అగ్ని మహా పురాణము

193 - అథ శివరాత్రివ్రతమ్

అగ్నిదేవుడు చెప్పెను: ఇపుడు భుక్తి ముక్తి ప్రదమగు శివరాత్రివ్రతమును గూర్చి చెప్పెదను ఏకాగ్రచిత్త మతో వినుము మామఫాల్గుణమాల మధ్య వచ్చు కృష్ణ చతుర్దశినాడు కోరికలు గలవాడు ఉపవాసముండవలెను. రాత్రి జాగరమ చేసి ఇట్లు చెప్పవలెను. “నేను చతుర్దశినాడు ఉపవాస ముండి శివరాత్రి వ్రతము చేయుచున్నాను. నేను వ్రతముక్తుడ నై రాత్రి జాగరము చేసి శివుని పూజ చేయుచున్నాను. భోగమోక్షమలమ ప్రసాదించు శివుని ఆవాహనము చేయుచున్నాను. శివా! నీవు నరకసముద్రమును దాటించు నౌక వంటివాడవు. నీకు నమస్కారము. నీవు ప్రజారాజ్యాదుల నిచ్చువాడవు మంగలమయుడవు, శాంతస్వరూపుడవు. నీకు నమస్కారము. నీవు సౌభాగ్య - ఆరోగ్య - విద్యా - ధన - స్వర్గముల నిచ్చువాడవు. నాకు ధర్మమును, ధనమును, కామభోగాదికమును ప్రసాదించుము. నన్ను గుణ - కీర్తి - సుఖసంపన్ను ని చేయుము. నాకు స్వర్గ - మోక్షముల నిమ్ము” శివరాత్రి వ్రతప్రభావముచే పాపాత్ముడై న సుందర సేను డన వ్యాధుడు కూడ పుణ్యవంతు డాయెను.

            ఆగ్ని మహాపురాణమునందు శివరాత్రివ్రత మను నూట తొంబది మూడవ అధ్యాయము సమాప్తము.