పరమేశ్వరుడు చెప్పెను. రుద్రాక్ష కటకమును ధరించవలెను. రుద్రాక్షల సంఖ్య విషమముగా వుండవలెను. యవి సమములు గను దృఢవలు గను వుండవలెను. ఏక ముఖమును గాని, త్రిముఖమును గాని, పంచ ముఖమును గాని, యథాలాభముగా ధరించ వచ్చును. ద్విముఖ చతుర్ముఖ షణ్ముఖి రుద్రాక్షలు కూడా ప్రశస్తములే. బద్దలగుట కాని పురుగు దొలుచుట కాని కలుగుటచే క్షతములు కాకూడదు. వాటిపై కంటకము లుండవలెను. దక్షిణ భుజ శిఖాదుల పై చతు ర్ముఖి రుద్రాక్షను ధరించవలెను. అట్లు చేయుటచే బ్రహ్మ చారి బ్రహ్మ చారి యగును. అస్నాతకుడు కూడ స్నాతు డగును. లేదా శివమంత్రముతో పూజించి సువర్ణాంగుళీయక మును కుడి చేత ధరించవలెను. శివశిఖాజ్యోతి సావిత్రములు ఈ సాలు గును గోచరములు. గోచరమునకు కులము యని అర్థము. దీక్షితుడు దీనిని లక్ష్యము కొనవలెను. ప్రాజాపత్య మహీపాల కపోత గ్రంథికులు శివ కులమునకు చెందిన వారు. కుటిల పేతాల పద్మ హంసలు శిథాకులమునకు చెందిన వారు. ధృతరాష్ట్ర బక, కాక, గోపాలులు జ్యోతి కులమునకు చెందిన వారు. కుటికా సాఠర, గుటికా దండులు సావిత్రి కులమునకు చెందిన పారు. ఈ విధముగా ఒక్కొక్క కులమున నాలుగేసి భేదములున్నవి.
ఉత్తమ మంత్ర సిద్ది నిచ్చు సిద్దాది ఆంశములను చెప్పెదను. కూట యంత్ర రహితము దిగు మాతృకాక్షరములను నేలపై వ్రాయవలెను. యంత్రాక్షరములమ వేరువేరు చేసి అనుస్వారమును వేరు చేయవలెను. సాధకుని నామము నందలి అక్షరములను కూడా చేయవలెను. మంత్రము యొక్క ఆద్యంత ఆక్షరము లందు సాధకుని నామాక్షరములు చేర్చి సిద్ధమని సాధ్యము సుసిద్ధము ఆరి యను సంజ్ఞలను అనుసరించి అక్షరములను క్రమముగా లెక్క పెట్టవలెను. మంత్రము యొక్క ఆద్యంతము లందు సిద్దము వున్నచో ఆది నూటికి నూరు పాళ్ళు సిద్ధిదాయకము, ఆద్యంతము లందు సిద్ధి కలది వెంటనే సిద్ధి నిచ్చును. ఆద్యంతము లందు సుసిద్ధమున్న చో ఆ మంత్రమును కూడ సిద్దముగ గ్రహించవలెను. ఆద్యంతములందు ఆరి వున్నచో ఆ మంత్రమును పరిత్యజించవలెను. సిద్దము యనునవి కూడ తుల్యములే. మంత్రము యొక్క ఆద్యంతాక్షరము లందు సిద్ధమున్న చో మధ్య వేల కొలది ఆరి అక్షరములున్నను దోషకారకము కాదు. మాయ బీజము, ప్రాసాద బీజము ప్రణవము వీటి యోగముచే విఖ్యాత మంత్రము నందు క్రమముగా బ్రహ్మ విష్ణు రుద్రాంకక ములు ఏర్పడును. బ్రహ్మం శకము బ్రహ్మ విద్య యనియు, విష్ణ్వ వంశకము వైష్ణవమనియు రుద్రాంశకము వీరమనియు చెప్పబడును. ఇంద్రాంశక మంత్రము ఈశ్వర ప్రియము నాగాంశ మంత్రము నాగములవలె స్తబ్ద నేత్రము యతాంశ మంత్రము భూషణ ప్రియము, గంధర్వాంశ మంత్రము, అతి గీతాది ప్రియము, భీమాంశ , రాక్షసాంశ దైత్యాంశ మంత్రములు యుద్ధ కారకములు. విద్యా ధరాంశ మంత్రము అభిమానదము. పి చాంగ మంత్రము మలాక్రాంతము. మంత్రమును పూర్తిగా పరీక్షించి ఉపదేశ ము చేయవలెను ఏకాక్షర మంత్రము మొదలు అనేకాక్షర మంత్రముల వరకు చివర వట్ చేర్చినచో యది మంత్ర మని చెప్ప బడును. ఏబది అక్షరముల వరకు వున్న మంత్రము “విద్య”. ఇరువది అక్షరముల వరకు వున్నది “బాలావిద్య”. ఇరు వది అక్షరముల వరకు వున్న అస్త్రాంత మంత్రము “రుద్ర”. అంతకుమించి మూడు వందల అక్షరముల వరకు వున్న మంత్రమునకు వృద్ధ యని పేరు. మంత్రములలో “అకారము” మొదలు హ కారము వరకు వున్న అక్షరము లుండును. మంత్రము లందు క్రమముగా శుక్ల కృష్ణ పక్షము లుండును. అనుస్వార విసర్గలు విడిచి స్వరములు పది. హ్రస్వ స్వర ములు శుక్ల పక్షము. దీర స్వరము కృష్ణ పక్షము. ఇవియే ప్రతిపదాది తిథులు. శాంతి కార్యములను ఉదయ కాలము నందును, వశీకరణ కర్మలను భ్రమిత కాలము నందును ద్వేషణ ఉచ్చాటన కర్మలను భ్రమిత కాలము నందు సంధ్యా ద్వయము నందును స్తంభన కర్మలను సూర్యాస్తమయ కాలమునందును చేయవలెను. ఇడానాడి చరించునపుడు శాంతిక కర్మలని పింగళానాడి చలించునపుడు ఆకర్షణ కర్మలు చేయవలెను విషమ తలముక మారణ ఉచ్చాటనాది పంచకర్మలు వేరు వేరుగ చేయవలెను. అధర గృహమున పృథివియు, ఊర్ధ్వ గృహమున తేజస్సు మధ్య జలము చెప్పబడినవి. రంధ్రములు ఎచ్చట వుండునో అచటను, బాహ్య పార్శ్వము లందును వాయువు లోపటి పార్శ్వము లందు ఆకాశము వుండును. పార్థి వాంశము నందు స్తంభనము జలీయాంశము నందు శాంతి కర్మ తై జశాంసము నందు వశీకరణము, వాయువు నందు భ్రమణము ఆకాశము నందు పుణ్య కర్మయు చేయవలెను.
అగ్ని మహా పురాణము నందు ఆగ్నే యాంశకాది వర్ణన మను మూడు వందల ఇరువది యైదవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 326 of the Agni Purāṇa is as follows:
The rites for consecrating village deities and protective divinities are described. Agni explains the distinction between the great temple deities installed with full āgamic rites and the protective village deities (kṣetrapāla, grāma-devatā) installed at the boundaries of settlements. The materials for the mūrti — wood, stone, clay, or metal — and the appropriate forms for each deity class are specified. The prāṇapratiṣṭhā ceremony, in which life-force is ritually infused into the image, is outlined step by step, along with the subsequent daily pūjā obligations of the community. The chapter stresses that a properly installed deity protects the village from drought, disease, and invasion.