పరమేశ్వరుడు చెప్పెను : సూర్యాదిగ్రహముల రాశులందు జన్మించిన శిశువునకు క్షేత్రాధిపతిని పట్టి కలుగు ఫలము చెప్పెదను. సింహలగ్నమునందు పుట్టిన వాడు సమకాయుడు, ఒకప్పుడు కృశాంగుడు, ఒకప్పుడు స్థూలశరీరము కలవాడు, గౌరవర్ణుడు,పిత్తప్రకృతి, రక్తనేత్రుడు, గుణవంతుడు, వీర్యవంతుడు ఆగును. కర్కటలగ్నమున వుట్టినవాడు భాగ్యవంతుడు, కోమలశరీరముకలవాడు అగును. మేష వృశ్చిక జాతుడు వాతరోగి, ఆత్మంతలుబ్ధుడు అగును. మిధున-కన్యాలగ్న జాతుడు బుద్ధిమంతుడు, సుందరుడు అగును. ధను-ర్మీనలగ్న జాతుడు సుందరుడు, ఆధిక కోపవంతుడును ఆగును. మకరకుంభలగ్నజాతుడు బుద్ధిమంతుడు, సుందరుడు, మానవంతుడు అగును, సౌమ్యలగ్నమందు పుట్టినవాడు సౌమ్యస్వభావవంతు డగును. క్రూరలగ్న జాతుడు క్రూరస్వభావు డగును. గౌరీ! ఇపుడు నామరాశులనుబట్టి సూర్యాది గ్రహదశాపలము చెప్పెదను-సూర్యదశ యందు గజములు, అశ్వములు, ప్రబలరాజ్యలక్ష్మి లభించును. ధవవాప్తి కలు గును. చంద్రదశలో దివ్యస్త్రీప్రాప్తి, కుజదశలో భూమిలాభము, సుఖము కలుగును. బుధదశలో భూమిలాభముతో పాటు ధనధాన్యప్రాప్తి కూడ కలుగును. గురుదశ లో గజాశ్వధనప్రాప్తి కలుగును. శుక్రదశలో ఖాద్యాన్నము, గోదుగ్దాదిపానము ధనలాభము ఉండును. శనిదశలో నానావిధము లగు రోగములు కలుగును. రాహుదర్శనమున, అనగా గ్రహణసమయ మున స్నానాదులాచరించి ధ్యానము చేయవలెను. వాణిజ్యము చేయవలెను. ఎడమ శ్వాస ఉన్నపుడు నామాక్షరమ సంఖ్య విషమ మైనచో ఆ సమయము కుజ-శని-రాహువులకు సంబంధించినది. అపుడు యుద్ధము చేయుటచే విజయము లభిం చును. కుడి శ్వాస ఆడు నపుడు నామాక్షరసంఖ్య సమసంఖ్యయైనచో అది సూర్యుని సమయము. ఆ సమయమున వర్త కము చేయుట నిష్ఫలము. కాని ఆ సమయమున పదాతి యై యుద్ధము చేసినచో విజయము లభించును. ఏదైన వాహ నముపై ఎక్కి యుద్ధము చేసినచో మృత్యువు కలుగును.
‘ఓం హం...’ ఇత్యాది మూలో క్తమంత్రమును ఏడు పర్యాయములు వ్యాసముచేసి, నాలుగు, పది, ఇరువది భుజములు కలవాడును, కటారమును ధరించినవాడును, తన సేవకు విముఖుడై శత్రుసేనను భక్షించుచున్న వాడును, అగు భైరవుని హృదయమునందు ధ్యానించుచు, శత్రుసేన ఎదుట పై మంత్రమును నూటఎనిమిది పర్యాయములు జపించవలెను. పిదప డమరు శబ్దము చేయగా శత్రు సేన శస్త్రములు విడచి పారిపోవును. శత్రుపరాజయము కొరకై మరొక ప్రయోగము చెప్పెదను. శ్మశానమునందలి బొగ్గులను కాకి-గుడ్లగూబ రెట్టలతో కలిపి దానితో బట్టపై శత్రువు చిత్రము వ్రాసి, వాని శిరస్సు, ముఖము, లలాటము, హృదయము, గుహ్యము, పాదములు, పృష్టము, బాహువులు నడుము-వాటిపై వాని పేరు తొమ్మిది పర్యాయములు వ్రాయవలెను. ఆ బట్ట మడచి యుద్ధమునందు తన దగ్గర ఉంచుకొని పూర్వోక్తమంత్రమును జపించుటచే జయము లభించును.
ఇపుడు, విజయప్రాప్తిసాధన మగు త్రిముఖాక్షరమహాతార్ఘ్యచక్రమును చెప్పెదను.”క్షిప ఓం స్వాహా తార్ష్వాత్మా శత్రురోగవిషాదినుత్” ఈ మంత్రము తార్ఘ్యచక్రము. ఈ మంత్రమును ఆనుష్టించుటచే దుష్టబాధ, భూతబాధ, గ్రహబాధ, అనేక విధములగు రోగములును తొలగును. ఈ గరుడమంత్రముచే ఏకార్య మైనమ సిద్ధించును. ఈ మంత్ర సాధకుని దృష్టి ప్రసరించుటచే స్థావర జంగమవిషములు, లూతావిషము, కృత్రిమవిషము అన్నియు నశించును. మహాతార్ఘ్యని ఈ విధముగా ధ్యానించవలెను, మనుష్యాకృతితో రెండు భుజములు, రెండు రెక్కలు కలిగి యుండును.ముక్కు వంక రగా నుండును. మహాబలము గల హస్తములతో ఏనుగను, తాబేలును ధరించి యుండును. పాదములందు అసంఖ్యాకము లగు సర్పములు చుట్టుకొని యుండును. ఆకాశ మార్గమున వచ్చి రణరంగమున శత్రువులను పొడిచి పొడిచి తినుచుండును. కొందరు శత్రువులు ఆతని ముట్టెచే చంపబడి యుందురు. కొందరు పంజాదెబ్బచే మరణింతురు. కొందరు రెక్కల దెబ్బకు చూర్ణము చేయబడుదురు. కొందరు పది దిక్కులకు పారిపోవుచుందురు. ఈ విధముగా ధ్యాననిష్టు డగు సాధకుడు మూడు లోకములందును ఆజేయుడగును.
ఇపుడు మంత్రసాధనచే సిద్ధించు పిచ్చికాక్రియను గూర్చి చెప్పెదను. “ఓం హూం పక్షిన్...... స్వాహా” అను (మూలోక) పిచ్ఛికామంత్రమును చంద్రగ్రహణమునందు జపించి సిద్ధింపచేసికొనిన సాధకుడు యుద్ధమునందు “గజమును, సింహమును గూడ ఎదిరించగలడు. మంత్రధ్యానముచే శత్రువులను, లేళ్ళను మేకలను వలె చంపగ లడు. దూరమునుండియే కేవల మంత్రోచ్చారణముచే శత్రువినాశము చేయు ఉపాయము చెప్పబడుచున్నది. కాలరాత్రియదు (ఆశ్విన శుక్లాష్టమినాడు) మాతృకలకు చరుప్రదానము చేసి శ్మశానభస్మము, మాలతీపుష్పములు, చామరి, పత్తి చెట్టువేరు వాటితో దూరమునుండియే శత్రువును సంబోధించవలెను. ఓం ఆహే హుంఫట్” అనునది సంబోధించు మంత్రము. ఈ భంగవిద్యను జపించుటచేతను, దూరమునుండియే ధ్వని చేయుట చేతను, అపరాజిత, ధత్తూరము వీటి రసము కలిపి తిలకము ధరించుట చేతను శత్రువులు నశింతురు. “ఓం కిలి కిలి...... కురుస్వాహా” అను (మూలోక్త మగు) సర్వకార్యార్థసాధకమంత్రమును భూర్జపత్రముపై వృత్తాకారముగ వ్రాసి, బహ్భూగమున మాతృకలను వ్రాయవలెను. ఈ విద్యను మొదట బ్రహ్మ విష్ణుమహేంద్రాదులు హస్తాదులందు ధరించిరి. ఈ విద్య ద్వారా బృహస్పతి దేవాసురసంగ్రామమునందు దేవతలను రక్షించేను. రక్షారూపిణియు, వారసింహియు, శక్తి రూపిణియు, భైరవియు, త్రైలోక్యమోహినియు అగు గౌరి కూడ దేవాసురనంగామమునందు దేవతలను రక్షించేను.
అష్టదల కమలమా కర్ణికయందును, దలములందును గౌరిబీజమతో (హ్రీం) సంపుటిత మైన తన పేరు వ్రాయ వలెను. పర్వదిక్కునం దున్న ప్రథమాండలములపై పూజానుసారము గౌరి అంగదేవతల న్యాసము చేయవలెను. ఈ విధముగా వ్రాయగా రమంత్రము ఏర్పడును. ఈ సంస్కారముల మధ్య సకలకలాపరివేష్టితము, సకారముచే ప్రబోధితమ అగు మృత్యుంజయమంత్రమును చెప్పెదను. ముందుగా ఓంకారము వ్రాసి, పిదప బిందుయుక్త మగు జకారము, వ్రాయవలెను, పిదప గర్భమున వకారమ వ్రాసి దానిని చంద్రబిందువుచే అంకితము చేయవలెను. అనగా “ఓం జం ధ్వం” అను మంత్రము ఉష్ణు లందరిని నశింపచేయును. గోరోచనా కుంకుమలతో గాని, మలయగిరి చందన- కర్పూరములతో గాని తగ్గ పత్రమపై గీసిన చతుర్థల కమల కర్ణికయందు తన పేరు వ్రాసి, నాలుగు దలముల పై ఓంకారము వ్రాయవలేను. ఆగ్నేయాది కోణములందు హూంకారము వ్రాయవలెను. దాని పై పదునారు దళముల కమలము వ్రాయవలెను. దాని దలములపై అకారాది షోడశస్వరములు వ్రాయవలెను. దాని దలములపై ముప్పదినాల్గు దళముల కమలము నిర్మించవలెను. దాని దలమలపై ‘క నుండి క్ష’ వరకు అక్షరములు వ్రాసి, ఆ యంత్రమును శ్వేతసూత్రముచే చుట్టబెట్టి, పట్టు బట్టతో కప్పి, కలశపై స్థాపించి హజించవలెను. ఈ యంత్రమును ధరించుటచే సకల రోగములు శాంతించును. శత్రువులు నశింతురు. ఇపుడు వియోగమునందు కలుగు మృత్యువును నివారించు 'ఖేలలీకి విద్యను చెప్పెదను. “ఓంవాతరే......ఓంస్వాహా” అను (మూలోక) మంత్రమును నవరాత్రులందు జపించి, సిద్ధి పొంది, యుద్ధమునందు ఏడు పర్యాయములు జపము చేయగా శత్రువులకు ముఖస్తంభన మగును. “ఓం చండి, ఓం హూంఫట్ స్వాహా” అనమంత్రమును యుద్ధసమయమునందు ఏడు పర్యాయములు జపించుటచే ఖడ్గయుద్ధమున విజయము కలుగును.
అగ్నిమహాపురాణమునందు యుద్ధజయార్ణవమున నానాబలవర్ణన మన ముప్పదిమూడవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 133 of the Agni Purāṇa is as follows:
Various forms of bali (ritual offering of cooked food, flesh, or symbolic substitutes) appropriate to different deities and occasions are described. Agni distinguishes sāttvika-bali (fruit, cooked grain, flowers), rājasika-bali (meat and wine in specified tantric contexts), and the purely symbolic bali using clay or flour figures. The proper vessels, directions, and mantras for bali-dāna to the bhūtas, yakṣas, and kṣetrapālas who guard the four quarters are enumerated. The chapter emphasizes that a householder's daily bali-karma, when properly performed, maintains harmony with the unseen presences inhabiting the domestic and village environment.