ఆగ్ని పలికెను - ఇపుడు విష్ణువుయొక జగత్సృష్టి మొదలగు క్రీడను గూర్చి చెప్పెదను, వినుము. స్వర్గాడు లను నిర్మించిన అతడే సృష్టికి ఆది యైనవాడు ఆతడు గుణములు కలవాడు, నిర్గుణుడు కూడ.
ప్రారంభమున సద్రూప మైన బ్రహ్మయే ఆవృత్తావస్థలో ఉండెను. ఆకాశము గాని, రాత్రి గాని, పగలు కాని లేకుండెను. (ఆ బ్రహ్మ) ప్రకృతిని, పురుషుడైన విష్ణువును ప్రవేశించి క్షోభింపచే నెను.
సృష్టి సమయమున ఆ ప్రకృతి పురుషుల క్షోభవలన మహత్తత్వము జనించెను. దానినుండి అహంకారము జనించెను. ఇంద్రియాది వికారములకు కారణమైన అహంకారము తై జనము. పంచభూతములకు కారణమైనది తామసము.
అహంకారమునుండి శబ్దతన్మాత్రరూప మైన ఆకాశము, దానినుండి స్పర్శతన్మాత్ర రూప మైన వాయువు, దానినుండి రూపతన్మాత్రరూప మైన అగ్ని, దానినుండి రసత న్మాత్రరూప మైన ఉడక ము, దానినుండి గంధతన్మాత్రరూప మైన పృథివియు జనించెను. ఇవన్నియు తామసాహంకార ము నుండి జనించెను. పిదవ తైజసాహంకారము నుండి తై జస మైన ఇంద్రియములు పది వై కారిక దేవతలు, పదకొండవ ఇంద్రియ మైన మనస్సు పుట్టినవి. పిమ్మట భగవంతు డైన బ్రహ్మ వివిధ ప్రజలను సృజింప దలచినవాడై, ముందుగా జలమును సృజించెను. దానియండు. తన వీర్యమును విడచేను. ఉదక మునకు నారములు అని పేరు. ఆవి నరుని వలన పుట్టెను కదా. పూర్వము నారములు అనగా ఉదకములు , నరునకు స్థాన మాయెను. అందుచే ఆతడు నారాయణుడని చెప్పబడెను.
ఉదకములో నున్న ఆ వీర్యము బంగారు వర్ణము గల అండముగా ఆయెను. దానియందు స్వయంభు బ్రహ్మ జనించె నని మేము వింటిమి.
భగవంతుడైన హిరణ్యగర్భుడు ఆ ఆండము నందు పరివత్సరము కాల ముండి, దానిని రెండు వక్కలు గా చేసి ద్యులోకమును, భూలోకమును నిర్మించెను ఆ రెండు ప్రక్కల మధ్యయందు ఆకాశమును సృజించెను. ఉదకము నందు తేలుచున్న భూమిని, పది దిక్కులను సృజించెను. అచట కాలమును, మనస్సును, వాక్కును, కామమును, క్రోధ
శ్రీమదగ్ని మహా పురాణము మును, మరియు రతిని నిర్మించేను. ప్రజాపతి, ఈ రాబోవు సృష్టిని పైన శ్పైన ఆకాళాదులతో సుబంధించిన దానినిగా చేయదలచి, ముందుగా వాటిని సృజించెను.
మేఱుపులను, వజ్రమును (పిడుగును), మేఘములను, ర కమును, ఇంద్రధనస్సును లేదా ఎఱ్ఱని రంగుగల ఇంద్రధనుస్సులను, పక్షులను - వర్జన్యుని -సృజించెను. పిదప యజ్ఞసిది కౌర కై ముఖము నుండి ఋగ్యజుఃసామవేదములను సృజించెను.
ఆ వేదములచే సాధ్యులను, దేవతలను ఉద్దేశించి యజ్ఞము చేసెను. అనేక విధము లగు భూతములను సృజించెను. భుజమునుండి సనత్కుమారుని, క్రోధమునుండి రుద్రుని సృజించెను. మరిచి, అత్రి, అంగిరసుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, వసిష్ఠుడు అనువారిని నృజించెను. ఈ ఏడుగురును బహ్మమానసపుతు లగు బ్రహ్మ అని ప్రసిద్ది చెందిరి. ఈ సప్త బ్రహ్మల ను, రుద్రులును ప్రజాసృష్టి చేసిరి.
తన దేహమును రెండు భాగములుగా చేసి, ఒక భాగము పురుషుడు గాను, మరొక భాగము స్త్రీగాను ఆయి బ్రహ్మ ఆమె యందు ప్రజలను సృజించెను.
అగ్ని మహాపురాణమునందు జగత్సృష్టివర్ణన మను సప్తదశాధ్యాయము సమాప్తము.
Summary of chapter 17 of the Agni Mahā Purana is as follows:
This chapter traces the Lunar dynasty (Candravamśa) from Brahmā through Atri, Candra (the Moon), Budha, and Purūravas, down to the lineage of the Pāṇḍavas and Kauravas. The story of Purūravas and the apsarā Urvaśī is included as a celebrated episode within this genealogy. The Yadu lineage — from which Bhagavān Kṛṣṇa was born — is traced in detail. Key kings such as Nahuṣa, Yayāti, Pūru, Kuru, and Śantanu are named in succession. The chapter situates both the Mahābhārata and the Kṛṣṇa narratives within a continuous genealogical framework, demonstrating that Bhagavān's descents always occur within the stream of dharmic kingship at the precise moment of cosmic need.