ఆగ్నిదేవుడు పలికెను. పద్మాసనము మొదలగు ఆసనము బంధించి పరమాత్మధ్యానము చేయవలెను. పవిత్ర మైన ప్రదేశమున చాల ఎత్తుకానిదియు చాల పల్లము కానిదియు వస్త్రము అజినము, కుశలు పరచిన స్థిరమైన ఆసనమును ఏర్పరచుకొని దానిపై కూర్చుండి చిత్త ఇంద్రియ పనులను అరికట్టి మనస్సు ఏకాగ్రముచేసి ఆత్మ విశుద్ధి కై యోగాభ్యాసము చేయవలెను. శరీరమును శిరస్సును కంఠమును సమముగా ఉన్నట్లు స్థిరముగ నిలపి తన నాసికాగ్రమును చూచుచు దిక్కు లను చూడక మణవలచే వృషణములను జన నేంద్రియమును రక్షించుచు తొడ పై బాహువులను అడ్డముగా వుంచి ఎడమ అర చేతిలో దక్షిణ హస్త పృష్టభాగమును ఉంచి ముఖముమ కొంచెము ఎత్తి ముందుకు చొచ్చుకొనునట్లు చేసి ధ్యానము చేయ వలెను. తన దేహములో నున్న వాయువు పాణము దానిని నిరోధించుట ప్రాణాయామము ఒక నాసికా పుటమును వేలితో నొక్కి పట్టి రెండవనాసికా పుటము నుండి ఉదరములోనున్న వాయువును పైకి పంపవలెను. ఇట్లు రేచనము చేయుటచే దీనికి రేచక ప్రాణాయామ మని పేరు. బాహ్యవాయువుతో దేహమును తిత్తిని నింపినట్లు నింపి అట్లే వుండవలెను పూరించుటచే. దీనికి పూరక మని పేరు. లోపల వాయువును విడువక బయటనున్న వాయువును లోపలకు తీసుకొనక. సంపూర్ణ కుంభము వలె సిరు డై వుండవలెను. దానికి కుంభకమని పేరు. వండేండు మాత కాలము ఉద్ఘాతము ఆంతకాలమ ప్రానాయామము చేయుట కనిష్టము. రెండు ఉద్చాతముల కాలము అనగా ఇరువది నాలుగు మాతల కాలము మధ్యమము. మూడు ఉద్ఘాతముల కాలము అనగా ముప్పది ఆరు మాతల కాలము ఉత్తమము. స్వేదమును కంపమను అభిఘాతమును కల్గించు ప్రాణాయామము ఉత్తమోత్తమము. తనకు అధికారము లేని ప్రాణాయామ రూమిక ల ఆధిష్టించకూడదు. ప్రాణాయా మము చే యు వానికి పాకాన్వాసాదులు తొలగును. ప్రాణము జయించిన వానికి మల మూత్రాది దోషములు కూడ అత్యల్ప ముగ వుండును. ఆరోగ్యము శీఘ్రముగా నడచుట ఉత్సాహము స్వరమాధుర్యము బలము శరీర వర్ణము స్వచ్చ మగుట సకల దోషమల క్షయము . ఇది ప్రాణాయామముల వలన కలుగు లాభములు. జప, ధ్యానము లేని ప్రాణాయామము అగర్బము. ఆవిఉన్న ది సగర్బము. ఇంద్రియ జయము కోరు వాడు.. సగర్బ ప్రాణాయామము చేయవలయును జ్ఞాన వైరాగ్యముల చేతను, ప్రాణాయామము చేతను ఇంద్రియముణను జయించిన వాడు సర్వమును జయించినట్లే. స్వర్గము వరకము అనునవి కూడా ఇంద్రియములే. వశము చేసికొనబడిన ఇంద్రియములు నర కమును ఇచ్చును. ఈ శరీరము రథము. ఇంద్రియము: ఆశ్వము. మనస్సు సారథి. ప్రాణాయామము కొరడా, మాయ జావము వైరాగ్యము అను కళ్ళెములతో మనస్సును స్వాధీనములో ఉంచుకొనును. ఈ విధముగా ప్రాణాయామముచే నిరోధింపబడిన మనస్సు మెల్ల గా నిశ్చలత్వమును పొందును మాసమునకు ఒసారి కళాగ్రముతో జల బిందువును త్రాగుచు నూరు సంవత్సరములు ఎంత తపస్సు చేసిన ఎంత ఫలమో అంత ఫలమును ప్రాణాయామమిచ్చును. విషయ సముద్రములో ప్రవర్తించిన ఇంద్రియములను వెనుకకు లాగి నిగ్రహించుట ప్రత్యాహారము. నీటిలో మునిగి పోవుచున్నట్లు, విషయములలో మునిగి పోవుచున్న తనను తానే ఉద్దరించుకొనవలెను భోగములనెడు నది యొక్క వేగము చే కొట్టుకొని పోవువాడు జ్ఞాన మనెడి వృక్ష మును ఆశ్రయించవలెను.
అగ్ని మహా పురాణమున ఆసన ప్రాణయామ ప్రత్యాహార నిరూపణ మను మూడు వందల డెబ్బది మూడవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 374 of the Agni Mahā Purana is as follows:
The sixth aṅga — dhyāna (meditation) — is described as an uninterrupted stream of Viṣṇu-cintana (thought of Viṣṇu), without any break in awareness. Two modes of dhyāna are distinguished: sākāra (with form, meditating on Viṣṇu's four-armed or eight-armed form seated on the eight-petalled lotus of the heart) and nirākāra (formless, meditating on the attributeless Brahman as pure awareness). The eight-petalled hṛdayapadma — with the eight śaktis on its petals — is visualized in detail, and Viṣṇu is placed at its center, radiant as ten million suns. The interweaving of japa and dhyāna is recommended, with japa igniting the concentration that sustains dhyāna. The japayajña (sacrifice of repetition) is declared to surpass all other yajñas, and steady dhyāna leads ineluctably to samādhi and liberation.