సముద్రుడు చెప్పెను : గర్గాచార్యా ! ఉత్తమ శ్రేణికి చెందన శరీరముగల స్త్రీ యొక్క సర్వాంగములును మనోహరముగా నుండును. ఆమె మత్తగజమువలె మందముగా నడచును. ఊరు - జఘనదేశములు విశాలములుగా నుండును. నేత్రములు ఉన్మ త్తపారావతము నేత్రములవలె మదభరితములై కేశములు నీలవర్ణములై యుండును. శరీరము పల్చగాను, రోమరహితముగాను ఉండును. చూడగానే ఆమె మనస్సును మోహింపచేయును. పాదములు పూర్తిగానేలపై ఆనును. స్తనములు ఒకదానితో ఒకటి కలిసి ఉండును. నాభిదక్షిణా వర్తమై ఉండును. యోని రావి ఆకు ఆకారములో నుండును. మణమలు అణగి యుండును. నాభి అంగుష్ట ప్రసూణ ముగ నుండును. పొట్ట వేలాడదు. రోమావళిచే రూక్షముగా నున్న శ్రీ మంచిది కాదు. నక్షత్ర - వృక్ష - నదీనామములు కలది, కలహ ప్రియ, అగు శ్రీ మంచిదికాదు. చాపల్యము లేనిది. కటువచనములు పలుకనిదియగు శ్రీ దేవతాదుల చేతగూడ పూజింపబడిన శుభలక్షణములు కలది. మధూక పుష్పములవలె తెల్లని కపోలములు గల స్త్రీ శుభురాలు. రోమావళితో నిండిన అవయవములు, నాడులు కనబడుచున్న శరీరము కల స్త్రీ ఉత్తమురాలు కాదు. వంకరగానుండి ఒకదానితో ఒకటి కలిసి పోయిన కనుబొమ్మలు కలది కూడ మంచిది కాదు. తన ప్రాణములను పతి పై ఉంచిన, పతికి ప్రియురాలును అగు స్త్రీ లక్షణరహితయైనను శుభలక్షణ సంపన్నగా చెప్పబడినది. సుందరమైన ఆకారమెచటనుండునో ఆచట శుధగుణములు కూడ ఉండును పాదము కనిష్ఠిక (చిన్న వ్రేలు) భూమికి తగలని స్త్రీ మృత్యుస్వరూపురాలే.
ఆగ్నేయమహాపురాణమునందు స్త్రీలక్షణవర్ణనమను రెండువందల నలుబది నాల్గవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 244 of the Agni Mahā Purana is as follows:
The seasonal regimen (ṛtu-caryā) that keeps the body in harmony with the cycles of nature is presented. Agni divides the year into six two-month seasons and prescribes diet, sleep, exercise, oil massage, and behavioral guidelines for each. During adāna-kāla (when the sun draws vitality northward — Śiśira, Vasanta, and Grīṣma), lighter and cooling regimens are recommended; during visarga-kāla (when the moon bestows vitality — Varṣā, Śarad, and Hemanta), nourishing and warming regimens prevail.