నారదుడు చెప్పెను: రాముడు పంపగా అంగదుడు వెళ్ళి రావణునితో ఇట్లు చెప్పెను. “వెంటనే సీతను రామునకు ఒప్పగించుము. కానిచో మరణించగలవు”.
యుద్దమునకై ఉద్దతులైన రాక్షసులు గల రావణుడు ఆతనిని చంపుటకు ప్రయత్నించెను. అతడు తిరిగివచ్చి. “దశగ్రీవుడు యుద్ధమును మాత్రమే కోరుచున్నాడు” అని రామునితో చెప్పెను.
ఆ మాట విని రాముడు వానరసమేతుడై లంక చేరెను. హనుమంతుడు, మైందుడు, ద్వివిదుడు, జాంబవంతుడు, నలుడు, నీలుడు, ఆరుడు, అంగద-ధూమ- ను షేణులు, కేనరి, గజ - పనస - వినత - రంభ - శరథ క్రథనులు, జల శాలియైన గవానుడు, దధివక్త్ర - గవయ - గంధమాదనులు, తదితర వనరులును వెళ్లిరి. వీరితోడను, ఆనంఖ్యాకులగు ఇతర వానరులతోడను కూడిన సుగ్రీవుడు కూడ వెళ్ళేను.
వానర రాక్షసుల మధ్య సంకుల యుద్దము కొనసాగెను. రాక్షసులు బాణములు, శక్తులు, గదలు మొదలగు వాటితో వానరులను కొట్టిరి. వానరులు, గోళ్ళు దంతములు, శిలలు మొదలగు వాటితో వానరులను కొట్టిరి. రాక్షసుల ఏనుగులు, గుఱ్ఱములు, రథములు, కాలిబంటులు ఈ రూవములో నున్న సైన్యము చంపబడెను.
హనుమంతుడు శత్రువైన ధూమ్రానుని పర్వతశిఖరముతో చంపెను. నీలుడు యుద్ధము చేయుచున్న ఆకంపన. ప్రహస్తులను చంపెను.
గరుత్మంతుని దర్శనముచే ఇంద్రజిత్తు ప్రయోగించిన తరబంధమునుండి విముక్తులైన రామలక్ష్మణులు బాణము లతో రాక్షన సైన్యమును సంహరించిరి.
రణరంగమున రాముడు బాణములచే రావణుని జర్జరశరీరునిగా చేసెను. రావణుడు దుఃఖితుడై కుంభకర్ణుని మేల్కొలిపెను.
నిద్రనుండి లేచిన కుంభకర్ణుడు వేయి కడవల మద్యము త్రాగి మహిషాదిమాంనము భుజించి రావణునితో ఇట్లు పలికెను.
కుంభకర్ణుడు పలికెను. నీవు సీతాహరణమను పాపకార్యము చేసితివి. అయినను నీవు నాకు అన్న తాన యుద్దమునకు వెళ్లి వానర సహితుడైన రాముని సంహరించెదను.
కుంభకర్ణుడి విధముగ పలికి వానరులందరిని మర్దించెను. ఆతడు సుగ్రీవుని పట్టుకొనగా, సుగ్రీవుడు వాని చెవు లను, ముక్కును, కొరికి నెను. చెవులు ముక్కులేని ఆతడు వానరులను భక్షించెను. పిమ్మట రాముడు బాణములతో కంభ కర్ణుని బాహువులను, పాదములను ఛేదించి ఆతని శిరస్సు నేల పై పడవేసెను.
పిమ్మట రామలక్ష్మణులును, వానరులును, విభీషణుడును కుంభ - నికుంభ - మకరాక్ష - మహోదర - మహాపార్శ్వ - మత్త - ఉన్మత్త - ప్రఘన - థానకర్ణ - విరూపాక్ష - దేవాంతక - నరాంతక, త్రిశిరన్కా - అతికాయులను రాక్షసులను, యుద్దము చేయుచున్న ఇతర రాక్షసులను సంహరించిరి.
మాయతో యుద్ధము చేయుచు ఇంద్రజిత్తు రామాదులను వరలబ్దములైన నాగబాణములచే బంధించేను. హను మంతుడు తాను తీసికొనివచ్చిన పర్వతము పై ఉన్న విశల్యయను ఓషధి చేత రామలక్ష్మణులను శల్యరహితులను చేసి ఆ పర్వతమును దాని చోట ఉంచెను.
నికుంభిలలో హోమాదికము చేయుచున్న ఆ ఇంద్రజిత్తును లక్ష్మణుడు బాణములతో సంహరించేను. రావణుడు శోకసంతప్తుడై సీతను చంపుటకు ఉద్యమింపగా అవింధ్య వారించెను. అతడు సేనాసమేతుడై రథము నెక్కి యుద్ధమునకై వెళ్ళెను.
ఇంద్రుడు పంపగా మాతలి వచ్చి రాముని రథారూఢుని చేసెను. రామరావణుల యుద్దమునకు రామరావణ యుద్ధమే సాటి. రావణుడు వానరులను కొట్టగా, హనూమదాది వానరులు రావణుని కొట్టిరి.
రాముడు మేఘము వలె ఆ రావణుని పై అస్త్రాస్త్రములను కురిపించెను. ఆతని ధ్వజమును భేదించి, రథమును లగ్నము చేసి గుఱ్ఱములను, సారథిని చంపి, ఆతని ధనస్సును, బాహువులను, శిరస్సులను ఛేదించెను. కాని ఆతని శిరస్సు మరల మరల మొలుచు చుండెను. అపుడు రాముడు బ్రహ్మాస్త్రముచే ఆతని హృదయమును భేదించి నేల పై కూల్చెను. రాక్షసుల నందరిని కూడ పరిమార్చెను. స్త్రీలు విహత భర్తృకలై ఏడ్చిరి.
రాముని ఆజ్ఞచే విభీషణుడు ఆ స్త్రీలను ఓదార్చేను. రాముని పూజించెను. రాముడు హనుమంతుని ద్వారా సీతను రప్పించి, అగ్ని ప్రవేశముచే రుద్దురాలగు ఆమెను స్వీకరించెను. ఇంద్రాది దేవతలును, బ్రహ్మయు, దశరథుడును “నీవు రాక్షససంహారివైన విష్ణువే” ఆని ఆతనిని స్తుతించిరి. రాముడు కోరగా ఇంద్రుడు అమృతము కురిపించి వానరులను పునరుజ్జీవితులను చేసెను.
ఆ దేవతలు యుద్దము చూచి రామునిచే పూజితులై స్వర్గమునకు వెళ్లిరి. రాముడు వానరులను గౌరవించి, లంకా రాజ్యమును విభీషణున కిచ్చెను.
సీతాసమేతుడై పుష్పకమునెక్కి, సంతసించిన మనస్సు కలవాడై, సీతకు వన ములను, దుర్గమ భూములను చూపుచు, వచ్చిన మార్గముననే అయోధ్య వైపు తిరిగి వెళ్లెను.
భరద్వాజునకు నమస్కరించి అచట నుండి నందిగ్రామమునకు వెళ్లి, భరతునిచే నమస్కరింపబడినవాడై అయోధ్యకు వెళ్ళెను.
వసిష్ఠాదులకు నమస్కరించి, కౌనల్యా-కై కేయి-సుమిత్రలకు కూడ సమస్కరించి, రాజ్యమును పొంది బ్రాహ్మణులను పూజించెను.
పిమ్మట ఆశ్వమేధయాగములచే వాసుదేవుడైన తనను తానే ఆరాధించెను. సర్వదానములను ఇచ్చెను. ప్రజలను పుత్రులను వలె పాలించెను. దుష్టులను నిగ్రహించుటయందు ఆసక్తుడై ధర్మకామాదులను పాలించెను.
రాముడు రాజ్యమును పాలించిన కాలమున ప్రజలందరును తమ ధర్మములను పాలించుటయందు ఆసక్తులైరి. ఆకాలమరణము చెందినవాడెవ్వడును లేకుండెను.
అగ్ని మహాపురాణమున, రామాయణమునందలి యుద్ధకాండవర్ణనమను దశమాధ్యాయము నమాప్తము.
Summary of chapter 10 of the Agni Purāṇa is as follows:
Hanūmān leaps across the ocean to Laṅkā, discovers Sītā in the Aśoka grove, delivers Rāma's ring as token, and offers to carry her back — an offer Sītā declines, preferring Rāma to come and defeat Rāvaṇa himself. Hanūmān burns Laṅkā before returning. Rāma builds the great causeway across the ocean with the aid of Nala and Nīla. The chapter then summarises the epic battle: the slaying of many rākṣasa commanders including Indrajit and Kumbhakarṇa, Lakṣmaṇa's wounding and revival by the Saṃjīvanī herb, and finally the death of Rāvaṇa at Rāma's hands. Sītā's agni-parīkṣā, the return to Ayodhyā in the Puṣpaka vimāna, and Rāma's coronation conclude the summary. Rāma's reign — Rāmarājya — is celebrated as the golden age of dharma.