అగ్ని దేవుడు చెప్పెను. వసిస్టా! అగస్త్య మహర్షి సాక్షాత్తు విష్ణుస్వరూపుడు. ఆతని పూజ చేసినవాడు శ్రీమహా విష్ణు సన్నిధి చేరును. సూర్యుడు కన్యారాశి చేరక ముందు, దానికి దగ్గరగా నున్న పుడు 3 1/3 రోజులు ఉప వాసముండి, అగస్త్య పూజ చేసి, ఆర్ఘ్యము ఇవ్వవలెను. మొదటి దినమున నాలుగు గంటలు పగటి భాగము మిగిలి యుండగా వ్రత ప్రారంభము చేసి, ప్రదోషకాలమున కాశ పుష్పమయ మగు ఆగస్త్యుని మూర్తి కలశముపై స్థాపించి, మూర్తి పూజ చేయవలెను. ఆర్ఘ్యము నిచ్చువాడు రాత్రి జాగరణము చేయవలెను; “ముని శ్రేష్టుడవైన ఆగస్త్యా! నీవు తేజో రాశివి. మహాబుద్ధి మంతుడవు. నీ భార్యయగు లోపాముద్రతో కలిసి వచ్చి- నేనిచ్చు పూజను గ్రహింపుము”అని అగస్త్యుని ఆవాహనము చేసి, గంధ-పుష్ప-ఫల-జలాదులతో అర్ఘ్యము సమర్పించవలెను. పిదప ముని శ్రేష్టుడైన అగస్త్యుని వైపు తిరిగి చందనాద్యుయపచారములతో పూజించవలెను. రెండవ రోజున ప్రాతఃకాలమున కలశ స్థిత - అగస్త్య మూర్తి ని ఏదైన జలాశయము వద్దకు తీసికొని పోయి, ఈ విధముగ చెప్పుచు అర్ఘ్యము సమర్పించవలేను. “కాశ పుష్పము వలె ప్రకాశించు వాడా! అగ్నివాయు సంభూతుడా! మిత్రావరుణ పుత్రా! కుంభసంభవా! ఆగస్త్యా! నీకు నమస్కరించుచున్నాను. ఆలాపి వాతాపు లను రాక్షసులను భక్షించిన వాడవును, సముద్రమును ఎండింప చేసిన వాడవును అగు అగస్త్యా! నా ఎదుట సాక్షా త్కరించుము. నేను మనోవాక్కాయములతో అగస్త్యుని ప్రార్థించుచున్నాను. ఉత్తమ లోక ప్రాప్త్యాశ చే అగస్త్యుని ప్రార్థించుచున్నాను. జంబూద్వీపమునకు బైట పుట్టినదియు, దేవతలకు ప్రియమును, సకల వృక్ష శ్రేష్టము అగు చందనమును స్వీకరింపుము. అగస్త్యా! ధర్మార్థ కామమోపక్షముల నిచ్చునదియు, సౌభాగ్యారోగ్యలక్ష్మీ వర్ధకమును పాపవినాశ కమును అగు ఈ పుష్పమాలను స్వీకరింపుము. ఈ ధూపమును గ్రహించి నాకు స్థిరభ క్తిని ప్రసాదింపుము. ఈ లోకమున మనోవాంఛిత ఫలములను, పరలోకమున శుభగతిని ఇమ్ము. దేవాసుర పూజితుడ వగు మునీంద్రా! నీవు సకల కామఫలప్రదాతవు. వస్త్ర - ద్రోహి - వల - సువర్ణములతో కూడిన ఆర్ఘ్యము నిచ్చుచున్నాను. మహామనీ! నా మనస్సులో నున్న విషయమును అగస్త్యునకు (నీకు) తెలిపెదను. నీకు ఫలారము సమర్పించు చున్నాను. గ్రహింపుము. పిదప “ఆగస్య ఏవం జగామ” అను వైదిక మంత్రముతో అర్ఘ్యము నీయవలెను. మహావ్రత పరిపాలకురాలివి రాజ పుత్రివి ముని పత్ని వి దేవేశ్వరివి ఆయిన లోపాముద్రా ! నీకు నమస్కారము. ఓ యశస్వినీ ! ఈ అర్ఘ్యము గ్రహింపుము. పంచరత్న , సువర్ణ - రజత - సప్తధాన్య పూర్ణమగు పాత్రను, దధి చందన సమన్విత మగు అర్ఘ్యమును అగస్త్యునకు సమర్పించపలెను. స్త్రీ శూద్రాదులు “కాశ పుష్పప్రతీకాశ” ఇత్యాది పౌరాణిక మంత్రముతో అర్ఘ్యప్రదానము చేయవలెను. “మునిశ్రేష్ఠుడ డైన అగస్త్యా! తేజఃపుంజముతో ప్రకాశించు నీవు నరక మును ప్రసాదించువాడవు. నేను చేసిన పూజ గ్రహించి శాంతి పూర్వకముగా వెళ్ళుము. ఈ విధముగా పూజానంతరము అగస్త్యుని విసర్జించి అతనిని ఉద్దేశించి ఏదైన ఒక ధాన్యమును ఫలమును, రసమును పరిత్యజించవలెను. పిదప బ్రాహ్మణులకు ఘృతమి శిత క్షీరాన్నము, లడ్డులు, మొదలైన వాటితో సంతర్పణము చేసి గోవస్త్ర సువర్ణాదుల దానము చేయవలెను. పిదప, ఆ కుంభము ముఖమును ఘృతమిశ్ర క్షీరయుక్త పాత్రచే మూసి, దానియందు సువర్ణముంచి బ్రాహ్మణునకు దానము చేయవలెను. ఈ విధముగా ఏడు రోజులు అగస్త్యార్ఘ్యము నిచ్చువారెల్లరును సర్వవాంఛితములను పొందగలరు. దీనివలన స్త్రీ సౌభాగ్య మును పుత్రులను పొందును. కన్య పతిని పొందును. రాజు రాజ్యము పొందును.
అగ్ని మహాపురాణమునందు ఆగస్త్యార్ఘ్యధాన మను రెండు వందల ఆరవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 206 of the Agni Mahā Purana is as follows:
This chapter expounds the Stambhana rite, used to immobilize enemies, enemies' weapons, or hostile forces. The mantra employs a specific bīja associated with the earth element. Agni describes how the sādhaka traces the target's name on a silver plate and buries it at a crossroads during an eclipse. Śiva and Kālī are the presiding deities, and the homa is performed with dry wood and black sesame.