పుష్కరుడుపలికెను : ఇపుడు రాజదేవతాద్యభిషేకమునకు సంబంధించిన మంత్రములను గూర్చి చెప్పెదను. ఇవి సకలపాపములను తొలగించును. కలశను కుశ యుక్త జలముతో నింపి రాజాభిషేకము చేసినచో సకల మనోరథములు సిద్ధించును. (మంత్రముల ఆర్థము)- రాజా! బ్రహ్మ విష్ణు శివాది దేవతలందరను నీక అభిషేకము చేయుదురు గాక! వాసుదేవ - సంకర్షణ - ప్రద్యుమ్న - అనిరుద్ధులు, ఇంద్రాది దశ దిక్పాలకులు, రద్ర - ధర్మ - నును దక్ష - రుచి శ్రాద్ధాది దేవతలును నీకు సర్వదా విజయము నిచ్చెదరు గాక. భృగు - అత్రి - వసిష్ఠ- సనక సనందన - సనత్కుమార ఆంగీరస్ - పులస్త్య - పులహ - క్రతు - మరీచి - కశ్యపాదిమహర్షులు ప్రజాసనము చేయు భూపతిని రక్షింతురు గాక. ప్రకాశ వంతులగు “బర్హిషద్” “అగ్నిష్వాత్త” అను పితృదేవతలు నిన్న రక్షింతురు గాక. క్రవ్యాదులు, ఆవాహితులగు ఆజ్యపులు, సుకాలి, ధర్మప్రియ, లక్ష్మి మొదలగు దేవతలను వృద్ధిపొందిన అగ్నులును నీకు అభిషేకము చేయుదురు గాక. అనేక పుత్రవంతుడైన ప్రజాపతి, కశ్యపుని ఆదిత్యాది పుత్రగణము, ఆభినందన - కృశాశ్వులు, ఆరిష్టనేమిభార్యలును నీకు అభిషేకము చేయుదురుగాక. ఆశ్విన్యాది. చంద్రభార్యలు, పులహుని భార్యలు, భూతా - కపి - దంష్ట్రా - సురసా సరమా - దను - శ్యేనీ - భాసీ - క్రౌంచీ - ధృతరాష్ట్రీ - శుకి మొదలగు దేవతలును, సూర్యుని సార థియైన అరుణుడును, నీ ఆభిషేక మును సుసంపన్నము చేయుదురు గాక. ఆతిథి - నియతి - రాత్రి - నిద్రాదిదేవతలును, లోక రక్షణ తత్పరురాలగు ఉమాదేవియు, మేనా - శచీప్రభృతి దేవతలును, ధూమ్రా- ఊర్జా - నైరృతీ - గౌరీ - శివా బుద్ధి - వేలా - నడ్వలా - ఆసిక్నీ - జ్యోత్స్నా దేవతలును, దేవాంగనలును, వనస్పతులును నిన్ను పాలించుగాక.
మహాకల్ప-కల్ప-మన్వంతర-యుగ-సంవత్సర-వర్ష-ఆయన-ఋతుమాస-పక్ష-రాత్రి-దివస-సంధ్యా-తిథి ముహూర్తములు, కాలము యొక్క విభిన్నా వయవములును నిన్ను రక్షించుగాక. సూర్యాది గ్రహములు, స్వాయం భువాది మనువులు నిన్ను రక్షింతురు గాక. స్వాయంభువ-స్వారోచిష-ఉత్తమ-తామస-రైవత చాక్షుష-వైవస్వత సావర్ణి- బ్రహ్మ పుత్ర-ధర్మపుత్ర రుద్రపుత్రదక్షపుత్ర-రౌచ్య-భౌత్యులను పదునాల్గురు మనువులు నిన్ను రక్షింతురుగాక. పేశ్వథుక్ - విపశ్చిత్ –శిఖి-విభు-మనోజవ-ఓజస్వి-బలి-అద్భుతశాంతి-వృష-ఋతధామ-దివస్పృక్-కవి-ఇంద్ర-రైవంత-కుమార- కార్తికేయ–వత్స వినాయక –వీరభద్రనంది-విశ్వకర్మ- పురోజవ - దేవ వైద్య - అశ్వినీకుమారులు, ధ్రు వాద్యష్టవసువులుఈ ప్రధాన దేవతలందరును ఇచట పార్పణము చేసి నీ అభిషేకకార్యమును సుసంపన్నము చేయుదురుగాక. ఆంగిరసుని కులమునందుద్భవించిన పదిమంది దేవతలును, నాలుగు వేదములును సిద్దికొరకై నీకు అభిషేకము చేయుదురుగాక. ఆత్మ-ఆసుష్-మస్-దక్ష-మద-ప్రాణ-హవిష్మత్-గరిష్ఠ-ఋత-సత్యములు నిన్ను రక్షించుగాక. క్రతు–దక్ష-వాసు సత్య-కాల-కామ-ధురి అనువారు నీకు విజయ ప్రదానము చేయుదురుగాక. పురూరవస్-ఆర్ద్రవ-విశ్వేదేవ-రోచన అంగారకాదివిగ్రహ-సూర్య-నిరృతియములు నిన్ను రక్షించుగాక. అజైకపాద-అహిర్బుధ్న్య-ధూమకేతు-రుద్రవుత్రభరత-మృత్యుకాపాలికింక-భవన-భావన-స్వజన్య-స్వజవక్రతుశ్రవస్-మూఢ యాజన-ఉశనసులు నిన్ను రక్షించు గాక. ప్రసప-అవ్యయ-దక్ష-భృగువంశ ఋషి-దవతా-మను–అనుమంతృ - ప్రాణనవబిలవదపానవాయువీతి హోత్ర-నయ-సాధ్య-హంస-విభు-ప్రభ-నారాయణులను లోక క్షేమకారు లగు దేవతలు నిన్ను పాలింతురుగాక, ధాత్మ మిత్ర-ఆర్యమన్-పూషన్-శుక్ర-వరుణభగ -త్వష్టృవివస్వల్-సవితృ భాస్కర విష్ణువులను పండ్రెండుగురు సూర్యులు నిన్ను రక్షించుగాక. ఏకజ్యోతి-ద్విజ్యోతి చతుర్యోతి - ఏకశ క్ర-ద్విశ క్రమహాబలి–త్రిక క్ర-ఇంద్రపతికృత్-మితసంత-మహాబలి. ఆమితఋతజిత్ -సత్యజిత్-సుషేణ-సేనజర్-అతిమిత్ర-పురుమిత్ర అపరాజిత- ఋత ఋకవాక్ధాతృ విధాతృధారణ-ధ్రువులును, ఇంద్రుని పరమమిత్రుడును తేజః శాలియు నగు విధారణుడును, ఐదృక్ష-ఆదృషఏతాదృక్- ఆమితాశన-క్రీడిత –సదృక్ష-సర భ - మహాతపస్-ధరృ - ధుర్య - ధురి - భీమ - ఆభియుక్త - ఆక్షపాత . సహ - ధృతి - వసు - అనాధృష్య - రామ - కామ - జయ - విరాట్టులను నలుబది తొమ్మండుగురు మరుత్తులను దేవతలును నీకు ఆభిషేకము చేసి, నీకు లక్ష్మీ నొసంగుదురు గాక. చిత్రాంగద - చిత్రరథ - చిత్రసేన - కలి -ఊర్జాయు - ఉగ్రసేన - ధృతరాష్ట్ర - నందన - హాహా - హూహూ - నారద - విశ్వావసు - తుంబురులను గంధర్వులు నీ ఆభిషేకమును సుసంపన్నము చేయుదురు గాక; నీకు విజయము నిత్తురు గాక. అతి ప్రధానులై నమునులు, అనవద్యాను కేశీ - మేనకా - సహజన్యా - క్రతుస్థలా - ఘృతాచీ - విశ్వాచీ - పుంజికస్థలా - ప్రహ్లిచా - ఉర్వశీ - రంభా - పంచచూడా - తిలోత్తమా - చిత్రలేఖా - లక్ష్మణా - పుండరీకా - వారుణీ అను దివ్యాప్సరలు నిన్ను రక్షింతురు గాక.
ప్రహ్లాద - విరోచన - బలి - దాణులు, బాణునిపుత్రులు, ఇతర దానవులు, రాక్షసులు, నీ ఆభిషేకమును సిద్ధము చేయుదురుగాక, హేతి - ప్రతి - విద్యుత్ - స్ఫూర్జథు - అగ్రక - యక్ష - సిద్ధ-మణిభద్ర - నందనులు నిన్ను రక్షించుగాక. పింగాక్ష - ద్యుతిమత్ - పుష్పవన్త - జయావహ - శంఖ - పద్మ - మకర - కచ్ఛపములను నిధులు నీకు జయప్రదము లగు గాక. ఊర్ధ్వ కేశాది పిశాచములు, భూమ్యాదులందు నివసించు భూతములు, మాతృదేవతలు, మహాకాలనృసింహులను ఉందు ఉంచుకొని నిన్ను పాలింతురుగాక, గుహ - స్కంద - విశాఖ - నైగమేయులు నీకు ఆభిషేకము చేయుదురుగాక, భూతమునందును ఆకాశము నందును సంచరించు డాకీనులు, యోగినులు, గరుడ-అరుణసంపాత్యాది పక్షులు నిన్ను పాలించు గాక. ఆనంతుడు మొదలగు మహానాగములు, శేష - వాసుకి - తక్షక - ఐరావతమహావద్మ - కంబల - అశ్వతర . శంఖ - కర్కోటక - ధృతరాష్ట్ర - ధనంజయ - కుముద - ఐరావత - పద్మ - పుష్పదంత - వామన - సుప్రతీక - అం జనములను నాగములు ఎల్లప్పుడును అన్ని వైపులనుండియు నిన్ను రక్షించు గాక. బ్రహ్మ వాహనమైన హంసయు, శంకరుని వాహనమైన వృషభము, దుర్గా దేవి వాహనమైన సింహము, యముని వాహనమైన మహిషము నిమ్న పాలించు గాక. అశ్వరాజమైన ఉచ్చశ్రవస్సు, ధన్వంతరి, కౌస్తుభమణి, శంఖజమైన పాంచ జన్యము, వజ్ర - శూల - చక్ర - నందక ఖడ్గాది శస్త్రములు నిన్ను రక్షించు గాక. దృడ నిశ్చయవంతుడగు యమధర్మ రాజు, చిత్రగుప్త - దండ - పింగల - మృత్యు - కాలులు, వాలఖిర్యాది మునులు, వ్యాసవాల్మీ క్యాది మహర్షులు, పృథు - దిలీప - భరత - దుష్యక్తులు, అత్యంత బలవంతుడగు శత్రుజిత్తు, మను - కకుత్థ - అనేనా - యువనాశ్వ - జయద్రథ - మాంధాతృ - ముచుకుంద - పురూరవులు నిన్ను రక్షింతురు గాక. వాస్తుదేవతయు, ఇరువది యెదు తత్త్వమును నీకు విజయము కూర్తురుగాక. రుక్మభౌమ - శిలా భౌమ - పాతాల - నీలమూర్తి - పీతర క్త - క్షితి. శ్వేతభౌమ - రసాతల - భూర్లోక - భువర్లోకాదిలోకములు, జంబూద్వీపము మొదలగు ద్వీపములు నీకు రాజ్యలక్ష్మి నీచ్చుగాక. ఉత్తరకురు - రమ్య - హిరణ్యక - భద్రాశ్వ - కేతుమాల - బలాహక - హరి నర - కింపురుష - ఇంద్రద్వీప - కశేరుమత్ - తామ్రవర్ణ - గభస్తిమత్ - నాగ ద్వీప - సౌమ్యక - గాంధర్వ - వారుణ - నవమాది వర్షములు నిన్ను రక్షించు గాక ; నీకు రాజ్యము నిచ్చుగాక. హిమవత్ – హేమకూట - నిషధ - నీల - శ్వేత - శృంగవత్ - మేరు -మాల్యవతి - గంధమాదన - మహేంద్ర - మలయ - సహ్య - శుక్తిమత్ - ఋక్షవత్- మిధ్యపారియాత్ర - పర్వతములు నీకు శాంతి నిచ్చుగాక. ఋగ్వేదాది వేద చతుష్టయము, షడ్వేదాంగములు, ఇతిహాస - పురాణ - ఆయుర్వేద - గాంధర్వవేద- థనుర్వేదాదులపవేదములు, శిక్షా-వ్యాకరణ - ఛందస్ - నిరుక్త - జ్యోతిషకల్పము అను ఆరు వేదాంగములు, మీమాంసా - వ్యాయ - ధర్మశాస్త్ర - పురాణములు అను ఈ పదునాలుగు విద్యలు నిన్ను రక్షించు గాక.
సాంఖ్య - యోగ - పాశుపత - వేద - పాంచరాత్రములకు సిద్ధాంతపంచక మని పేరు. ఇవియు, గాయత్రీ - శివా - దుర్గా - విద్యా - గాంధారీ దేవులును నిన్ను రక్షించు గాక. లవణ - ఇక్షురస - సురా - మృత - దధి - దుగ్ధ - జలసముద్రములు నీకు శాంతి నొసగు గాక. నాలుగు సముద్రములును, వివిధ తీర్థములును నిన్ను రక్షించు గాక. పుష్కర - ప్రభాస - నైమిశారణ్య - గయాశీర్ష - బ్రహ్మశిర స్తీర్థ - ఉత్తరమావస - కోలోదక - నందికుండ - పంచనదతీర్థ - భృగుతీర్థ - అమరకంటక - జంబూమార్గ - విమల - కమలాశ్రమ - గంగాద్వార - ఈశావర్త - వింధ్య - నీలగిరి - వరాహపర్వత - కనఖలతీర్థ - కొలంజర - కేదార - రుద్రకోటి - వారాణసీమహాతీర్థ - బదరికా శ్రమ - ద్వారకా - శ్రీ శైల - పురుషోత్తమతీర్థ - శాలగ్రామ - వారాహ - సింధు సముద్రసంగమ తీర్థ - ఫల్గుతీర్థ - బిందుసర - కరవీరాశ్రమములును, గంగా - సరస్వతీ - శతద్రు - గండకీ - అచ్ఛోదా - విపాళా - వితస్తా- దేవికాకావేరీ - వరుణా - నిశ్చిరా - గోమతీ - పారా - చర్మణ్వతీ - రూపా - మహానదీ - మందాకినీ - తాపీ - పయోష్ణీ - వేణా - వైతరణీ - గోదావరీ - భీమరథీ - తుంగభద్రా - ఆరణి - చంద్రభాగా - శివా - గౌరి మొదలగు పవిత్ర నదులమ నీకు అభిషేకము చేసి నిన్ను పాలించుగాక.
అగ్ని మహాపురాణమునందు అభిషేకమంత్ర వర్ణనమను రెండువందల పందొమ్మిదవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 219 of the Agni Purāṇa is as follows:
Agni discusses the recitation of Viṣṇu-Sahasranāma as composed within the Mahābhārata, taught by Bhīṣma to Yudhiṣṭhira. The chapter provides the proper pūrva-tantra and uttara-tantra for the recitation, including the dhyāna śloka and the phalasruti. Each of the thousand names is said to encapsulate one specific divine quality of Bhagavān. Agni declares that the daily recitation of the Sahasranāma yields the same merit as the gift of a thousand cows.