అగ్ని దేవుమ పలికెను. చైతన్యము ప్రశాంత సముద్రము వలె స్థిరమై ఆత్మ భిన్నములగు పదార్ధము లేమియు భాసించక ఆత్మ మాత్రమే రాసించు ధ్యానము సమాధి. ధ్యాన సమయమున చిత్తమును ధ్యేయమునందు నిలిపి గాలిలేని ప్రదేశము నందలి దీపమువలె కదలకుండ నుండు యోగి “సమాధిస్థుడు” అని చెప్పబడును. ఆ సమయమున ఆతడు వివడు వాసన చూడడు, రుచి చూడడు, స్పర్శము తెలుసుకొనడు,
దును ఆది మానము కలవాడు కాడు. దేనిని తెలిసికొనక కాష్ఠమువలె నుండుమ. ఈ విధముగ ఈశ్వరుని యందు లీనుడైన వాడు సమాధిస్థుడు. వాయువు లేని ప్రదేశమునందున్న దీపము ఎట్లు కదలదో అది ఉపమగా చెప్పబడినది. ఆత్మ స్వరూపుడు అగు విష్ణువును ధ్యానము చేయుచున్న యోగికి ఎన్ని యో దివ్యములగు విఘ్నములు ఎదురగును. అవి సిద్ధి సూచకములు. సాధకుడు పైనుంచి క్రిందకు పడ వేయును. చెవిలో బాధకలుగును. అనేక విధములగు ధాతువులు కనబడును. శరీరము నందు ఎక్కువ బాధ కలగును. అట్టి యోగికి దివ్యభోగములను ఇచ్చెదమని దేవతలు లోభ పెట్టుదురు. రాజులు భూమిని, ధనవంతులు, ధనములను ఇచ్చెదరు. వేదాది శాస్త్రములన్నియు స్వయముగ నే స్ఫురించును. ఇష్టమైన ఛందస్సులతో కావ్యరచన కూడ ఆతడు చేయును. దివ్యమైన రసాయనములు దివ్యౌషధులు సకల శిల్పములు, కళలు అతనికి లభించును. సురేంద్ర కన్యకలు, ప్రతి భాది గుణములు కూడ అతనివద్దకు వచ్చును. వీటినన్నింటిని ఎవడు: తృణమువలె పరిత్యజించునో వానిని విష్ణువు అనుగ్రహించును.
అణిమాది గుణైశ్వర్య వంతుడగు యోగి శిష్యునకు జ్ఞానము ఇచ్చి ఇచ్చాను సారముగ భోగములనుభ వించి లయ యోగము ద్వారా శరీరమున పరిత్యజించి విజ్ఞానా నందమయము. బ్రహ్మ స్వరూపము, ఐశ్వర్య సంపన్న ము, అగు స్వాత్మ యందు స్థితిని పొందవలేను మలినమైన ఆద్దమున ప్రతిబింబమును గ్రహింప శక్యము కానట్లు అంతః కర్ణ పరిపాకము లేని వాడు ఆత్మ జ్ఞానము పొందజాలడు. దేహము సకల రోగ భాజన ము. దానియందు అభిమానము కలవాడు దుఃఖమును పొందును. కాని యోగి యోగ బలము వలన దుఃఖము పొందడు. ఒకే ఆకాశము మహిమల ద్వారా వేర్వేరుగా కనబడు నట్లును ఒకే సూర్యుడు అనేక జలాధారముందు అనేక రూపము కనబడునట్లును ఒకే ఆత్మ అనేకమువలె కన బడు చున్నది. ఆకాశ వాయు ఆగ్ని , జల, పృథివీ, ధాతువులు, ఈ లోకములన్నియు సచరాచరజగత్తు వాత్మా ఇవన్ని యు బ్రహ్మ స్వరూపములు. కుంభకారుడు మట్టి దండము, చక్రము, వీటిని కలిపి కుంభమును చేసినట్లు గృహర కుడు తృణ మృత్తికా కాషములతో గృహమును నిర్మించినట్లును ఆత్మయే ఆయాకరణములను సమకూర్చుకొని ఆయాయోనుందు తనను తానే సృశించుకొనును. కర్మచేతను, దోష మోహము చేతను బద్దుడగును. జీవులు జ్ఞావమువలన ముక్తుడగును. యోగి ధర్మానుష్టానము చేయుటచే రోగ విముక్తుడగును. వర్తి ఆధారము తైలము, వీటికలయిక చే దీపము నిలచినట్లును ఏఒక్కటి లేకున్నను ఆది నిలువకున్నట్లును యోగ ధర్మములు లేకపోవుటచే వికారము కలిపి ఆకాలమున ప్రాణనాశనము కీలాగు చున్నది.
హృదయములో దీపము వలెనున్న ఆత్మయొక్క రశ్ములు అనంతములై వ్యాపించియున్నవి, సీతములు ఆసితములు కద్రువర్ణములు, నీలవర్ణములు, కపిలవర్ణములు, పీతలోహితములు ఆగువాటిలో ఒకటి ఊర్ధ్వముఖమై సూర్యమండలమును భేదించి బ్రహ్మలోకమునుకూడ అతిక్రమించి వెళ్లను. దాని మార్గమున పయనించినవాడు ఉత్తమ గతిని పొందును. ఇది కాక మరినూరు రత్ములు ఊర్ధ్వముఖములై యున్నవి. వాటి ద్వారా పయనించినవాడు ఆయా దేవలోకములను పొందును క్రిందుకు ప్రసరించు ఆల్ప కాంతిగల వివిధ రశ్ములద్వారా పయనించినవాడు కర్మోపభోగమునకై ఈ లోకమునందే జనించును. జ్ఞానేంద్రియములు, మనస్సు, కర్మేంద్రియములు, అహంకారము, బుద్ధి, పంచభూతములు, అవ్యక్తమగు ప్రకృతి వీటికి క్షేత్రము అని పేరు. వీటి స్వరూపము తెలిసినవాడు క్షేత్రజ్ఞుడు. అతడే సర్వభూతాధీశ్వరుడు. ఆతడు సత్తు అసత్ సదసద్రూపుడు. ప్రకృతి నుండి బుద్ది, (మహత్తత్వము) దానినుండి అహం కారము, దానినుండి పంచ మహాభూతములు జనించును. వీటిలో ఉత్తరోత్తరమునకు ఒక్కొక్క గుణము అధికముగ నుండును. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు, భూతగణములు ఏది దేనిని ఆశ్రయించి వున్న చో అది దానియందే లీనమగును. సత్వ రజస్తమస్సులు అవ్యక్త ప్రకృతి యొక్క గుణము. రజస్తమోగుణములచే ఆవిష్టుడగు జీవుడు చక్రమువలే తిరుగుచుండును. అన్నిటికి ఆదియైన పరమ పురుషుడు ఆనాది. మన స్సు చేతను ఇంద్రియముల చేతను గ్రహింపబడునది, వికారము. వేదపురాణ విద్యా ఉపనిషత్ శ్లోక సూత్ర, భాష్యాది వాజ్మయము ఈ పరమాత్మ నుండియే ఆవిర్భవించినది. సంతాన కాలములగు అగ్నిహోత్రులు పితృయానమార్గమునందలి ఉపవీథి మొదలు ఆగ స్త్య నక్షత్ర మధ్యమ వరకు వున్న మార్గము ద్వారా స్వర్గమును చేరుదురు. దాన తత్పరులై ఆష్టగుణ సంపన్నులగు వారుకూడ ఈ మార్గముననే పయనింతురు. ఎనుబది ఎనిమిదివేల గృహస్థమునులు ధర్మ ప్రవర్తకులు. వారే పునరావృత్తికి కారణ భూతులు. వారు సప్తర్షులకును నాగ వీథికిని మధ్యనున్న మార్గము ద్వారా దేవలోకమునకు వెళ్ళిరి. అంతే సంఖ్యగల మునులు సర్వారంథ శూన్యులై తపో, బ్రహ్మచర్య, ఆసంగతి, త్యాగ, మేధా శక్తుల ప్రభావముచే ఒక కల్పము వరకు ఆయా దేవలోకములలో నివసింతురు.
వేదాధ్యయనము యజ్ఞము, బ్రహ్మచర్యము, తపస్సు శ్రద్ధా ఇంద్రియనిగ్రహము, ఉపవాసము, సత్యము, వీటివలన ఆత్మ జ్ఞానము కలుగును. ద్విజాతులు సత్త్వ గుణమును ఆశ్రయించి ఆత్మను గూర్చి శ్రవణమనవ నిధిధ్యాసనములు చేసి ఆత్మ సాక్షాత్కారము పొందవలెను. ఈ విధముగ తెలుసుకొనువారు వానప్రస్థులే, శ్రద్ధాయుక్తులై, సత్యోపాసన చేయుచు క్రమముగ ఆగ్ని, దిన, శుక్ల పక్ష, ఉత్తరాయణ దేవలోక, సూర్యమండల విద్యుద్దేవతల లోకములు చేరుదురు. పిదప మానస పురుషుడు అచటకు వచ్చి వారిని బ్రహ్మ లోకమున చేర్చును. వారికి పుషరావృత్తి వుండదు. యజ్ఞతపో దానము చే స్వర్గము పొందువారు క్రమముగ ధూమ, రాత్రి, కృష్ణపక్ష, దక్షిణాయన పితృలోక చంద్రలోక అభిమాని దేవతల లోకములకు వెళ్ళి మరల ఆకాశ , వాయు, జలముల మార్గము ద్వార భూలోకమునకు తిరిగి వత్తురు. ఈ లోకమున జన్మించి, మరణానంతరము మరల ఆ మార్గముననే ప్రయాణము చేయుదురు. జీవాత్మకు సంబంధించిన ఈ రెండు మార్గములును తెలియనివాడు సర్పముగాను, పతంగముగాను, కీటముగాను క్రుమిగాను పుట్టును. హృదయాకాశ మున దీపమువలె భాసించుచున్న బ్రహ్మ ను ధ్యానించుటచే జీవుడు అమృత స్వరూపుడగును. వ్యాయముగ ధనసంపాదన చేయుచు ఆతిథి ప్రియుడై తత్వ జ్ఞాన నిష్ఠుడై శ్రాద్ధములు చేయుచు సత్యవాదియైవున్న గృహస్థుడు కూడ విముక్తుడగును.
ఆగ్ని మహాపురాణమున సమాధి నిరూపణమను మూడు వందల డెబ్బది ఆరవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 377 of the Agni Mahā Purana is as follows:
Agni presents the liberating knowledge of Brahman (brahma-vijñāna) to Vasiṣṭha. The teaching begins with the mahāvākya: "Ayam ātmā paraṃ brahma" — this ātman is the supreme Brahman — and demonstrates why neither the body, nor the senses, nor the mind, nor prāṇa, nor ahaṁkāra can be identified with the ātman: the body is visible like a pot and is inactive in sleep and at death; the senses are mere instruments; the mind operates only by borrowed light; prāṇa is without vijñāna in deep sleep. The ātman — distinct from all these — dwells in the heart of all beings as the all-seer, the bhoktar, shining like a lamp through the night. At the commencement of samādhi, the yogī should contemplate the sequential emanation from Brahman — ākāśa, vāyu, agni, jala, pṛthivī, sūkṣma-śarīra, sthūla-śarīra — and understand that Brahman alone, attained through jñāna not karma, is the singular reality.