పరమేశ్వరుడు చెప్పెను. సమస్త కర్మల యందును ముందుగా సర్వ సిద్ది ప్రదమగు అస్త్రయాగము చేయవలెను. మధ్య భాగమున శివాటి అస్త్రమున పూర్వాది దిక్కు లందు క్రమముగ ఇంద్రాది దిక్పాలకుల అస్త్రములను పూజించపలెను. శంకరునకు ఐదు ముఖములు పది హస్తములున్నవి. అట్టి శంకరుని యుద్ధ ప్రారంభమున పూజించినచో జయము కలుగును. మధ్య యందు రవిని పూర్వాది దిక్కు లందు చంద్రాదులను వుంచి గ్రహపూజ చేయవలెను. గ్రహపూజ చేయుటచే గ్రహములన్నియు ఏకాదశ స్థానమునందున్న లాభ రూప ఫలమును ఇచ్చును. సమస్త ఉత్పాతమును నశింపచేయు ఆస్త్ర శాంతిని చెప్పెదను. ఇది గ్రహరోగాదులను మారి శత్రు భయూదులను తొలగించును. వినాయకుల వలన కల్గిన బాధలను తొలగించును. నరుడు లక్ష పర్యాయములు ఆ ఘోరాస్త్రము జపించినచో గ్రహములు నశించును. దివ్య ఉత్పాతములు కలిగి నపుడు అర్ధ లక్ష హోమములు చేయవలెను. లక్ష ఆజ్యాహుతులు చేసినచో భూమి జోత్పాతములు నశించును. గుగ్గులు మిత్ర మృతమును హోమము చేసినచో ఆన్ని ఉత్పాతములు నశించును. దూర్వలు ఆక్షతలు ఆజ్యము, హోమము చేసిన సర్వ రోగములు నశించును. మృతముతో సహస్ర హోమము చేసినచో దుస్స్వప్న ములు నశించును. ఇందు సంశయము లేదు. పది వేలు హోమము చేసినచో గ్రహ దోషములు తొలగును. యవఘృత హోమముచే వినాయక బాధలు తొలగును. పది వేల ఆజ్య హోమములు పది వేల గుగ్గులు హోమములు చేసినచో భూతవేతాళ శాంతి కలుగును. ఏదైన మహా వృక్షము పడి పోయినను ఇంటిలో సర్ప శవము వచ్చినను మృత, అక్షతల హోమములచే విమ్న శాంతి కలుగును. ఆరణ్య ప్రవేశము చేయ వలసినపుడు కూడ ఇట్లు చేయవలెను. ఉల్కాపాతము గాని, భూకంపము గాని కల్గినపుడు తిలమృత హోమములు చేసిన మంగళమగును, వృక్షము నుండి రక్తము కారినను ఆకాలమున పుష్ప ఫలము వుట్టినను రాష్ట్ర భంగము కల్గినను తిలమిశ్ర మృతముతో ఆర్ధ లక్ష హోమములు చేయవలెను. ఏనుగులకు మహా మారి వచ్చినపుడు ఆడ ఏనుగులకు దంతములు వచ్చినను లేదా వాటికి గండస్థలము నుండి మదము కొరివను పది వేల హోమము చేసినచో శాంతి కలుగును. ఆకాలమున గర్భ పాతమైనను పుట్టిన వెంటనే శిశువు మరణించినను వికృతాంగములు గల శిశువు జన్మించినను సమయమునకు పూర్వమే శిశువు జన్మించినను పది వేల హోమములు చేసిన దోషము శమించును. సిద్దిని సాధించుటకు తిల మిశ్రమములగు మృతముతో ఒక లక్ష హోమములు చేయుట ఉత్తమము. ఆర్ధ లక్ష హోమములు చేసినచో మధ్యమ సిద్ధియు ఇరవడి ఐదు వేల హోమమ చేసినచో అధమ సిద్దియు కల్గును. జపాను సారముగ హోమము చేసినచో యుద్దము నందు విజయము లభించును. తేజిళ్ళాలి యగు పంచ ముఖుని ధ్యానించుచు న్యాస పూర్వకముగ అఘోరాస్త్ర జపము చేయవలెను.
ఆగ్ని మహా పురాణమున ఆ ఘోరాస్త్రాది శాంతి కల్ప నిరూపణ మను మూడు వందల ఇరువది ఒకటవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 322 of the Agni Purāṇa is as follows:
The science of omens (śakuna) is expounded: the behavior of birds and animals, sounds heard from different directions, twitching of body-parts (aṅgaspandana), and atmospheric phenomena are catalogued as indicators of auspicious or inauspicious outcomes. Agni organizes the omens by their context — omens before a journey, before battle, before a marriage, and at the moment of embarking on a great undertaking. The crow, owl, jackal, and various birds receive dedicated treatment as classic omen-bearers in the Purāṇic tradition. The chapter closes with the remedies (śānti) prescribed for inauspicious omens, including mantra recitation and homa.