హయగ్రీవుడు పలికెను - ఇప్పుడు సర్వసాధారణమైన దేవాలయమును గూర్చి చెప్పెదను, వినుము. దేవాలయ మును నిర్మింపదలచిన విద్వాంసుడు, నలుపలకలగా ఉన్న క్షేత్రమును పదువారు భాగములుగా విభజింపవలెను. వాటిలో మధ్యనున్న నాలుగు భాగములతో, ఆయముతో కూడిన గర్భమును నిశ్చయించి. మిగిలిన పండ్రెండు భాగములను గోడల నిమిత్తము నిర్ణయించుకొనవలెను. పై పండ్రెండు భాగములలో నాలుగు భాగముల పొడవు ఎంత ఉండునో, గోడల ఎత్తు అంత ఉండవలెను, శిఖరము ఎత్తు గోడల ఎత్తునకు రెట్టింపు ఉంచవలెమ, శిఖరము ఎత్తులో నాల్గవవంతు ఎత్తు దేవాలయ పరిక్రమ ఎత్తు ఉంచవలెను. రెండు పార్శ్వముందును ఉన్న మార్గముల (ద్వారము) కొలత ఈ కొలతను బట్టియే ఉండ వలెను. ఆ ద్వారములు సమాన ప్రమాణములై ఉండవలెను. ఆలయము ఎదుటనున్న ప్రదేశము విస్తారము కూడ శిఖర ముతో సమానముగా ఉండవలెను. అందముగా ఉండుటకై దాని విస్తారము శిఖతము కంటే రెట్టింపు ఉండునట్లు కూడ చేయ వచ్చును. ఆలయము ఎదుటనున్న సభామండపము విస్తారము, గర్భ సూత్రమునకు రెట్టింపు ఉండవలెమ. దేవాలయ పాద స్తంభముల పొడవు గోడపొడవుతో సమముగా ఉండవలెను, వాటికి మధ్య స్తంభముల మర్చి ఆందముగా ఉండు నట్లు చేయవలెను. ముఖమండప ప్రమాణము ఆలయ గర్భ ప్రమాణముతో సమముగా నుండవలెను. పిమ్మట ఎనుబది ఒక్క పదముల వాస్తు మండపమును ఆరంభింపవలెను.
మొదట ద్వారన్యాసము దగ్గర నున్న పదములలో ఉండు దేవతలను పూజింపవలెను. పిమ్మట ప్రాకార విన్యాసము దగ్గరనున్న దేవతలను, అంతమునందు పదములందు స్థాపింపబడిన ముప్పది ముగ్గురు దేవతలను పూజింపవలెను. ఇది ప్రాసాదముల సర్వసాధారణ లక్షణము. ఇపుడు ప్రతిమా మానాను సారముగ నిర్మించు ఇతర ప్రాసాదములను గూర్చి వినుము.
ప్రతిమ ఎంత పెద్దది ఉండునో, అంత పెద్ద ఆందమైన పిండి నిర్మింపవలెను. పిండిలో సగము ప్రమాణము గల గర్బమును నిర్మించి, గర్బమానాను సారముగ గోడలు పెట్టవలెను. గోడల ఎత్తు వాటి వెడల్పును అనుసరించి ఉండవలెను. విద్వాంసుడు శిఖరము ఎత్తు గోడ ఎత్తుకు రెట్టింపు ఉంచవలెను. శిఖరము ఎత్తులో నాల్గవవంతు ఎత్తున ఆలయమునకు పరిక్రమ ఏర్పరుపవలెను. ఆలయము ముందున్న ముఖ మండపము గూడ అదే ఎత్తుతో నిర్మింపవరెను. గర్భము ఎనిమిదవ వంతు ప్రమాణముండు నట్లు రథకములు బైటకు వచ్చు మార్గము నిర్మింపవలెను. లేదా పరిధి మూడ వభాగమును అనుసరించి రథకములను (చిన్ని రథములను) నిర్మింపవలెను. వాటి మూడవ వంతు ప్రమాణమున రథ నిర్గ మద్వార మేర్పరుపవలెను. మూడు రథకముల పై సర్వదా మూడు వామములను స్థాపింపవలెను.
శిఖరము కొరకు నాలుగు సూత్ర పాతములు చేయవలెను. భకనాస పైనుండి సూత్రము ఆడ్డముగా పడవేయ వలెను. శిఖరము సగ ము భాగమున సింహ ప్రతిమను నిర్మింపవలెమ. శుక నాస్త పై సూత్రము స్థిరముగానుంచి దానిని మధ్యసం ధివరకును తీసికొనివెళ్ళవలెను. రెండవ పార్శ్యమునందు గూడ ఈ విధముగానే సూత్రపాతము చేయవలెను శుకనాసపై వేసి నిర్మించి, దానిపై అమలసారమను పేరుగల, కంఠముతో కూడిన కలశము నిర్మింపవలెను. అదీ వికరాలముగ ఉండగూడదు. వేదిమానము ఉన్నంతవరకునే కలశను నిర్మింపవలెను. ఆలయద్వారము వెడల్పు ఎంత ఉండునో దానికి రెట్టింపు ఎత్తు ఉండవలెను. ద్వారము చాల అందముగా శోభాసంపన్న ముగా ఉండునట్లు నిర్మింపవలెను. ద్వారముల పై భాగమున సుందరములును, మంగళకరములును ఆగు వస్తువులతోపాటు రెండు ఉదుంబర శాఖలు నిర్మింపవలెను.
ద్వారము నాల్గవ భాగమున చండుడు, ప్రచండుడు, విష్వక్సేనుడు, వత్సదండుడు అను నాలుగు ద్వార పాలకుల మూర్తులను నిర్మింపవలెను ఉదుంబరశాఖ సగభాగమున సుందరమగు లక్ష్మీవిగ్రహము నిర్మింపవలెను. ఆమె చేతిలో కమలముండవలెను. దిగ్గజములు కలశములతో ఆమెను స్నానము చేయించు చుండవలెను. ప్రాకారము ఎత్తు ఆలయము ఎత్తులో నాల్గవవంతు ఉంచవలెను. ఆలయ గోపురముఎత్తు ఆలయము ఎత్తుకంటె నాల్గవవంతు తక్కువ ఉండవలెను. దేవతా విగ్రహము ఐదు హస్త ముల విగ్రహమైన చోదాని పీఠిక ఒక హస్త ముండవలెను.
విష్ణ్వాలయము ఎదుట ఒక గరుడ మండపము, భౌమాది ధామములును నిర్మింపవలెను. మహావిష్ణువు విగ్రహ మునకు చుట్టు, ఎనిమిదివై పులందును విష్ణుప్రతిమకంటే రెట్టింపు ప్రమాణముగల ఆవతారమూర్తులను నిర్మింపవలెను తూర్పున వరాహము, దక్షిణమున నృసింహమూర్తి, పశ్చిమమున శ్రీధరుడు, ఉత్తరమున హయగ్రీవుడు, ఆగ్నేయమున పరశురాముడు, నైరృతి దిక్కునందు శ్రీరాముడు, వాయువ్యమున వామనుడు, ఈశానమున వానుదేవుడు వీరిమూర్తులను నిర్మింపవలెను. ఆలయ నిర్మాణమును ఎనిమిది, పండ్రెండు మొదలగు సరిసంఖ్యల స్తంభములతో చేయవలెను. ద్వారము ఆష్టమాద్యంశలు తప్ప కలుగు వేధచేదోష మేమి మును ఉండదు.
అగ్ని మహాపురాణమునందు ప్రాసాదలక్షణమను నలుబదిరెండవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 42 of the Agni Purāṇa is as follows:
This chapter describes the typology and characteristics of temple architecture according to Āgamic principles. The three principal styles — Nāgara (northern), Vesara (mixed), and Drāviḍa (southern) — are mentioned, along with the defining proportional systems governing each. The ground plan (vāstu-maṇḍala) with its 64 or 81 padas and the assignment of presiding deities to each zone of the site are described. The proportional relationship between the garbhagṛha (sanctum), the maṇḍapa (pillared hall), the antarāla (vestibule), and the gopura (tower) is specified. The heights of the śikhara (tower) and its relationship to the breadth of the base are given in units. The chapter affirms that a properly proportioned temple is the cosmic body of the deity, and every architectural element corresponds to a body part or cosmic principle.