హయగ్రీవుడు చెప్పెను : సూర్యుడు, ఏడు గుఱ్ఱములు కట్టిన, ఒకే చక్రముగల రథముపై రెండు పద్మములను హస్తములలో ధరించి యుండును. ఆతని దక్షిణ పార్శ్వమున దండి. సిరా బుడ్డి లేఖిని ధరించి యుండును. వామ పార్శ్వమున పింగళుడు దండమును ధరించి ద్వారము నందుండును. వీరిరువురును సూర్యుని పార్షదులు. పార్శ్వములందు ఇద్దరు స్త్రీలు పొలవ్యజనమును ధరించియుందురు. రాణియైన (భార్యయైన) ఛాయాదేవి ప్రక్క నుండును. లేదా ఆత్వము పైన కూర్చున్న ఒక్క సూర్యుని ప్రతిమ మాత్రమే కన్పించవలెను. సమస్త దిక్పాలకులును వరద ముద్రతో, రెండేసి పద్మములు ధరించి, సాయుధులై దిక్కుల వరుసలో నుందురు.
పండ్రెండు దళముల కమలమును నిర్మింపవలెను. సూర్యుడు, ఆర్యమ మొదలగు ద్వాదశ సూర్యులను ఆ ద్వాదశ దళములపై స్థాపింపవలెను. ఈ స్థాపనము పశ్చిమవాయవ్య దిక్కులతో ప్రారంభించి, నైరృతిదిక్కు. వరకును ఉన్న దళములపై చేయవలెను. ఈ ఆదిత్య గణమునకు నాలుగేసి చేతులు, చేతులలో ముద్ధర - శూల – చక్ర - కమలములు ఉండును. ఆగ్నేయము నుండి నైరృతి వరకు, నైరృతి నుండి వాయవ్యము వరకు, వాయవ్యము నుండి ఈశాన్యము వరకు, ఈశాన్యము నుండి ఆగ్నేయము వరకు ఉన్న దళముల పై స్థాపింపవలెను.
వరుణుడు, సూర్యుడు, సహస్రాంశువు, ధాత తపనుడు, సవిత, గథ స్తికుడు, రవి, పర్ణ న్యుడు, త్వష్ట, మిత్రుడు, విష్ణువు, అనువారు ద్వాదజ్ఞాదిత్యులు. వీరు మేషాది ద్వాదశ రాసులలో నుదురు, వరుణాది ఆదిత్యులు క్రమముగ మార్గ శీర్షము మొదలు (వృశ్చికము మొదలు) కార్తికము వరకు నున్న మాసములలో (తుల వరకు వున్న రాశులలో) ఉందురు. వీరి శరీరకాంతి క్రమముగ నలుపు, ఎరుపు, కొంచెము ఎరుపు, పసువు, పాండువు, తెలుపు, కపిలము, పీతము, ఆకుపచ్చ, ధవళము, ధూమము, నీలము రంగులలో నుండును. వీరి శక్తులు ద్వాదశ దలక మల కేసరాగ్రములందు ఉండును. వారి పేర్లు- ఇడ, సుమమ్న, విశ్వార్చి, ఇందు, ప్రమర్ధిని, ప్రహర్షిణి, మహాకాలి, కపిల, ప్రబోధిని, నీలాంబర, వనాంతస్థ (ఘనాంతస్థ) అమృతాఖ్య. ఈ శక్తుల శరీర కాంతి గూడ వరుణాదుల శరీర కాంతి వలెనే ఉండును. ఈ శక్తులను కేసరాగ్ర భాగముల పై స్థాపింపవలెను. సూర్యుని తేజస్సు ప్రచండముగా, విస్తృతముగా ఉండును. ఈతనికి రెండు భుజములుండును. కమలమును, ఖడ్గమును ధరించి యుండును.
చంద్రుడు చేతులలో కుండిక - జపమాలలను ధరించును. కుజునకు చేతులలో శ కీ, అక్షమాలయు, బుధునకు ధనస్సు, అక్షమాలయు, బృహస్పతికి కుండిక, అక్షమాల, శుక్రునకు కుండిక, అక్షమాల ఉండును. శని మువ్వలు కట్టిన సూత్రమును ధరించును. రాహువు అర్ధ చంద్రుని ధరించును. కేతువు చేతులలో ఖడ్గము, దీపము ఉండును. అనంతుడు, తక్షకుడు, కరోటకుడు, పద్ముడు, మహాపద్ముడు, శంఖుడు, కులికుడు మొదలగు ప్రముఖ నాగ గణములన్నియు సూత్రమును ధరించును. వీరందరును పడగల ఆకారము గల ముఖములతో, గొప్ప తేజఃపుంజముతో ప్రకాశించు చుందురు. ఇంద్రుడు వజ్రము ధరించి గజముపై ఎక్కియుండును. అగ్ని శక్తి హస్తుడై మేక మీద కూర్చుండును. యముడు దండము ధరించి మహిషాధిరూఢుడై ఉండును. ఖడ్గధారియైన నిరృతికి వాహనము మనిషి. వరుణుడు పాశహస్తుడై మకరముపై ఉండును. వజ్రధారియైన వాయుదేవునకు లేడి వాహనము. కుబేరుడు గద ధరించి గొట్టెపై ఉండును. జటాధారియైన ఈశానునకు వాహనము వృషభము.
లోకపాలులందరును ద్విభుజులు విశ్వకర్మ చేతిలో ఆక్ష సూత్రముండును. హనుమంతుని ఫక్తమునందు వజ్రాయుధముండును. రెండు పాదములతో ఒక అసురుని అణగ దొక్కి నిలబడును. కింసరలు వీణాధారులు, విద్యా ధరులు మాలాధారులై ఆకాశమున విహరించు చుందురు. పిశాచముల శరీరములు అస్థిపంజరమాత్ర శేషములుగ నుండును. వేతాళముల ముఖములు భయంకరముగ నుండును. క్షేత్రపాలుడు శూలములు ధరించి యుందురు. ప్రేతముల ఉదరములు పెద్దవిగ నుండును. శరీరములు కృశించి యుండును.
అగ్ని మహాపురాణమునందు సూర్యాది ప్రతిమాలతణమను ఏబది ఒకటవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 51 of the Agni Purāṇa is as follows:
This chapter describes the ritual installation of the kalaśa — the sacred pot that serves as a temporary vessel for the deity's presence during festivals, consecrations, and auspicious rites. The selection of the pot (copper, silver, or gold being most auspicious), its filling with pure water mixed with specific substances — five types of earth, five gems, five metals, five leaves, durva grass — and its covering with a full coconut and mango leaves are described. The mantras for invoking the deity into the kalaśa — drawing upon the Puruṣa-sūkta and specific deity bīja-s — are given. The directional placement of eight kalaśa-s in the eight directions around the central kalaśa, each assigned to a specific deity and color, is described. The kalaśa is affirmed as a complete cosmogram, its rounded body symbolizing the cosmos, its water the primordial ocean, its coconut the deity's head.