అగ్ని మహా పురాణము

99 - అథ సూర్య ప్రతిష్టా విధానమ్.

పరమేశ్వరుడు పలికేను:- ఇపుడు సూర్యప్రతిష్టావిధానము చెప్పెదను. వెనుకటి వలె మండపాటి నిర్మాణము, స్నానాదికముచేసి, పూర్వము చెప్పిన విధి ననుసరించి విద్యను, సాంగసూర్యదేవతను ఆసనశయ్య పై న్యాసము చేసి, తత్వ ములను, ఈశ్వరుని. ఆకాళాది పుచభూతములను న్యాసము చేయవలెను, పూర్వము వలె శుద్ధ్యాటక ము చేసి, పిండిశోథనము చేయవలెను. సడేశ పడమువరకు తత్త్వ వంచకవ్యానము చేయవలెను, సర్వతోమణలీశ క్తితోకూడ యథావిధిగ ఘోషనము చేసి, గడ, సూర్యమంత్రము జపించుచు ఈ క్షః శసూర్యుని ఘోషించవలెను. సూర్యదేవతకు పేరుచివర 'స్వామి' అని కాని. ‘పాడ' అని కాని ఉంచవలెను. స్థాపనకు పూర్వోత్తసూర్యమంత్రములనే ఉపయోగించవలేను.

ఆగ్నిమహాపురాణమనందు సూర్యప్రతిష్టావిధానమను తొంబదితొమ్మిదవ అధ్యాయము సమాప్తము.