అగ్ని రువాచః
అగ్ని దేవుడు పలికెను. యజ్ఞములచే దేవలోకమును తపస్సు చే విరాట్పదమును, కర్మ సన్యాసముచే బ్రహ్మ పదమును, వైరాగ్యముచే ప్రకృతిలయమును, జ్ఞానముచే మోక్షమును పొందును. ఈ విధముగా ఐదుగతులు చెప్పబడినవి. ప్రసన్నత్వము తాప విషాదాదులు లేకుండుట వైరాగ్యమని చెప్పబడును. చేసిన కర్మల యొక్కయు ఇంతవరకు చేయని కర్మల యొక్కయు ఫలమును త్యజించుట సంన్యాసము. ఇట్లు చేయుటచే ఆవ్యక్తము మొదలు విశేషము వరకును వున్న వికారములు తొలగును. చేతనా చేతనముల వివేక జ్ఞానమునకు జ్ఞానమని పేరు. ఈ జ్ఞానము వలనే పర మాక్మ జ్ఞానము కలు గును. పరమాత్మ సర్వాధారము. పరమేశ్వరుడు వేదవేదాంతములో విష్ణు నామమాతో కీర్తింపబడుచున్నాడు. ఆతడే యజ్ఞేశ్వరుడు ప్రవృత్తి మార్గములో వున్న వారు యజ్ఞ పురుషునే సేవింతురు నివృత్తి మార్గములో వున్న వారు జ్ఞానయోగముచే జ్ఞాన స్వరూపుడగు ఆ పరమాత్మను సాక్షాత్కరించుకొందురు. హ్రస్వ దీర్ఘప్లుతాది వాక్కు పురుషోత్తమ స్వరూపమే.
మహామునీ ! ఆ పరమాత్మ ప్రాప్తికి జ్ఞానము కర్మ అనునవి రెండు సాధనములు. వివేక జన్యము ఆగమ జన్యము అని జ్ఞానము రెండు విధములు శబ్ద బ్రహ్మ జ్ఞానము ఆగ మమయము. పర బ్రహ్మ జ్ఞానము వివేకదము. బ్రహ్మ శబ్ద బ్రహ్మ అనియు పర బ్రహ్మ అనియు రెండు విధము. వేదాది విద్య అపర బ్రహ్మ -అక్షర తత్వము పర బ్రహ్మ. భగ వచ్ఛబ్దముచే ముఖ్యముగా చెప్పబడునది ఈ పర బ్రహ్మయే. పూజాద్యర్థములందు ఈ శబ్దముల యొక్క ప్రయోగము ఔప చారికము. భగవచ్చబ్దములోని ధకారమునకు సోషించువాడు సర్వాధార భూతుడు అని రెండు ఆర్థములు. గకారమునకు నేతబ్రహ్మ విజ్ఞానమ్ గమయితా, సృష్టి అని అర్థములు. సమగ్రముగా ఐశ్వర్యము, వీర్యము, యశస్సు, లక్ష్మి, జ్ఞానము వైరాగ్యము ఈ ఆరింటికి భగమని పేరు. సర్వ భూతములను విష్ణువు యందు నివసించును. ఆతడు సర్వ ధారకుడు త్రిమూర్తి అందుచే భగవచ్చబమునకు హరియందే ముఖ్య ప్రయోగముము. ఇతరార్థము యందు దాని ప్రయోగము గౌణము. సకల ప్రాణుల ఉత్పత్తి ప్రళయ గమనములను, విద్యా విద్యలను ఎరిగిన వానినే “భగ వా” అని చెప్పవలెను. హేయగుణములు లేక జ్ఞాన శ క్తిబల ఐశ్వర్య వీర్య తేజస్సులు పరిపూర్ణముగా ఎవని యందుండునో ఆతనినే భగవాన్ అనవలెను.
పూర్వము కేశిధ్వ జరాజు ఖాండిక్య జనగునకు ఈ విధముగ ఉపదేశించారు. ఆ నాత్మ యందు, ఆత్మ బుద్ది ఆ విద్యా జనితమై సంసార బంధమునకు కారణము. ఈ అజ్ఞానము ఆహంకార మమ కార రూపముల రెండు విధములుగా వున్నది. దేహాభిమానియగు జీవుడు మోహాంధకారముచే కప్పబడి ఈ పాంచ భౌతిక శరీర మే నేను ఆను కుబుద్ధి కలిగియుండును. ఇట్లే పుత్రపౌత్రాదులందు మనుకారము కలిగియుండును. విద్వాంసుడు ఆనాత్మయగు ఈ దేహమున సమభావము కలిగియుండును. మానవుడు సర్వదే హోపకారమునకే కర్మ చేయును. దేహము పురుషునకంటే భిన్నమైనది. కావున ఆకర్మ యంతయు బంధ హేతువగును. వాస్తవమున ఆత్మ నిర్వా సమయము, జ్ఞానమయము, అమలము దుఃఖ జ్ఞాన మనునది ప్రకృతి ధర్మము కాని, ఆత్మ ధర్మము కాదు. జలమునకు అగ్నితో సత్సంబంధములే నున్నను పాత్రము ద్వార అగ్న సంపర్కము కలుగుట ఎట్లో ఇదియు అట్లే. మహామనీ ! ఆత్మ ప్రకృతి సంగమంచే అహంకార మమకారాది ప్రకృతి ధర్మములను పొందుచున్నది. వాస్తవమున ఆది వాటికంటే భిన్నమైనది. అవినాశి. విషయాసక్తమగు మనస్సు బంధ హేతువు. విషయ దూరమైనది జ్ఞాన హేతువు. దానిని విషయముల నుండి లాగి హరిని స్మరించవలేను. తనను ధ్యానించు వానికి హరి బ్రహ్మ భావము నిచ్చును. సూదంటురాయి లోహమును ఆకర్షించినట్లు తనను ధ్యానించు వానిని బ్రహ్మ తన వైపు లాగి కొనును. ఆత్మ ప్రయత్నముచే మనస్సు బ్రహ్మతో విశిష్ట సంయోగమును పొందుటయే యోగము. నిశ్చలుడై సమాధియందు న్నవాడు పర బ్రహ్మను పొందును. యమ నియమ, స్థితి, ప్రాణాయాయ, ప్రత్యాహార, ప్రాణజయ, ఇంద్రియనిగ్రహము లచే చిత్తము శుభమగు ఆశ్రయమునందు నిలచునట్లు చేసుకొనవలెను. ఈ శుభాశ్రయగు బ్రహ్మ మూర్తము అని రెండు విధము. సనందనాదులు బ్రహ్మ భావనా యుక్తులు. దేవతలు మొదలు స్థావర సల వర కువున్న ప్రాణులు కర్మభావనా యుక్తులు హిరణ్యగర్భాదులకు కర్మ బ్రహ్మ బ్రహ్మ భావనలు రెండును వుండును. ఈ విధముగా భావన మూడు విధములు. ఈ విశ్వమంతయు బ్రహ్మయే. అని ఉపాసించుట బ్రహ్మ భావనా. సమస్త భేదములు తొలగినదియు, సత్తా మాత విషయకము, వాక్కులకు గోచరించనిది, ఆత్మ మాత్ర సంవేద్యము అగు తత్వము యొక్క జ్ఞానము బ్రహ్మజ్ఞానము. ఆది యేరూప హీనుడగు విష్ణువు యొక్క జన్మరహితము, అక్షరము అగు ఉత్కృష్ట స్వరూపము అమూర్త ధ్యానము కష్టముగాన ముందు మూర్త ధ్యానము చేయవలెను. ఇట్లు చేయు వాడు భగవద్భావముమ పొంది పరమాత్మతో ఐక్యము పొందును. భేదజ్ఞానము ఆజ్ఞాన కృతము.
అగ్ని మహాపురాణమున బ్రహ్మ జ్ఞాన వర్ణనమను మూడు వందల డెబ్బది తొమ్మిదవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 380 of the Agni Purāṇa is as follows:
The Advaita (non-dual) teaching is conveyed through the narrative of Bharata — the great king who, through attachment to a deer in his hermitage, was reborn as a deer, but retained his jāti-smṛti (memory of past lives) and voluntarily left that body to be reborn as a Brāhmaṇa. In this final birth, Bharata lived as a jīvanmukta, outwardly appearing as a simple laborer (jada-vat). When the king of the Sauvīra kingdom pressed him into palanquin-service, Bharata refused to hurry, and when questioned, delivered a profound teaching: the ātman carries no burden, for the body is constituted of the five elements which alone carry one another; the "I" (aham) cannot be identified with any part of the body; all apparent differences — king and servant, man and animal — are karmaja (karma-generated) designations overlaid upon the one ātman. The chapter concludes with the parallel Ṛtu-Nidāgha parable reinforcing that the entire world is the one Vāsudeva.