పరమేశ్వరుడు చేప్పేను. ఇపుడు భుక్తి ముక్తి ప్రదాయకమగు దేవాలయ లింగశౌవన విధానమును చేప్పెదను. ముక్తి కొరకు చేయులింగ ప్రతిష్ట ఎపుడై నను చేయవచ్చును. కాని భోగ సిద్ధి కె చేయులింగ ప్రతిష్టమాత్రము. ఉత్తరాయణము నందు చేయవలెను. మాఘాది మాసవచకములో, శైత్రమును విడచి, దేవతాప్రతిజ్ఞ చేయవలెను. గురు శుక్రులు ఉద ఉంచి నపుడు మొదటి మూడు కరణములందును చేయవలెను... రెండు పక్షములందును పంచమి వరకను ఉన్న తిథులు ప్రతిష్ఠకు శుభమైనవి. - చతుర్థి, నవమి, షష్టి, చతుర్దశి విడిచి మిగిలిన తిధులు క్రూరమైన వారములు. కానిచో ఉత్తమ మైనవి. శతభిషడ్ - ధనిష్టా - ఆర్దా - అనురాధా ఉత్తరాత్రయ - రోహిణి-శ్రవణనక్షత్రములు స్థిరప్రతిషా ప్రారంభము నకు ఉత్తమములు, కుంభ, సింహ, వృశ్చిక, కన్యా - వృషభ లగ్నములు శ్రేష్ఠములు. గురుడు నవమ - సప్తమ స్థానము లలో ఉన్నచో శుభము. షష్ణ - అష్టమ - దశమి - చతుర్థ స్థానములందు బుధుడున్న చో శుథము. షష్ఠము. తప్ప పై స్థానములో శుక్రుడున్న శుభము. తృతీయ - సప్తమ - షష - దశమ స్థానములందు చంద్రుడు సర్వదా బలదాయకుడు. సూర్యుడు దశమ , తృతీయ - షష్ఠములందున్న చో శుభఫలము నిచ్చును. తృతీయ - షష్ఠ - సప్తమములందు రాహువు శుభకారకుడు. శని - కుజ - కేతువులు షష్ణ - తృతీయ స్థానములందు శుభము, శుభ - క్రూర పాపగ్రహములు ఏకాదశములో నున్నచో శుభకరములు. సమ స్తగ్రహముల దృష్టి సప్త మమున పూర్ణముగా నుండును. పుచమ నవమ స్థానములందు ఆర్ధదృష్టి. తృతీయ - దశమ దృష్టి పాదదృష్టి, అష్టమస్థానమునందు దృష్టి త్రిపాదదృష్టి. మీనమేష వృషకుంభ రాశుల భోగము మూడు ముప్పావు ఘడియలు, మకరమిథునముల భోగము ఐదు ఘడియలు, ధనుస్సు, వృశ్చికము, సింహము, కర్కటకము వీటి భోగము ఆరు నాడులు, తులా కన్యారాశుల భోగము ఐదున్నర నాడులు. స్థిర లగ్నముకైన సింహ, వృషభ, కుంభములు సిద్ధిదాయకములు, ధనుస్తులా మేషములు చరరాశులు, మూడవ సంఖ్య గల రాశులు (మిథున - కన్యాదులు) ఉభయ స్వభావములు. కర్కట - మకర - వృశ్చికములు సంన్యాసమునకు అనర్ఘములు. శుభగ్రహదృష్టి గల లగ్నము శరభము - శుభ గ్రహమున్న లగ్నము శ్రేష్ఠము. లగ్నమునందు గురు - శుక్ర - బుధులున్నచో ధన - ఆయు - రాజ్య - శౌర్య - బల - పుత్ర - యశ్ - ధర్మాదులను అధికముగా నిచ్చును. ప్రథమ - చతుర్థ - సప్తమ - దశమములకు పేరు కేంద్రస్థానములందున్న గురు శుక్ర బుధులు సంపూర్ణ శుభఫలముల నిత్తురు. తృతీయ - ఏకాదశ - చతుర్ధ స్థానము లందు పాపగ్రహములున్నచో శభనలమ నిత్తురు.
అందువలన వీటిని, ఇతర శుభగ్రహములను, ఇతర శుభతిథులను ప్రతిష్ఠాకర్మ విషయమున విద్వాంసుడు నిర్ణయించుకొనవలెను. ఆలయము ఎదుట దానికంటే పది రెట్లు లేదా దానితో సమానమైన లేదా మెట్టునుండి వ హస్తముల దూరము భూమి విడచి మండప నిర్మాణము చేయవలెను. ఆ మండపము చతురశ్రమై నాలుగు ద్వారములు కలదై ఉండ వలెను. దానిలో సగము భూమి గ్రహించి స్నానార్ధమై మండవము నిర్మింపవలెను. దానికి ఒకటి లేదా నాలుగు ద్వారము లుండవలెను. ఈ స్నానమండపము ఈశాన్యమునందు గాని తూర్పునగానీ ఉత్తరమునందు గాని . ఉండవలెను. మొదటి మండపము ప్రమాణము ఎనిమిది హస్తములు పది హస్తములు, లేదా పండ్రెండు. హస్తము లుండవలెను. మిగిలిన ఎనిమిది మండపములు రెండేసి హస్తములు పెంచి నిర్మించవలేను. మధ్య మండలమునందు నాలుగు హస్తముల వేది నిర్మించవలెను. దాని నాలుగు కోణములందును, నాలుగు స్తంభము లుండవలెను. వేది - పాదముల మధ్యస్థమును వీడచి కుండములను నిర్మించవలేను. ఇవి తొమ్మిది లేదా పది ఉండవలెను. ఈశాన్యమునందు గాని తూర్పునందు గాని ఒకే కుండమును నిర్మించవలెను. ఆది గురుస్థానము. ఏబది. హోమములు చేయు కుండము ప్రమాణము పిడికిలి ఉండ వలేను. నూరు హోమములై నచో జానెడు, వెయ్యి హోమములు చేయవలసియున్న చో ఒక హస్తము, పది వేల హోమము లైనచో రెట్టింపు ఉండవలెను. లక్ష హోమములకు నాలుగు హస్తములు, ఒక కోటి హోమములకు ఎనిమిది హస్తములు ఉండవలెను. కుండమును అగ్నేయమునందు భగాకారముగను, దక్షిణమున అర్ధచంద్రాకారమునను, నైరృతి యందు త్రికోణాకారముగను, వాయవ్యమున షట్కోణముగను, ఉత్తరమున కమలాకారముగను, ఈశాన్యమునందు అష్ట కోణముగను నిర్మించవలెను. కుండము అన్ని వైపుల సమముగను, పల్లముగను ఉండవలెను. పైన మేఖలలు నిర్మించ వలెను. బైట వరుసగా నాలుగు, మూడు, రెండు అంగుళముల వెడల్పు గల మేఖల నిర్మించవలెను. మేఖలలు కుండా కారముతో సమానోకారములై ఉండవలెను. వాటిపై మధ్య భాగమున రావి యాకు ఆకారముగల యోనియుండవలెను. దాని ఎత్తు ఒక అంగుళము, వెడల్పు ఎనిమిది అంగుళములు ఉండవలెను. “పొడవు గుండార్ధముతో సమానముగాఉండ వలెను యోని మధ్యభాగము కుండ కంఠము వలె నుండవలెను పూర్వ ఆగ్నేయ -దక్షిణములండు ఈకముల యోని ఉతారాదీ ముఖముగ ఉండవలెను. ఇతరదిక్కులందున్న కుండముల యోని పూర్వాభిమళముగ నుండవలెను. ఈశాన్యకుండ ఉని ఉత్తరాభి ముఖముగా గాని, పూర్వాభిముఖముగా గాని ఉండవలెను. కుండములో ఇరువది నాల్గవ భాగము అంగు శము. తదమపారము విభజించి మేఖలా - కంఠ - నాభులను నిశ్చయించవలెను. ముడపము పూ్వూదీదిక్కులందు ద్వారమలు వరుసగ ప్లక్ష ఉదుంబర ఆశ్వ వటదారువులతో నిర్మింపబడవలెను. పూర్వాదిదిక్కులనుండి వరుసగ వాటి పేర్లు శాంతిభూతి బల ఆరోగ్యములు ద్వారముల ఎత్తు ఐదు, ఆరు, లేదా ఏడు హస్తము లుండవలెను. వాటిని చేతి లోతు త్రవ్విన గోతులలో నిలుపవలెను.. వాటి విస్తారము ఎత్తులో సగము ఉండవలెను. వాటిపై మామిడాకులు మొదలగు నవి కట్టవలెను.
మండప పూర్వాది, దిక్కులందు వరుసగ, ఇంద్రాయుధము వలె అనేక వర్షములు గల పతాకను, రక్త-కృష్ణధూసర.శ్వేత.హరిత-సువర్ణవర్ణ స్ఫటిక వర్ణపతాకలను ఎగురవేయవలెను. ఈశాన్యమునందును, పూర్వమధ్యమునందును బ్రహ్మకొరకు రక్తవర్ణ పతాకను, నైరృతి.పశ్చిమ మధ్య భాగములందు అనంతునికొరకు నీలవర్ణపతాకను ఎగుర వేయవలెను. ధ్వజముల పతాక లు ఐదు హస్తముల పొడవు, అందులో సగము వెడల్పు ఉండవలెను. ధ్వజదండము: ఎత్తు ఐదు హస్తము లుండవలెను. ధ్వజము లావు రెండు చేతులతో పట్టుకోమటకు వీలగు నట్లు ఉండవలెను. పర్వత శిఖర ఠాజద్వార నదీతటజ్వ లా.హస్తిలావల్మీకముల మట్టిని, ఏనుగుదంతములతో పెకలించిన మట్టిని, ఎద్దు కొమ్ములతో పెకలించిన మట్టిని, వూహము పెకలించిన మట్టిని, గోష్ణ చతుష్పథముల మట్టిని ఈ పండ్రెండు. విధమాల మట్టిని గ్రహించవలెను, విమస్థాపనమునకు పండ్రెండు విధముల మట్టిని, శివసాపవమునకు- ఎనిమిది విధముల మట్టిని ఉపయోగించవలెను. న్యగ్రోధ ఉదుంబర. అశ్వత్థా-చూత-జంబూవృక్షముల బెరడునుండి తీసిన ఐదు కషాయములు, ఎనిమది విధము లైన ఋతువలసలు సంగ్రహించ వలెను, తీర్థజల సుగంధిత జలములు, స్విషధి మిశ్ర జ్వము, సస్యపుష్పమిశ్రిత జలము, స్వర్ణమిశ్రిత ఇన, రత్న మిశ్రిత జలము, గోశృంగ స్పర్శయుక్త జలము, పంచగవ్య-పంచామృతములు-వీటినన్నిటిని దేవతాస్నానముకొరకై సిద్దమ చేసికొనవలెను. విఘ్నము కలిగించువారిని భయ పెట్టుటకై పిండితో చేసిన వజ్రాద్యాయుధములను గూడ సిద్దము చేసికొన వలెను. సహస్రఛిద్రము లున్న కలశమును, మంగళార్థమై గోరోచనమును సిద్ధము చేసికొనవలెను. స్నానార్ధమై వంద విధములైన ఓషధు మూలములు, విజయా-లక్ష్మణాదిలాగుడూచీ.అతబలా పాఠా సహదేపా-శతావరీ-బుద్ధి:సువర్చలా. వృద్ధులను వేరు వేరుగా సిద్దము చేసికొనవలెను. రవకొరకు. తిరకుళాదులు, భస్మస్నానము కొరకు భస్మము, స్నానార్ధము యవగోధుమలపిండి, బిల్వచూర్ణము, విలేపనము, కర్పూరము, కలశము, చెంబు సిద్దము చేసికొనవల. మంచము, రెండు పరుపులు, తలగడ, దుప్పది మొద లైన ఇతరవస్త్రములు గూడి తన శక్తిని అనుసరించి సిదము చేసుకొని, వివిధ చిహ్నములతో సిద్ధము చేయబడిన శయనాగారమునందు ఉంచవలెను. ఘృత - మధు పూర్తపాత్రపు, బంగారు సూది, వర్ధని శివకుంభము లోకపాల మటములను కూడా సిద్ధము చేసికొనవలెను. నిద్రకొరకు ఒక కలశ, కుండము లెన్ని ఉన్నవో అన్ని శాంతికలశములు. ద్వారపొలాది - ధర్మాది - ప్రశాంతాదుల కొరకై కలశలు, వాస్తుదేవ - లక్ష్మీ - గణేశ లకై వేరు వేరు కలశలు, సమకూర్చుకొనవలెను. ఈ కలశల క్రింద ఆధారముగా నుండు, నట్లు పోయుటకు ధాన్యము ఉంచుకొనవలెను. ఆన్ని కలశలను వస్త్ర పుష్పాదులతో అలంకరించవలెను. వీటి లోపం సువర్ణముంచి, స్పృశించి సుగంధజలముతో నింపవలెను. అన్ని కలశ ల మీదను పూర్ణ పాత్రలు, ఫలములు ఉంచవలెను. వాటి ముఖభాగమునందు పంచపల్లవములుంచవలెను. ఆ కలశలు ఉత్తమ లక్షణ సంపన్నములై ఉండవలెను. కలశములను వస్త్రములచే ఆచ్ఛాదించ వలెను. నలుమూలల చల్లుటకై తెల్ల ఆవాలు, పేలాయి సిద్ధము చేసికొనవలెను. పూర్వమునందు చెప్పినట్లు జ్ఞానఖడ్గము ఉంచుకొనవను. సమిధలు, చరుపాత్ర, రాగి గరిటి, పాదాభ్యంగము కొరకై మృత మధపులున్న పాత్రను ముప్పది కుశ దక్షములతో నిర్మించిన నాలుగు ఆసనములను, పలాశ నిర్మి తములగు నాలుగు పరిధులను సమకూర్చుకొనవలెను.
తిలపాత్ర - హవిష్య పాత్ర - అర్ఘ్యపాత్ర - పవిత్రక ములను కూడ సిద్దము చేసికొనవలెను. వీటి ప్రమాణము ఇరువదేసి ఫలములు ఘంటి, ధూపపాత్ర, సుక్కు, స్రువము, పిటకము, పీఠము, వ్యజనము, ఎండిన సమిధలు, పుష్పములు, సత్రములు గగ్గులు, మృత దీపములు, ధూపము, అక్షతలు, మూడు పోచల ద్వారము, గౌమృతము యవలు, తిలలు, కుశలు, శాంతికర్మపై త్రివిధమధుర పదార్థములు, పది పర్వముల సమిధలు, ఒక హస్తము ప్రమా ఇము గల స్రువము, సూర్యాది - గ్రహశాంతికై ఆర్క - పలాశ – ఖాదిర - ఆపామార్గ - ఆశ్వత్థ - ఉదుంబక - శమీ వృక్ష సమిధలు, ధరూరలు, కుశలు, సిద్దము చేసికొనవలెను. ఆరాదిసమిధలు నూట ఎనిమిది చొప్పున ఉండవలెను. ఇవి లభించనిచో వాటి స్థానమున యవలు, తిలలు హోమము చేయవలెను. ఇంకను గృహోపకరణములు కూడ సిద్ధము చేసికొనవలెను. గిన్నెలు, గరిడె, మూతలు మొదలగునవి. దేవాదుల కొరకు వస్త్రద్వయము, ఆచార్యపూజనిమిత్తము పోద్రా - ముకుట . వస్త్ర - హార - కుండల - కంకణాదులుసు సిద్దము చేయవలెను. ధనవ్యయము విషయమున లుబ్దత్వము చూపరాదు. మూర్తి ధారణము, అస్త్రమంత్రాదిజపము చేయు బ్రాహ్మణులకు ఆచార్యున కిచ్చిన దానిలో నాల్గవవంతు తగ్గించి దక్షిణ ఈయవలెను. సామాన్య బ్రాహ్మణులకును, జ్యోతిష్కులకును, శిల్పులకును, జపక ర్తల కిచ్చినట్లుగనే ఇవ్వవలెను. వజ్రము, సూర్యకాంతమణి, నీలమణి, అతినీలమణి, ముత్యము, పుష్పరాగము, పద్మరాగము, వైదూర్యము . వీటిని సంగ్రహించుకొనవలెను, వట్టివేరు, విష్ణుకాంత, రక్తచందనము, ఆగురువు, శ్రీ ఖండము, శాంబ, కుషము, శంఖిని ఈ ఓషదులను సంగ్రహించవలెను. బంగారము, రాగి, ఇనుము, రక్తము, రజతము. కంచు, సీసము అను లోహము లను, హరితాలము, మనః కిల గైరికము, హేమమాక్షికము, పాదరసము, వహ్ని గైదికము, గంధకము, అభ్రకము అను ఎనిమిది ధాతువులను కూర్చుకొనవలెను. ఈ విధముగనే ఎనిమిది విధములగు ధాన్యములు - వరి, గోధముణం తిలలు, పెసలు, మినుములు, యవలు, నీవారములు శ్యావాకములు, సమకూర్చుకొనవలెను.
ఆగ్ని మహాపురాణమునందు ప్రతిష్టాకాల సామాగ్ర్యాది విధి వర్ణనమను తొంబదియైదవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 95 of the Agni Purāṇa is as follows:
The ninety-fifth chapter provides a comprehensive list of the timing rules and materials required for a major deity installation ceremony. The auspicious months for pratiṣṭhā — the five months from Māgha through Jyeṣṭha, excluding Caitra — are specified, with the requirement that Jupiter and Venus both be in favorable positions. The rules for selecting the auspicious nakṣatra, tithi, vāra, and lagna — with extensive lists of favorable and unfavorable combinations for each planet — are given in detail. The chapter then catalogs the materials required for a complete installation: the twelve types of sacred earth from mountain peaks, river banks, termite mounds, and elephant paths; the five types of tree bark; the five seasonal fruits; the eight types of grain; the eight types of metal; the eight classes of gems; the medicinal herbs (Vijayā, Lakṣmaṇā, Atibhalā, Pāṭhā, Śatāvarī, and others); and the full set of ritual implements, pots, vessels, and fabrics.