నారదుడు పలి కెను : -
అన్ని ఫలములను ఇచ్చు దీక్షను చెప్పెదను. మండలమునందలి పద్మమునందు హరిని పూజించవలెను. దశమి యందు సమస్త మైన యాగ ద్రవ్యములను సమకూర్చుకొని, ఆచట ఉంచి, 'ఫట్' అనునది అంతముందు గల నారసింహ మంత్రముచేత ఆవాసాను నూరు పర్యాయములు అభినంత్రించి, వాటిని నలుమూలల చల్లవలెను.
అచట స్వత్మికయు, ప్రాసాదరూపిణియు అగు శక్తిని నిలుపవలేను. సాధకుడు శుభ మైన పాత్రయందు సమసౌషధు. ను ఉంచి నూరు పర్యాయములు వాసు దేవమం తముచే వికిరములను అభిమంత్రించ వలెను. పంచగవ్యమును నారా యణాన్తము లైన ఐదు మూలమూర్తులచే సంపాదించుకొని, దానిచే ఆ భూమిని కుశాగ్రములతో సంప్రోక్షించి, వాసుదేవ మంత్రముచే చిమ్ముచు, వెల్లిగితల ఉంచబడిన హస్తముతో మూడు ప్యూయములు విసిరివేయవలెను. తూర్పుగా తిరిగి విష్ణువును మనస్సులో ధ్యానించవలెను. వర్ధనితో కూడిన కుంభమునందు ఆంగసహితు డగు విష్ణువును పూజింపవలెను.
వర్ధనిని అస్త్రముచేతనే నూరు పర్యాయములు ఆభిపుంత్రించి, భిన్నము కాని ధారతో తడుపుచు ఈశాన్య దిక్కు వరకును తీసికొని వెళ్ళవలెను.
కలశమును వెనుకనుంచి తీసికొని వెళ్ళి వికిర ములపై స్థాపించవలెను. వికరములను దర్భలచేత పోగుచేసి కుంభేశుని కర్కరిని పూజించపలెను.
వస్త్రముతోడను పంచరత్నములతోడను కూడిన విష్ణువును స్థండిలము పై పూజించవలెను. అగ్నియందు కూడ పూజించి, పూర్వమునందు వలె మంత్రమును జపించి, పాత్రను కడిగి, మంచి సువాసన గల పద్మముచే లోపల తుడిచి, నేతితోను, గోక్షీరముతోను నింపి, వాసుదేవమంత్రముతో దానివై పు చూచి, పిచ్ముట సంకర్షణమంత్రముతో, సంస్కృతమైన క్షీరములో నెయ్యి పూసిన తండులములను పోయవలెను.
ప్రద్యుమ్న మంత్రముతో కలిపి గరిటిచేత మెల్లగా ఎనపవలేను. ఉడికిన తరువాత, గురువు అనిరుద్ధమంత్రముతో దింపవలెను. ఆ పాత్రను కడిగి, నారాయణమంత్రముతో, భస్మ చేత పాత్రకు ఊర్ధ్వపుండ్రము లుంచవలెను. ఈ విధముగ ఆ చరువును చక్కగా సంస్కరించవలెను.
ఒక భాగము దేవునకు, రెండవ భాగము కలశకు సమర్పించి, మూడవ భాగముచే మూడు ఆహుతులు చేయవలెను. నాల్గవ భాగమును గురువు శిష్యులతోకూడ భుజించవలెను. క్షీరవృక్షమునుండి దంత కాష్ఠమును గ్రహించి, దానిని నారాయణ మంత్రముచే ఏడు సార్లు అభిమంత్రించి పవిత్రము చేసి, దానిని నమలి విడువవలెను. తన పాప మంతయు ఈశాన్యదిగభి ముఖముగా పడిపోయినట్లు భావన చేయవలెను. శుభమైన నరసింహమంత్రముతో నూరు సార్లు హోమము చేసి, ఆచమనము చేసి, పూజా గృహము ప్రవేశించి, తూర్పున విష్ణువును స్థాపించి ప్రదక్షిణము చేయవలెను.
“భక్త వత్సలుడి వైన ఓదేవా! సంసార సముద్రమునందు మునిగి యున్న పశువుల పాపములను తొలగించుటకు నీ వొక్కడవే శరణము. ఓ! దేవదేవా! ప్రాకృతములై న పాశ బంధనముచే బద్దులైన ఈ పశువులను, నీ అనుగ్రహము వలన విముక్తులను చేసెను. ఆనుజ్ఞఇమ్ము.” అని విష్ణువును ప్రార్థించవలెను.
విష్ణువునకు ఈ విధముగా విజ్ఞాపన చేసి, పిమ్మట పశువులను ప్రవేశించి, పూర్వము చెప్పినట్లు ధారణలచేతను, జ్వలనాదికముచేతను సంశోధనముచేసి, సంస్కరించి, మూర్తి తో కలిపి, నేత్రములను బంధించి చూపవలేను. ఆచట పుష్పములతో నిండిన దోసిళ్ళను విసిరి, ఆ పేర్లను చేర్చవలెను. అచట వెనుక టివలే క్రమముగా మంత్రరహితముగా అర్చన చేయవలెను. పుష్పము ఏ మూర్తి పై పడునో ఆ మూర్తి యొక్క పేరు ఆతనికి పెట్టవలెను.
పాదాంగుష్టము మొదలు శిఖ వరకు పొడవు గల ఆరు పేట్ల ఎఱ్ఱటి దారమును, కన్యచేత - భేదింపచేసి, మరల దానిని మూడు పేటలు చేసి, దానిపై, ఏ, ప్రకృతిలో విశ్వము లీనమగునో, దేనినుండి జనించునో అట్టి ప్రకృతిని వివిధ ప్రక్రియలతో భావన చేయవలెను.
ఆ సూత్రముతో, ఎన్ని తత్వము లున్నవో అన్ని ప్రాకృతిక పాశములను ముడివేసి, దానిని మూకుడులో అగ్ని కుండపార్శ్వమునందుంచి, గురువు. ప్రకృతి మొదలు పృథివి వర కును ఉన్న ఆ తత్త్వములను సృష్టి క్రమానుసారము ధ్యానించుచు శిష్యుని శరీరముపై న్యాసము చేయవలెను.
వికృతుల క్రమము ప్రకారము నిఖిలమార్గమును పంచాంగములతో, తన్మాత్రాత్మకమగు మాయాసూత్రమైన పశువు శరీరమునందు ఉపసంహరించి, తత్త్వచింతకులు ఆచట ఐదు, పది, లేదా పండ్రెండు విధములచే ఆ గ్రథితమైన సూత్రమును పర్వ భేదముచే ఇవ్వవలెను.
తన ఇచ్ఛననుసరించి, సూత్రమునందును, దేహమునందును - ప్రకృతి, లింగశక్తి కర్త, బుద్ధి, మనస్సు, తన్మాత్రలు, జ్ఞానేంద్రియము, కర్మేంద్రియములు, పంచభూతములు.వీటినన్నింటిని, ద్వాదశాత్మను ధ్యానించవలెను. సృష్ట్య నులోమవిలోమక్రమములచే ఒక్కొక్క శతము హోమములు చేసి, పిమ్మట పూర్ణాహుతి. ఇచ్చి, మూకుడులో” సంపుటముగా చేసి, కుంభీశునకు నివేదనము చేయవలెను.
ఈ విధముగ, శాస్త్రానుసారముగా ఆధివాసితము చేసి; భక్తుడైన శిష్యునికి దీక్ష ఇవ్వవలెను. కరణి, కర్తరి, రజస్సులు. ఖటిక, ఇంకను ఉపయుక్తములైన వస్తువులు, వీటి నన్నింటిని ఆతని ఎడమ ప్రక్క దగ్గరగా ఉంచి, “మూల మంత్రముచే స్పృశించి, అధివాసితములు చేయవలెను.
హరిని స్మరించుచు “నమో భూతేభ్యః” అని భూతబలిని కుళముల పై ఇవ్వవలెను. పిదప వితానము (చందన) చేత, ఘటముచేత, లడ్డుల చేత మండలమును అలంకరించి, మండలముపై విష్ణువును . పూజింపవలెను. పిమ్మట ఆగ్నిని పూజించి పద్మాసనము కట్టి కూర్చున్న శిష్యులను పిలచి వారికి దీక్ష ఇవ్వవలెను.
విష్ణువును హస్తముచే ప్రోక్షించి, శిరస్సును స్పృశించి, క్రమముగా ప్రకృతి మొదలు వికృతుల వరకును గల, అధిభూతాధి దైవతములతో కూడిన సృష్టినిగూర్చి మనస్సులో భావనచేసి దానిని మరల క్రమముగా ఉపసంహరించి, ఆసృష్టి యంతయు తన్మాత్రలుగా అయిపోయినట్లును, జీవునితో సమానమైననట్లును భావన చేయవలెను.
పిమ్మట గురువు కుంభేశుని ప్రార్థించి, సూత్రమును ప్రోగుచేసి, అగ్ని దగ్గరకు వచ్చి, దానిని అగ్ని పార్శ్వము నందుంచి, సృష్టికి అధిపతియైన ఆ అగ్నిని మూలమంత్రముతో నూరు అహుతులతోను, పిమ్మట పూర్ణాహుతితోను పూజించ వలెను. మూలమంత్రముతో నూ-రుసార్లు అభిమంత్రించిన తెల్లనిరజస్సుతోహృదయతాడనము చేయవలెను, వియోగపద సంయుక్త ములును, పాదాదీంద్రియ ఘటితములును, బీజయుక్తములును అగు వాక్యములతో క్రమముగా పృథి వ్యాది తత్త్వ విశ్లేషణము చేసి హోమము చేయవలెను.
పండితుడు అఖిలతత్వములకును నిలయమైన వహ్నియందును, వ్యాహృతుడగు హరియందును సమస్తమైన అర్చనామార్గము క్రమముగ ఉంచబడుచున్నట్లు స్మరింపవలెను. తాడనముచే విడదీసి, గ్రహించి, శమింపచేసి ప్రకృతిచే స్వీకరించి, పూర్వోకమైన అగ్నియందు హోమము చేయవలెను.
గర్భాధానమును, జాతకర్మను, భోగమును, లయమును, ఆ అగ్నియందే ఎనిమిది హోమములు చేసి, పిమ్మట శుద్ధహోమము చేయవలెను.
గురువు శుద్ధతత్త్వమును గ్రహించి, దానిని ఆవ్యాకృతమువరకును క్రమముగ పూర్ణాహుతిచే పరతత్త్వము నందు హోమము చేయవలెను.
పండితుడు, జ్ఞానయోగముచేత ఆ పరమును పరమాత్మయందు విలీనముచేసి, బంధ విముక్తుడై జీవుడు శుద్దము, జ్ఞానస్వరూపము, నిర్వికారము, పరమానందరూపము అగు పరమాత్మయందు ఆనందము పొందు చున్నట్లు భావింపవలెను. పిమ్మట పూర్ణాహుతి ఇవ్వవలెను. ఈ విధముగా దీక్ష పూర్తి యగును.
దీక్షా-హోమ- విలయముల కుపయుక్తము లగు యోగమంతములను చెప్పెదను. ఓం యం భూతాని విశుద్ధం హుం ఫట్ అను మంత్రముచే తాడనమును, వియోజనమును చేయవలెను.
“ఓం యం భూతాన్యాపాతయేఒహమ్” అను మంత్రముచే ఆదానము చేయవలెను. ప్రకృతితో యోజనము చేయు మంత్రమును వినుము, “ఓం యం భూతాని పుంశ్చాహో” అనునది ప్రయోజన మంతము.
హోమ మంత్రమును, పిమ్మట పూర్ణాహుతి మంత్రమును చెప్పెదను- “ఓం భూతాని సంహర స్వాహా” అనునది హోమమంతము “ఓం శ్రీం ఓం నమోభగవతే వాసుదేవాయ వౌషట్” అనునది పూర్ణాహుతి మంత్రము. పూర్ణాహుత్యనంతరము తత్త్వమునందు శిష్యుని సాధించవలెను. ఈ విధముగా బుధుడు కమముగ సర్వతత్త్వ సంశోధనము చేయవలెను.
నమః అనునది అంతమునందుగల ఆయా తత్త్వముల బీజములతో తాడనాది పూర్వకముగా తత్వసంశోధనము చేయవలెను. “ఓం వాం కర్మేస్ట్రియాణి నమః ఓం దేం బుద్దింద్రియాణి నమః' ఇత్యాది విధమున చేయవలెను. తాడనాది ప్రయోగము 'యం' బీజముతో చేసినట్లే చేయవలెను.
ఓం సుగతన్మాతే వియుజ హుం ఫట్ ఓం సంపాహి స్వాహా” అనునది గంధరన్నా తా వియోజన మంతము. “ఓం స్వం స్వర యజ్వ హకృత్యా' అనునది పకృతి సంయోజన మంతము, . “ఓం సుం హుం గన్డే తన్మాతో సంహర స్వాహా'' అనునది సంహార మంతము, పిమ్మట పూర్ణాహుతి చేయవలెను. మిగిలినవాటి , విషయమున గూడ ఇడ్లి చేయవలెను. “ఓం రసతన్మాతే” మొదలు “ఓం ఓం పకృతౌ” అను దానివరకును ఉన్న ఎనిమిది యతత్త త్ర్పయోగాలలో ఉపయోగించు మంత్రములు. ఇది ఏకమూర్తి విషయమున సంపూర్ణముగ చెప్పబడిన దీక్షా విధానము. నవ వ్యూహాదికమునందు కూడ ప్రయోగ మిట్లే అని చెప్పబడినది.
నరుడు ప్రకృతిని దహించి దానిని పరమ నిర్వాణమునందు చేర్చవలెను. నరుడు ప్రకృతిని అవికారుడగు ఈశ్వరునితో చేర్చవలెను. పిమ్మట భూతశుద్ధి చేసి బుద్ధాఖ్యములగు కర్మాంగములను, పిన్ముట తన్మాతలను, మనస్సును జ్ఞానమును, ఆహంకారమును శోధించవలేను.
అంతమునందు లింగాత్మశోధనము చేసి చురల ప్రకృతి శోధనము చేయవలెను. పరిశుద్దుడును, ఈశ్వరధమ మున నున్న పాడును, అన్ని భోగములను తస గోచరము చేసికొనినవాడును, ముక్తి యందు స్థితి సంపాదించినవాడును అగు పాకృత పురుషుని ధ్యానించుచు పూర్ణాహుతిని ఇవ్వవలెను. ఇది అధికారికి సంబంధించిన దీక్షా విధానము.
మంత్రాoగమలచే ఆరాధనచేసి తత్త్వముల సముదాయమును సమముగా నుండునట్లుచేసి ఈఎధముగ సకరమముగా విశోధనముచేసి, అంతమునందు సర్వసిద్ధి సమన్వితుని ధ్యానించుచు పూర్ణాహుతి ఇవ్వవలెను. ఇది సాధకుడు చేయవలసిన దీక్షా పద్ధతి దీక్షా పద్ధతి.
ద్రవ్యములను కూర్చుకొనుటకు సామర్థ్యము లేకపోయినచో, లేదా తనకు శక్తి లేకపోయినచో, దేశికోత్త ముడు పూర్వము చెప్పినట్లు సర్వోపకరణసహితు డగు దేవుని ఆరాధించి వెంటనే శిష్యునకు ద్వాదశియందు దీక్ష ఇవ్వవలెను.
భక్తుడును, వినయవంతుడును, సమస్త మైన శారీర గుణములు కలవాడును అగు శిష్యుడు ఆధిక ధనవంతుడు కానిచో ఆతనికి స్థండిలాభ్యర్చన చేయించి దీక్ష ఇవ్వవలెను.
గురువు, సమస్త మైన దైవమార్గమును గాని, ఆధ్యాత్మికముగా భావన చేయబడిన భౌతిక మార్గమునుగాని, శిష్యుని దేహముపై ధ్యానించి, ముందుగా వాసుదేవాది దేవతలను, అగ్ని మొదలై నవారిని, కమముగ వారి వారి మతములతోఎనిమిదేసి ఆహుతులచేత తృప్తి పరచిపరము చేయవలెను.
పిమ్మట సంహార క్రమమమున హోమముచే శోధనము చేయవలెను. శిష్యుని దేహముపై కట్టిన కర్మరూప సూత్రములను విడిపించి, వాటిని ఒకచోట పోగుచేసి, తత్వ శోధనము చేయవలెను. ప్రాకృతికాగ్నియందును, ఆధిదై విక విష్ణువు నందును లయముచేసి, అశుద్ధులతో కూడిన తత్త్వమును పూర్ణాహుతిచే శుద్ధము చేయవలెను.
ప్రాకృతిక గుణములను దహించి శిష్యుడు ప్రకృతిష్ణుడైన పిమ్మట గురువు ఆతనిని విముక్తుని చేయవలెను; లేదా శిశువులను ( శిష్యులను) అధికారమునందు నియుక్తులను చేయవలెను.
లేదా గురువు భావస్థితుడై మరియొక శ క్తిదీక్ష యైన చేయవలెను. యతులు గాని, నిర్ధనులు గాని భక్తి పూర్వకముగ తన నాశ్రయించి నపుడు స్థండిలము పై విష్ణువును పూజించి, శిష్యని పార్శ్వమునందే కూర్చుండ బెట్టవలెను. శిష్యుడు దేవతాభిముఖుడుగా ఉండగా గురువు ముఖమును ఆడ్డముగా , త్రిప్పి కూర్చుండవలెను. స్యీయపర్వములతో వికల్పిత మైన సకలాధ్వమును శిష్యునిదేహము పై ధ్యానించి పిమ్మట ఆధిదై వికఫూజ చేయవలెను. ధ్యానయోగముచే చింతించి, వెనుక చెప్పిన విధమున తాడనాంకముచే క్రమముగ స్థండిలము పై నున్న హరియందు సకలతత్వసంతోఢనము చేయవలెను.
పిమ్మట తాడనముచేత విడిపించి, తత్పరత్వముతో తనలో గ్రహించి, దేవునితో సంబంధింప చేసి, పరిశోధనము చేసి, దేవస్వరూపమున గ్రహించి, శుద్ధఖవము తో తీసికొని వచ్చి, క్రమముగ సంధింపడేసి, డ్యానగము నవలంబించి జ్ఞానముద్రతో శోదిం పవలెను.
సర్వతత్వములును శుద్ధము లే న పిన్ముట ప్రధానుడగు ఈశ్వరుడు మాత్రము ఉండగా, శిష్యులను(పాశములను) దహించి నిర్వాసితులను చేయవలెను. ఈశ్వరస్థానమున వారిని నియుక్తులను చేయవలెను. లేదా దేశికోత్తముడు సాధకుని కొద్దిమార్గమును పొందింపచేయవలెను.
అధికారము గల గృహస్థుడు ఈ విధముగ కర్మాచరణ విషయమున ఆలసత్వము లేనివాడై, రాగము క్షీణించు వరకును ఆత్మశోధకము చేసికొనుచు ఉండవలెను.
తన కున్నరాగము క్షీణించిన దను విషయము గుర్తించి, పాపము లన్నియు తొలగిన ఆతడు పుత్రునకు గాని శిష్యునకు గాని అధికారము అప్పగించి, సంయమియై, మాయామయ మగు పాశమును దహింపచేసికోని, సన్యాసము స్వీకరించి, ఆత్మ చింతాపరాయణుడై, తన స్థితిని ఇతరులకు వ్యక్తముచేయక శరీరపాతమునకై (మరణమున కై) వేచి యుండవలెను.
అగ్ని మహాపురాణములో సర్వదీక్షాకథన మను ఇరువదిఏడవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 27 of the Agni Purāṇa is as follows:
The twenty-seventh chapter provides a complete ritual manual for the Grahayajña — the fire sacrifice performed for the propitiation of the nine planets (navagraha-s): Sūrya, Candra, Maṅgala, Budha, Bṛhaspati, Śukra, Śani, Rāhu, and Ketu. For each graha, the chapter specifies the deity form, the sacred wood (samidha) for offering, the specific grain or substance to be poured into the fire, the mantra (including Gāyatrī variants for each planet), the color of flowers and cloth to be offered, and the number of oblations. The eight-petaled maṇḍala arrangement of the nine planets in the fire altar is described. The chapter concludes with the merit of the Grahayajña — removal of planetary afflictions, health, prosperity, victory in disputes — and the injunction to repeat the sacrifice annually.