అగ్ని దేవుడిట్లు చెప్పెను : వసిష్ఠా! మరొకవసిష్ఠుడు గాయత్రీజపపూర్వకముగ లింగమూర్తియగు శివుని స్తుతించి శివుని అనుగ్రహముచే నిర్వాణస్వరూపమగు పర బ్రహ్మను పొందెను. వసిష్ఠుడిట్లు స్తుతించెను- “కనకలింగమునకు నమస్కారము, వేదలింగమునకు నమస్కారము. పరమలింగమునకు నమస్కారము. ఆకాశలింగమునకు నమస్కారము. సహస్రలింగ - వహ్నిలింగ - పురాణలింగ .వేదలింగ శివునకు మాటిమాటికి నమస్కారము చేయుచున్నాను. పాతాలలింగ - బ్రహ్మలింగ - సప్త ద్వీపోర్ధ్వ లింగమునకు మాటిమాటికి నమస్కారము. సర్వాత్మలింగ - సర్వలోకలింగ - అవ్యక లింగ - బుద్దిలింగ - ఆహంకార లింగ - భూతలింగ - ఇంద్రియలింగ - తన్మాత్రలింగ - పురుషలింగ - భావలింగ రజోర్ధ్వలింగ - సత్త్వలింగ - ధవలింగ - త్రైగుణ్యలింగ ఆనాగతలింగ - తేజోలింగ - వా మూర్ధ్వలింగ - శృతిలింగ అథర్వలింగ - సమలింగ - యజ్ఞాంగలింగ – యజ్ఞలింగ-తత్త్వలింగ - దైవకానుగ తలింగ స్వరూపుడవగు నీకు మాటిమాటికి నమస్కరించుచున్నాను. ప్రభూ! నాకుపరమయోగమును ఉపదేశించుము; నాతోసమానుడైన పుత్రుని ఇమ్ము. నాకు ఆవినాశి యగు పర బ్రహ్మయొక్క ప్రాప్తి ని కలిగించుము. పరమశాంతినిమ్ము నావంశము ఎన్నటికిని క్షీణము కాకుండుగాక! నా బుద్ది సర్వదా ధర్మముపై లగ్నమైయుండుగాక” అగ్ని పలికెను : పూర్వము వసిష్ఠుడు శ్రీ శైలముపై స్తుతించగా శంకరుడ ప్రసన్నుడై వసిష్ఠునకు వరములిచ్చి అచటనే అంతర్ధానము చెందెను.
అగ్ని మహాపురాణమున గాయత్రీనిర్వాణకథనమను రెండు వందల పదునేడవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 217 of the Agni Purāṇa is as follows:
Agni presents the complete pūjā of Bhagavān Gaṇeśa, who is to be propitiated at the commencement of all rites. The twenty-one names of Gaṇeśa used in the pūjā are listed, along with the Gaṇapati Atharvaśīrṣa as the primary upaniṣad for this deity. Offerings of modaka, dūrvā, and red flowers are described. The chapter states that worship of Gaṇeśa removes vighnas from all undertakings and grants siddhi in mantra sādhana.