పుష్కరుడు పలికెను : పూర్వము తన రాజ్యలక్ష్మిని స్థిరముగా ఉంచుకొనుటకై ఇంద్రుడేవిధముగ లక్ష్మీస్తవము చేసెనో ఆమ్టే రాజు విజయము కొరకు లక్ష్మీస్తవము చేయవలెను. ఇంద్రుడు పలికెను: సకలలోక జననియు, సముద్ర సంభవయు, వికసితకమలనేత్రయు, విష్ణువక్షఃస్థితయు ఆగు లక్ష్మికి నమస్కారము. ఓ లోకపావనీ! నీవే సిద్ధివి; స్వాహా. స్వధా - సంధ్యా - రాత్రి - ప్రధా - భూః - మేధా - శ్రద్ధా సరస్వతీ రూపిణి.. ప్రకాశించు దానవు, ముక్తి రూపవల దాత్రివి ఆగు ఓ దేవీ! యజ్ఞ విద్య, మహాపద్య, గుహ్యవిద్య, ఆత్మ విద్య, ఆన్వీక్షకి, త్రయి, వార్త, దండనీతి కూడ నీవే. నీవు సౌమ్యురావు, నీతో నిండిన ఈ జగత్తు కూడ సౌమ్యమైనది. దేవీ! గదాధారియైన దేవదేవుడైన శ్రీ మహావిష్ణువు యొక్క సర్వయజ్ఞ స్వరూపము, యోగులచే ధ్యానింపబడునది అయిన శరీరమును నీవు తప్ప ఎవరు అధిష్టించగలరు?, దే!! నీవు విడచినంతనే ఈ భువనత్రయము వినష్టమైపోయినది. నీచే ఇపుడు పోషింపబడుచున్నది. మహాదేవీ! నీ దృష్టిపడిగనే మానవులకు భార్య, పుత్రులు, గృహము, స్నేహితులు, ధాన్యము, ధనము మొదలగునవి నిత్యము లభించును. నీ దృష్టిచే చూడబడిన పురుషులకు ఆరోగ్యము, ఐశ్వర్యము. శత్రుపక్షవినాళ నము, సుఖము-ఇవన్నియు దుర్లభములు కావు. సర్వ భూతములకును నీవే తల్లివి, దేవదేవుడైన శ్రీమహావిష్ణువు తండ్రి. ఈ చరాచర జగత్తునంతను, నీవు, శ్రీమహావిష్ణువు వ్యాపించి యున్నారు. ఓ సర్వపావనీ! నీవెన్నటికిని, నా కీర్తి ని, ధనాగారమును, అన్న కోష్టమును, గృహమును. పరి వారమును, శరీరమును, భార్యను విడచివెళ్ళకుము. శ్రీమహావిష్ణు వక్షఃస్థలముపై నివసించుదానా! నా పుత్రులను, స్నేహితు లను, పశువ్వును, ఆలంకారములను, విడచివెళ్ళకుము. ఓనిర్మలురాలా ! నీచే విడువబడిన వారు, సత్యము చేతను, సమరాశాచముల చేతను, శీలము మొదలగు గుణములచేతను పరిత్యజింపబడుదురు. నీచే చూడబడిన వారు నిర్గుణులై నను. వారికి శీలాది సకల గుణములును, కులైశ్వర్యాదులును లభించును. ఓదేవీ ! నాచే చూడబడినవాడే క్లాఘ్యుడు, గుణవంతుడు ధన్యుడు. కులీనుడు, బుద్ధిమంతుడు, శూరుడు, విక్రాంతుడు, జగత్తును పోషించు ఓ విష్ణువల్లభా ! నీవు ఎవని విషయ మున పరాజ్ము ఖురాలవగుదువో ఆతని శీలాదిసకల గుణములును వెంటనే విగుణము లగును. బ్రహ్మదేవుని నాలుక గూడ నీ గుణములను వర్ణింపజాలదు. ఓ పద్మాక్షీ ! దేవీ ! అనుగహింపుము. మమ్ము లను ఎన్నడును విడువకుము. పుష్కరుడు పలికెను. ఈ విధముగ స్తుతింపబడిన లక్ష్మి ఇంద్రునకు కోరికను, రాజ్య సైర్యమును, యుద్ధ విజయాదు లను అనుగ్రహించెను. తన స్తోతమును పఠించువారికిని, వినువారికిని భుక్తి ముక్తులను వర ముగాప్రసాదించెను. అందుచే మానవుడు సర్వదా శ్రీ స్తోత్రమును చదువవలెను. వినవలెను.
ఆగ్ని మహాపురాణమునందు శ్రీస్తోత్రవర్ణనమను రెండువందల ముప్పది ఏడవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 237 of the Agni Purāṇa is as follows:
The vāta doṣa, its qualities, functions, and pathological manifestations are described. Vāta, composed of ākāśa and vāyu, governs all movement in the body — from nerve impulses to the expulsion of waste. Agni lists eighty vāta-janya diseases and their treatment principles: snehana (oleation), svedana (fomentation), basti (enema), and the use of taila in abhyaṅga. Specific formulations using guggulu, śatāvarī, and daśamūla are prescribed for vāta disorders.