ఆగ్ని దేవుడు పలికెను. భుక్తి ముక్తి ప్రదమగు మరియొక త్వరితా విద్యను చెప్పెదను. ధూళిచే నిర్మించ బడినదియు, వజ్ర చిహ్నముచే ఆవరింపబడినదియగు భూపుర మండలమున త్వరితా దేవిని పూజించవలయును. ఆ మండలములో యోగ పీఠము పై కమలమును నిర్మించి మండలము యొక్క పూర్వాది దిక్కులండను విదిక్కులందును వజ్ర చిహ్న మును, మండలములోపల వీథి ద్వారము, శోభ, ఉపశోథ వాటిని రచించవలెను. దాని లోపల త్వరితా దేవిని భావన చేయవలయును, ఆమెకు పదునెనిమిది భుజము ఉండును. ఎడమకాలు సింహము వీపు పైనను కుడికాలు దానికి రెట్టింపు ఆకారముతో పాదపీఠములందును ఉంచబడి యుండును, అమే (సర్ప) నాగమయ అలంకారములతో అలం కరింపబడి యుండును, కుడివై నవున్న హస్తములలో క్రమముగ వజ్ర - దండ - ఖడ్గ - చక్ర - గదా శూల - బాణ - శక్తి - వరద ముద్రలు, ఎడమ ప్రక్కన వున్న చేతులలో ధనుః - పాశ - శర - ఘంటా - తర్జనీ - శంఖ - అంకుశ అభయ ముద్ర వజ్రాయుధములును ధరించి యుండును. ఆ దేవుని పూజించుటచే శత్రువులు నశింతురు. అవలీలగా రాష్ట్రమును జయించగలుగును. దీరా యుర్దాయవంతుడై రాష్ట్రైశ్వర్యమును పొందును. దివ్యసిద్దులను ఆదివ్య సిద్ధులను కూడ పొందును. - తలయనగా సప్తపాతాళములు కాలము, ఆగ్ని సకల భువనములు, అంతకుడు యని అర్థము, ఓంకారముచే పరమేశ్వరుడు మొదలు బ్రహ్మాండములన్నియు ప్రతి పాదింపబడుమ. తన మంత్రము యొక్క ఆద్యక్షరమగు ఓం కారముచే తల పర్యంతము దేవి తోయము శీఘ్రముగ త్రిప్పును. అందుచే ఆమెకు "తోతలత్వరితా" యని పేరు.
ఇపుడు, త్వరితా మంత్ర ప్రస్తారమును చెప్పెదను, భూతలము పై సర్వ సముదాయమున ప్రాయవలయును, కవర్గమునకు సాంకేతిక నామము స్వరవర్గ మొదటిది, తాలువర్గము రెండవది. మూడవది జిహ్వతాలుక వర్గము నాల్గవది తాలు జిహ్వాగ్ర వర్గము ఐదవది జిహ్వా దంతక వర్గము ఆరవది ఓష్ఠ పుటసంపన్నము. ఏడవడి మిత్ర వర్గము ఎనిమిదవది ఊష్మవర్గము. ఈ వర్గములు అక్షరముల నుండి మంత్రోద్దారము చేయవలెను. ఆరవస్వరమైన "ఊ" కారముపై ఊష్మవర్గ ద్వితీయారమైన "హ" కారము బిందు సంయు క్తము చేయవలెను. (హూం) తాలువర్గ తృతీయా క్షరమగుఖ కారమును పదకొండవ స్వరమగు ఏకారముతో కూర్చవలెను. (ఖే) జిహ్వాతాలు సమాయోగము యొక్క మొదటి అక్షరమగు "చ" కారము దాని క్రింద ఆదేవర్గము యొస ద్వితీయాక్షరమగు "ఛ" కారము పదకొండవ స్వరమగు ఏ కారముతో కలుపవలేను. (చ్ఛ్యే) తాలు వర్గ ప్రథమాక్షరమగు 'క'కార మును దాని క్రింద ఊష్మవర్గ ద్వితీయార మగు షకారము చేర్చి పదునారవస్వమగు ఆతో కలుపవల యను. (క్షః) ఊష్మవర్గ తృతీయాక్షరమగు సకారమునకు క్రింద జిహ్వా దంతసమాయోగ ప్రథమాక్షర మగు తకారము చేర్చి దాని క్రింద మిశ్రవర్గ ద్వితీయాక్షరమగు రకారము కలుపవలెను. పిదప నాల్గవ స్వరమగు ఈకారము చేర్చవలెను. (స్త్రీ) తాలువర్గ ప్రథమాక్షరమగు కకారమునకు క్రింద ఊష్మవర్గ ద్వితీయాక్షరమగు షకార మును చేర్చి పండ్రెండవ స్వరమగు ఏకారమును కలుపవలెను. (క్షే) పిదప ఊష్మ వర్గ అంత్యాక్షరమగు హకార మునకు ఆనుస్వార ము చేర్చి ఐదవస్వరమును కలుపవలెను. (హూం) ఓష్ఠ సంపుట యోగము నుండి రెండవ ఆక్షర మగు పకారమునకు జిహ్వాగ్ర తాలు యోగమునుండి ఠకారమును పంచమమగు నకారముగా మార్చి కలుపవలెను. స్వర ఆర్ధవ్యంజనముతో ఉద్ధృతములగు ఈ ఆక్షరములుతో తలాత్వరితాముత్రము. దీని, ఆదియందు ఓం కారమును ఆుతమునందు నమును చేర్చిన మంత్రమును జపము చేయవలయును. హోమమునందు మాత్రము నమః తొలగించి స్వాహా చేర్చవలేను, అనగా ఓం హ ఖే.చ్చ్యే-క్షః-స్త్రీ ,క్షే హూం-ఫట్ నమః ఆనువది జపమంత్రము. నమః బదులు స్వాహా చేర్చిన హోమ మంత్రము
దీని ఆంగన్యాసము ఈ విధముగ నుండును. ఓం హ్రీం హ్రూం హ్రః హృదయాయనమః, హాం హః శిర సే స్వాహా. హ్రీం జ్వల జ్వల శిఖాయైవ షట్ హులు హులు కవచాయ హుం- హ్రీం శ్రీం క్షూం నేత్ర త్రయాయవౌషట్ ఫట్ యనునది దేవీ నేత్రముగా చెప్పబడినది. క్షాం హ: ఖౌం, హూం . ఫట్ , ఆస్త్రాయ ఫట్ ఇవి గుహ్యంగ మంత్రములు. వీటి ప్యాసము ముందుగా చేయవలయును. త్వరితాంగమలను తరువాత చేప్పెదము. విద్యాంగ ములను వినుము. మొదటి రెండు బీజాక్షరములు హృదయము. తృతీయ చతుర్థాక్షరములు స్థిరము. పంచషష్ఠ అక్షరములు శిఖా మంత్రము, సప్త మాష్టమ వర్ణములు కవచ మంత్రములు. నవమాక్షరము ఆర్ధాక్షర ము తారకము"తో తలే వజ్రతుండే ఖఖ హూం" యను పదియ క్షరములు కలది వజ్ర తుండికా నామకమగు ఇంద్రదూతికా విద్య. ఖేచరి - జ్వాలిని - జ్వాలే ఖఖ అను పది అక్షరములు కలది జ్వాలినీ విద్య వచ్చే శర విభీషణి అభే యనునది దశాక్షర శబరీ విద్య ఛఛేదని, కరాలిని ఖఖ ఇది దగా క్షర కరాలినీ విద్య, క్షః శ్రవ ద్రవ ప్లవని, ఖథే ఇది దశాక్షర ప్లవంగ దూతీవిద్య. "స్త్రీ బలం కలిదొనని శాసి” ఇది దశాక్షర శ్వసన వేగికా విద్య, క్షే పక్షే కపిలే హంస ఇది దశాక్షర కపిలా దూతికావిద్యా. హ్రూం తేజోవతి రౌద్రి మాతంగి" ఇది దశాక్షరౌది దూతికావిద్య. పుటేపుటే బఖ ఖడ్గ వట్ ఇడి దశాక్షర బ్రహ్మ దూతికా విద్య. వైశాల్లో చెప్పబడిన అన్ని మంత్రములును దళాక్షరములు ఇతర మైన వాటినన్నింటిని పొల్లువలె సార హేయము గా భావించి విడిచి చేయవలెను. న్యాసాదుల యందు హృదయాద్యంగములను ఉపయోగించవలెను. నేత్రమును మర్యమునందు న్యాసము చేయవలెను.
పాదము నుండి శిరస్సు వరకు, శిరస్సు నుండి పాదముల వరకు చరణజాను ఇంజను ఊరు గుహ్య నాథ హృదయములను కంఠ దేశము నుండి ముఖ మండల పర్యంతము పైకిని క్రిందకును అది బీజము నుండి నిర్గతమైనదియు, అమృత ధారను వర్షించునదియు హోమ రూప మగు అకారము బ్రహ్మ రంధ్రము నుండి నాలో ప్రవేశించు చున్నది యని సాధకుడు భావన చేయవలెను. మంత్రోపాసకుడు శిరోముఖ కంఠ హృదయ నాభి గుహ్య ఊరుజాను పాదము లందును తర్జని యందును మాటి మాటికి ఆపి బీజమును న్యాసము చేయవలెను. మత మయ హోమము పైనను బీజాక్షర రూప మగు శరీర కమలము క్రిందను వున్నది యను రహస్యము తెలిసిన వానికి మృత్యు భయము గాని వ్యాధి జఠాదులు గాని వుండవు. న్యాస ధ్యాన పూర్వకముగ ధ్యానము చేసి త్వరితా మంత్రము నూట యెనిమిది పర్యాంగుములు జపించవలెను. ఇపుడు ప్రణీతాది ముద్రలను చెప్పెదను. జీలా ముద్రలు ప్రణీత, సబీజా ప్రణీత, భేకని కరాలి వజ్రతుండ యని ఐదు విధములు. రెండు చేతులు కలిపి అంగుష్ఠములను మధ్య యందుంచి తర్ణ ని పైకి చాపినచో ప్రణీత. దీనిని హృదయ దేశము నందు చూపవలెను. ఈ ముద్ర యందు కనిష్ఠికను పైకి వుండునట్లు చేసి మధ్య యతిడించినచో అది సబీజ తర్జని. మధ్య యందు ఆనా మీకను పరస్పర సంలగ్నము చేసి ఆంగుష్టాగ్ర భాగమును మధ్యయందుంచినచో అది భేదనీ ముద్ర. ఆ ముద్రను నాభి దేశము నందుంచి అంగుష్ఠము నందలి జలమును జల్లవలెను. దీనినే హృదయము నందుంచినచో కరాలి యని మహా మద్ర యగును. మరల బ్రహ్మ లగ్నా జ్యేష్ఠను వెనుకటి వలే పైకి నిలబడునట్లు చేసినచో ఆ వజ్ర తుండ ముద్ర దానిని వజ్ర దేశ పను ఉంచవలెను. రెండు హ సముతో మణి బంధమును బంధించి మూడే వేళ్ళు చాపినచో వజ ముద్ర యగును. వాటి వాటి ఆకారములను అనుసరించి దండ - ఖడ్గ - చక్ర. గదాది ముద్రలు చెప్పబడినవి. అంగుష్ఠముచే ఊర్ధ్వ ముఖములగు మూడు వేళ్ళను ఆక్రమించినచో అది త్రిశూల ముద్ర. మధ్య మాంగుళిని మాత్రమే పైకి నిలిపినచో శక్తి ముద్ర యగును. బాణ . వరద.ధనుష్. పాశ- భార – ఘంటా - శంఖ - అంకుశ - అభయ పద్మములు పైన చెప్పిన ప్రణీత మొదలగు ముద్రలు కలిపి ఇరువది యెనిమిది మాద్ర లగును. గ్రహణి - మోక్షణి- జ్వాలిని. ఆమృత- ఆభయ - ఈ ఐదును ప్రణీతా ముద్రలు. వీటిని పూజో హోమములందుపయోగించ వలెను.
ఆగ్ని మహావురాణమున త్వరితా మంత్రాది వర్ణన మను మూడు వందల పదవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 310 of the Agni Purāṇa is as follows:
Agni concludes the Āyurveda section by summarizing the eight branches of medicine as a unified system rooted in the knowledge of puruṣa — the embodied being comprising ātman, mind, senses, and the five great elements. The physician who knows all eight branches and who treats patients with compassion and skill is compared to Dhanvantari himself. The text reiterates that health is the foundation of all four puruṣārthas, and that the highest purpose of medical knowledge is to free the jīva from bodily suffering so that it may devote itself to dharma and ultimately to liberation. The chapter closes with a eulogy of Dhanvantari.