ఆగ్ని దేవుడు పలికెను. ఇపుడు చేష్టాది విశేషమును ఆంగప్రత్యంగ ములను వాటి కర్మలను చెప్పెదను. దానిని ఆంగిక కర్మయందురు. ఇది సాధారణముగా స్త్రీ సంశ్రితము. లీలా, విలాస, విచ్ఛిత్తి, విశ్రమ, కిలి కించిత, మోట్టా యిత, కుట్టమితా, బిబ్బోక, లలిత, విహృత, క్రీడిత, కేకులుయని ఆది పండ్రెండు విధములు. ఆవృత ప్రదేశమున ఇష్టజన చేష్టను అనుకరించుట లీల. కొంచెము విశేషమును చూపించునది విలాసము. హాఫరో దనాదుల సంకరమణ కిలికిం చితము. వికారము బిబ్బోకము; సుకుమార చేష్టలలితము. శిరస్సు. హస్తములు వక్షము, పార్శ్వము కటి, పాదముయని, ఇవి క్రమముగా యంగములు. కనుబొమలు మొదలగునవి ప్రత్యంగములు. అంగ ప్రత్యంగము ప్రయత్న జనితమగు చేష్టలేకుండ ప్రయోగము ఎచ్చటను కలుగదు. కొన్ని చోట్ల ముఖ్యముగను కొన్ని చోట్ల వక్రరూపమునకు అది సాధింపబడును. ఆకం పిత, కంపిత, ధూత, విధూత పరివాహిత, ఆధూత, అవధూత, ఆచిత, నికుంచిత, పరావృత, ఉత్తిష, ఆధోగత లోలితములని శిరః కర్మ పదమూడు విధములు. కనుబొమ్మల చెష్ట ఏడు విధములు. వీటిలో భ్రుకుటి మొదలగునవి ప్రధాన ములు. రస, స్థాయి, సంచారి భావము, సంబంధమును బట్టి దృష్టి మూడు విధములు, దీనికి ముప్పది ఆరు భేదములు కూడ వుండును. అందుర సజ దృష్టి, యెనిమిది విధములు. భ్రమణ చాలనాదికమగు తార కాకర్మ తొమ్మిది విధములు. వాసికాకర్మ ఆరు విధములు. నిశ్వాసము తొమ్మిది విధములు; ఓష్ణకర్మ అరు విధములు; పాదకర్మ ఆరు విధముక్ష్; చిలుక కర్మ ఏడు విధములు; గ్రీవా కర్మ తొమ్మిది విధములు, హస్తకర్మ సాధారణముగ అసంయుతము సంయుతము, యని రెండు విధముల వుండును. పతాక త్రిపతాక, కర్తరీ ముఖ ఆర్ధ చంద్ర ఉత్కరాళ, శుక్రతుండ, ముష్టి, శిఖర, కపిత్త, కటకా ముఖ సూచ్యాస్య, పద్మకోశ, శిర, మృగ శీర్ష, కాంబోల, కాల పద్మ, చతుర, భ్రమర, హంసాస్య హంస పక్ష, సందంశ, ముకుళ, ఊర్ననాభ తామ్ర చూడములని ఆసంయుత హస్తమునకు ఇరువది నాలుగు భేదములు. అంజలి, కపోత, కర్కట, స్వస్తిక, కటక :ప్తమాన, అసంగ, నిషద, దోల, పుష్పపుట, మకర, గజదంత, భెస్తంభములు యని సంయుత హస్తమునకు పదమూడు భేదముల; సంయుత హస్తమునందు ఇంకను భేదములుండ వచ్చును. వృక్ష స్థల కర్మ ఆభుగ్న నర్త వాది భేదముచే ఐదు విధములు; ఉదరకర్మ దురతి క్షామ ఖండము, పూర్ణము అని మూడు విధ ములు; పార్శ్వకర్మలు ఐదు; జంఘాకర్మలు ఐదు; నాట్యనృత్యాదులందు పాదకర్మ అనేక విధములుగా నుండును.
ఆగ్ని మహాపురాణమున నృత్యాద్యంగకర్మ నిరూపణమను మూడువందల నలుబది ఒకటవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 342 of the Agni Mahā Purana is as follows:
The four modes of acting (abhinaya) are described: sāttvika (psychological/emotional), vācika (verbal — speech, tone, meter), āṅgika (bodily gesture and movement), and āhārya (costume, makeup, and stage properties). Śṛṅgāra is further subdivided into saṃbhoga-śṛṅgāra (love in union) and vipralambha-śṛṅgāra (love in separation), with detailed description of the nāyikā's states in each. The six varieties of hāsa (laughter) — smita, hasita, vihasita, upahasita, apahasita, and atihasita — are enumerated with their causes and appropriate dramatic occasions. The chapter introduces the broad category of śabdālaṅkāra (sound-based figures of speech), beginning the transition from performing arts to poetics proper.