అగ్ని వలికెను : ఓ ద్విజుడా యుధిష్టురుడు రాజ్యము చేయుచుండగా ధృతరాష్ట్రుడును, గాంధారియు, కుంతియు, ఆరణ్యమునకు వెళ్ళి ఒక ఆశ్రమమునుండి మరి యొక ఆశ్రమమునకు సంచరించుచుండిరి.
విదురుడు దావాగ్నిచే దగ్దుడై మృతి చెందెను. ఈ విధముగ మహావిష్ణువు పాండవులను నిమి త్తముగ చేసి కొని, ధర్మరక్షణముకొరకును, అధర్మవినాశ మునకును పూనుకొని దానవాదిక మగు భూభారమును హరించెను. విప్రశావ మను వంకచే, ముసలముచే, భూధారకర మగు యాదవకులమున నశింపచే నెను.
శ్రీ కృష్ణుడు వజ్రుని రాజ్యాభిషిక్తుని చేసి దేవతల ఆదేశముచే, ప్రభాసషేత్రమునందు తన దేహమును పరిత్య జించి, ఇంద్రలోక బ్రహ్మలోక ములందు స్వర్గ వాసులచే పూజింపబడెను. బలరాముడు, ఆది శేష రూపధారి యై పాతాళ స్వర్గము చేరెను.
వినాశరహితు డగు ఆ శ్రీ హరి యోగులచే ధ్యానింపబడు వాడు. ఆట్టి శ్రీ కృష్ణుడు లేని ద్వారకను సముద్రము ముంచివే నెను.
అర్జునుడు యాదవులకు పేత సంస్కారాదులు చేసి ఉదక ధనాదిదానములు చేసెను. ఆష్టావక్రుని శాపముచే విమభార్వలుగా అయిన స్త్రీలను, మరల ఆతని బావము చేతనే, కఱ్ఱలు ఆయుధములుగా గల గోపాలకులు అర్జునుని ఓడించి తీసికొని పోయిరి. అర్జునుడు బాల శోకించెను. వ్యాసుడాతనిని ఊరడించెను. . కృష్ణుడున్న ప్పుడే నా బలము అని అతడు గ్రహించెను. అతడు హస్తినాపురమునకు వచ్చి, రాజ్యపాలకు డైన యుధిష్ఠిరునకు ఇది యంతయు చెప్పెను.
కృష్ణుడు ఈ లోకమును విడచి వెళ్ళిపోయిన తోడనే ఆర్జునుని అదే ధనస్సు, అవే అస్త్రములు, అదే రథము, అవే గుఱ్ఱములు, అవన్ని యు శ్రోత్రియుడు కాని వానికి ఇచ్చిన దానము వలె నష్ట మైపోయెను.
ధర్మరాజు ఆ వార్త విని, పరీక్షిత్తును రాజ్యపాలనకై నియోగించి, ఈ సంసార మనిత్య మను విషయము గ్రహించినవాడై, ద్రౌపదియు, సోదరులును వెంట రాగా, మహావిష్ణుని అష్టోత్తరశతనామములు జపించుచు మహా ప్రస్థాన మున బయలుదేరెను.
ఆ మహాప్రస్థానమునందు ద్రౌపది, సహదేవుడు, నకులుడు, అర్జునుడు, భీముడును వడిపోయిరి. రాజు తాతురు డయ్యెను. ఆతడు ఇంద్రుడు తీసికొని వచ్చిన రథము నధిరోహించి, సోదర సహితుడై స్వర్గము చేరెను. అచట దుర్యోధ నాదులను, వాసు దేవుని చూచి సంతసించెను. నీ కి భారతకథను చెప్పితిని. దీనిని పఠించినవారు స్వర్గమునకు వెళ్లెదరు.
ఆగ్ని మహాపురాణములో మహాభారతాఖ్యానమను పంచదశాధ్యాయము సమాప్తము.
Summary of chapter 15 of the Agni Mahā Purana is as follows:
This chapter provides a comprehensive survey of the fourteen Manvantara-s — the great cosmic time-periods each ruled by a Manu. For each Manvantara, the Purāṇa lists the presiding Manu, the seven Ṛṣi-s (saptaṛṣi-s), the ruling Indra, the principal gods, and any special events or avatāras associated with that epoch. The current Manvantara — the seventh, that of Vaivasvata Manu — is identified, with familiar figures from the Purāṇic narratives placed within this temporal framework. The chapter establishes the cyclical nature of cosmic time and Bhagavān's continuous governance of each cycle through appropriate descents and protectors. The immense merit of hearing and retaining this knowledge of Manvantara-s is affirmed.