అగ్ని దేవుడు పలికెను. సర్వ గీతలలో ఉత్తమోత్తమము ఆగు గీతా సారమును చెప్పెదను. పూర్వము శ్రీకృష్ణుడు భుక్తి ముక్తి ప్రదమగు ఈ గీతను అర్జునునకు బోధించెను. శ్రీ భగవానుడు చెప్పెను. జీవుకు జన్మ రహితుడు కావున మరణించిన వానిని గూర్చి గాని, జీవించి యున్న దానిని గూర్చి గాని శోకము చెందరాదు. ఆత్మ జర, మరణములు లేనిది భేద్యము కానీది. అందువలన కోకాక మును విడువవలేను. విషయమును గూర్చి ఆలోచించు వానికి వాటిపై సంగ మేర్పడును. సంగము వలన కామమం, దాని వలన క్రోధము, దాని వలన సమ్మోహము, దాని వలన స్మృతి భ్రంశము, దాని వలన బుద్ధి పాశము కలుగును. బుద్ధి వాశము వలన మానవుడు నకిఁచును. సత్సంగము వలన దుస్సంగ హానియు కలుగును. మోక్ష మందు కోరిక కల వాడు ఇతర కామములను తొలగించుకొనును. కామము త్యజించిన వాడు ఆత్మ నిష్టు డగుమ. అపుడాతడు స్థిర ప్రజ్ఞుడని చెప్పబడును. సర్వ భూతములకు యేడి నిశ యో దానిలో యోగి మేల్కొని యుండును. చూచుచున్న మునికి యేది రాత్రియే దాని యందు ఇతర భూతముణ మేల్కొని యుండును. ఆత్మ సంతుష్టుడైన వానికి మరి కర్తవ్యము లేమియు వుండవు, కర్మ చేసినను చేయకున్నను ఆతనికి ప్రయోజనమేమియు లేదు. ఓ మహా దాహం ! గుణ కర్మ విపాక తత్త్వము తెలిసిన వాడు గుణములు, గుణము లందు ప్రవర్తించుచున్నవని తెలిసికొని వాటిపై సక్తుడు కాడు. పాపము వంతను జ్ఞాన మనెడు సావతో దాట గలవు. అర్జునా ! జ్ఞానాగ్ని సర్వ కర్మలను భస్మము చేయును. సంగము విడిచి కర్మలను బ్రహ్మార్పణ బుద్ధితో చేయువాడు పద్మ పత్రము, జలము చేత వలె పాపము చేత లిప్తుడు కాడు. యోగ యు కౌత్ముడగు యోగి ఆంతటను సమముగా చూచుచు సర్వ భూతముల యందు తనమ తనలో సర్వ భూతములను చూడగలుగును. యోగ భ్రష్టుడు పవిత్రులగు శ్రీమంతుల గృహము నందు జనించును. కల్యాణ కార్యము చేసిన వాడెవ్వ డను దుర్గతి పొందడు.
గుణమయమైనదియు, దివ్యమైనదియు అగు నామాయ లంఘింప శక్యము కానిది . నన్ను ఎవరు ఆశ్రయింతురో వారు ఈ మాయను దాట లేరు. ఓ భరత వంశ శ్రేష్ఠా ! కష్టములలో నున్న వాడు జిజ్ఞాసువు ప్రయోజనా పేక్ష కలవాడు ఆద్వైత దృష్టి గల జ్ఞాని ఈ నాలుగు విధములగు వారు నన్ను సేవింతురు. ఆక్షర మైన బ్రహ్మ అత్యుత్తమము. స్వభావము ఆధ్యాత్మమని చెప్పబడును. భూత భావోద్భవ కరమగు యజ్ఞమునకు కర్మ యని పేరు. వినాశ శీలమగు పదార్థము ఆది. భూతము పురుషుడు ఆధి దైవతము. ఈ దేహములో నేనే ఆధి యజ్ఞమును. మరణ కాలమున నన్ను స్మరించువాడు నన్నే పొందును. సంశయము లేదు. అంతమున యేయే భావమును స్మరించుచు దేహము వీడుచునో దానినే పొందును. ఆంతమున ప్రాణమును భ్రూ మధ్యము నందుంచి, పరమాత్ముడనగు నన్ను పొందును. “ఓం” అను ఏకాక్షర రూప మగు బ్రహ్మను ఉచ్చరించుచు, దేహము త్యజించువాడు నన్నే పొందును. బ్రహ్మ మొదలు స్తంభము వరకు వున్న అన్నియు నా విభూతులే. శ్రీ మన్తములు తేజోవంతములు ఆగు ప్రాణులన్నియును నా అంశములే. నేనే విశ్వరూపుడను. ఈ విధముగ తెలుసుకొనిన వాడు ముక్తుడగును.
క్షేత్రమను పేరు గల ఈ శరీరమును తెలుసుకొనువాడు క్షేత్రజ్ఞుడు. క్షేత్ర క్షేత్రజ్ఞుల జ్ఞానము నా జ్ఞానమే. మహా భూతములు అహంకారము, బుద్ధి, ఆవ్య క్తము, ఏకాదశ ఇంద్రియములు, పంచ ఇంద్రియ విషయములు, ఇచ్ఛ, ద్వేషము, సుఖము, దుఃఖము, స్థూల శరీరము, చేతనా, ధృతి. ఇవి సంక్షిప్తముగ వికార సహితమగు క్షేత్రము. అభిమానము లేకుండుట, దంథము లేకుండుట, అహింసా, ఓర్పు, ఆర్జవము, ఆచార్యోపాసనము, శౌచము, ఛైర్యము, ఆత్మ నిగ్రహము, ఇంద్రియార్థము లందు వైరాగ్యము, అహంకారము లేకుండుట, జన్మ మృత్యు, జరా, వ్యాధి, దుఃఖ రూపము లగు దోషము) పరిశీలనము, అనాసక్తి, పుత్ర దార గృహాదులందు మమకారము లేకుండుట, ఇష్టానిష్టములు కలిగినపుడు నిత్యము సమచిత్తుడై ఉండుట, ఇతర సంబంధము లేక నాపై చలించని భక్తి, నిర్జన ప్రదేశమును సేవించుట, జన సమూ హము నందు ఆనాసక్తి ఆధ్యాత్మ జ్ఞానము లందు స్థిరత్వము తత్వ జ్ఞాన దర్శనము. ఇది యంతయు జ్ఞానమని చెప్ప బడును. దీనికి విరుద్ధమైనది అజ్ఞానము.
దేనిని తెలుసుకొనుటచే మానవుడు అమృతత్వమును పొందునో దానిని గురించి చెప్పెదను. పర బ్రహ్మ అనాది. సత్త్వ స్వరూపము. అది అంతటను పాణి పాదములు కలది. అన్ని వైపులను నేత్ర, శిరో, ముఖములు కలది. అన్ని వైపు లను కర్ణములు కలది. సర్వమును ఆవరించి యుండును. సకలేంద్రియ గుణములను భాసిఁప చేయునది, సకలేంద్రియ శూన్యము. ఆది సంగ రహితము, సర్వమును భరించునది. నిర్గుణమ, గుణములను అనుభవించునది. భూతముం బయటను, లోపలను వున్నది. ఇది అచరము. చరము కూడ. సూక్ష్మ మగుటచే ఇది అజేయము. ఇది దూరమునందును వున్నది. సమీపము నందును వున్నది, భూతములందు అవిథ క్షమైనను విభ క్తము వలె నుండునది. భూతములను థరించునది, వాటిని మింగి వేయునది. ఇది జ్యోతిస్సులకు జ్యోతిస్సు. తమోతీతము. జ్ఞాన, జ్ఞేయ స్వరూపము, జ్ఞాన గమ్యము. అందరి హృద యములందు వున్నది. కొందరు ఈ ఆత్మను ధ్యానముచే తమ ఆంతఃకరణము నందే చూచెదరు. కొందరు సాంఖ్య యోగము చేతమ, కోందర కర్మయోగము చేతను చూచెదరు. ఈ విధముగా తెలియజాలని వారు ఇతరుల నుండి విని ఉపాసింతురు. శ్రుతి పరాయణులగు వారు కూడ మృత్యువును తప్పక తరింతురు.
సత్త్వము వలన జ్ఞానము, రజస్సు వలన లోభము, తమస్సు వలన ప్రమాద మోహ అజ్ఞానములు పుట్టును. గుణ ములు వాటి వాటి పనులను చేయుచున్నది అని తెసుకొని జ్ఞాని తాను చలించడు. మాన అవమాన మిత్ర శత్రువుల విష . యమున తుల్యముగ నుడు ఆ త్యాగి గుణాతీతుడు. ఈ అశ్వత్థాము ఊర్ధ్వ మూలము, అధశ్శాఖము, వినాశరహితము. దీనికి ఛందస్సులు పర్ణములు అని ఎవ్వడు తెలుసుకొనునో అతడే వేదవేత్త. ఈ లోకమున దైవము, ఆసురము అని రెండు భూత సర్గ మాలున్నవి. దైవీ సంపత్తి వలన మానవులకు అహింసా, క్షమా మొదలగునవి వుండును. అసురీ సంపద వలన శాచము కాని, ఆచార ము కాని వుండదు. క్రోధ లోభ కామములే నరకము. అందుచే ఆత్రయమును త్యజింపవలెను. సత్త్వాది గుణములను బట్టి యజ్ఞ తపో దానాదులు త్రివిధములుగా వుండును. ఆయుః సత్త్వ, బల, ఆరోగ్య, సుఖ కరమగు, అన్నము సాత్త్వికము. దుఃశము, శోకము, ఆమయము కల్గించు తీక్ష్ణరూవెన్నము రాజసము. ఆమేధ్యము ఉచ్చిష్ణ, పూతి, నీర సమగు అన్నము, తామసము. నిష్కామముగా వీధి పూర్వకముగా చేయు యజ్ఞము సాత్త్వికము. ఫలాపేక్షచే దంధమున చేయు యజ్ఞము రాజసము శ్రద్ధా ముత్రా విధి పూర్వకముగ చేయు తపస్సు శారీరము. దేవ పూజా, అహింసాదికము, వాజ్మ గు తపస్సు. ఇతరులకు బాధను కల్గించనిది సత్యము ఐన వాక్యము. స్వాధ్యాయము జపము. ఇది కూడ వాజ్మయ తపస్సు. చిత్త సంశద్ధి కొరకై మౌనమును అవలంబించుట మానస తపస్సు. దీనికే ఆత్మ వినిగ్రహమని పేరు. ఇలా పేక్ష లేని తపస్సు సాత్వికము. ఫలాదులకై చే యునది రాజసము. పర పీడకై చేయునది రామసము. యుక్త దేశాదులందు చేయు దానము సాత్వీకము. ప్రయోజనము నుద్దేశించు దానము రాజసము. అయుక్త దేశాదులందు అనాచర పూర్వముగ చేయు దానము తామసము.
బ్రహ్మ యొక్క నిర్దేశము, ఒం, తత్, సత్ అని త్రివిధము. మానవులకు యజ్ఞ దానాది కర్మలు భుక్తి ముక్తి ప్రదములు. అనిష్టము, ఇష్టము, మిశ్ర ము, ఆని, త్రివిధమగు కర్మ ఫలము, త్యాగ రహితులకే మరణానంతరము కలుగును. సన్యాసులకు ఎన్నడును కలగదు. కర్మ సంయోగము, మోహము, క్లేశము, భయము మొదలగు దానివలన చేయునది తామసకర్మ. కామము లేకుండా చేయునది సాత్త్వికకర్మ. తద్భిన్నము రాజసము, అధిష్ఠానము, కర్త వివిధ కరణ జీతము, వివిధ చేష్టలు దైవము ఈ ఐదును కర్మ హేతువులు. ఏకత్వజ్ఞానము సాత్త్వికము. భేదజ్ఞానము రాజసము. అతాత్త్విక జ్ఞానము, తామసము. ఆ కామకర్మ సాత్త్విక ము, సకామ కర్మరాజసము. మోహకృతమగు కర్మ తామసము, సిద్ద్య సిద్దులయందు, సమముగా నుండు కర్త సాత్త్వికుడు తద్భిన్నుడు రాజసుడు, శఠుడు ఆలసుడులైన వాడు తామసుడు. కార్యాది నిశ్చయము సాత్త్వికము కార్యార్థమైన నిశ్చయము రోజు సము, తద్విపరీతము తామసము . మనః సైన్యము సాత్త్విక ము. ప్రీతికామము రాజసము. దుఃఖాదికము తామసము. ప్రారంభమున దుఃఖముగనున్న ను, చివర సుఖము నిచ్చునది. సాత్వికము. ప్రారంభమున సుఖము, అంతమున దుఃఖము అయినది రాజసము. ప్రారంభమునందు ఆంతము నందు దుఃఖ హేతువై నది తాపసము. ఏ విష్ణువు ఈ ప్రపంచము నంతను వ్యాపించియున్నాడో, ఆతడే ఈ భూతముల ప్రవృత్తి కి హేతువు. అట్టి విష్ణుపును స్వకర్మచే అర్చించి సిద్ధిని పొందును. సర్వావస్థలయలదును. సర్వకాలములందును. మనోవాక్కాయ కర్మలచే బ్రహ్మాది స్తంబ పర్యంతమగు ఈ జగత్తు విష్ణు స్వరూపము. అని భావన చేయు భగవద్భక్తుడగు భాగవతుడు తప్పక సిద్ధిని పొందును.
అగ్ని మహాపురాణమువ గీతసారమను మూడువందల ఎనిమిది ఒకటవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 382 of the Agni Mahā Purana is as follows:
The Yamagītā — the teaching given by Yama-dharmarāja to Naciketas and attributed in the Agni Purāṇa tradition to the Kaṭhopaniṣad framework — is narrated. Yama summarizes the teachings of the great sages on the highest śreyas (well-being) for human beings: Kapila teaches detachment from enjoyments and constant ātma-darśana; Pañcaśikha teaches equanimity and freedom from ego; Gaṅgā-Viṣṇu teach awareness of the stages from garbhāvāsa onward; Janaka teaches resolving the ādhyātmika and other forms of suffering at their source; Brahma teaches that peace through dissolving the false sense of difference between jīva and Paramātman is the highest good; Jaigiṣavya teaches detachment in Vedic karma; Devala teaches renunciation of all undertakings; Sanaka teaches the abandonment of kāma. Yama then provides a concise recapitulation of aṣṭāṅga yoga — yama, niyama, āsana, prāṇāyāma, pratyāhāra, dhāraṇā, dhyāna, samādhi — and the celebrated chariot metaphor from the Kaṭhopaniṣad: the ātman is the rider, the body the chariot, the intellect the charioteer, the mind the reins, the senses the horses. The chapter ends with Agni declaring to Vasiṣṭha that the ātyantika pralaya — final liberation — is nothing other than the emergence of brahma-buddhi (awareness of Brahman as all) through Vedānta-jñāna.