. ఈశ్వరుడు ఏకైక కారణము. దీని అవస్థ తురీయావస్థ. ఈ విధముగ భువనాది సకలతత్వములును శాంతికళలో ఉన్నట్లు భావన చేసి, వెనుకటి వలెనే, తాడన-భేదన-హృదయప్రవేశ చైతన్య వియోజన ఆకర్షణ గ్రహణములు చేయవలెను. పిదప శాంతిముఖసూత్రముచే చైతన్యమును తనలో ఆరోపించుకొని, కళను గ్రహించి, కుండమునందు ఉంచవలెను. పిమ్మట ఈశ్వరని ఈ విధముగ ప్రార్థించవలెను. “ఓపరమేశా! నేను ఈ ముముక్షువునకు నీ అదికారమునందు దీక్ష ఇచ్చుచున్నాను. ఈతనికి అనుకూలుడవుగ నుండుము. మాతాపిత్రా వాహనాది కము, శిష్యవాడనాదికము చేసి, చైతన్యమును గ్రహించి ఆత్మతో యోజనము చేయవలెను. వెనుకటి వలెనే మాతాపితృసం యోగ భావన చేసి, హృదయమంత్రసంపుటితమగు ఆత్మబీజము ఉచ్చరించుచు, ఉద్భవవాడితో ఆ చైతన్యమును దేవీగర్భము నందుంచవలెను. దేహోత్పత్తికొరకు హృదయమంత్ర ముతోను, జన్మకొరకు శిరోమంత్రముతోను, అధికార సిద్ధికొరకు శిఖా మంత్రముతోను, భోగముకొరకు కవచ మంత్రముతోను, లయకొరకు శస్త్రమంత్రముతోను, ప్రోతఃశుద్దికొరకు శివమంత్రము తోను, తత్వశోధనము కొరకు హృదయమంత్రముతోను ఐదేసి హోమము చేయవలెను. గర్భాధానాది సంస్కారములు, గూడ వెనుక టివలెనే చేయవలెను.
పాశ శైథిల్యముకొరకును. నిష్కృతికొరకును. కవచమంత్రము నూరు సార్లు జపించవలెను. మలశ క్తి తిరో. ధానము కొరకు శస్త్రమంత్రముతో ఐదు హోమములు చేయవలెను. పాశ వియోగముకొరకు గూడ ఐదు హోమములు చేయ వలెను. పిమ్మట అస్త్రమంత్రమును ఏడు పర్యాయములు జపించి, బీజయు క్రాస్త్రమంత్ర రూప ఖడ్గముతో (ఓం హౌం శాస్త్రి కలాపాశాయ నమః హాం హరాం ఫట్) పాశ మును ఛేదించవలెను. వెనుకటి వలెనే అస్త్రమంత్రముతో పాశ విమర్ధన వర్తులే కరణములు చేసి నేతితో నింపిన స్రువములో ఉంచి, కలాస్త్రమంత్రముతో దానిని హోమము చేయవలెను. పాశాంకుర, నివృత్తికొరకై అస్త్రమంత్రముతో ఐదు ఆహుతు లిచ్చి ప్రాయశ్చిత్త నివారణార్థమై ఎనిమిది హోమములు చేయవలెను. “ఓం హం? అస్త్రాయ హూం ఫట్” అనునది మంత్రము. హృదయమంత్రముతో ఈశ్వరుని ఆవాహన చేసి పూజతర్ప జాద్యనంతరము “ఓం హాం ఈశ్వర, బుద్ధ్యహఙ్కారౌ శుల్కం గృహాణ స్వాహా” అను మంత్రముతో యథాశాస్త్రముగ శుల్కమును సమర్పించవలెను. పిదప ఈశ్వరునకు శివాజ్ఞ వినిపింపవలెను, “ఈశ్వరా! ఈ పశువు పాశములన్నియు దగ్గములై నవి. ఇక నీవు వీనికి బంధములు కలిగించరాదు.” పిమ్మట ఈశ్వరుని విసర్జించి ఆత్మలో రౌద్రీశ క్తిని చేర్చ వలెను. ఈశ్వరుడు చంద్రునకు తన శిరస్సుపై ఆశ్రయ మిచ్చి నట్లు శిష్యుని జీవాత్మ ను గురువు తన ఆత్మతో సంబం ధింపచేయవలెను. పిదప దానిని శుద్దా-ఉద్భవముద్రతో సూత్రమునందు చేర్చి, అమర బిందు స్వరూప మగు ఆ చైతన్య సూత్రమును, మూలమంత్రముతో, శిష్యుని శిరముపై నుంచవలెను. పిదప ఆగ్ని ని, పితరులను పుష్పాదులతో పూజించి, విసర్జనము చేసి, సమ స్తవిధానసంపూర్తి కొరకై, పూర్ణాహుతి ఇవ్వవలెను. తాడనాదికము వెనుకటివలెనే చేయవలెను. ఈ కళకు సంబంధించిన బీజము నుపయోగించుట యొక్కటియే విశేషము. ఈ విధముగ కాంతిక శుద్ది చెప్పబడినది.
శ్రీ ఆగ్నేయపురాణమునందు నిర్వాణదీక్షలో శాంతికళాశోధన మను ఎనుబది యేడవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 87 of the Agni Mahā Purana is as follows:
The eighty-seventh chapter describes the purification of the śānti-kalā — the fourth cosmic level associated with air and the obscuring function that veils the divine nature from the individual soul. The 14 bhuvana-s of this kalā — Prabhava, Samaya, Mudrā, Vimala, Śiva, and 9 others — are listed. The presiding deity is Īśvara (the Lord) in his aspect of cosmic governance, and the turīya-avasthā (the fourth state of consciousness, beyond waking, dreaming, and deep sleep) is the specific level of awareness associated with this kalā's realization. The śānti-bīja mantra is used throughout the purification procedure. The liberation attained through the śānti-kalā purification is described as the experience of pure witnessing consciousness — the soul's recognition of itself as the silent witness of all experience rather than the experiencer caught in the stream of time.