ఓ మునీశ్వరుడా! ఆపుడు కశ్యపునకు ఆదిత్యాదులయందు పుట్టిన సంతానమును గూర్చి చెప్పెదను. దానుష మన్వంతరము నందు తుషితడేవతలుగా ఉన్న వారే మరల వైవస్వతమన్వంతరమునందు- ధాత, ఆర్యముడు, పూష, వివస్వంతుడు, సవిత, మిత్రుడు. వరుణుడు, భగుడు, అంశువు అను, ద్వాదశాదిత్యులుగా ఆదితియందు కశ్యపునకు జనించిరి, అరిష్టనేమి భార్యలకు పదునారుగురు పుత్రులు జన్మించిరి.
విద్వాంసుడై న బహుపుత్రునకు నలుగురు విద్యుత్రులు కుమార్తె లుగా పుట్టిరి. కృశాశ్వుని శ్రేష్టమైన సురాయుధ ములు ప్రత్యంగిరసుని వలన జనించినవి. ప్రతియుగమునందును, సూర్యుని ఉదయాస్త మనముల వలె, వీరి ఉదయాస్త మన ములు (పుట్టుక, తిరోధానము) జరుగు చుండును.
దితికి క్యపుని వలన హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు అను కుమారులును, విప్రచిత్తి భార్యయైన సింహిక యను కుమార్తె యు జనించిరి. ఆమెకు రాహువు మొదలగు పుత్రులు పుట్టి సైంహినేయులని ప్రసిద్ధి పొందిరి.
హిరణక శిపునకు ప్రసిద్ధ మైన తేజస్సుగల అనుహ్లాదుడు, హ్రదుడు, గొప్ప విష్ణుభక్తుడైన ప్రహ్లాదుడు, సంప్రో గుడు అను నలుగురు పుత్రులు జనించిరి. ఫదుని పుత్రుడు పదుడు, ఆయుష్మంతుడు, శిబి సంప్రదుని కుమారులు ప్రహ్లాదుని కుమారుడు విరోచనుడు. విరోచనునకు బలి అను పుత్రుడు కలిగెను. బలికి నూర్గురు కుమారులు జనించిరి. వారిలో బాణుడు జ్యేష్ఠుడు.
పూర్వకల్పమునందు బాణుడు ఉమాపతిని అనుగ్రహింప చేసికొని ఆతనినుండి ఆతని సమీపముననే విహరించుట అను వరమును పొందెను.
స్వర్భానువునకు సుప్రథఆను కన్యయు, పులోమునకు కచియు జనించిరి. ఉపదనువు కుమార్తె హయశిరస్సు. వృషపర్వుని కుమార్తె శర్మిష్ఠ, పులోము కాలక అను ఇరువురును వైశ్వానరుని కుమార్తెలు. వారిద్దరును కశ్యపుని భార్యలు వారికి కోట్లకొలది పుత్రులు జనించిరి.
ప్రహ్లాదుని కులమునందు నాలుగు కోట్ల నివాతకవచులు పుట్టిరి. కశ్యపుని భార్యయైన రామకు ఆరుగురు కుమారులును కాకి, శ్యేని దాసి, గృధిక , శుచిగ్రీవ అను భార్యలకు కాకులు మొదలగునవి జనించినవి. తామవలననే ఆశ్వములును. ఒంటెలును. జనించినవి. వినతవలన ఆరుణుడును, ఆగరుడుడును పుట్టిరి. సురసనుండి వేయిసర్పములు పుట్టినవి. శేషుడు, వాసుకి, తక్షకుడు మొదలైన వేయిమంది కద్రువకు పు; తులు. వీరందరును కోరలుకలిగినవారు. చాల కోపము కలవారు. భూమిపై నివసించువారు. జలములో వీరు రెక్కలు కలిగియుందురు. సురభి (కామధేనువునందు) గోవులు, మహిష్యాదులును పుట్టెను. ఇక నుండి తృణాదులు పుట్టెను, ఆ కశ్యపమువలననే సయను అప్సరస యందు యతులు, రాక్షసులును, అరిష్టయందు గంధర్వులును జనించిరి. ఈ విధముగ కశ్యపుని నుండి చరాచర జగత్తు జనించి నది. వీరి పులాదులు అసంఖ్యాకులు ఒకప్పుడు దేవతలు దానవులను జయించిరి.
ఈ విధముగ పుత్రులు నశించగా దితి ఇంద్రుని సంహరింపగల కుమారుడు కావలెనని కోరుచు కశ్యపుని అను గ్రహింపచేసికొని ఆట్టి వానిని పొందెను.
ఆమె పాదప్రక్షాళనము చేసికొనకుండగనే నిద్రించెను. ఇంద్రుడు ఆ అవకాశ మును చూచుకొని ఆమె గర్భమును ఛేదించెను. వారు (గర్భఖండములు) గొప్ప తేజస్సు గలవారును, ఇంద్రునికి సాహాయ్యము చేయువారును అగు నలుబది తొమ్మండుగురు మరుత్తులను దేవతలుగా అయిరి (నవి).
హరియు, బ్రహ్మయు, పృథువును రాజ్యాభిషిక్తుని చేసి దీని నంతను ఆతని కిచ్చిరి. ప్రభువైన హరి క్రమముగ ఇతరులకు ఆయా రాజ్యాధికారముల నిచ్చెను.
బ్రాహ్మణులకును, ఓషధులకును చంద్రుడు రాజు. జలములకు వరుణుడు, రాజులకు వైశ్రవణుడు, సూర్యులకు - విష్ణువు, వసువులకు అగ్ని , మరుతులకు ఇంద్రుడు, ప్రజాపతులకు దకుడు, దానవులకు ప్రహ్లాదుడు, పితృదేవతలకు యముడు, భూతాదులకు శివుడు, శైలములకు హిమవంతుడు, నదులకు సముద్రుడు, గంధర్వులకు చిత్రరథుడు, నాగులకు వాసుకి, సర్పములకు తక్షకుడు, పక్షులకు గరుత్మంతుడు, గజేంద్రములకు ఐరావతము, గోవులకు వృషభము, మృగములకు పులి, వనస్పతులకు ప్లక్ష ము, ఆశ్వములకు ఉచ్చైశ్రవము ప్రభువులు తూర్పున సుధన్వ, దక్మిణమున శంఖ పదుడు, పశ్చిమమున కేతుమంతుడు, ఉత్తరమున హిరణ్యరోమకుడును పాలకులు. ఈ విధముగ అవాంతర సృష్టి (ప్రతి సర్గము) చెప్పబడినది.
ఆగ్ని మహాపురాణమున ప్రతి సర్గ వర్ణనమను ఏకోనవింశా ధ్యాయము సమాప్తము.
Summary of chapter 19 of the Agni Mahā Purana is as follows:
This chapter celebrates the Devī in her supreme form as the energy (śakti) that underlies all existence and all the deities. The narrative of the Devī's battles against the demons — Mahiṣāsura, Śumbha, Niśumbha — is summarised, with the Purāṇa affirming that the Goddess herself is the ultimate cause of both bondage and liberation. Her manifold forms — Durgā, Caṇḍikā, Kālī, Lakṣmī, Sarasvatī — are described as different expressions of a single supreme feminine power. The merit of reciting the Devī Mahātmya (Saptaśatī) and the protective power of the Goddess's names and hymns are affirmed. The chapter establishes the Śākta theological view alongside the Vaiṣṇava and Śaiva visions already presented.