హనుమంతుడును, ఆంగదాదులును నంపాతి. మాటలు విని, సముద్రమును చూచి “ఈ సముద్రమును దాటి ఎవరు మనలనందరిని జీవింపచేయగలరు?” అని అనుకొనిరి.
హనుమంతుడు కపులు జీవించుటకును, రామకార్యము సిద్ధించుటకును నూరు యోజనముల విస్తారము గల సముద్రమును లంఘించెను.
పైకి (సముద్రమునుండి) లేచిన మైనాక పర్వతమును చూచి, సింహికను చంపి, లంకను చూచి, రాక్షసుల గృహములను కూడ చూచెను. అచట రావణుని ఇంటి అంతఃపురము నందును, కుంభ - కుంభకర్ణ - విభీషణ - ఇంద్ర జిత్తుల గృహములందును, ఇతర రాక్షసుల గృహములందును, పానభూమి మొదలగు ప్రదేశములందును కూడ సీతను చూడజాలకపోయెను. అప్పుడు ఆ హనుమంతుడు చింతాక్రాంతుడై ఆశోకవనమునకు వెళ్ళి శింశపావృక్షము నెక్కి దాని క్రిoద రాక్షస స్త్రీలచే రక్షింపబడుచున్న సీతను, “నా భార్యను కమ్ము” అని పలుకుచున్న రావణుని, అందులకు నిరాక రించుచున్న సీతను, “రావణునికి భార్యవగుము” అని చెప్పుచున్న రాక్షసస్త్రీలను చూచేను.
రావణుడు వెళ్ళిపోయిన పిమ్మట హనుమంతు డిట్లు పలికెను. దశరథుడనేడు రాజు ఉండెను. ఆతని శేమ లైన పుత్రులు, రామలక్ష్మణులు, ఆరణ్యమునకు వెళ్ళిరి. రామ భార్య లైన సీత యగు నిన్ను రావణుడు బలాత్కార మున అపహరించెను. సుగ్రీవుని మిత్రుడైన రాముడు నిన్ను అన్వేషించుచు, నన్ను పం పెను. అనవాలుతో కూడిన రాము డిచ్చిన ఉంగరమును గ్రహింపుము.
సీత వృక్షముమీద ఉన్న వానరుని చూచెను. ఆ ఉంగరమును తీసికొనెను. ఇంకను ఎదుట కూర్చొని ఉన్న ఆతనితో ఇట్లనెను – “రాముడు జీవించి ఉన్న చో నన్నేల తీసికొని వెళ్ళుటలేదు ?” ఈ విధముగ శంకించుచున్న ఆమెతో హనుమంతు డిట్లు పలికెను.
హనుమంతుడు పలికెను : ఓ సీతాదేవీ ! రామునికి నీ జాడ తెలియలేదు. ఇపుడు తెలిసికొని, సేనాసహితు డై న రావణుని సంహరించి నిన్ను తీసికొని వెళ్ళగలడు. ఓ దేవీ ! విచారించకుము. ఆనవాలుతో కూడిన దేదైన నా కిమ్ము.” అపుడు సీత హనుమంతునకు మణిని ఇచ్చేను. “నన్ను రాముడు శీఘ్రముగా తీసికొని వెళ్ళిపోవు నట్లు చేయుము” అని చెప్పెను. అతనికి కాకి కంటి కథను కూడ చెప్పి, “ఓ శోకవినాశకుడా ! తిరిగి వెళ్ళుము” అని పలికెను.
హనుమంతుడు ఆ కథ విని, మణిని తీసికొని, ఇట్లు పలికెను. “ఓ శోభనస్వభావము గల దేవీ ! నీ భర్త రాగలడు. లేదా, నీకు తొందర ఉన్న చో నా వీపు పైన ఎక్కుము. ఇపుడే నీకు సుగ్రీవసహితుడైన రాముని చూపించెదను. ఆ మాటలు విని సీత హనుమంతునితో – “రాముడే నన్ను తీసికొని వేళ్ళుగాక” అని పలికెను.
అపుడు హనుమంతుడు రావణుని చూచుటకై ఒక ఉపాయమును చేసెను. దంతములు నఖములు మొదలగు వాటితో ఉద్యానపాలకులను చంపి, ఆ ఉద్యానవనమును విరచెను. కింకరులను అందరు రాక్షసులను, ఏడుగురు మంత్రి కుమారులను, రావణుని పుత్రుడైన అగకుమారుని కూడ చంపెను. ఇంద్రజిత్తు నాగపాశముచే ఆతనిని బంధించి రావణునికి చూ పెను. “నీవెవ్వడవు?” అని రావణుడు ప్రశ్నింపగా మారుతి రావణునితో ఇట్లనెను.
హనుమంతుడు పలికెను. “నేను రాముని దూతను. సీతను రామున కిచ్చి వేయుము. ఇవ్వకున్నచో, లంకలో నున్న రాక్షసులతో గూడ, రామబాణములచే కొట్టబడి మరణింపగలవు. తప్పదు.
రావణుడు హనుమంతుని చంపుటకు ఉద్యమించగా విభీషణుడు నివారించెను. హనుమంతుని తోకకు నిప్పు ఆంటిలవచేసెమ, ఆ హనుమంతుడు మండుచున్న తోకతో లంకను, రాక్షసులను కాల్చి, సీతను చూచి నమస్కరించి, సముద్రము దాటి వచ్చి, ‘సీతను చూచితిని’ అని అంగదాదులుతో చెప్పెను. ఆంగదాదులతో కలిసి, దధిముఖాదులను ఓడించి, మధువనములోని మధువును లాగెను. వారందరును రాముని వద్దకు వెళ్ళి “సీతను చూచితిమి” అని పలికిరి. రాముడు సంతసించి హనుమంతునితో ఇట్లనెను.
శ్రీ రాముడు పలికెను--- “నీవు సీతను ఎట్లు చూచితివి? ఆమె నాతో ఏమని చెప్పమన్నది? మన్మథాగ్ని లో పడి ఉన్న నన్ను సీతా కథా మృతముచే తడుపుము.”
నారదుడు పలికెను. హనుమంతుడు రామునితో ఇట్లు పలికెను. “రామా! నముద్రము లంఘించి, సీతను చూచి, లంకను కాల్చి వచ్చినాను. సీత ఇచ్చిన మణిని తీసికొనుము. ఆ రావణుని సంహరించి సీతను పొందగలవు. దుఃఖింపకుము.
రాముడా మణిని గ్రహించి, సీతావిరహముచే దుఃఖితుడై ఏడ్చెను. “మణిని చూడగనే సీతను చూచినట్లున్నది. నన్ను సితవద్దకు తీసికొని వేళ్ళుము. ఆమెను విడచి జీవింపజాలను” అని పలికెను. సుగ్రీవాదులు ఓదార్చిరి, పిమ్మట సముద్రతీరము చేరెను. “సీతను రామునకు ఇచ్చివేయుము” అని విభీషణుడు రావణునకు ఉపదేశింపగా ఆ దురాత్ముడు ఆతనిని అవమానించెను. అందుచేత విభీషణుడు అసహాయుడై రామునివద్దకు వెళ్ళెను.
రాముడు మిత్రుడైన విభీషణుని లంకరాజ్యమునందు అభిషిక్తుని చేసేను. మార్గమిమ్మని నముద్రుని ప్రార్థింపగా అతడు ఇవ్వలేదు. అపుడు బాణములచే భేదించెను. సముద్రుడు రాముని వద్దకు వచ్చి పలికెను.
సముద్రుడు పలికెను : “నా పై నలునిచే సేతువు కట్టించి లంకకు వెళ్ళుము. నన్ను లోతైన వానినిగా పూర్వము చేసినది నీవేకదా”! వృక్షములు, శైలములు మొదలైన వాటితో నలుడు కట్టిన సేతువు పై రాముడు వానరులతో సముద్ర మును దాటి నువేల పర్వతము పై నిలచి, లంకను చూచెను.
అగ్ని మహాపురాణములోని సుందరకాండ వర్ణనమను నవమాధ్యాయము సమాప్తము.
Summary of chapter 9 of the Agni Mahā Purana is as follows:
The narrative continues with Rāma, Sītā, and Lakṣmaṇa's forest sojourn. Rāma slays many rākṣasa-s who harass the sages, including Khara and Dūṣaṇa. Śūrpaṇakhā's humiliation by Lakṣmaṇa provokes Rāvaṇa, who then abducts Sītā through the deception of the golden deer Mārīca. Jaṭāyu, the great eagle-king, fights bravely to prevent the abduction and dies in Rāma's arms. The chapter then describes Rāma's encounter with the monkey Hanūmān, the alliance with Sugrīva on Ṛṣyamūka, the slaying of Vālin, and the great search for Sītā across the four directions. Hanūmān's identity as Vāyu's son and his extraordinary powers are highlighted.